14, అక్టోబర్ 2015, బుధవారం

దత్తపది - 83 (కారు-లారి-జీపు-వ్యాను)

కవిమిత్రులారా,
కారు - లారి - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

67 కామెంట్‌లు:

  1. కౌరవసభలో కృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్న మాటలు....

    పలికెఁ దొలుకారు మొయిలు రం గలరువాఁడు
    వైర మేలా? రిపులు కారు పాండుసుతులు;
    ధర్మరా జీ పుడమి నేలు తరుణ మొదవ
    నందెదరు ప్రజ లెల్ల దివ్యానుభవము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుర కవి శ్రీ శంకరయ్య గారూ , చాలా మృదువైన పలుకులు. మధురమైన పద్యం. అభినందనలు .

      తొలగించండి
    2. శంకరార్యా ! చాలా బాగా అమర్చారు వాహనాలను !
      చాలా సుందరమైన దత్తపది !

      తొలగించండి
    3. డా. విష్ణునందన్ గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
    4. మిత్రులు శంకరయ్యగారూ! నేను గమనించనే లేదు....ఎంత చక్కని పద్యము వ్రాసినారు! సంస్కృతాంధ్రపదములను సమపాళ్ళలోఁ బొదిగి, యందముగ రచించితిరి! చాల బాగున్నది. ఈ విషయమున డా. విష్ణునందన్ గారి మెప్పునొందిన మీకు నా శుభాభినందనలు! స్వస్తి.

      తొలగించండి
  2. మాస్టరు గారూ..వాహనాలను చక్కగా నడిపారు

    నాపూరణ
    శ్రీ కృష్ణుడు రాయబార ఘట్టంలో...

    కారు శత్రులు పాండవుల్ కౌరవేయ
    కలుగు దివ్యానుభూతులే కలసియున్న
    యుసురులారీగతి యనిని కసిగ గోర
    ధర్మరాజీ పుడమికిని తగిన రాజు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ".... యుసురు లారీతిగ" అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
    3. మాస్టరు గారూ..ధన్యవాదములు ''' ఉసురులారు + ఈగతి అని నాభావమండీ...

      తొలగించండి
    4. మన్నించాలి... నాకు ‘ఈగతి’ అన్నది ‘ఈతిగ’ అని కనిపించింది. (అప్పుడు బస్సులో ప్రయాణంలో ఉన్నాను).

      తొలగించండి
  3. కాంక్షించ బోకుమో కదనమికను, కౌర
    వేంద్రా! వినుము నాదు విన్నపమును
    పాండుపుత్రులు వారు భండనార్థులు కారు
    సంధిగోరుచునుండ్రి శాంతిగోరి
    వీరులారీతిన విన్నవించిరి మీకు
    వివరించి తెలిపితిన్ విషయమెల్ల
    చింత మానుమిక రాజీ పుడమిన మేలు
    గూర్చును జాతికి కుశల మగును

    పాండవులతోడ క్షేమమ్ము భవ్య మదియు
    మీకు దివ్యాను భవమౌను మీరబోకు
    మనుచు తెలుపుచు నుంటినో యనఘులార
    వినుడు నాదువాక్కులుమీరు విజ్ఞులార!

    రిప్లయితొలగించండి
  4. పాండురాజీపురమునకు వన్నెతెచ్చె
    కారు పాండవుల్ వైరులు కౌరవేంద్ర
    తమ్మునితనయులారీతి దవములందు
    కరము దివ్యానుభవముతో వరలుచుండ్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. కారు మొయిలవి గగనాన గ్రమ్ము కొనెను
    కనుమ దివ్యాను భవమును గౌర వేంద్ర !
    ధర్మ రాజీ పు డమికిని దగిన పతిగ
    నుండ యేలా రిపుల మాట యుండు ననఘ !

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    (దేవసభలో నర్జునునిం గనిన యూర్వశి కామపరవశయై మనమున వితర్కించు ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

    "మోహనాకారుఁ డీతఁడు! ముద్దుఁ దీర్ప
    నీ బ
    లారి సుతునిఁ గోర నేమి యనునొ?
    చూడఁగ నెలరా
    జీ పురుషుండె!" యనుచుఁ
    గవ్వడి పయి న
    వ్యానురాగమ్ముఁ జూపె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారతార్థం అనగానే అందరికీ స్ఫురించే శ్రీకృష్ణ రాయబారం కాకుండా వైవిధ్యాంశాన్ని ఎన్నుకున్నారు , పదాల పోహళింపు చక్కగా ఉంది, భేషైన కవిత గుండు మధుసూదన్ గారూ, అభినందనలు.

      నిరంతర సంప్రదాయ పద్య కవితానంది - శ్రీ కంది శంకరయ్య గారూ, మీరు ' భారత పక్షపాతి ' ( చమత్కార పూర్వకంగా మాత్రమే ) వలె ఉన్నారు, ఇటుపైన దత్తపదికి రామాయణ భాగవతేత్యాది ఇతర కథాంశాలను కూడా స్వీకరింపగలరని సూచన !

      తొలగించండి
    2. సుకవి మిత్రులు డా.విష్ణు నందన్ గారికి ధన్యవాదములు!

      తొలగించండి
    3. గుండు మధుసూదన్ గారూ,
      శబ్దార్థాల సుందరమైన మేళవింపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు

      తొలగించండి
  7. అర్జునుడు ధర్మరాజుతో సారధిగా కృష్ణుడు సమ్మతించాడనే భావంలో...

    వానకారు మొయిలు వర్ణమ్ము గలవాడు
    జీపు చూప డెపుడు జిద్దునందు
    అవ్యయుండె నాకు దివ్యానురక్తితో
    సారధయ్యె నగ్రజా! కిలారి!!!

    జీపు = వీపు , జిద్దు = యుద్ధము, కిలారి =గోపాలుడు,యాదవుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సారథి +అయ్యె " అన్నప్పుడు సంధి లేదు.

      తొలగించండి
  8. కురుక్షేత్రమున శ్రీకృష్ణుడు అర్జునునితో:

    కారుణ్యమేల? వారలి
    లా రీతిగ నీదు సుతుని ప్రాణముఁ గనిరే?
    పోరున జీపున్ జూపక
    తీరుము దివ్యానుభూతి స్థిరమై నిలుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. అభినందనలు.
      ‘ఇలా’ అనడం వ్యావహరికం. అక్కడ సవరణ సూచించలేకపోతున్నాను.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్ం పరిశీలించ ప్రార్థన:

      కారుణ్యమేల? కౌరవు
      లా రీతిగ నీదు సుతుని ప్రాణముఁ గనిరే?
      పోరున జీపున్ జూపక
      తీరుము దివ్యానుభూతి స్థిరమై నిలుచున్!

      తొలగించండి
  9. విదురుడు ధృతరాష్ట్రునితో
    నుతబలారికతన వార లజితు లైరి
    వారలేకారు చుంద్రు నీ పంచనుండ
    పంచు మవ్యాను రాగమ్ము వారలకును
    సలుపు రాజీ పుడమిఁబ్రజ సంతసించ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వారలేకారు చుంద్రు’... అర్థం కాలేదు.

      తొలగించండి
    2. ఏఁకారుః మిక్కిలి కోరు - పాండవులు నీ దగ్గర ఉండటానికి మిక్కి కోరుచుంద్రు అనే అర్థంతో వ్రాశాను.

      తొలగించండి
  10. దత్తపది

    గు రు మూ ర్తి ఆ చా రి *
    అ౦దరికి భారత మిడు దివ్యానుభక్తి ;

    యెదగలేరు ద్వేషము గలా రీ జగాన. ,;

    కారు సౌఖ్యవ౦తులు శా౦తి c. గోరకున్న. ;

    కీర్తి రాజీ పునీతులై , కృష్ణ భక్తు --

    లెల్ల. పా౦డవుల వలె శోభిల్ల గలరు ;

    " భారతమ్ము కైవల్య.. ప్రభారతమ్ము "

    దివ్యానుభక్తి : దివ్యానుభవము . కీర్తి రాజీ పునీతులు : కీర్తి రేఖ చేత పునీతులు .

    ి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కీర్తి రాజీ పునీతులై’... అర్థం కాలేదు.

      తొలగించండి
  11. కనఁ సాకారుడు సద్గుణమ్ముల సురేఖాహస్తుడాశ్వేతవా
    హనుడేలా రిపుమర్దనుండనగ నాహాశ్చర్యముంగల్గదీ
    శనిఁసంహారము సేయఁ జీపుకరముల్ సవ్యానుసంధాతయున్
    వనజాక్షాప్త సఖుండు ఫల్గుణుడు భీభత్సుండు సామాన్యుడే

    [సేయఁ చీము కరముల్; సవ్యానుసంధాతయున్=సవ్యసాచి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కారు కూతలేలా రిపు కాయములను
      రణమున పడడు రాజీ పురందర తన
      యుండు ఖండింప డేవేగ యుద్ద భూమిఁ
      ప్రాణములు వోవ కలుగు దివ్యాను భూతి

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘కన, శని" తర్వాత అర్ధానుస్వారం అవసరం లేదు. ‘ఆహా + ఆశ్చర్యము’ ఇక్కడ సంధి చేయరాదు. ‘చీము’ చీపు ఎలా అయింది?

      తొలగించండి
    3. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. చీముకరము కర్మధారమున ము వర్ణమునాకు పుంపు లగును కద.
      ఈశ!+ అనిన్( యుద్దము) సంహారము అందుకే అర్ధానుస్వారం పెట్టాను. ధన్యవాదములు.

      తొలగించండి
    4. ఆహాశ్చర్యము: నాకే ఎబ్బెట్టు అనిపించింది.

      తొలగించండి
    5. కన సాకారుడు సద్గుణమ్ముల సురేఖాహస్తుడాశ్వేతవా
      హనుడేలా రిపుమర్దనుండనగ బోనాశ్చర్యముంగల్గదీ
      శని సంహారము సేయఁ జీపుకరముల్ సవ్యానుసంధాతయున్
      వనజాక్షాప్త సఖుండుఫల్గుణుడు భీభత్సుండు సామాన్యుడే

      తొలగించండి
    6. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ఈశ+అని అని సంధి చేయరాదు.అక్కడ యడాగమం వస్తుంది.

      తొలగించండి
  12. రాయభార సమయములో భీష్ముఁడు దృతరాస్ట్రునితో చెప్తున్నట్లుగా....

    పూని ముకుందునాజ్ఞ గని పొందిక గల్గిన చాలు, కారు నీ
    సూనులు సాటి పాండవుల శూర బలంబుల, కాబలారి స
    త్సూనుఁడు దివ్య శస్త్ర పరిశోధితుఁడాతనిఁ జీపుటెట్లున
    వ్యానుగతానుబంధముల నంతముచేయిట పాడియౌనటే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  13. .దత్తపది-83.కారు,లారీ,జీపు,వ్యానుపదాలతో
    భారతార్ధములో పద్యము వ్రాయండి
    పద్యము:కారు క్ష౦తవ్యులా రీతి పరిభవమ్ము
    జేయ పాంచాలి ని౦క రాజీ పుడుకు గ
    వాంఛ నుంచంగ తగదు.దివ్యానుభూతి
    బ్రతికి యుండగ కలలోన బడయ వచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘రాజీ పుడుకుగ’...?

      తొలగించండి
    2. గురువుగారికి వందనములు పద్యమును సవరించి తిని పరిశీలింఛ ప్రార్ధన
      కారు క్షంతవ్యు లారీతి కాపురుషులు
      తగదు రాజీ పురటములు తగవు దీర్చ
      కౌరవాదుల రణమున పేరడచగ
      ప్రతిథ తీరును కలుగు దివ్యానుభూతి

      తొలగించండి
    3. గురువుగారికి వందనములు పద్యమును సవరించి తిని పరిశీలింఛ ప్రార్ధన
      కారు క్షంతవ్యు లారీతి కాపురుషులు
      తగదు రాజీ పురటములు తగవు దీర్చ
      కౌరవాదుల రణమున పేరడచగ
      ప్రతిథ తీరును కలుగు దివ్యానుభూతి

      తొలగించండి
    4. తిమ్మాజీ రావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. 15రాయభార కృష్ణుడు కౌరవ సభలోపలికినిమాటలు
    .రాజీ పులకింతొసగును
    తేజపు దివ్యాను భూతి తిరిగియు గలుగున్
    రాజా|పుకారు నమ్మకు
    వ్యాజములకు వెళ్ళ?బ్రతుకు లారిన ఫలమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పులకింత నిడుము’ అనండి.

      తొలగించండి
  15. Guruvu gaaru ninnatu సమస్య ki naa poorana..gamaninchagalarani manavi

    గు రు మూ ర్తి ఆ చారి .
    ........................

    సత్యమును విస్మరి౦
    చెడు " సచ్చరితులు "

    పరుల సొమ్ము నాశి౦చెడు
    " పురుషవరులు "

    వ్యసనముల చరి౦చెడు
    గుణ భ్రష్టు లైన

    " స జ్జ ను లు "చేరుదురు
    యమ సదనమునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. రిప్లయిలు

    1. శ్రీగురుభ్యోనమః

      జాజీపువ్వుల మాల దాల్చి సభనన్ చక్రాయుధుం డంతతా
      నాజి న్నాపగ రాయబారి యయి దివ్యానుగ్రహంబిచ్చుచున్
      పూజింపన్ దగు వృద్ధులెల్ల కనగా బోధించెను కారుణ్యతన్
      రాజీవాక్షుని బోధ లా రిపులకున్ లాలిత్యమున్నేర్పునే?

      అనుచు విదురుడు యోచించె మనసు లోన
      కృష్ణమూర్తిని తోడ్కొని గృహము జేరి
      యర్ఘ్య పాద్యమ్ము లిచ్చుచు నాదరింప
      హరియు మురియుచు దీవించె హాయి నొంది.

      తొలగించండి
    2. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జాజిపువ్వులు’ అనవలసింది ‘జాజీపువ్వులు’ అన్నారు. ‘సభనన్’ అన్నదాన్ని ‘సభలో’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘బోధించెఁ గారుణ్యతన్’ అంటే సరి.

      తొలగించండి
  17. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఉదయం యాదగిరికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసికొని తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఇల్లు చేరగానే మీ పూరణలను, పద్యాలను సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ భాగవతుల కృష్ణా రావు గారి పూరణ

    బందుగులె; కారు వైరులు , పాండు సుతులు
    నీతిమంతు లారీ తినె జ్ఞాతులు కద !
    ధర్మ, రాజీ పురి కిబంప దలచె నన్ను
    నీదు దివ్యానుభవమును నెరపు మధిప !

    రిప్లయితొలగించండి
  19. కారులు గూయరాదు యిక కర్జము లారి సభాంతరమ్మునన్
    ఘోర రణంబు ముంగిటన ఘోషలు వెట్టుచు రంకె లేసెరా
    చీరెను జీపురున్ తుడిచి చెండుటకై తగు వ్యాను వీచెరా
    పోరుకు సిద్ధమై తరలి పొమ్ము సుయోధన యోచ నేలరా?

    వ్యానము=గాలి ఈ అర్థములో వ్యాను అని వ్రాసినాను సరియైనదేనా?
    గురువు గారికి నమస్కారములు. నాకు అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానము లేదు.కనుక నేను పద్య రచనలో సరిగా పాల్గొనలేక పొతున్నాను. క్షంతవ్యుడిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మణ మూర్తి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      ఆరంభంలోనే వృత్తరచనకు చక్కని ప్రయత్నం చేశారు. సంతోషం! మీ పూరణ ప్రశంసార్హం. అభినందనలు.
      ‘రాదు+ఇక’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. వ్యానమును వ్యాను అనరాదు. అయినా వ్యానము సాధారణ వాయువు కాదు, అది శరీరమంతటా వ్యాపించి ఉండేది.

      తొలగించండి
  20. కారు పాండవులన్యులు కౌరవేశ
    లాతి భక్తి నీయెడను గలారిది విను
    రాజ్య మిడి చూపు నవ్యానురాగ మందు
    చేత వారితో రాజీ పునీత మగును.

    రిప్లయితొలగించండి
  21. తే.గీ :రామచంద్రుడన్ రా జీ పురమ్ము నందు
    ప్రభుత నెరపెడునట్టి దివ్యానుభూతి
    కైక దుష్టురా లారీతి క్రమ్మి వైచె
    కారు మబ్బు మా రాజ్యాన క్రమ్ముకొనియె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మిమ్మల్ని శంకరాభరణం బ్లాగులో చూడడం నాకు మహదానందాన్ని కలిగిస్తున్నది. స్వాగతం.
      మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. అయ్యా ! శంకరయ్య గారు ! నమస్కారం. నాకు మీ కవిత్వం పట్ల మీ బ్లాగ్ పట్ల చాలా అభిమానం. కానీ బ్లాగ్ లో చదవటం వ్రాయటం నాకు కాస్త అలవాటు కాక రవ్వంత ఇబ్బంది అయింది. ఇకపై నేను పాల్గొంటూ ఉంటాను.మీ అభిమానానికి ధన్యవాదం.

    రిప్లయితొలగించండి