16, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1114 (దురదృష్టము వలన సిరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.

63 కామెంట్‌లు:


  1. సిరులను మూటల నిడి పా
    తరలోనే దాచి పెట్టి తరలగ దివికిన్
    మరితినరు వారలును తమ
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వాహ్! చాలా బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! శహబాష్ !

    జూదగాడి సిరులు జనుల పాలే గదా !

    01)
    __________________________

    దురపిల్ల సుతులు దారయు
    దురోదరమునకు వశుడయి - దుర్గతి పాలై
    దురితము మరి మరి జేయును
    దురదృష్టము వలన; సిరులు - దొరకు జనులకున్ !
    __________________________
    దురోదరము = జూదము

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కిశొర్జీ ! ధన్యవాదములు.
    మీ పూరణ కూడా అదిరింది.

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రి గారూ ! దంచేసారు !!

    పరిశ్రమయు నార్జనమ్మున
    పరిశ్రమయే కాపు గాయఁ బ్రభు తస్కరులన్
    దరగిన దుఃఖము, గావున
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్.

    రిప్లయితొలగించండి
  7. కిశోర్ జీ అద్భుతమైన పూరణ. మీ రాక మాకు ముదావహము. మీ ఆదరానికి ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  8. శంకరార్యా ! ధన్యవాదములు !

    శాస్త్రీజీ ! ధన్యవాదములు !

    మూర్తీజీ ! ధన్యవాదములు !
    మీ నారికేళ పాకం కొరుకుడు పడకండా ఉంది !
    కొంచెం వివరిస్తారా !

    రిప్లయితొలగించండి
  9. ధరలో నెవ్వరికైనను
    సిరికొఱకై తాను తపన జేయకయున్నన్
    సిరి లభియించినచో యం
    దు, రదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నరసింహ మూర్తి గారికి,

    పరిశ్రమ లో "ర" గురువై గణభంగమవుతుందనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  11. వరదల పాలైరి జనులు
    దురదృష్టము వలన , సిరులు దొరకు జనులకున్
    విరివిగ శివు బూజించిన
    ఇరవుగ మఱి మనసువెట్టి యెప్పుడు నైనన్

    రిప్లయితొలగించండి
  12. పర రాష్ట్రమునకు వెళ్ళితి
    నిరతము కష్టించి పనులు నే జేసితినే!
    కరువాయె నోగిరము నా
    దురదృష్టము వలన , సిరులు దొరకు జనులకున్.

    రిప్లయితొలగించండి
  13. సిరులను పొందెడి యిచ్చను
    పరులను పీడించు వారు పరముకు వెలియై
    నరకము లోపడు, నిహమున
    దురదృష్టము వలన , సిరులు దొరకు జనులకున్.

    రిప్లయితొలగించండి
  14. తరువుల గూల్చుచు కొండల
    కరిగించి ప్రకృతిని మ్రింగ కలికాల మహో!!
    ఎర దొరికిన చేపకు వలె
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్

    రిప్లయితొలగించండి
  15. ఆర్జనంబు యున్న ఆదరణ లేకున్న
    ధనము దండి గుండి దాత కాకున్న
    కూడ బెట్టిం దెల్ల కుండలో నీరాయె దుర
    దృష్టం వలన సిరులు దొరకు జనులకును

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి ప్రయత్నం. కానీ వసంత కిశోర్ గారన్నట్టు భావం బోధపడడం లేదు.
    సంపత్ కుమార్ శాస్త్రి గారన్నట్టు ‘పరిశ్రమ’లోని ‘రి’ గురువే. రెండవ పాదంలో ‘యే’ను హ్రస్వం చేస్తే సరి.. నా సవరణ....
    సరమయు నార్జనమందున
    పరిశ్రమయె కాపు గాయఁ బ్రభు తస్కరులన్
    దరగిన దుఃఖము, గావున
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్.
    (పరిశ్రమకు సరమ పర్యాయపదం)
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, విరుపు ప్రశంసనీయంగా ఉన్నాయి. బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చక్కని విరుపుతో బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వెళ్ళితి’ అనే వ్యావహారికానికి బదులు ‘వెడలితి’ అనండి.
    *
    శ్రీనివాస్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పరముకు’ అనరాదు... అది ‘పరమునకు’. దానిని సవరించండి.
    *
    ఆదిత్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    సమస్య కందంలో ఉంది. మీరు ఆటవెలదిని ఆశ్రయించారు. కందంలో పూరించే ప్రయత్నం చేయండి.
    కంద పద్య లక్షణానికి ఇక్కడ చూడండి.... http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%82%E0%B0%A6%E0%B0%82

    రిప్లయితొలగించండి
  17. మాన్యుల్యు శ్రీ శంకరయ్య గారికి, విద్వన్మిత్రులకు
    నమస్కృతులతో,

    బహుకాలదర్శనం. మీరంతా క్షేమస్థేమాలతో ఉన్నారు కదా!

    పరహితనిత్యోత్సవులై
    నిరతిశయానందు లగు ఘనీయశ్శ్రేయో
    నిరతులకుం బుణ్యప్రా
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.

    పుణ్య = పుణ్యఫలముగా, ప్రాదుః = ప్రకాశమానమగు, అదృష్టము = భాగ్యవిశేషము.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గురువు గారికి ధన్యవాదములు
    =======*=======
    ( నష్ట పరిహారమును దిను వారిపై )

    గిరిధరుని జూడ భక్తులు
    గిరుల నడుమ జిక్క, వారి గీతలు మారెన్
    పరిహార మార గించెను
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్

    రిప్లయితొలగించండి
  19. శ్రీ సుబ్బారావు గారు మీ పద్యములో నా భావము

    వరదల పాలైరి జనులు
    దురదృష్టము వలన,సిరులు దొరకు జనులకున్
    విరివిగ పరిహారము దిను
    గురి వెందకు ధరణి పైన కుసుమములవలెన్

    రిప్లయితొలగించండి
  20. మధ్యాక్కర:
    సిరులు వచ్చునెడల వచ్చు చేరి కొబ్బెర నీటి వోలె
    సిరులు పోయిన పోవు దంతి చెలగి తిను వెలగ రీతి
    సరియగు యోగమ్ము లిడును సకల ఫలితములు విగత
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్ ధరిత్రి

    రిప్లయితొలగించండి
  21. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    భగవత్కృప వలన అందరం క్షేమంగానే ఉన్నాం. ధన్యవాదాలు.
    శబ్దాలతో ఆటలాడుకొనడంలో మీకు మీరే సాటి. అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాచ్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఇప్పుడే మిమ్మల్ని గుర్తు చేసుకొని మరోసారి మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఈలోగా చక్కని పూరణతో దర్శనభాగ్యాన్ని కలిగించారు. ధన్యవాదాలు. ఈ మూడు రోజులూ బ్లాగు పెద్దదిక్కు లేని సంసారమయింది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారి పూరణ....

    దురదృష్టము రాకుంటకు
    వరమందిరి పురజనములు వరలక్ష్మి కడన్!
    వరము కతన, కలుగని యా
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్!!

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారూ,
    చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    శుభాశీస్సులు.
    శ్రీ గుండు మధుసూదన్ గారి ప్రయోగము "రాకుంట" సాధు ప్రయోగమేనా???
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  25. మిత్రులారా! శుభాభినందనలు.
    గత నాలుగు దినములలో మాకు అంతర్జాలము కరవయినది. అందుచేత ఈనాడే మరల మీతో ముచ్చటించే భాగ్యము లభించినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    ========*=========
    వరదల పాలైరి జనులు పర రాష్ట్ర మందున నాడు
    దురదృష్టము వలన,సిరులు దొరకు జనులకున్ విరివిగ
    పరిహారము దినెడి వారి పరివారములకెల్ల నేడు,
    గురి వెందకు ధరణి పైన కుసుమములవలెను జూడ ।

    రిప్లయితొలగించండి
  27. మిత్రులారా!

    సమాసముల మధ్యలో వచ్చు రేఫయుత సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరము గురువా లఘువా అను సందేహము వచ్చునపుడు, ప్ర హ్రాదయః అనే ఒక సూత్రము ప్రకారము పూర్వ అక్షరమును తేలికగా పలికి లఘువుగా వాడుకొనవచ్చును, లేక ఊది పలికి గురువుగా నైనను వాడుకొనవచ్చును. ఇవి సమాసములకే పరిమితములు కాని పదముల మధ్యలోని అక్షరములకు అన్వయించకొనరాదు.

    ఉదా: సరస + ప్రక్రియ = సరసప్రక్రియలో ప్ర ముందున్న స గురువుగా నయినను లేక లఘువుగానైనను వాడుకొనవచ్చును.

    పరిశ్రమ మొదలైన విడి విడి పదములలో మధ్యనున్న శ్ర కి ముందునున్న రి విధిగా గురువే యగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. పండిత నేమాని వారూ,
    గుండు మధుసూదన్ గారు ఫోన్ ద్వారా తెలియజేసిన విషయం... (వారి నెట్ పనిచేయడం లేదట)

    శబ్దరత్నాకరం ‘ఉంట’ శబ్దానికి ‘ఉండుట’ అని అర్థాన్నిచ్చింది. క్రింది ఉదాహరణలను పరిశీలించండి.

    శివుడద్రిని శయనించుట
    రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
    డవిరళముగ శేషునిపై
    బవళించుట నల్లి బాధ పడలేక సుమీ! (చాటువు)

    నోటిపుప్పి కెల్ల నొప్పి లేకుంటకు
    నాకుపోకసున్న మౌషధముగఁ
    బెట్టకుండెనేని బెనురోఁత వేయురా,
    విశ్వదాభిరామ వినుర వేమ!

    కాకుంటకు కుందవరపు కవిచౌడప్పా!


    పై ఉదాహరణలలో ‘ఉండుట’ అనే అర్థంలో ‘ఉంట’ అనీ, ‘లేకుండుటకు’ అనే అర్థంలో ‘లేకుంటకు’ అనీ, ‘కాకుండుటకు’ అనే అర్థంలో ‘కాకుంటకు’ అనీ ప్రయోగాలు ఉన్నాయి. కావున ‘రాకుండుటకు’ అనే అర్థంలో ‘రాకుంటకు’ అనే తమ ప్రయోగం సాధువే అని మధుసూదన్ గారు తెలియజేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  29. వరప్రసాద్ గారూ,
    కందానికి మీ మధ్యాక్కర రూపాంతరం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. సిరిగలిగిన భోగమునన్
    మరులుగొని యిహంబు పైన మమకారమునన్
    పరమున్ మయచెద రకటా!
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్!

    రిప్లయితొలగించండి
  31. సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో ‘మరచెదరు’కు బదులు ‘మయచెదరు’ అని టైపయింది.

    రిప్లయితొలగించండి
  32. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
    శ్రీ మధుసూదన్ గారి ప్రయోగము "ఉంట" గురించి మీరు మంచి వివరణను ఇచ్చేరు. శబ్దరత్నాకరములో పూర్వప్రయోగములను ఈయలేదు. శ్రీ మధుసూదన్ గారు చూపిన పూర్వ కవి ప్రయోగములు కూడ నన్నయ్య తిక్కన్న శ్రీనాథుడు వంటి వారివి కావు కదా!". స్వస్తి.

    రిప్లయితొలగించండి
  33. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి, శ్రీ గురువులకు నమస్కృతులతో,

    భావార్థకమైన "ట" వర్ణకం పరంగా "డు" వర్ణం లోపించినపుడు లుప్తశేషమైన "ఉం" అన్నదానితో టవర్ణకం కూడి "ఉంట" ఏర్పడింది. బిందు - డు లోపాలు వైకల్పికాలు కనుక లోపం కలుగని పక్షాన "ఉండుట" ఏర్పడుతున్నది. అందుకే,

    "తి - దు - ట లు పరంబగునపు డన్వాదుల ను స్థానంబున నున్నయు నుండు డులోపంబును విభాష నగు" అని బాలవ్యాకరణం: క్రియా-58.

    "మధుకైటభారాతి మఱఁది రమ్మని పిల్చి పనిగొంట" అని శ్రీనాథుడు. మహాకవులందరి ప్రయోగాలూ ఉన్నాయి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  34. సిరి సంపద లనునవి
    వరముగ లభియించు ననగ ప్రాకృత కర్మల్ !
    సరియగు నీమము వీడిన
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్ !

    రిప్లయితొలగించండి
  35. గురువుగారికి ధన్యవాదములు.
    టై పాటు సవరణ తో :

    సిరిగలిగిన భోగమునన్
    మరులు గొని యిహంబు పైన మమకారమునన్
    బరమున్ మరచెదరకటా!
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్!

    రిప్లయితొలగించండి
  36. తరుగును సంపద లన్నియు
    దురదృష్టము వలన ; సిరులు దొరకు జనులకున్
    బరగెడు భాగ్యము కతమున
    స్థిరముగ నుండదు గద ! రమ చిరకాలముగన్

    రిప్లయితొలగించండి
  37. నిరుపేదలు కష్ట పడుచు
    సిరిసంపద లెల్ల బొంది శ్రీమంతులవన్
    మరి ధన ముండెడి వా రం
    దు రదృష్టమువలన సిరులు దొరుకు జనులకున్

    రిప్లయితొలగించండి
  38. శంకరయ్య గారికి కృతజ్ఞతా పూర్వక నమస్కారములు . నిన్నటి పూరణకు మీ అభినందనా పాత్రుడి నైనందుకు బహుధా కృతఙ్ఞతలు . మీరు సూచించినట్టు సవరణ చేసి ఈవిధము గా పూరణను పంపించు చున్నాను.
    సిరులను పొందెడి యిచ్చను
    పరులను పీడించు వారు పరమును గనకన్
    నరకము లోపడ వారల
    దురదృష్టము వలన , సిరులు దొరకు జనులకున్.

    రిప్లయితొలగించండి
  39. పురజనులను దోచుకొనుచు
    ధరణీశులు కోటలందు దాచిన సొమ్ముల్
    వరదలతో దరి జేరెను
    దురదృష్టము వలన; సిరులు దొరుకు జనులకున్

    రిప్లయితొలగించండి
  40. శ్రీ శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచేను - బాగుగనున్నది. 2వ పాదము చివరిలో "పరమును గనకన్" అనే పదమును వాడేరు. గనక అనే పదము వ్యతిరేకార్థకము - అందుచేత దాని చివర న్ అనే ద్రుతము రాదు. గనకన్ అని అనరాదు. దానికి బదులుగా గనకే అనుట కొంత నయము. స్వస్తి.

    రిప్లయితొలగించండి


  41. సిరి రా మోకాలొడ్డుట
    దురదృష్టము వలన ; సిరులు దొరకు జనులకున్
    సిరి దా వచ్చిన వచ్చును
    సిరి దా బోయినను బోవు చిత్రము సుమ్మీ !

    రిప్లయితొలగించండి
  42. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గురువు గారికి ధన్యవాదములు
    =======*=======
    నిరయమధికము గల పరుల
    దురదృష్టము వలన, సిరులు దొరుకు జనులకున్
    కరతల మందున మరకల
    పరకలు మెలికలు దిరుగగ పాపపు జగతిన్ ।
    ( నిరయము = దుర్గతి, పరకలు= రైతులు పొలమున మిగిల్చిన గడ్డి )

    రిప్లయితొలగించండి
  43. పండిత నేమాని వారూ,
    సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘ఉంట’ శబ్దానికి ‘ఉండుట’ అని అర్థాన్నిచ్చి క్రింది పూర్వకవి ప్రయోగాలను చూపించింది.
    1)
    బంటుతనంబు మాటలకుఁ బాఱకు పాండునృపాలు పాలు గై
    కొంటయ చాలు నన్న నృపకుంజరు పల్కుల కడ్డమాట రా
    కుంట యెఱుంగవే మును... (భార. ఉద్యో. 3-59)
    2)
    దుగ్ధాబ్ధికన్యక తోడికోడలు గాఁగ
    నొరిమ మై నుంట నీ కొప్పుఁగాదె (నైష. 3-126)
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘సిరి సంపద లనునవి యొక/ వరముగ....’ అందాం.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ తాజా పూరణ వృత్యనుప్రాసాలంకారంతో చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  44. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  45. ఏదో సరదాకి ఈ పద్యం :

    ‘ సిరి ' సౌలభ్యము గలుగదు
    దురదృష్టము వలన ; ‘ సిరులు ' దొరకు జనులకున్
    ‘ సిరి ' గల ఐఫోన్లు కొనిన ;
    ‘ సిరి ' యనునది సాఫ్టువేరు సిరిసిరి మువ్వా !!

    ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అప్లికేషన్‘ siri'. ఇది యాపిల్ ఐఫోన్, ఐపాడ్లలో నిక్షిప్తమై ఉంటుంది. దీని సహాయంతో మనము ' siri' ని ఏదైనా అడగొచ్చు లేదా దానితో మాటాడొచ్చు.

    రిప్లయితొలగించండి
  46. ఇక్కడికి వచ్చి కవి పండితుల పద్యాలు చదువుకోవటం కూడ సిరియే కదండీ నాబోంట్లకు..

    అరరే! రారిటు తెలుపగ
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్
    దరగనివై నిల్చును, శం
    కరాభరణ దర్శనమున కమ్రకృతులలోన్!!

    రిప్లయితొలగించండి
  47. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గురువు గారికి ధన్యవాదములు
    =======*=======
    ( పేదల కష్టమును దోచుకొనే వారిపై )

    మాయ దెలియని మనుజుల మగతనమ్ము,
    పేద వారి స్వేదన మెల్ల పేరిమి యగు
    వైరి తతి దురదృష్టము వలన, సిరులు
    దొరుకు జనులకున్ నిత్యము ధరణి నందు ।

    రిప్లయితొలగించండి
  48. దొర ధర్మాత్ముం డైనను
    సిరి యుండును వాని రాజ్య సీమల ననియం
    దు, రదృష్టము వలన సిరులు
    దొరకు జనులకునని యనుట దోసమ్మేమో.

    రిప్లయితొలగించండి
  49. పరమేష్ఠి లేఖ్యములు ఎ
    వ్వరికి తెలియంగరాదు వరమేయగు దు
    ర్భర దారిద్ర్యము సైతము
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్

    kembai Timmaji Rao

    రిప్లయితొలగించండి
  50. డాక్టర్ ఏల్చూరి వారూ! శుభాశీస్సులు.
    మీరు ఉదహరించిన వ్యాకరణ సూత్రము మా సందేహమును దీర్చినది. శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  51. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    శుభాశీస్సులు.
    మీరు సందేహ నివృత్తి చేసినందులకు మా అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  52. గురువర్యులకు ప్రణామములు ...
    పూరణం చూడగానే పద్యరచనకు పూనుకోవడం తప్ప మరో ధ్యాసలేదు.అందుకే పద్యం వ్రాయాలనే తపన తో తమకు శ్రమ కల్గించినందులకు క్షంతవ్యురాలను... తమరందించిన లింకు(స్ఫూర్తి)తో ఇక కందాన్ని ప్రయత్నిస్తాను.. తప్పులను సరిచేసి పథనిర్ధేశం చేయగలరని ఆశిస్తాను.

    రిప్లయితొలగించండి
  53. నాగరాజు రవీందర్ గారూ,
    ‘సరదా’కి ‘సిరి’పై వ్రాసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రామకృష్ణ గారూ,
    పద్య సిరులను గూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    తేటగీతిలో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    సమస్యను స్థానభ్రంశం చేసి అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రమణ గారూ,
    స్వాగతం!
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘లేఖ్యములు + ఎవ్వరికి’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘లేఖ్యములె యెవ్వరికి...’ అందాం.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు.
    *
    శైలజ గారూ,
    నేనిచ్చిన లింకులో కందపద్య లక్షణంలో ఏమైనా సందేహాలుంటే అడగండి. ఎల్లప్పుడూ మీకు సహాయపడటానికి సిద్ధం.

    రిప్లయితొలగించండి
  54. గురువు గారి సవరణకు ధన్యవాదములు. రేఫము విషయములో సందేహ నివృత్తి నొనరించిన అన్నగారికి అభివాదనములు.

    రిప్లయితొలగించండి
  55. వివిధములైన పూరణలు, పండితచర్చలు జరుగుచున్న ఈ శంకరాభరణ దర్శనం నిజంగా నిధియే, రామకృష్ణగారూ!

    విరళములై విలసిల్లుచు
    నురముల నుప్పొంగఁజేయు నుక్తుల రచనల్
    విరివిగఁ గనిపింపగ నం
    దుర,దృష్టము వలన సిరులు దొరకు జనులకున్

    రిప్లయితొలగించండి
  56. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
    నమస్కారములు
    శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారు పూరించిన సమస్యను నేను పోస్ట్ చేశాను. వారికి తెలుగు టైపు పోస్టింగ్ వ్విశాయలు తెలియక నా సహాయము తీసుకోనినారు. వారి ఒక గూగుల్లో ఖాతా తెరిచి మున్ముందు వారి పేరుతోనే పంపగలము.

    రిప్లయితొలగించండి
  57. బిరబిర భవనము కట్టుట
    నిరతము లెక్కించుకొనుట నిదురల లోనన్
    భరణమ్ము లిచ్చుకొనుటయె...
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్

    రిప్లయితొలగించండి


  58. పరువుల్ బోవు జిలేబీ
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్,
    వరమివ్వ లచ్చు మమ్మ, స
    వరమ్ములకొలది, శుభాంగి వందన మిడుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  59. తరలుచు గ్రామము గ్రామము
    వరలుచు వడ్డీలకిచ్చి వారల్ కొంపల్
    బిరబిర కూల్చగ రైతుల
    దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్

    రిప్లయితొలగించండి