21, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1119 (మీసము లందమ్ము సతికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్.
(మల్లాది లక్ష్మణకుమార్ గారి ‘బంతిపూలు’ బ్లాగునుండి ధన్యవాదాలతో...)

30 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  శంకరార్యా !
  మీసము లందమ్ము సతికి - మెట్టెల కంటెన్
  అనవలెనేమో !

  రిప్లయితొలగించండి
 2. వసంత కిశోర్ గారూ,
  నిజమే. సవరిస్తున్నాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  భుజముల చుట్టూ పవిట కప్పుకున్న సుదతి :

  01)
  __________________________

  మీసరపు మగని కెప్పుడు
  మీసము లందమ్ము ! సతికి - మెట్టెల కంటెన్
  మాసిక లున్న చనుమఱువు
  మూసెడు చేలాంచలమదె - ముచ్చట గొల్పున్ !
  __________________________
  మీసరము = శ్రేష్ఠము
  చనుమఱువు = రవిక

  రిప్లయితొలగించండి
 4. "మా సము లెవ" రని పతి తన
  మీసమ్ములఁ ద్రిప్పి, సతియు మెచ్చ, ముఖమునన్
  మీసమును జేర్చి, కనఁ, బతి
  మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్.

  రిప్లయితొలగించండి
 5. పూసల హారము దెచ్చితి
  వేసుకు రమ్మనుచు జెప్పె వేడుకతోడన్
  వాసూరావ్ దువ్వుచు తన
  మీసము "లందమ్ము సతికి మెట్టెలకంటెన్."

  రిప్లయితొలగించండి
 6. రోసము గలిగిన మనిషికి
  మీసము లందమ్ము, సతికి మెట్టెల కంటెన్
  బాసటముగ బతి దేవుని
  ఆసలు మఱి దీ ర్చదగును నాప్యాయత తోన్

  రిప్లయితొలగించండి
 7. రా సుత వాలము ద్రిప్పుచు
  వేసముఁ దా మగడు నయ్యి వెస జన, పోరున్
  రోసము మెలికెలు దిరిగెడి
  మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్.

  రిప్లయితొలగించండి
 8. కాసుల నార్జించుటలో
  మా సము లెవరనెడు స్త్రీ సమాజములోనన్
  భాసిలు నొక తరుణి పలికె
  మీసము లందమ్ము సతికి మెట్టెల కంటెన్

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు
  ==========*========
  భూసురునకు భాసుర మగు
  మీసము లందమ్ము, సతికి మెట్టెల కంటెన్
  మోసము జేయని భర్తను,
  కూసము,కూరిమిని గోరు కువలయ మందున్
  (కూసము = రవికె )

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. రోసము గల మగవానికి
  మీసము లందమ్ము ; సతికి మెట్టెల కంటెన్
  హౌసెద్ది కాలి వేళ్ళకు !?
  వేసము ముఖ్యమ్ము గాదు విద్యార్థులకున్ !


  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు
  ==========*========
  భూసురునకు భాసురమగు భూతియు,నాభరణమగు
  మీసము లందమ్ము, సతికి మెట్టెల కంటెను దనను
  మోసము జేయని పతిని, పూసల హారము తోడ
  కూసము,కూర్మిని గోరు కుంతాలముల నీడ నందు.
  (పూసల=నల్లపూసలు,కుంతాలము= శ్రీ తాళపు జెట్టు)

  రిప్లయితొలగించండి
 14. రోసము గలిగిన పురుషుని
  వేసము గట్టమని నంత వినయము తో స్త్రీ
  వేసము గట్టిన తడవున
  మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్.

  మీసము తో నాగమ్మగ
  వేసము గట్ట నట రత్న విడ్డూ రము గా
  నా సభి కులెల్ల వల్కిరి
  మీసము లందమ్ము సతికి మెట్టెల కంటెన్

  రిప్లయితొలగించండి
 15. మోసము దెలియక చేసిన
  బాసలు నెరవేర్చువాడు భర్తగ నున్నన్
  నాసిక దిగువ గల మగని
  మీసము లందమ్ము సతికి, మెట్టెలకంటెన్!

  రిప్లయితొలగించండి

 16. ఈ విరుపులో ఎన్ని వ్యాకరణ దోషాలున్నాయో తెలియదండీ.
  పెళ్ళినాటి ఫోటోలలో మెట్టెలు తొడుగుతున్న ఫొటో చూపిస్తూ, భార్యతో భర్త:

  ఓసాయంత్రపుసమయము
  నూసులనాడుచును కనుచు నుద్వాహమునన్
  దీసిన చిత్రాల్, పతి యనె:
  మీసము లందమ్ము సతికి - మెట్టెల కంటెన్

  మీసముల - అందము - సతికి, మెట్టెలకు, అంటెన్

  రిప్లయితొలగించండి
 17. గ్రాసము లేకను పూర్వము
  రోసమ్మును కుదువ బెట్ట రొక్కము కొఱకై
  దోసము నెంచని ప్రియ సఖి
  మీసము లందమ్ము సతికి మెట్టెల కంటెన్ !

  రిప్లయితొలగించండి
 18. వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ప్రారంభంలో రోసము అనవచ్చు. ప్రాసకు ఇబ్బంది ఉండదు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  తిరుపతి వేంకట కవుల ‘దోశ మటం చెఱింగియును...’ పద్యం గుర్తుకు వచ్చిందా? మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  రామకృష్ణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  సతికిలోని ‘కి’ ప్రత్యయానికి అన్వయం?
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  ఈరోజు ఎవ్వరూ సవరణకు అవకాశం ఇవ్వలేదు. సంతోషం.

  రిప్లయితొలగించండి

 19. నా సముడు అర్జునుడొక్కడు
  నీ సరిజోడే సుభద్ర నీ కిష్టమనన్
  మీసము పెంచెను. పతికిన్
  మీసము లందమ్ము- సతికి మెట్టలకంటెన్

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. గురువు గారికి ధన్యవాదములు, గురువుగారు తిరుపతి వేంకట కవుల పద్యము మీరు బ్లాగులో పెట్టిన తరువాత జూచితిని అది మరొక్కసారి వీక్షకులకు

  కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, వీరు చెప్పిన పద్యం. దమ్మున్న కవులు ఎవరైనా మమ్ములను గెలిస్తే మీసాలు తీసి మొక్కుతామని:

  దోసమటంచెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
  మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
  రోసము కలిగినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
  మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.

  రిప్లయితొలగించండి
 22. కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సముడు అర్జునుడు’ అని విసంధిగా ఎందుకు వ్రాసారు? ‘నా సము డర్జును డొక్కడు’ అంటే గణదోషం ఉండదు కదా!
  *
  వరప్రసాద్ గారూ,
  సంతోషం!
  కానీ ఒక్క విషయం ఆ జంట కవుల్లో చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి మాత్రమే మీసాలున్నాయి. దివకర్ల తిరుపతి శాస్త్రికి లేవు. గమనించండి!

  రిప్లయితొలగించండి
 23. యే సిరి మూతికి గలిగిన
  రోసము భూషణము పతికి? లోపము లేకన్
  బాసిల్లు బొట్టు నుదుటన
  మీసము!, లందమ్ము సతికి మెట్టెల కంటెన్!

  రిప్లయితొలగించండి
 24. సతికి కూడా ఆ మీసాల మెరుపు అబ్బింది ( ఫోటో లో) అని అన్వయమండి..

  లేదూ - కాస్త క్లిష్టమే కానీయండి పతి యనె - సతికి.. అని అన్వయం చెప్పుకోవచ్చు..
  భవదీయుడు

  రిప్లయితొలగించండి
 25. చిన్న సవరణతో.............

  మీసము ద్రిప్పుచు చేసిన
  బాసలు నెరవేర్చువాడు భర్తగ నున్నన్
  నాసిక దిగువ గల మగని
  మీసము లందమ్ము సతికి, మెట్టెలకంటెన్!

  రిప్లయితొలగించండి
 26. ఆ సతు లిందిర సోనియ
  మీసపు మగవారి కంటె మేలనిపించన్
  దాసోహమ్మని వంగిరి...
  మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్

  రిప్లయితొలగించండి


 27. ఓ!సరసి! పెనిమిటికి గద
  మీసము లందమ్ము! సతికి మెట్టెలకంటె
  న్నాసంగంబేది గలదు
  కూసము లాగి మగ వాడి కూర్చము లాగన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. "చూసిర నిందిర గాంధిని?
  మీ సములము మేము కూడ మ్రింగుట లోనన్
  వాసిగ పాకుల తూర్పును...
  మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్! "

  రిప్లయితొలగించండి