కావు శాశ్వతములు సిరులు కాయములును దైవమున్ కావు మనుచు వేడుడనుచు కాకి చేయు బోధలన్ రావు మరల మరల మంచి రంగు రంగు దృశ్యముల్ నా విధమ్ము గాంచుడంచు నాట్యమాడు బళి శిఖుల్
గురువు గారు క్షమించాలి. సస్యాపూరణలో పెట్టితిని శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు ======*====== చిన్న నాడు జదివిన పాఠమొకటి గుర్తుకు వచ్చి
పండిత నేమాని వారూ, దేని ప్రత్యేకత దానిదే అన్నట్టు చక్కని పద్యాలను వ్రాసారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం ‘కెవ్వు కేక..." కానీ.... అర్థం కాలేదు. :-) * సుబ్బారావు గారూ, పద్యం బాగుంది,. కానీ నేమాని వారన్నట్టు మీరు నెమలిని కోయిల అనుకున్నారు. * రాజేశ్వరి అక్కయ్యా, మంచి ప్రయత్నం. అభినందనలు. చివరి పాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ..... కాకా యని యఱచి యఱచి కాకానిగ తనదు పేర గ్రామమె వెలసెన్ ! కేకికి లోటా యా కా ర్తికేయునకు వాహన మయి దీపించెఁ గడున్!
మీ రెండవ పద్యం బాగుంది. రెండవ పాదంలో గణదోషం. ‘‘తినుమంచు’ను ‘తిను మటంచు’ అంటే సరి! * వరప్రసాద్ గారూ, ‘కాకీక కాకికి కాక కేకికా?’ చిన్నప్పుడు చెప్పుకున్నది. మళ్ళీ గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
కవి మిత్రులందరికీ అభినందనలు ....హనుమచ్చాస్త్రి గారు మీ పద్యం అద్భుతం గా ఉంది ...నేను అర్ధం చేసుకున్న భావన అయితే ఇది " కాకి "కా కా " అని కేక పెడుతుంది .. కేకి " కా కా" అని కాక "కీ కీ కీ కీ " అంటుంది కాకీక నల్లగా ఉంటె కేకి కి మాత్రం కోక అందం గా ఉంటుంది (కేకో కేక ? ) అంతేనా గురువు గారూ ! తప్పైతే సారీ
మాస్టరుగారూ ధన్యవాదములు. వంశీ కృష్ణ గారూ ! నా కాకి, కేకి కేకల్ని చీకాకు పడకుండా చక్కగా అర్థం చేసుకున్నారు...కెవ్వు కేక... అర్థం సుబోధకం కోసం చిన్న సవరణ...
కాకు లెల్ల నుండు నైకమత్యము తోడ
రిప్లయితొలగించండిబంధుజనుల రాక వార్త తెలుపు
ఖ్యాతి గాంచె కేకి జాతీయ పక్షిగా
నృత్యమందు మిగుల నేర్పు జూపి
కాకికి కేకే ' కాకా '
రిప్లయితొలగించండికేకికి ' కాకాక ' కాక ' కీకీ కీకీ '
కాకీక కాటుకేయిక
కేకికి కోకల్ని జూడ కేకే కేకౌ.
కాకి కేకులు రెండును గాఱు నలుపు
రిప్లయితొలగించండికూత మాత్రము భిన్నపు గూ త లుండు
కాకి కాకా యనగ మఱి కేకి 'కూ' యనునులె
కాకి పొదుగును దన యొద్ద కేకి గ్రుడ్లు .
కావు శాశ్వతములు సిరులు కాయములును దైవమున్
రిప్లయితొలగించండికావు మనుచు వేడుడనుచు కాకి చేయు బోధలన్
రావు మరల మరల మంచి రంగు రంగు దృశ్యముల్
నా విధమ్ము గాంచుడంచు నాట్యమాడు బళి శిఖుల్
శ్రీ సుబ్బా రావు గారు కేకి అంటే కోకిలగా పొరబడి నట్లున్నారు. కేకి అంటే నెమిలి కదా. పద్యమును మార్చితే బాగుంటుంది. స్వస్తి.
రిప్లయితొలగించండికాకా యని యఱచి యఱచి
రిప్లయితొలగించండికాకానిగ తనదు పేర గ్రామమె వెలసెన్ !
కేకికి లోటే లేదన
యా కార్తి కేయునికి తాను వాహన మయ్యెన్ !
గురువు గారు క్షమించాలి. సస్యాపూరణలో పెట్టితిని
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
======*======
చిన్న నాడు జదివిన పాఠమొకటి గుర్తుకు వచ్చి
కేకిని గని కాకియు కే
కీకల తోడ దిరుగాడ యేకాకయ్యేన్
కాకుల గుంపున, కాకికి
కేకియు రూపము వలదుగ కీర్తిని పొందన్
కాకా సురు నకు వరమిడె కాలు డనగ
రిప్లయితొలగించండిపిండము లను దిను మంచు దండి గాను
లేదు కేకికి కొదవన జాతి కంత
పక్షి రాజుగ వెలుగొందు నక్ష యముగ
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిదేని ప్రత్యేకత దానిదే అన్నట్టు చక్కని పద్యాలను వ్రాసారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం ‘కెవ్వు కేక..."
కానీ.... అర్థం కాలేదు. :-)
*
సుబ్బారావు గారూ,
పద్యం బాగుంది,.
కానీ నేమాని వారన్నట్టు మీరు నెమలిని కోయిల అనుకున్నారు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మంచి ప్రయత్నం. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ.....
కాకా యని యఱచి యఱచి
కాకానిగ తనదు పేర గ్రామమె వెలసెన్ !
కేకికి లోటా యా కా
ర్తికేయునకు వాహన మయి దీపించెఁ గడున్!
మీ రెండవ పద్యం బాగుంది. రెండవ పాదంలో గణదోషం. ‘‘తినుమంచు’ను ‘తిను మటంచు’ అంటే సరి!
*
వరప్రసాద్ గారూ,
‘కాకీక కాకికి కాక కేకికా?’ చిన్నప్పుడు చెప్పుకున్నది. మళ్ళీ గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
కేకి విహగరాజు కాకి ఁ యతని వేగు
రిప్లయితొలగించండినీటిపక్షికోట నిప్పుపెట్టె
ప్రాణహాని కల్గె పక్షుల జాతికి
విగ్రహమ్ము నెపుడు నిగ్రహించు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిపంచతంత్ర కథను ప్రస్తావించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
కాకికి బంధువు లెక్కువ
రిప్లయితొలగించండికాకా యని నంత గూడు కాకములెల్లన్
కేకికి అందం బెక్కువ
కేకించుచు నాట్యమాడు కేరింతలతో
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
‘కేకించు.." ?
కవి మిత్రులందరికీ అభినందనలు ....హనుమచ్చాస్త్రి గారు మీ పద్యం అద్భుతం గా ఉంది ...నేను అర్ధం చేసుకున్న భావన అయితే ఇది
రిప్లయితొలగించండి" కాకి "కా కా " అని కేక పెడుతుంది ..
కేకి " కా కా" అని కాక "కీ కీ కీ కీ " అంటుంది
కాకీక నల్లగా ఉంటె
కేకి కి మాత్రం కోక అందం గా ఉంటుంది (కేకో కేక ? )
అంతేనా గురువు గారూ ! తప్పైతే సారీ
మాస్టరుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండివంశీ కృష్ణ గారూ ! నా కాకి, కేకి కేకల్ని చీకాకు పడకుండా చక్కగా అర్థం చేసుకున్నారు...కెవ్వు కేక...
అర్థం సుబోధకం కోసం చిన్న సవరణ...
కాకికి కేకే ' కాకా '
కేకికి ' కాకాక ' కాక కేకే వేరౌ
కాకీక కాటుకేయిక
కేకికి కోకల్ని జూడ ' కేకే కేకౌ '