కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కారు నలుపుపైనఁ గలిగె ప్రేమ.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కారు నలుపుపైనఁ గలిగె ప్రేమ.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
"రూప గుణము లందు రూప మే మైనను
రిప్లయితొలగించండిగుణముఁ గలిగి యున్న గొప్పవారె"
యనుచు నొకఁడు గుణి ననాకారిఁ గోరఁగఁ
గారు నలుపుపైనఁ గలిగెఁ బ్రేమ!
కారు నలుపు రంగు కలవాడు చెలికాడు
రిప్లయితొలగించండికన్నె మనసు దోచు వెన్నదొంగ
గోకులమణి యనుచు గోపికలకునెల్ల
కారు నలుపు పైన కలిగె ప్రేమ
(కారు నలుపు : మేఘ శ్యామలము)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా కారునలుపు సమస్య పైన గలిగి ప్రేమ
రిప్లయితొలగించండిశ్రీ మధు సూదన్ గారు, శ్రీ నేమాని వారు చక్కని పూరణలు చేశారు
కారు కొనగ వెడలె కామాక్షి భర్తతో
కనగ రాగ బిలిచె కస్టమర్ల
కార్ల రంగులెన్నొ కనరారు వానిలో
కారు నలుపు పైన కలిగె ప్రేమ
జోరు వాన మిగుల కారగా పైనుండి
రిప్లయితొలగించండితేరి జూచె సన్న కారు రైతు
తెల్ల మేఘ ముగని తెల్లబోయెనపుడు
కారు నలుపు పైన కలిగె ప్రేమ
కాంతుల రతి కనుల కాటుక తనువుగా
రిప్లయితొలగించండికలిగి వచ్చు చున్న కంతుడనగ
సంతమసము పర్వ సరసుల హృదయాల
కారు నలుపు పైన గలిగె ప్రేమ
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘కారు’ నలుపు పూరణ, కారు మేఘాల పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
*
ఆదిత్య గారూ,
‘సంతమసము’తో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
కారు కొనుట కొఱకుకాకినాడకు నేగి
రిప్లయితొలగించండికార్లు జూడ యచట కారు నలుపు
పైన గలిగెప్రేమ కాన కొ నగనిష్ట
పడితి నార్య! మఱిని భర్గు గృపను .
నలుపు వర్ణ మనిన నగుబాటు పడనేల
రిప్లయితొలగించండిదేవకీ సుతుని దదేమి రంగు
కాళి వర్ణ మదియు కాళమే యని దెల్సి
కారు నలుపు పైన కలిగె ప్రేమ
శివుని కంఠ ఛాయ శ్రీహరి తనుఛాయ
రిప్లయితొలగించండిబధ్ర కాళి ఛాయ భళిర గనుడు
వెలిసి పోవు రంగు వెలెవెల తెలుపన
కారు నలుపు పైన కలిగె ప్రేమ
చూపు లేని తనకు సూర్యుండు నలుపేను
రిప్లయితొలగించండివిశ్వ మెల్ల నలుపు విభుడు నలుపు
సర్వవేళలందు సహజీవనముజేయు
కారు నలుపు పైన కలిగె ప్రేమ!!!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చూడన్ + అచట = చూడ నచట’ అవుతుంది. అక్కడ యడాగమం రాదు.
*
‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో కొన్ని తుగాగమ సంధుల్ని విస్మరించారు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిసమాసములో ఉత్తరపదము "ఛ" వర్ణముతో మొదలగు నప్పుడు అచ్చట ఛ్ఛ అని ద్విత్తమగును. కనుక కంఠఛ్ఛాయ; కాళిఛ్ఛాయ; తనుఛ్ఛాయ మొదలగు సమాసములు వచ్చును. ఆ విధముగా మీ సమాసములను సరిచేయవలసి యుండును. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
బొగ్గు స్కాముపై
======*======
కారు నలుపు రాళ్ళు కనకమై వర్థిల్ల
కారు నలుపు పైన కలిగె ప్రేమ,
కారు నలుపు నందు కాలిడ ఖలులను
కారు నలుపు నిలిపె కలిమి పైన
(కారు నలుపు రాళ్ళు= బొగ్గు రాళ్ళు )
జుత్తుకు రంగు వేయు వారిపై
======*======
కారు నలుపు కురులకై నరులెల్లరు
కారు నలుపు స్వర్ణ కారు లైయ్యె
ముదిమి ముందు నిలువ మౌనివలెను నేడు
కారు నలుపు పైన కలిగె ప్రేమ,
కష్ట పడిన రాని పేరు ఒక్క దుష్ట కార్యము నందు వచ్చు చున్నది.
రిప్లయితొలగించండి3. కష్ట బడ్డ రాదు కలిమియు సుంతైన,
నలుపు, కలుపు లందు గలదు తెలుపు,
మచ్చ బడ్డ నదియె మణి భూషణమ్మని
కారు నలుపు పైన కలిగె ప్రేమ.
( నలుపు= అక్రమ వ్యాపారము,కలుపు= కల్తి, తెలుపు= ధనము(ప్రకాశము ))
4.నలుపు నందు నిలువ నలువురు గీర్తించ
రిప్లయితొలగించండినలుపు నందు దిరుగ నరులు నేడు
మచ్చ బడ్డనదియె మణి భూషణమ్మని
కారు నలుపు పైన కలిగె ప్రేమ.
అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. 2వ పద్యము 3వ పాదములో ముదిని - మౌని అను పదములకు యతి మైత్రి కుదరదు. మార్చండి. స్వస్తి.
నల్ల నయ్య కుండు నారీ మణులు మెండు
రిప్లయితొలగించండినుల్ల మందు ప్రేమ వల్ల మాలి
గొల్ల పిల్ల లంత గోవిందు డన ప్రీతి
కారు నలుపు పైన గలిగెఁ ప్రేమ
నలుపు నలుప టన్న నాణ్యమై యుండును
రిప్లయితొలగించండిమాట వినగ తీపి మనసు వెన్న
కోయి లెంత నలుపు కూత వీనుల విందు
కారు నలుపు పైన గలిగెఁ ప్రేమ !
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు, సవరణతో
రిప్లయితొలగించండి======*======
కారు నలుపు కురుల కై నరులెల్లరు
కారు నలుపు స్వర్ణ కారు లైయ్యె,
ముదిమి ముందు నిలువ భోగులమని నేడు
కారు నలుపు పైన కలిగె ప్రేమ.
అమ్మ చల్లనిప్రేమ, ఆమెతీయనిపల్కు
రిప్లయితొలగించండి..........లామె లాలనముద్దులన్ని నలుపె
కన్నతండ్రియు జతగలిసినడుచు భార్య
..........ఆప్తులుస్నేహితులంత నలుపె
ఆకలిదీర్చెడు అన్నపానీయాలు
..........భక్ష్యభోజ్యములన్ని పరమ నలుపు
దేశము ధర్మము దేవుడు ప్రకృతియు
..........మనుజులు పశువులవన్ని నలుపె ||
ఎన్నితానెరుగునొనన్నియు నలుపయ్యె
నలుపె సాటిలేనివేలుపయ్యె
లోచనవిహితునకు లోకమంతయునున్న
కారునలుపు పైనఁగలిగె ప్రేమ ||
కళ్ళులేని వాళ్ళకు అంతా చీకటి గానే ఉంటుందంటారు.. కానీ వాళ్ళకి కనపడేది కచ్చితంగా నలుపే అని చెప్పడము భవ్యమో కాదో తెలియదు.
ఎప్పుడో physics క్లాసులో "వేరే ఏ రంగు లేని స్థితినే నలుపు అంటారు" అన్నదానిని బట్టి, కన్నులలో కాంతిలేని వారికి కనపడేది నలుపే అయి ఉంటుందెమో అని ఈ ప్రయత్నము
ఈ ఆలోచనతో పాటు ఇంకొకటి:
మానిసికెంతొనేమఱనిడు మాయకుహేతువు నామరూపముల్
వానికతీతమైబ్రతుక వాంఛలఁద్రుంచి విరాగులైతిరే
హీనపుఁసంపదల్ మనుచుహేయపుఁగర్వము లేనివారలౌ
కానఁగలేనివారికి జగద్భవుఁగాంచుట తేలికౌనొకో ||
రెండవ పద్యమునకు మొదటి పాదమున చిన్న సవరణ:
రిప్లయితొలగించండి"మానిసినెంతొనేమరచు మాయకుహేతువు నామరూపముల్"
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిటీవిలో మంచి పని జేసిన వానిని ఒక్క సారి జూపు, చెడ్డ పని జేసిన పలుమార్లు జూపు
======*======
5.నల్ల మచ్చ బడ్డ నరుని మోమును జూప,
నవ యువతకు నీవు నాయకుడవు
మమ్ము దరికి జేర్చు తమ్ముడవని బల్క
కారు నలుపు పైన గలిగె ప్రేమ.
======*======
6.పులికి మచ్చల వలె పురుషులు బెంచిరి
ఖలుల జెంత జేరి కలిమి గోరి.
కుంభ కోణములను కోరిన జనులకు
కారు నలుపు పైన గలిగె ప్రేమ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ గూడా రఘురాం గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సీస పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు:
సీసము 3వ పాదములో: "పరమ నలుపు" అనే సమాసము సాధువు కాదు. పరమ అనే సంస్కృత పదము తరువాత నలుపు అని తెలుగును వాడకూడదు.
సీసము 4వ పాదములోను మరియు ఆటవెలది 2వ పాదములోను మీరు ప్రయత్నించిన ప్రాసయతి సరికాదు. ప్రాస యతి లక్షణములను మీరు పాటించలేదు.
స్వస్తి.
తెల్ల దొరలు వివిధ దేశాలు దిరుగుచు
రిప్లయితొలగించండికొల్ల గట్టి నారు నల్ల వాళ్ళ
గాంధి గారు వారి గర్వమ్ము ననచగా
కారు నలుపు పైన గలిగె ప్రేమ.
కాకివంటి రూపు కలుగునది పికము
రిప్లయితొలగించండికాని దాని కూత కరము తీపి !
నల్లనయ్య కూడ నలుపు రంగు కనుక
కారు నలుపు పైన గలిగె ప్రేమ !
పగటి వెలుగులోన పండని కలలన్ని
రిప్లయితొలగించండిరేయి తిమిరమందు హాయి కూర్చు
తెలుపుకన్న నలుపు తీపియో ననుచును
కారు నలుపు పైన కలిగె ప్రేమ
వెలుగులోన తెచ్చు వేయి నిష్కమ్ములు
కలుగులోన దూర కాంచన నిధి
తెల్ల ధనము కన్న నల్ల ధనమే మేలు
కారు నలుపుపైన కలిగె ప్రేమ
నలుపు రంగు నెపుడు నచ్చని వనితకు
రిప్లయితొలగించండికలిగె నొక్క శిశువు కారు నలుపు
"తల్లిప్రేమ" చేత తనను తాను మరువ
కారునలుపు పైన గలిగె ప్రేమ !
వెలుగు లోన ధ్యాన విధమది కుదరక
రిప్లయితొలగించండిరేయి లోన ధ్యాన లీలఁ దెలిసి
పట్టు బట్ట తలచు ప్రారంభ యోగికి
కారు నలుపు పైన కలిగె ప్రేమ
ప్రజల మోసగించి ప్రభువుల మంచును
రిప్లయితొలగించండిధనము సంగ్రహించి దాచువారు
దొంగ లౌదు రెన్న దొరలెట్టు రగుదురు?
కారు! నలుపు పైన గలిగె ప్రేమ !
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
ఈ రోజు మీలో పద్యరచనావేశం పొంగి పొరలినట్లుంది. మీ ఆరు పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.
2వ పూరణ 2వ పాదంలో ‘స్వర్ణకారు లైయ్యె’ను ‘స్వర్ణకారు లైరి’ అందాం.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు
వాన లేక పంట పండలేదు నిరుడు
రిప్లయితొలగించండికరవు వచ్చి రైతు కష్ట పడెను
మింట నున్న నల్ల మేఘాల జూడగా
కారునలుపు పైన గలిగె ప్రేమ
గుండా రఘురామ్ గారూ,
రిప్లయితొలగించండిమీ సీసపద్య పూరణ, దానిని అనుసరించిన ఉత్పలమాల చాలా బాగున్నవి. అభినందనలు.
నేమాని వారి సూచనల ననుసరించి నా సవరణలు....
సీసం 3వ పాదంలో ‘భక్ష్యభోజ్యము లనబడును నలుపు’ అందాం.
4వ పాదంలో ‘మనుజులు పశువు లనునవి నలుపె’ అనండి.
ఆటవెలది 2వ పాదాన్ని ‘నలుపె సర్వలోకనాథు డయ్యె’ అందామా?
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘వాళ్ళ’ అని వ్యావహారికం వాడారు. అక్కడ ‘కొల్లగొట్టిరి గద యెల్ల జనుల’ అందాం.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘తీపియో యనుచును’ అని యడాగమమే వస్తుంది.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
టైపాటు ‘దొరలెట్టు ర(ల)గుదురు’....
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
నేమాని మాష్టారు గారికి, నా పద్యములలోన దోషములను సవివరముగా తెలిపినందుకు ధన్యవాదములు..
రిప్లయితొలగించండినిజమే ఎందులకో నాకు ప్రాస-యతి పై ఎక్కువ అవగాహన లేదు..
ప్రాస-యతి వాడిన పద్యములను చూచాను గానీ, నేనెప్పుడూ ప్రయత్నించలేదు.. మీ సూచన మేరకు ఆ విభాగమును మరల అర్ధము జేసికొనుటకు ప్రయత్నిస్తాను.
నా తప్పులను సరిజేసిన శంకరయ్య మాష్ట్ష్టారుగారికి ధన్యవాదములు. మీ సవరణలు బహు చక్కగానున్నాయి. ధన్యవాదాలు
స్వస్తి.