22, జులై 2013, సోమవారం

పద్య రచన – 410 (గురు పూర్ణిమ)

కవిమిత్రులారా,
గురుపూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచనకు అంశము.....
“గురు పూర్ణిమ”

28 కామెంట్‌లు:


  1. గుండు సున్నా లో ఉన్నదిగుండు
    పూర్ణములో నున్నవారు గురువు
    గురువుని గనుమా గుండు సున్న లో
    సున్న సున్నాలో సున్న అయిపోకుమా

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞానపు చీకట్లకు .
    విజ్ఞానపు వెన్నెలనిడి వెలుగే నింపున్
    సుజ్ఞానియైన గురువుకు
    ప్రజ్ఞా వంతులుగ మారి ప్రణమిల్ల వలెన్.

    రిప్లయితొలగించండి
  3. గురు పూ ర్ణిమ దినమున మన
    గురువును బూజించు నెడల గురువే యిచ్చున్
    వరమగు నా శీ ర్వాదము
    పర సుఖములబొందు కొఱకు పావన నరుడా !

    రిప్లయితొలగించండి
  4. గురు స్తుతి:

    గురుదేవా! జ్ఞానప్రద!
    సరసీరుహ సంభవా! ప్రసన్న గుణాఢ్యా!
    వరదా! శ్రుతిస్వరూపా!
    పరమాదృతి నిను దలంచి ప్రణతులొనర్తున్

    గురుదేవా! జ్ఞానప్రద!
    కరుణాకర! వాసుదేవ! కమలాకాంతా!
    సుర రక్షక! స్థితికారక!
    పరమాదృతి నిను దలంచి ప్రణతులొనర్తున్

    గురుదేవా! జ్ఞానప్రద!
    పరమామ్నాయాంతవంద్య! ప్రజ్ఞాననిధీ!
    గిరిజానాయక! శంకర!
    పరమాదృతి నిను దలంచి ప్రణతులొనర్తున్

    రిప్లయితొలగించండి
  5. జిలేబీ గారూ,
    ప్రొద్దున్నే మీ 'వరూధిని' "గురుపూర్ణిమ గుండుసున్నా" అనడం చదివాను. ఈలోగా ఇక్కడ మీ వ్యాఖ్య. బాగుంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    త్రిమూర్తులను గురుమూర్తులుగా దలంచి వ్రాసిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఎవఁడు ప్రణవ స్వరూపుఁడై భువన భవన
    సృష్టి సంస్థితి లయ కార్య శీలి యగునొ
    యతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
    శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

    ఆది మధ్యాంత రహితుడై వ్యాప్తిఁ జెంది
    పంచ భూతాత్ముడై కాచుఁ బ్రకృతి నెవ్వఁ
    డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
    శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

    ఎవడు వాచామగోచరుండెవఁడు నిఖిల
    తత్త్వ విజ్ఞాన సార నిధాన చిత్తుఁ
    డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
    శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

    నిర్గుణుండు నిరాకార నిర్వికల్ప
    నియమి యెవ్వఁడు నిగమాంత నిత్య పూజ్యుఁ
    డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
    శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

    చిన్మయానందుఁడెవఁడు విశేష బుద్ధి
    కుశలుడెవ్వఁడు శ్రీ జగద్గురువరేణ్యుఁ
    డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
    శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

    రిప్లయితొలగించండి
  7. డా. విష్ణునందన్ గారికి అభినందనలు. మీ గురుస్తుతి చాల బాగుగ నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
    గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :'

    జిలేబి గారికి ధన్యవాదములు

    ( దొంగ బాబాలను ఆశ్రయించక, మంచి గురువులను ఆశ్రయించమని కోరుతూ )
    ======*======
    గుండు నందున గుండ్రాతి గురువుని గని
    గుండు సున్నా యగు నరుల దండుని గని,
    గుండు నందు గనుము మంచి గురువులను,స
    కలము సిద్ధించు నా గురు కరుణ తోడ,
    ( గుండు= జగము )

    రిప్లయితొలగించండి
  9. తరువులవలె గురువు లెపుడు
    పరహితమును జేయనెంచి ప్రజ్ఞానిధులై
    నిరతము భావి తరములకు
    దరగని జ్ఞానమ్ము బంచు దాతలు మిత్రా!

    రిప్లయితొలగించండి
  10. గురువు లేని చదువు గుడ్డి చదువగును, గురువు సంస్కారము గౌరవమును
    మర్యాద గల్పించు, మన్నన తోడుత జీవించ నేర్పించు జీవితమును,
    గురుభక్తి కల్గిన, గోవిందుని దయను పొందుట సులభము పుణ్య మరయ
    గురువు మార్గ మగును, గురుభక్తి ముక్తి ప్రసాదించుటక దియే సాధనమ్ము !

    రిప్లయితొలగించండి
  11. శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. సీస పద్యము వలె కనుపట్టుచున్నది. కానీ దాని తరువాత తేటగీతి గాని ఆటవెలది గాని లేదు. 4వ పాదములో ప్రసాదించుట కదియె సాధనమ్ము అంటే గణభంగము ఉండదు. కదియే అనుట టైపు పొరపాటు కావచ్చు. అలాగే 1వ పాదములో గురువు నకు గౌరవము నకు యతి గానీ ప్రాసయతిగానీ కుదురుట లేదు. కాస్త సరిదిద్ద వలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. గురువు లేని చదువు గుడ్డి చదువగును, గురువు సంస్కార సద్గుణము లిచ్చి
    మర్యాద గల్పించు, మన్నన తోడుత జీవించ నేర్పించు జీవితమును,
    గురుభక్తి కల్గిన, గోవిందుని దయను పొందుట సులభము పుణ్య మరయ
    గురువు మార్గ మగును, గురుభక్తి ముక్తి ప్రసాదించుటక దియె సాధనమ్ము !

    వేద విద్య నేర్పి వినయ శీలురుగను
    శాస్త్ర విద్య గరిపి శాస్త్రులు గను
    ఆత్మ విద్య నేర్పి ఆత్మ జ్ఞానులు గను
    చేయు గురువు తాను సిద్ద గురువు

    పండిత నేమాని గురువర్యుల పాదారవిందములకు వందనములు. గురు పౌర్ణమి సందర్బముగా నమస్కారములు. శ్రీ శంకరయ్య గురువర్యులకు నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  13. అజ్ఞాన ధ్వాంతములను
    ప్రజ్ఞా దీధితులతోడ బారద్రోలున్
    సుజ్ఞానము దయజేయును
    విజ్ఞానాదిత్యుడగుచు వెల్గెడు గురుడే.

    శంకరుని రూపమున దొల్త సంభవించి
    మధ్యలో శంకరాచార్య మహిమ గలసి
    అస్మా దాచార్య పర్యంత మవని నైన
    గురు పరంపరకనయము కరము మోడ్తు.

    మొదట నారాయణుని రూపమునను నిలచి
    వ్యాస వాల్మీకులయి మధ్య వాసికెక్కి
    అస్మ దాచార్య పర్యంత మవని వెలుగు
    గురు పరంపర స్మరియింతు కరము మోడ్చి.



    రిప్లయితొలగించండి
  14. శ్రీ శ్రీనివాస్ గారి పద్యములో కొన్ని మార్పులు అవసరము. ఆటవెలది 3, 4 పాదములలో కొన్ని మార్పులు : ఆత్మ జ్ఞానులు అనుచో త్మ గురువగును అందుచేత గణభంగము అగును. ఆత్మ విదులు అందాము. ఆఖరి పాదము: సంస్కరించు గురుడు సద్గురుండు అందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. గురుపూర్ణిమ సందర్భగా నా అవివేకపు చీకటి కోటులను తరిమికొడుతూ జ్ఞాన కాంతులను ప్రసాదిస్తున్న గురువులకూ, గురుతుల్యులైన మహనీయులకూ ప్రణామ సహస్రము.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మంచి గురుస్తుతిని రచించేరు. కొన్ని సూచనలు:
    పరమశివుడు అభవుడు కదా! అందుచేత మీ ప్రయోగము "శంకరుని రూపముని దొల్త సంభవించి" అనునది ప్రశ్నార్థకమే.
    చిన్న టైపు పొరపాటు మీ 2వ పద్యము 3వ పాదములో: అస్మదాచార్యకి బదులుగా అస్మాదాచార్య అని పడినది - సరిచేయవలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. గురువు లేని చదువు గుడ్డి చదువగును, గురువు సంస్కార సద్గుణము లిచ్చి
    మర్యాద గల్పించు, మన్నన తోడుత జీవించ నేర్పించు జీవితమును,
    గురుభక్తి కల్గిన, గోవిందుని దయను పొందుట సులభము పుణ్య మరయ
    గురువు మార్గ మగును, గురుభక్తి ముక్తి ప్రసాదించుటక దియె సాధనమ్ము !

    వేద విద్య నేర్పి వినయ శీలురుగను
    శాస్త్ర విద్య గరిపి శాస్త్రులు గను
    ఆత్మ విద్య నేర్పి ఆత్మవిదులు గను
    సంస్కరించు గురువు సద్గురుండు

    నేమాని గురువర్యులు సూచించిన సవరణ చేసి పూరణ పంపిస్తున్నాను . మన్నించ గలరు .

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు.
    మీ 2వ పద్యము 1వ పాదమును ఇలాగ మార్చవచ్చునేమో చూడండి:

    "తొలుత శంకరుడవగచు నలరి దేవ!"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. విద్యార్థి వితతికి విద్యనందించి
    గుణవంతులను జేయు గురువర్యులార!
    భావితరములకు భవితవ్యమిచ్చి
    దేశప్రగతిని గోరు ధీమంతులార!
    సంఘసంస్కర్తలై సద్భుద్ధి తోడ
    సంఘ ప్రగతి గోరు సన్మార్గులార!
    విశ్వమానవులకు వెలుగులనివ్వ
    క్రొవ్వత్తివలవెల్గు గురువులార!
    మతసామరస్యము మానవత్వమును
    మంచి నడత నేర్పు మహనీయులార!
    శ్రమతత్వవిలువను సహనశీలతను
    సద్భుద్ధి బోధించు సన్మార్గులార!
    అందుకొనండి మా అభివందనములు
    గురుపూర్ణమీరోజు గురువర్యులార!

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. మొగములు నాల్గులేక జగముల్ సృజియించెడి జన్నిగట్టు నా
    లుగు భుజ హస్త జాతములు లుప్తముయైన రథాంగపాణియున్
    సెగకనులేని శంకరుడు చిన్మయరూపుని వేదవ్యాసునిం
    పుగ నుతియింతు నేడు గురుపూర్ణిమ వేళను జ్ఞానసిద్ధికై

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  23. నేమాని పండితార్యా! మీరు ప్రతిపాదించిన సవరణకు కృతజ్ఞతలు.
    టైపాటుకు చింతిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. వ్యాసుని జననము గావున
    ద్యాసగ పూజించి జనులు తరియిం చంగన్
    శైశవము నుండి జ్ఞానము
    భాసురముగ బోధ జేయు భానుడు గురువై !

    రిప్లయితొలగించండి
  25. శ్రీ తిమ్మాజీరావు గారికి శుభాశీస్సులు. వారి స్ఫూర్తితో:

    మొగమొకటే కల నలువయు
    తగ రెండే భుజములుండు దామోదరుడున్
    సెగ కన్నులేని శివుడగు
    జగద్గురుని వ్యాసదేవు సంప్రార్థింతున్

    రిప్లయితొలగించండి
  26. గురుపూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    డా. విష్ణునందన్ గారికి,
    వరప్రసాద్ గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    శ్రీనివాస్ గారికి,
    మిస్సన్న గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. జైశ్రీమన్నారాయణ .
    అస్మద్ గురుభ్యో న్నమః ..
    అస్మద్ పరమ గురుభ్యొ న్నమః ..
    అస్మద్ సర్వ గురుభ్యో న్నమః ..
    శ్రీమతే రామానుజాయ నమః ..
    ఓం నమో నారాయణాయ ..
    ఓం శ్రీ సూర్య నారాయణాయ
    నమః
    అందరికీ శుభ శుభోదయం ,
    అందరికీ గురు పూర్ణిమోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి