19, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1117 (భీష్ముఁ డంబను బెండ్లాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

23 కామెంట్‌లు:

 1. భీష్మ పాత్రకు పెట్టింది పేరతనిది
  అంబ వేషములో నామె యారితేరె
  కలసినాటక మాడుచు కలియ మనసు
  భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  నాటకాన్నాసరా చేసుకున్నారా ! శాస్త్రీజీ ! భేష్ !

  ఒక తెలుగు వాచకములలో అచ్చుతప్పు :
  (ఈ మధ్య యివి సాధారణమై పోయాయి)

  01)
  __________________________

  ముద్రణందు గలిగిన,యు - పద్రవమున
  భీము డామెను బెండ్లాడి - బిడ్డల గనె
  యన్నవాక్యము తప్పుగా- నున్నదిట్లు
  భీష్ము డంబను బెండ్లాడి - బిడ్డల గనె !
  __________________________

  రిప్లయితొలగించండి
 3. గుండు మధుసూదన్ గారి పూరణ.....

  అతఁడు గాంగేయ సన్నిభుఁ, డతని నంబ
  వలచి, పెండిలి యాడంగఁ దలఁచి, చేరి,
  జాయ కాఁ గోర్కిఁ జెప్పంగ, నా యభినవ
  భీష్ముఁ డంబను బెండ్లాడి, బిడ్డలఁ గనె!

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  గురువు గారికి ధన్యవాదములు

  అంబ భీష్ముని పెండ్లి యాడమని ప్రాధేయపడు చుండగ జూచిన పరిచారిక మిగిలిన పరిచారికలతో ఈ రీతిని జెప్పు చున్నది
  =====*========
  భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె,
  ముద్దు లాడు చుండ గను బుగ్గ గిల్లె,
  కాటుకను బెట్టు చుండగ కన్ను గొట్టె,
  జోల బాడి వచ్చితి నమ్మ గోల జేయ.

  రిప్లయితొలగించండి
 5. భీమపుర గ్రామ పెద్ద రాముడు - జగదాంబల కల్యాణం :


  02)
  __________________________

  భీమపుర గ్రామ పెద్దగు - రాము ,పేర్మి
  భీష్ముడని ,పిల్ల , పెద్దలు - పిలుచుకొంద్రు
  భీమ సుత జగదాంబపై - ప్రేమ పెరుగ
  భీష్ము డంబను బెండ్లాడి - బిడ్డల గనె !
  __________________________

  రిప్లయితొలగించండి
 6. అభినవ కవిప్రముఖు డొక్క శుభ దినమున
  వ్రాసెనట భారతం బందు పాత్రల గన
  భీష్ముడంబను బెండ్లాడి బిడ్డను గనె
  నాతడే విభీషణుడని ఖ్యాతి గాంచె

  రిప్లయితొలగించండి
 7. తొల్లి పేరగు దేవవ్రతుడనువాడు
  భీష్ముడం, బను బెండ్లాడి బిడ్డల గనె
  నాటకంబున భీష్ముడు నా బడునట
  అతడు పెండ్లాడె నంబను నామె నపుడు

  రిప్లయితొలగించండి

 8. యుద్ద మందున గెలిచిన యువతు లందు
  సాల్వుని వలచె ననితెలుప సాగనంపె
  భీష్ముఁ డంబను, బెండ్లాడి బిడ్డలఁ గనె
  నంబ తోబుట్టు లా శాంత నవుల నపుడు

  రిప్లయితొలగించండి
 9. శ్రీ Sheena గారు,

  "వలచె ననితెలుప" ను "వలచె ననిదెల్ప" అని సవరించండి. గణభంగము కాకుండా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 10. తాను సాళ్వుని వరియింపఁ దలతుననుచు
  నుడివినంతనె మహనీయుకడకు విడిచె
  భీష్ముఁ డంబను, బెండ్లాడి బిడ్డలఁ గనె
  వలచి గాంధారి ధృతరాష్ట్రు వలన గనుడు.

  రిప్లయితొలగించండి
 11. యుద్ద మందున గెలిచిన యువతు లందు
  సాల్వుని వలచె ననితెల్ప సాగనంపె
  భీష్ముఁ డంబను, బెండ్లాడి బిడ్డలఁ గనె
  నంబ తోబుట్టు లా శాంత నవుని యపుడు (శాంతనవుడు = విచిత్ర వీర్యుడు ).

  సంపత్ కుమార్ శాస్త్రి గారి సూచన మేరకు గణ సవరణ మరియు అంబిక, అంబాలిక లిరువురు విచిత్ర వీర్యుని మాత్రమే వివాహమాడారు కావున శాంతనవుల బదులు శాంతనవుని అని మార్చి సవరణ లతో పూరణ పంపించు చున్నాను. మన్నించగలరు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. తండ్రి కోరిక నెరవేర్చ తపన పడుచు
  ప్రతిన బూని భీష్ముండయె బ్రహ్మచారి.
  గంగ కన్నట్టి కలలోన గంగ సుతుడు
  భీష్ము డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె

  రిప్లయితొలగించండి
 14. దురమునను గెల్చుకొనెగాని తిరిగి పంపె
  "పరినయంబాడు" వలసిన ప్రభువు నంచు
  భీష్ముఁ డంబను, బెండ్లాడి బిడ్డలఁ గనె
  నామె చెల్లెలు భీష్ముని యనుజు తోడ

  రిప్లయితొలగించండి
 15. వేంకటాంబను దక్క నే వేరొకతెను
  బెండ్లి యాడుదె ? యని పట్టి భీష్ము డయ్యె
  నాంజనేయుడు ; పెద్దలే యనుమతింప
  భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

  రిప్లయితొలగించండి
 16. వయసులో పెద్ద వాడంచు వాడలోన
  భీష్ముడని యొక్క విధురుండు పేరుగాంచె
  నతడు తోడుకై వెదుకగా నంబ దొరకె
  భీష్ము డంబను బెండ్లాడి బిడ్డను గనె

  రిప్లయితొలగించండి
 17. పట్టి తెచ్చిన ముగ్గురు వనితలందు
  పతియె నాకు సాళ్వు డనగ పంపివేసె
  భీష్ము డంబను ; బెండ్లాడి బిడ్డలు గనె
  నంబిక, విచిత్రవీర్యుని నచ్చి పతిగ.

  రిప్లయితొలగించండి
 18. భీకరమముగ సృజియిం చె వీరభద్రుడు
  దక్షుడొనరిం చు యాగవిధ్వంమునకు
  సతివియోగము శమియింప శాంతుడైన
  భీష్ముడంబను పెండ్లాడె బిడ్డలు గనె

  రిప్లయితొలగించండి
 19. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
  మీరందిచిన సూచనలకు కృతజ్ఞుణ్ణి. కొన్ని టైపింగ్ దోషాలు ఇంతకుముందు దొర్లాయి.

  రిప్లయితొలగించండి
 20. భారతము విని నంతనె పట్టె నిదుర
  కలను గాంచితి భీష్ముడు వలను వేయ
  చిలుక భామలు మెండుగ చిక్కు కొనగ
  భీష్ము డంబను బెండ్లాడి బిడ్డల గనె !

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఉదయం 8.30కు పోయిన కరెంట్ మధ్యాహ్నం ౩ గం.లకు వచ్చింది. ఈలోగా పండుగను పురస్కరించుకొని మా బావమరది ఇంటికి వెళ్ళి ఇంతకు ముందే ఇల్లు చేరాను. అందువల్ల మీ పూరణలు, పద్యాలపై వెంట వెంటనే స్పందించలేకపోయాను, మన్నించండి.
  ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు.......
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  వసంత కిశోర్ గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  వరప్రసాద్ గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  శ్రీనివాస్ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  ‘ముద్రణ + అందు’ అన్నప్పుడు సంధి లేదు.
  ఆ పాదాన్ని ‘ముద్రణంబందు గల్గె నుపద్రవంబు’ అందాం.
  రెండవ పూరణ ‘పెద్ద + అగు’ అన్నచో సంధిలేదు.
  ‘గ్రామ పెద్దగు’ అన్నదాన్ని ‘గ్రామపాలుడు’ అందామా?
  *
  వరప్రసాద్ గారూ,
  రెండవ పాదంలో గణదోషం.
  ఆ పాదాన్ని ‘ముద్దు లాడుచు నుండగ బుగ్గ గిల్లె’ అందాం.
  *
  సుబ్బారావు గారూ,
  ‘పెండ్లాడె నంబను’ అన్నాక ‘ఆమెను’ ఎందుకు?
  అక్కడ ‘పెండ్లాడె నంబ నయ్యవసరమున’ అందామా?
  *
  తిమ్మాజీ రావు గారూ,
  ‘భీకరమముగ’ అనండం సాధువు కాదు. ‘వీరభద్రుడు’లో ‘డు’వలన గణదోషం.
  ఆ పాదాన్ని ‘భీకరమ్ముగ సృజియించె వీరభద్రు’ అంటే సరి!

  రిప్లయితొలగించండి