గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఇంద్రుడు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘మేనక + ఉన్నది’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘మేనక గలదు రంభయు మీద గలదు’ అందామా?
మూర్తిమిత్రమా! గురువుగారు శీనా గారిని అడిగితే గుర్తు వచ్చింది. తెలుగువెలుగు జూలై మాసపత్రికలో 'గన్నవరపు నరసింహమూర్తి'(విశాఖపట్నమ్) గారి రచన 'చరమాంకం' ప్రచురిత మైంది. ఆ రచన మీదేనేమోనని, ఫొటో మీ పాత రోజుల్లోదేమో నని నా అనుమానం.
మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు. ఆయన వేఱు. శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారు కధ లద్భుతంగా వ్రాస్తారు. వారిది విశాఖ పట్టణమే ! అక్కడే ఉంటారనుకొంటాను. ఈ సారి ఎప్పుడైనా కలవాలి . బంధురిక ముందేమో తెలుసు కోవాలి. లేకపోతే నెయ్యము కలుపుకోవాలి. మా చెల్లెమ్మ ' ఎన్నెల ' కు బంధుత్వ ముందేమో !
లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. కాని ఒక విషయం. సమస్యను మరో విధంగా పూరించే గత్యంతరం లేనప్పుడే అధిక్షేపాన్ని, క్రమాలంకారాన్ని ఆశ్రయించాలి. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘సమయస్ఫూర్తి’ అన్నప్పుడు ‘య’ గురువై గణదోషం. * శ్రీనివాస్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన పూరణలలో ఇది ఉత్తమమైనదని నా అభిప్రాయం. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. గన్నవరపు నరసింహ మూర్తి పేరుతో ఒక కథారచయిత ఉన్నారు. మన గన్నవరపు వారు కవిసింహులు. ఈ విషయం గురించి మన బ్లాగులో గతంలోను ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా మూర్తి గారే సందేహ నివృత్తి చేసారు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురువుల దయ వలన అప్పుడప్పుడు సరదాగా పద్యాలు వ్రాసే నరసింహమూర్తినే. శిష్యులపై మమకారముతో గురువరేణ్యులు 'నర' తీసి ' కవి ' తగిలించారు. కవిత్వములో మీరంతా ఉద్దండులు. గురువుగారి శంకరాభరణము బ్లాగు వలన ఉత్సాహంగా యువతరము వారు , నా తరము వారు పద్యాలు వ్రాయడము నా కానంద దాయకము. బిరుదులకు మీఱే అర్హులు. మీ సహృదయతకు ధన్యవాదములు. గురువు గారికి నమోవాకములు.
రైతు కొడుకు, రాముడు , ఊర్వశిని ప్రేమించి స్నేహితుల సహాయముతో పెళ్ళాడిన వైనం :
01) __________________________
రాఘవాపుర మందుండు - రైతు సుతుడు రమణి నూర్వశి బ్రేమించి; -రమ్యమలర రాణి,కాముడు, సుందర - రావు, సౌమ్య, రాజు మొదలగు వారి పో- రామి వలన రాత్రి , శుభవేళ , శంకరా - రామ మందు రాము డానంద మొందె నూ - ర్వశిని బొంది ! __________________________ పోరామి = స్నేహము
ఆ ప్రురూరవుఁ, డతి మనోహరుఁడు, ఘనుఁడుఁ,
రిప్లయితొలగించండిజంద్ర వంశజుఁ, డైలుండు, సాధుగుణుఁడు,
బుధ సుతుండుం, బ్రతిష్ఠాన పుర మనోఽభి
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిపురూరవుని ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మేనకున్నది రంభయు మీద గలదు
రిప్లయితొలగించండిస్వర్గ మందున సుత్రాము సరసమునకు
చేర రాగను మరియు శచీ మనోభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఇంద్రుడు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మేనక + ఉన్నది’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘మేనక గలదు రంభయు మీద గలదు’ అందామా?
భరతమునిశాప వశమున ప్రణయమిటుల
రిప్లయితొలగించండిసఫలమయ్యనటంచును సంతసించి
చక్రవర్తినిఁ జేరె నచ్చర; గుణాభిరాముఁ
డానందమందె నూర్వశినిఁ బొంది.
మాస్టరు గారూ ! ధన్యవాదములు... మీ సూచన..సవరణతో...
రిప్లయితొలగించండిమేనక గలదు రంభయు మీద గలదు
స్వర్గ మందున సుత్రాము సరసమునకు
చేర రాగను మరియు శచీ మనోభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.
రాము డానంద మందె ను నూ ర్వశిని పొంది
రిప్లయితొలగించండిఅనగ దగునార్య ? యా రాముడనగ నేక
పత్ని యుతుడుగా దె లియుడు పరమ పురుష !
వంద నంబులు నిడుదును వంద లాది .
చక్రవర్తి సద్గుణ మూర్తి సమయ స్ఫూర్తి
రిప్లయితొలగించండిఇంద్ర లోకపు నర్తకి నిందు ముఖిని
రూపవతిని ప్రేమించి పురూరవుడభి
రాము డానంద మొందె నూర్వసిని పొంది
శంకరయ్య గురువర్యులకు నమస్కారములు. ఆర్యా ! మీరు ప్రస్తావించిన శీనా గారు నేను కానండి. మీ అభిమానానికి ధన్యుడను.
రిప్లయితొలగించండిఎంకి నొక కవి వలచెతా నెంత ఘనుడు
ఎంకి పాటలు పాడగ నెంత తీపి (నండూరి వారు)
కావ్య జగతిన విహరించె కవికులాభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది. (దేవులపల్లి వారు).
మూర్తిమిత్రమా! గురువుగారు శీనా గారిని అడిగితే గుర్తు వచ్చింది.
రిప్లయితొలగించండితెలుగువెలుగు జూలై మాసపత్రికలో 'గన్నవరపు నరసింహమూర్తి'(విశాఖపట్నమ్) గారి
రచన 'చరమాంకం' ప్రచురిత మైంది. ఆ రచన మీదేనేమోనని, ఫొటో మీ పాత రోజుల్లోదేమో నని
నా అనుమానం.
మానవుడవని యెంచకు మానధనుడ!
రిప్లయితొలగించండిపొందు మీయులూచిని పార్థ! పూర్వము, విను,
చంద్ర కులమణి యైలుడు సద్గుణాభి
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది!
*****************************
చంద్ర కులమణి యైలుడు సద్గుణాభి
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది
యట్లె నీవును నను బొందు మర్జున!
యని యులూచి విజయునితో ననెను వలచి.
మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు. ఆయన వేఱు. శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారు కధ లద్భుతంగా వ్రాస్తారు. వారిది విశాఖ పట్టణమే ! అక్కడే ఉంటారనుకొంటాను. ఈ సారి ఎప్పుడైనా కలవాలి . బంధురిక ముందేమో తెలుసు కోవాలి. లేకపోతే నెయ్యము కలుపుకోవాలి. మా చెల్లెమ్మ ' ఎన్నెల ' కు బంధుత్వ ముందేమో !
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేయి తినగను భరియించి నెయ్య మొంది
రిప్లయితొలగించండిగొఱ్ఱె పిల్లల కాసిన గొప్ప రాజు
దేవ వేశ్యకు దాసుడై దివిజుల కభి
రాముఁ డానంద మొందె నూర్వశిని పొంది !
ఊర్వశి తన మనోహరి, ఊహ లందు
రిప్లయితొలగించండినామె అందచందముల నాహార్యము గని
పరవశించగ కనిపించె వరముగ నభి
రాము డానంద మందె నూర్వశిని పొంది!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని ఒక విషయం. సమస్యను మరో విధంగా పూరించే గత్యంతరం లేనప్పుడే అధిక్షేపాన్ని, క్రమాలంకారాన్ని ఆశ్రయించాలి.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సమయస్ఫూర్తి’ అన్నప్పుడు ‘య’ గురువై గణదోషం.
*
శ్రీనివాస్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన పూరణలలో ఇది ఉత్తమమైనదని నా అభిప్రాయం. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి పేరుతో ఒక కథారచయిత ఉన్నారు. మన గన్నవరపు వారు కవిసింహులు. ఈ విషయం గురించి మన బ్లాగులో గతంలోను ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా మూర్తి గారే సందేహ నివృత్తి చేసారు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కవిసింహుల కభినందనలు.
రిప్లయితొలగించండిగురువు లిచ్చిన బిరుదాంకిత ..... కవి కేసరి .....సోదరునకు అభినంద మందారములు
రిప్లయితొలగించండిగురువుల దయ వలన అప్పుడప్పుడు సరదాగా పద్యాలు వ్రాసే నరసింహమూర్తినే. శిష్యులపై మమకారముతో గురువరేణ్యులు 'నర' తీసి ' కవి ' తగిలించారు. కవిత్వములో మీరంతా ఉద్దండులు. గురువుగారి శంకరాభరణము బ్లాగు వలన ఉత్సాహంగా యువతరము వారు , నా తరము వారు పద్యాలు వ్రాయడము నా కానంద దాయకము. బిరుదులకు మీఱే అర్హులు. మీ సహృదయతకు ధన్యవాదములు. గురువు గారికి నమోవాకములు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రియమిత్రులు,కవిసింహులకు వందనాభినందనలు !
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రైతు కొడుకు, రాముడు , ఊర్వశిని ప్రేమించి
స్నేహితుల సహాయముతో పెళ్ళాడిన వైనం :
01)
__________________________
రాఘవాపుర మందుండు - రైతు సుతుడు
రమణి నూర్వశి బ్రేమించి; -రమ్యమలర
రాణి,కాముడు, సుందర - రావు, సౌమ్య,
రాజు మొదలగు వారి పో- రామి వలన
రాత్రి , శుభవేళ , శంకరా - రామ మందు
రాము డానంద మొందె నూ - ర్వశిని బొంది !
__________________________
పోరామి = స్నేహము
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి