2, జులై 2013, మంగళవారం

పద్య రచన – 390 (శకునములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“శకునములు”

9 కామెంట్‌లు:

 1. జ్ఞానులై యంతటను నాత్మ గాంచు వారి
  కెట్టి శకున ఫలమ్ములు నేని గలుగ
  వకట! శంకలు గలిగెడు నట్టి వారి
  కెల్ల శకునాలు ఫలితమ్ము లిచ్చుచుండు

  రిప్లయితొలగించండి
 2. శకునమన్నను శనిగాదు శకునిగాదు
  కన్నులదురుట పిల్లులు కండ్ల బడుట
  తలచి భయమును చెందకు కలత వలదు
  హరుని దలచుచు సాగుము హాయి గలుగు.

  రిప్లయితొలగించండి
 3. రకరకముల శకునములు రాలిపోయె
  నక్కటా! ప్రగతి పథమునందు పోవు
  చుంటిమనుచు నెసరుఁ బెట్టె జీవరాశి
  మనుగడకెల్ల, స్వార్థియౌ మనుజుడిపుడు.

  రిప్లయితొలగించండి
 4. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములో 4వ పాదములో గణభంగము కనుపించుచున్నది. సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. శకునము లవి బూ టకములు
  శకునములను నమ్మ కునికి జాతికి మేలౌ
  శకునంబులకును బదులుగ
  సకలంబుల నుండు శంభు శరణము వే డూ .

  రిప్లయితొలగించండి
 6. గణదోషం, యతి దోషము సవరించిన పద్యము

  రకరకముల శకునములు రాలిపోయె
  నక్కటా! ప్రగతి పథమునందు పోవు
  చుంటిమనుచు నెసరుఁ బెట్టుచుండె, సృష్టి
  మనుగడకెల్ల, స్వార్థియౌ మనుజుడిపుడు.

  ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి
 7. వికటించగ పనులన్నియు
  శకు నమ్ముల ఫలిత మంచు శాపము లిడగన్ !
  సకలంబు శుభము గలిగిన
  ప్రకటిం తురు ఘనత లెన్నొ పాటవ మనుచున్ ! ! ! !
  --------------------------------------------
  శకున మొక పక్షి యనగను
  సకలము శుభ సూచకమ్ము సౌఖ్యము లిడగన్ !
  నికరముగ నిలిచె మామగ
  శకునిగ ధరలోన పేరు శాస్వత కీర్తిన్ !

  రిప్లయితొలగించండి
 8. ‘శకునములు’ అన్న అంశముపై చక్కని ప్రద్యములను రచించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి