28, అక్టోబర్ 2015, బుధవారం

సమస్య - 1838 (జనులఁ జంపఁ గల్గు...)


కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.

25 కామెంట్‌లు:

  1. అడవిఅన్నలారా!
    ఎట్టిఫలితమొసగు పట్టి బడుగు గిరి
    జనులఁజంపఁగల్గు ఘనయశమ్ము
    వారిని సతతమ్ము పండించు దుష్టుల
    పేరడిచి సరియగు దారిఁజుప
    పండించుః మోసగించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మారణాయుధముల మహిలోన సృష్టించి
    విశ్వ శాంతి కనుచు విన్న వించి
    ప్రగతి కాముకులని వాసి గాంచినవారి
    జనుల జంప గల్గు ఘనయశమ్ము

    రిప్లయితొలగించండి
  3. చెడ్డ పనులు చేసి చిక్కులు కల్గించు
    అల్ప బుద్ధివారి నణచి వేయ
    కఠిన నిర్ణయాలు గట్టిగా గొని యా కు
    జనుల జంప గల్గు ఘనయశమ్ము

    రిప్లయితొలగించండి
  4. పాత కములు గలిగి పాపిగా బేరొం దు
    జనుల జంప, గల్గు ఘన యశమ్ము
    మంచి కార్య ములను మాత్రమే జేయంగ
    చేత లుండ వలయు శ్రీ క రముగ

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా (విక్రమాదిత్యుని గూర్చి యిచ్చిన) వివరణ తిలకించ గోర్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      ప్రయాణంలో ఉన్నాను. రేపు వివరంగా సమాధానం ఇస్తాను.

      తొలగించండి
  6. సవ్య సాచి సకల శస్త్రాస్త్ర వేదుడు
    కాలకేయు లవని ఖండితులవ
    విజయు డాజిని ఘన విజయుడే శాత్రవ
    జనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. మానవత్వమసలు మచ్చుకైననులేక
    పాపకార్యమన్న భయము వీడి
    పరుల మోసగించి బ్రతుకు గడుపుదుష్ట
    జనుల జంప గల్గు ఘన యశమ్ము!!!

    రిప్లయితొలగించండి
  8. జనుల జంపగల్గు ఘన యశమ్మును సమ
    వర్తి యైన జముడు పడయుచుండ
    జనుల ప్రాణములను దనమును గొ౦పోవు
    ప్రథితి నొందె యముని భ్రాత వెజ్జు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    విభజనమ్ము గూర్చె విషభోజనమ్మాంధ్ర
    జనుల జంప;గల్గు ఘన యశమ్ము
    తెలుగు ఖ్యాతి వెలుగ కలహములను వీడి
    సఖ్య తనువహించి సాగునెడల

    రిప్లయితొలగించండి
  10. శ్రీభవాని యొసఁగ సిసలైన ఖడ్గమ్ము
    శత్రువర్గసింహస్వప్నమైన
    నా శివాజి పొందె నందరి తోడ దు
    ర్జనులఁ జంపఁ గల్గు ఘన యశమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. .కలిమిబలిమినమ్మ?కర్కశత్వము రాగ
    జనుల జంప గల్గు ఘనయశమ్ము
    కంసు డందుకొనిన? కారుణ్యమేలేక
    బ్రతుకు బ్రమల యందువెతలు ద్రుంచె|
    2చేయుపనుల యందు మాయనుజొప్పించి
    చెడునునింపి లాభ గడియలనుచు
    మోసబరుచు వారి మోహము మాన్పగ
    జనుల జంపగల్గు ఘన యశమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'లాభగడియలు' అని సమాసం చేయరాదు. 'లాభఘటికలు /లాభకాలము' అనండి.

      తొలగించండి
  12. కవిమిత్రులందరికినమస్కారములు.
    దండకాటవిగల ధర్మదూరులసుర
    జనుల జంప గల్గు ఘనయశమ్ము
    ననుచు మునులు దెల్ప నాలించిశ్రీరాము
    డసుర జాతి పైన నలిగెనాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భూసారపు నర్సయ్య గారూ,
      బహుకాల దర్శనం! సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి