గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మహాకాయుడైన రాక్షసుడి ఉంగరము మానవకాంతకు ఒడ్డాణమైనదన్న మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ రన్నది నిజమే... ధన్యవాదాలు. మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘శీనా’ శ్రీనివాస్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో నేమాని వారి అభ్యంతరమే కాక గణదోషం కూడా ఉంది. ఆ పాదాన్ని ‘స్తవనీయ మగు నడుము ప్రా...’ అందాం. రెండవ పాదంలోనూ గణదోషం. ‘పెంచిన నటి’ని ‘పెంచి నటి’ అంటే సరి. రెండవ పూరణలో ‘వ్రాయగ / నువిద కొసగె..’ అనండి. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు.
వివిధౌషధముల గైకొని
రిప్లయితొలగించండినవల యొకతె సన్నబడెను నాజూకులతో
యువతులు భళి! పొగడగ నా
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండినాజూకైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
జవరాలి ముద్రికను నొక
రిప్లయితొలగించండినవసాలియె మార్చె నొడ్డియానము గాఁగన్!
రవణించు నగ ధరించిన
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!
(అవసాలి=స్వర్ణకారుఁడు; ఒడ్డాణము>ఒడ్డియానము...రూపాంతరము "తెలుగు పర్యాయపద నిఘంటువు"న నున్నది)
కవి వర్ణించెను కథలో
రిప్లయితొలగించండియువరాణిని పట్టి తెచ్చె నొక రాక్షసుడే
జవరాలి కతడు పెట్టగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
నవలావణ్యఁపు మెఱుఁగుల
రిప్లయితొలగించండికివిసాటియె యంచు ప్రియుఁడునీప్సిత మనమున్
స్తవమొనరించగ పొంగెడు
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.
రిప్లయితొలగించండిజవరాలి యాటలందున
నవలామణి రూపమందు నటియించెడు బొ
మ్మ వధువయినచో మరి యా
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణమయెన్/ణమ్మౌ
గురువుగారు,
విష్ణునందన్ గారు ఒకసారి అయెన్ వ్యాకరణ రూపము సరికాదని చెప్పినట్టు జ్ఞాపకం.
నవ వధువౌ సీత వరుడు
రిప్లయితొలగించండిరవికులతిలకుని ప్రతిమలు రమణీయమ్మై
నవమిన ధగధగ మెరియ
న్నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మహాకాయుడైన రాక్షసుడి ఉంగరము మానవకాంతకు ఒడ్డాణమైనదన్న మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ రన్నది నిజమే... ధన్యవాదాలు.
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిరవి చంద్రులు తాటంకము
లు,వసుధ తానాయె నాభి, లోకేశ్వరి కా
దివియే నడుమట, శివుని
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ (దివి = ఆకాశము )
రవి చంద్రులు తాటంకము
రిప్లయితొలగించండిలు,వసుధ తానాయె నాభి, లోకేశ్వరి కా
దివితానె నడుమట, శివుని
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ (దివి = ఆకాశము )
మూడవ పాదము లో గణ దోషము సవరించి పంపు చున్నాను. మన్నించ గలరు .
శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
కరిష్మా కపూర్ జిరో సైజ్ పై
====+====
వివిధ విధముల నడుము ప్రా
భవమును బెంచిన నటి పొందె వైభవమును, సా
ధువు నొసగెనుంగర మొకటి,
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రయోగము వివిధ విధముల అనుట సాధువు కాదు. వివిధ అంటేనే అనేక విధములైన అనే అర్థము. స్వస్తి.
క్రికెట్ లో,టివిలో బహుమతిగా పెద్దవి ఇచ్చెదరు.అటు వంటి బహుమతి ఉంగరమును ధరించగ సుందరి
రిప్లయితొలగించండి=====*======
కవితలు జక్కగ వ్రాయగ
యువిదకొసగె నుంగరమ్మునొక బహుమతిగన్,
వివరము మరచి ధరించిన
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిమంద బుద్ధికి మరి మరి వెదకిన పదములు దొరకుట లేదు,పదమును సూచించి తప్పును సరిజేయగలరు
నవ మల్లిక నడుము సొగసు
రిప్లయితొలగించండినవ విధి వర్ణింతు రెపుడు నాజూకనుచున్ !
కవనమున కవుల కల్పన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !
రిప్లయితొలగించండిఅతిశయోక్తితో చెప్పిన పూరణము (సరదాగా)
ధవు నెడఁబాసియు మోదము
లవలేశము నందకుండ లంకాపురిలో
నవయు ధరాత్మజ యగు న
య్యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.
(నవయు = కృశించు)
maasTaru gaaroo ! seetaaadEvi digulutO chikkina vishayaanni cakkagaa ceppaaru.... baaguMdi.
రిప్లయితొలగించండికవిత కరగించి తన పా
రిప్లయితొలగించండిత విలువగల యుంగరమును దనయకు జేయిం
చె వెడద యొడ్డాణముగన్ -
ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
‘శీనా’ శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో నేమాని వారి అభ్యంతరమే కాక గణదోషం కూడా ఉంది. ఆ పాదాన్ని ‘స్తవనీయ మగు నడుము ప్రా...’ అందాం. రెండవ పాదంలోనూ గణదోషం. ‘పెంచిన నటి’ని ‘పెంచి నటి’ అంటే సరి.
రెండవ పూరణలో ‘వ్రాయగ / నువిద కొసగె..’ అనండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
@రాజేశ్వరి నేదునూరి గారూ
రిప్లయితొలగించండినవ మల్లిక నడుము సొగసు ----- వావ్
శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండినా తప్పులకు మన్నించగలరు.
శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారూ మీ మల్లిక ---అదుర్స్.
నమస్కారములు
రిప్లయితొలగించండిశ్రీ లక్కరాజు గారికీ . వర ప్రసాద్ గారికీ ! ధన్య వాదములు మాతమ్ముడి పేరుకుడా ఈశ్వర వర ప్రసాద్ .నా ఇద్దరి చెల్లెళ్ళ తర్వాత ఒక్కడే తమ్ముడు
ధవుడొప్పుకొనెను బటువుకు
రిప్లయితొలగించండినవనికి పసిడి ధరలు దిగి యాశలు పెంపై
సవరులు హెచ్చుగఁ బెట్టిన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
జవరాలి నడుము తీవని
రిప్లయితొలగించండిసవినయముగ తెలియజేసి సంబరపెడుతూ
కవనము లల్లుచు నిచ్చిన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
సవరలు మూడని తెలియగ
రిప్లయితొలగించండినవనిజ మూర్తికి సరియని యవ్వవి నగల
న్నవలీలగ కరిగించగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
రిప్లయితొలగించండిభవబంధములను జూచుచు
భువనంబందు నెలతుకకు భూమాతవలెన్
కవనంబుల రింగులమర
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!
జిలేబి
అవలీలగ నేనిచ్చిన
రిప్లయితొలగించండియువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
జవరాలే కరిగించుచు
భవబంధమ్ములను త్రుంచు భగవతికిడగా