26, అక్టోబర్ 2015, సోమవారం

సమస్య - 1836 (మన్మథుండు ముక్కంటికి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మన్మథుండు ముక్కంటికి మాతులుండు.

38 కామెంట్‌లు:

  1. భవుని యాగ్రహ మ్మునగాలి భస్మ మైన
    దెవరు? సర్పమే భూషణ మెవరి కయ్యె?
    శకుని వరుసేమి పాండవ శత్రువులకు
    మన్మథుండు ముక్కంటికి మాతులుండు

    రిప్లయితొలగించండి
  2. హరికి పుత్రుండు చూడగా నాతడెవరు
    విస్ణువెవరికి మిత్రుండు వేగ జెపుమ
    కంసుడెవ్వరు శ్రీకృష్ణుకంటి, వరుస
    మన్మథుండు, ముక్కంటికి, మాతులుండు

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    సతిని నెడఁబాసి విరహ మగ్న తపసి యగు
    శివుని హృదయాన ననురాగ సృష్టి చేసి
    నట్టి వాఁడు మాతృ తులుఁడు నగును గాన,

    మన్మథుండు ముక్కంటికి మాతులుండు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      ఈ సమస్యకు క్రమాలంకారం తప్ప మరో మార్గం లేదనుకున్నాను. మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. భవుని కోపాగ్ని కాహుతై భస్మ మయ్యె
    మన్మధుండు , ముక్కంటికి మాతులుండు
    నాబరగె హిమ వంతుడు నమ్ము డా ర్య !
    వ్రాసి యుంటిని నిజమును వాసి గాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      హిమవంతుడు శివునికి పిల్ల నిచ్చిన మామే కాని మేనమామ కాదు కదా! 'ఆహుతి +ఐ' అన్నప్పుడు యడాగమం వస్తుంది. సంధి లేదు.

      తొలగించండి
  5. బుద్ధి మరలించె నరుణపై బుధులుఁగోర
    మన్మధుండు ముక్కంటికి, మాతులుండు
    జపపు భగ్నమ్మునెంచుచు కుపితుడగుచు
    బూడిదన్ జేసి కరుణించె పొలతి యేడ్వ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. సోమగర్భుని ప్రియమైన సూనుడెవరు?
    గుజ్జుదేవర యేరికి కొడుకొ తెల్పు?
    కంసు దెవ్విధి బంధువు హంసునకును?
    మన్మథుండు, ముక్కంటికి, మాతులుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  7. గు రు మూ ర్తి ఆ చా రి
    ---------------------

    సురభి నాట్యమ౦డలి వారు సొ౦పు మీర
    శివ కధా నాటకము ప్రదర్శి౦చిరి + అ౦దు
    పాత్రధారు లెల్ల రొకి౦టి వారె ; కనుక
    మన్మధు౦డు ముక్క౦టికి మాతలు౦డు .

    *****************

    కుసుమ శరములు వేయు సొగసరి యెవడు ?
    అవని రుద్రాభి షేకమి౦ కెవరి క౦దు ?
    అమ్మ తమ్ముడు వరుస కే మగును నీకు ?
    మన్మధు౦డు / ముక్క౦టికి / మాతలు౦డు

    *************


    మన్మధు౦డు ముక్క౦టికి మాతలు౦డు --
    కాదు ; పరమవిరోధి యౌి గద. కవివర !
    తపము చెరచు క౦దర్పుని దర్ప మెల్ల
    క౦టి మ౦టచే ముక్క౦టి కాల్చె నపుడు .

    **************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.

      తొలగించండి
  8. భవుని కోపాన దగ్ధమై భస్మ మయ్యె
    మన్మధుండు , ముక్కంటికి మాతులుండు
    నెరుగ నెవ్వరో మరినేను నెరిగి తేని
    జెప్పు డా ర్యులు విందును దప్ప కుండ

    రిప్లయితొలగించండి
  9. ఫాల నేత్రుడు నిక్కంబు పార్వతి పతి
    బాణ కుసుముడు దెలియును పద్మ పట్టి
    ధారుణి నెరుగనిట్టి బాంధవ్యములన
    మన్మథుండు ముక్కంటికి మాతులుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. చెరకు వింటిని ధరియించు చెన్నుడెవరు?
    శరజుడెవరికి తనయుడు సత్యముగను?
    ధార్తరాష్ట్రున కేమగు ధవుడు శకుని?
    మన్మధుండు, ముక్కంటికి, మాతులుండు!!!

    రిప్లయితొలగించండి
  11. గురుగారికి నమస్కరించి..
    నా సందేహము మీముందు ఉంచుతున్నాను
    కందము, ఉత్సాహము తరువోజ మరియు మధ్యాక్కర ..ఇవన్ని చందోరీత్య జాతుల క్రింద వస్తాయి కదా!
    కందము లో ప్రాస ఉంటుంది కాని ప్రాస యతి చెల్లదు,, అలాగె మధ్యాక్కర లో కూడ ప్రాస ఉంటుంది కనుక ప్రాస యతి చెల్లదేమో అని నా భావన
    .............................
    కాని నిన్నటి రోజు ఒక కవి మిత్రుడు ప్రాస యతి వేశాడు..
    నన్ను పూర్తి గా క్షమించాలి
    ................
    నేను ఆయనను పాయింట్ ఔట్ చెసేటంత గొప్పదాన్ని కాదు కాని మధ్యాక్కర లో ప్రాస యతి వేసే అవకాశము మనకు ఉన్నదా?
    వివరించగలరు
    _/\_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సువర్ణ లక్ష్మి గారూ,
      ధన్యవాదాలు. మీ సందేహం సరియైనదే. మధ్యాక్కరలో ప్రాసయతికి అవకాశం లేదు. గుండు మధుసూదన్ గారిని సంప్రదించాను. వారు తమ పొరపాటును అంగీకరించారు. పద్యాన్ని సవరిస్తానన్నారు.

      తొలగించండి
    2. మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు!

      నా మధ్యాక్కఱ పద్యమందు యతిమైత్రికి బదులు ప్రాసయతి పడినది. దోషమును గమనింపకపోయితిని.

      నేనీ మధ్యాక్కఱను టైపు చేయునపు డే కళ/కల నుంటినో గాని, యతిమైత్రి స్థానమునఁ బ్రాసయతి నిడితిని. ఉపజాతి పద్యములే మెదలినవి కాఁబోలు; నిప్పటికి (మీరు దూరవాణి ద్వారమునఁ దెలుపుటచే) నేను చేసిన యీ పొరపాటు నా మనస్సునఁ గదలాడినది. పొరపాటు మీ క్రిందివిధముగ సవరించుచుంటిని.

      అయితే, దీనికి నాలుగవ గణాద్యక్షరము యతిమైత్రిగాఁ గుదురదు (దత్త పద్యపాదమున నీ యవకాశము లేదు) కావున, నన్నయగా రైదవ గణాద్యక్షరమును యతిమైత్ర్యక్షరముగ వాడియున్నందున, నేనును నైదవ గణాద్యక్షరమునే యత్రిమైత్ర్యక్షరముగ వాడుకొనుచుంటిని. గమనింపఁగలరు. ఇఁక నా సవరణమునుం బరిశీలింపుఁడు...


      "వినుమిదె నా హిత వాక్యమును నీవు ♦ విధిగఁ దలంచి!
      జనకాత్మజయ నాదు పత్ని! నినుఁ గొన!♦ సైకపత్నీ వ్ర
      తుని ననుఁ గోరక, నాదు ననుజుతోఁ ♦ దుష్టినిఁ బొంది,
      కనుము సౌఖ్యములు లక్ష్మణునిఁ గలసి! నీ ♦ కాంక్షయే తీరు!!"

      తొలగించండి
    3. నా మధ్యాక్కఱలో దొఱలిన దోషముం దెలిపి, సవరించుట కవకాశ మిడిన మిత్రులు సువర్ణ లక్ష్మి గారికి వినయపూర్వక ధన్యవాదములు!

      తొలగించండి
  12. సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదములు గురువు గారు
    _/\_

    రిప్లయితొలగించండి
  13. త్ర్యక్షు జ్వాలను మసి యయ్యె లచ్చి కొడుకు
    మన్మథు౦డు.ముక్కంటికి మాతులుండు
    లేడు .శ్వశురుడు కొండలరేడు గలడు .
    శివుని సేవింప తొలగును భవము నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. శివుని కోపాగ్ని కెదురించు సిద్దు డెవరు?
    తపసు మాన్పించ నెంచగ దగ్దబరచె?
    అమ్మతమ్ముడు నీకేమి అవునుపుత్ర?
    మన్మథుండు; ముక్కంటికి; మాతులుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో అన్వయం లోపించినట్లున్నది. మీ పద్యానికి నా సవరణ....
      శివుని కోపాగ్ని కెరయైన సిద్ధు డెవరు?
      విఘ్ననాయకు డెవరికి ప్రియసుతు డగు
      నమ్మ తమ్ముడు నీకేమి యగును పుత్ర?
      మన్మథుండు; ముక్కంటికి; మాతులుండు.

      తొలగించండి
  15. త్ర్యక్షు జ్వాలను మసి యయ్యె లచ్చి కొడుకు
    మన్మథు౦డు.ముక్కంటికి మాతులుండు
    లేడు .శ్వశురుడు కొండలరేడు గలడు .
    శివుని సేవింప తొలగును భవము నిజము

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    శివుని తపమును భగ్నంబు చేసె నెవడు
    కంఠమున సర్పములు పలు కలవెవనికి
    శకుని యేమగు దుష్ట దుశ్శాసనునకు
    మన్మథుండు ముక్కంటికి మాతులుండు.

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణలో అన్వయం ఆమోదయోగ్యం కాదేమో! 'ఆహుతి + అయ్యెను' అన్నప్పుడు సంధి లేదు. మరొక ప్రయత్నం చేయండి.

      తొలగించండి
  18. ఇదకొసారి చూడండి.
    భవుని తపమెవరి ధనువు వలన వీగె
    పాము భూషణమ్ముగను నెవ్వరికి గలదు
    పార్థుసూను కేవరుసగు భద్రబలుడు.
    మన్మథుండు ముక్కంటికి మాతలుండు.
    భద్రబలుడు--బలరాముడు>అభిమన్యునకు మేనమామ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి