31, జులై 2013, బుధవారం

పద్య రచన – 419 (మయసభ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“మయసభ”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

10 కామెంట్‌లు:


 1. మా 'తెలుగుమయ' సభ
  మాయ మై రెండు అయినాది
  ఒకటి మీది మరొకటి మాది
  వెరసి మీకుమీరే మాకు మేమే !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. మయుని సభను జూడ నరిగి మమత తోడ
  ఉన్న దనుకొని దాకగ సున్న మిగిలె
  లేదు లేయని నేగగ మీ ద కుఱు క
  బల్లి నా మీ ద , మిక్కిలి భయ పడితిని

  రిప్లయితొలగించండి
 3. మయసభ కేంద్రమై నిలిచె మంజుల సుందర చిత్రరాజికిన్
  మయసభ కేంద్రమై నిలిచె మైమరపించు మహాద్భుతాలకున్
  మయసభ కేంద్రమై నిలిచె మానధనాఢ్యుని భంగపాటు కా
  మయసభ కేంద్రమై నిలిచె మానిని ద్రౌపది దు:ఖపంక్తికిన్.

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శ్రీ హరివరూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  మయసభ కేంద్రమై నిలిచె మా హరి మిత్రు కవిత్వ దీప్తికిన్

  రిప్లయితొలగించండి
 5. శ్రీమతి జిలేబి గారికి శుభాశీస్సులు.
  మీ భావ వైవిధ్యమునకు ఢోకా లేదు. మీరు పద్య విద్యలో ఎప్పుడు అడుగు పెడతారో అని చూస్తున్నాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. పొందు పరచిన మణులను బిందు నదము
  ఇంద్ర నీలపు మెరుపులు నీటి పైన
  పద్మ రాగపు మణిమయ పద్మ ములుగ
  సాల భంజిక లమరెను సాజము గను
  మాయ జాలమె యనునట్టి మయుని ప్రతిభ
  సభను బొగడంగ తరమౌనె విభుని కైన ?

  రిప్లయితొలగించండి
 7. శ్రీమతి జిలేబీ గారూ మీభావము ప్రతిక్సేపించగలిగినానో లేదో తెలీదు కానీ.........

  భరతజాతికి సౌభాగ్యభావమిచ్చు
  తెలుగుజాతిని విడదీయ, తెలుఁగు నేల
  వ్రక్కలైనది నేడిక దిక్కుకొకటి,
  వీగిననుకూడ తెలుఁగును వీడబోము

  రిప్లయితొలగించండి
 8. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  2వ పాదములో యతి మైత్రి లేదు. 5వ పాదములో "మాయాజాలము" అనుటే సాధు ప్రయోగము.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు శుభాశీస్సులు.
  జిలేబీ గారి భావమునకు పద్యరూప కల్పనకై మీరు చేసిన యత్నము బాగుగ నున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. మయసభ కురుపతి గన రస
  మయసభగా దోచె, రాజ! మానిని గన వే
  మయ, సభలో నవ్వెన ? విను
  మయ సభలో రాగ నీడ్చి మదమందితివా !

  రిప్లయితొలగించండి