31, అక్టోబర్ 2015, శనివారం

సమస్య - 1841 (యోగము భోగేచ్ఛ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

43 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    మరికాసేపట్లో కాశీయాత్రకు బయలుదేరుతున్నాను. ఈ పదిరోజుల సమస్యలను, పద్యరచన శీర్షికలను షెడ్యూల్ చేశాను. ప్రయాణంలో వీలున్నప్పుడల్లా మీ పద్యాలను, పూరణలను సమీక్షిస్తూ ఉంటాను. దయచేసి ఈ పదిరోజులు పరస్పర గుణదోష విచారణ చేసుకొనవలసిందిగా మనవి.
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మాకు కాశీలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. భాగవత భక్త గణ సం
    యోగము మోక్షేచ్ఛఁ బెంచు నొనరఁగ విషయో
    ద్యోగానురక్త జన సం
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్విజనులకున్.

    రిప్లయితొలగించండి
  3. భోగవతులైన యువతులు
    రాగముఁబంచుటనుమాని రామభజనతో
    యోగినులుగ మారగను వి
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్విజనులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    భోగములు వీడి చేసెడి
    యోగము మోక్షేచ్ఛఁ బెంౘు! యువతులతోడన్
    గ్రాఁగుౘు నిౘ్చలు గొను సం
    యోగము భోగేచ్ఛఁ బెంౘు నుర్వి జనులకున్!

    రిప్లయితొలగించండి
  5. భోగులు ధనార్థు లై ఘన
    భాగవతుల మంచు చెప్పు వంచన పరులీ
    యోగుల కృత్రిమ కామవి
    యోగము భోగేచ్ఛ పెంచు నుర్వి జనులకున్

    రిప్లయితొలగించండి
  6. తీగను బోలు,యు వతిసం
    యోగము భోగేచ్ఛ బెంచు నుర్వి జనులకు
    న్భోగ ములు గలుగు నెడలను
    రోగములకు వశము లగుచు రోదిం తురుగా

    రిప్లయితొలగించండి
  7. ఏగం జన దెప్పుడు వే
    శ్యాగారము సేకురు ఘనహానియు వలదీ
    రోగము బహునారీ సం
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేగం' టైపాటు వల్ల 'ఏగం' అయింది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “ దగదెప్పుడు” పొరపాటున “జనదెప్పుడు” అయ్యింది.
      ఏగం దగ దెప్పుడు వే
      శ్యాగారము సేకురు ఘనహానియు వలదీ
      రోగము బహునారీ సం
      యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

      తొలగించండి
  8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శివశ్చ తేధ్వాస్తు శంకరార్యా!!!

    రిప్లయితొలగించండి
  9. సాగతము బెంచ నిలలో
    పోగొట్టుచుమచ్చరమ్ము పూనిక తోడన్
    రోగముల నడ్డుకొను సమ
    యోగము బోగేచ్ఛ బెంచు నుర్విజనులకున్!!!



    సాగతము = మైత్రి సమయోగము = ప్రయోగము ,ప్రయత్నము

    రిప్లయితొలగించండి
  10. రాగము పెంచిన నర్తన
    యోగము భోగేచ్ఛ బెంచు నుర్వి జనులకున్
    భోగించుచు, కర్మఫల త్యాగమ్మొనరింప మోక్షధామము జేర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. బాగగు వేతనవృద్ధియు,
    తూగెడు గౌరవము, ప్రజల తో సఖ్యతయున్
    సాగిన హాయియె యీయు
    ద్యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ ఉద్యోగ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. రాగము ననురాగంబుల
    యోగము భోగేచ్చ బెంచు నుర్వి జనులకున్
    ఆగక నాయువు నింపును
    సాగెడిస,రి,గ,మ, ప,ద, ని,స-సంసారములో

    రిప్లయితొలగించండి
  13. సాగరమేఖల జను లను
    రాగము సంపదల పైన రాజ్యంబేలున్
    వేగమ కలసియు వచ్చిన
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

    రిప్లయితొలగించండి

  14. *గు రు మూ ర్తి ఆ చా రి *
    ...... ......... .......

    యోగము ప్రశా౦తి నిచ్చును ;
    యోగము కైవల్య పథము నొసగు ; సుగుణ స౦
    యోగము యశ౦బు నిడు ; శ్రీ -
    యోగము భోగేఛ్చ పె౦చు నుర్వి జనులకున్
    ------------------------------
    1. యోగము : ధ్యానము
    2 .యోగము : భక్తి ి
    3.సుగుణస౦యోగము : సద్గుణములకలయిక
    4.శ్రీయోగము : ధనయోగము
    .............................

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    రాగద్వేషము లుడుగును
    భాగవత పఠనము జేయ భక్తిప్రపత్తిన్
    సాగగ దుర్జనగణ సం
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

    రిప్లయితొలగించండి
  16. యోగులమనంగ, భక్తులు
    మూగఁగ నగల నరచేత పుట్టించుచు లో
    దాగిన కోర్కెల రేపు ప్ర
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. యోగము వలననె తొలగె కు
    యోగము లన్నియు జగతిన రాగము హెచ్చెన్
    సాగెను సుఖకర భద్రో
    ద్యోగము,భోగేచ్ఛ బెంచు నుర్వి జనులకున్.

    రిప్లయితొలగించండి
  18. యోగము వలననె తొలగె కు
    యోగము లన్నియు జగతిన రాగము హెచ్చెన్
    సాగెను సుఖకర భద్రో
    ద్యోగము,భోగేచ్ఛ బెంచు నుర్వి జనులకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.బల్లూరి ఉమాదేవి గారూ- రెండవ పాదంలో యో కు రా కు యతి చెల్లదుగదా(కందంలో ప్రాసయతి కూడా లేదు)

      తొలగించండి
  19. వేగిరముగఁ జను గుఱ్ఱము,
    సోగకనుల చిన్నదియును, సుందరవనమం
    దాగని పయనము కద స
    ద్యోగము! భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్!

    రిప్లయితొలగించండి
  20. భోగము మితిమీరంగను
    వేగమెతా వచ్చు కుక్షి బెడదలకిరువౌ
    రోగము బాపుటకు సలుపు
    యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్ :)

    భోగము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
    సం. వి. అ. పుం.
    2. భోజనము

    రిప్లయితొలగించండి
  21. రోగమ్మౌ యేకాంతము
    పోగాలము కోరుకొనుచు భోరున నేడ్వన్
    వేగముగా నాలు మగల
    "యోగము" భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్

    రిప్లయితొలగించండి