అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. "బంధువయ్యి" అనే ప్రయోగము సాధువు కాదు. బంధువగుచు అని గానీ బంధు వనగ అని గానీ అనవచ్చు నేమో? స్వస్తి.
రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పాదాలూ బాగున్నవి. అభినందనలు. ‘వెలుగుయమ్మ’ను ‘వెలుగునట్టి’ అనండి.
వరప్రసాద్ గారూ, చిన్నప్పటి కథకు పద్యరూపాన్ని ఇచ్చారు. సంతోషం. కానీ కథలో స్పష్టత లోపించింది. * బొడ్డు శంకరయ్య గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ఒక సూచన... పద్యం మధ్యలో అచ్చులు వ్రాయడం సంప్రదాయం కాదు. అక్కడ యడాగమ, నుగాగమాలు చేసి వ్రాస్తే బాగుంటుంది.
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు, మీర సూచించిన నియమాలతో పద్యాన్ని సవరిస్తూ..... బాట సారుల యాకలి బాధ దీర్చు నలసి వచ్చిన వారల నాదరించు విడిది చేసిన వారికి విడియమిచ్చు పేదరాసి పెద్దమ్మది పెద్దమనసు
ప్రాత కథలకు నామెయే పట్టుగొమ్మ
రిప్లయితొలగించండిబాటసారుల కామెయే పూట కూళ్ళు
పేదరాలయ్యి పోయెగా పెద్దదయ్యి
ఆదరించెడు కథలేక నయ్యొ రామ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ఆమెయే పూటకూళ్ళు’ అనడం కంటే ‘బాటసారులకును బెట్టు పూటకూళ్ళు’ అంటే బాగుంటుందేమో?
పెద్దమ్మ, యాదరించుచు
రిప్లయితొలగించండిపెద్దమనసు తోడ కూడు బెట్టుచు నెంతో
నొద్దికతో కథ చెప్పుచు
తద్దయు పులకింపజేయు తల్లికి జేజే
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిపెద్దమ్మ పెద్దరికాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
బాటసారులకు మిగుల బంధు వయ్యి
రిప్లయితొలగించండికూడువెట్టును బ్రియమున కొసరి కొసరి
గ్రామ వార్తలు సెప్పును గధలు గాను
పేదరాసి పెద్దమ్మ నా బేరు వడసి .
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. "బంధువయ్యి" అనే ప్రయోగము సాధువు కాదు. బంధువగుచు అని గానీ బంధు వనగ అని గానీ అనవచ్చు నేమో? స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమనిషి పేదైన కాదామె మనసు పేద
రిప్లయితొలగించండిఆద రించును పాంధుల సేద దీర
విపిన మందైన దినిపించు కపిల గోవు
కధలు కావ్యాలు వినిపించి కరుణ తోన !
ముగ్గురమ్మల వరమున పుట్టినమ్మ
రిప్లయితొలగించండిఈగ మొదలుగ ఎల్లరి బాగు కొరకు
తెలుగునాతను కథలలో వెలుగుయమ్మ
పేదరాసింటి పెద్దమ్మ విందులమ్మ
దేశదేశాలవారికాతిద్యమిచ్చి
కష్టసుఖములనన్నియు ఇష్టగోష్టి
పంచుకొనుచును సాయమందించుతల్లి
విశ్వశాంతిని గోరిన ప్రేమమూర్తి
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పాదాలూ బాగున్నవి. అభినందనలు.
‘వెలుగుయమ్మ’ను ‘వెలుగునట్టి’ అనండి.
చిన్న నాడు జెప్పుకున్న చిన్న కథను పద్య రూపమున
రిప్లయితొలగించండి======*======
బిడ్డలు లేకను నొక్క -పేదరాసి పెద్దమ్మ బెంచె
గడ్డములున్న మేకలను - గారాబముగ,పెద్ద మేక
యడ్డ బొట్టుల తోడ సంత- నందు దిరిగి దెచ్చె ధనము
గడ్డి జాటున,జూచిన నొక- కలికి శునకమును బంపె
గడ్డి తోడను దెచ్చెనునొక- కంపు గొట్టెడి మాంసమునను.
బాట సారుల ఆకలి బాధ దీర్చు
రిప్లయితొలగించండినలసి వచ్చిన వారిని ఆదరించు
విడిది చేసిన వారికి విడియ మిచ్చు
పేదరాసి పెద్దమ్మది పెద్దమనసు!
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిచిన్నప్పటి కథకు పద్యరూపాన్ని ఇచ్చారు. సంతోషం.
కానీ కథలో స్పష్టత లోపించింది.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
ఒక సూచన... పద్యం మధ్యలో అచ్చులు వ్రాయడం సంప్రదాయం కాదు. అక్కడ యడాగమ, నుగాగమాలు చేసి వ్రాస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు, మీర సూచించిన నియమాలతో పద్యాన్ని సవరిస్తూ.....
బాట సారుల యాకలి బాధ దీర్చు
నలసి వచ్చిన వారల నాదరించు
విడిది చేసిన వారికి విడియమిచ్చు
పేదరాసి పెద్దమ్మది పెద్దమనసు