15, జులై 2013, సోమవారం

పద్య రచన – 403 (క్రొత్త కాపురము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“క్రొత్త కాపురము”
ఈ ఆంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

  1. తెల్లని వెన్నెల మనసుల
    నుల్లము రంజిల్లు సొగసు నూరెడు కోర్కెల్ !
    చల్లని పున్నమి రాత్రులు
    కొల్లలుగా నుండు గాదె క్రొత్త కాపుర మందున్ !

    రిప్లయితొలగించండి
  2. పూర్వము కొన్ని ఉమ్మడి కుటుంబాలలో క్రొత్త కాపురం ఇలా...

    అత్త చేత తిట్లు నాడబిడ్డల మొట్లు
    భర్తకు నగచాట్లు భామ ఫీట్లు
    మామ మదికి తూట్లు మరిసర్దు కొనుటెట్లు
    క్రొత్త కాపురమున కొన్నిపాట్లు

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం.
    ‘కల్లలు గా వెచ్చు క్రొత్త కాపురమందున్’ అందాం. (ఎచ్చు = అధికము)
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అంత్యానుప్రాసతో అద్భుతమైన పద్యాన్ని వ్రాసారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అక్కయ్యా, మీరబ్బాయి మనోస్థితి చెపితే నేనమ్మాయి మనోస్థితి చెపుతున్నా.

    ఏదో తెలియని భయమును
    మోదముఁ గూర్చెడు ప్రియపతి మోహపు మాటల్
    హ్లాదములిడు సఖి నగవుల్
    వేదన మాతా పితరుల వీడిన వేళన్.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వీడిన వేళన్’ ... ‘వీడిన కతనన్’ అయితే...?

    రిప్లయితొలగించండి
  6. గురువుగారు,
    మీరిచ్చిన పదమే బాగున్నది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. క్రొత్త కాపురమ్ము గోరి బెట్టితినినే
    జూడ రండి మీరు చూసి మాకు
    ఆశిసులను నిచ్చి యక్షంత లీ యుడు
    అమ్మ ! నాన్న ! అక్క ! అత్త!మామ!


    రిప్లయితొలగించండి
  8. నేటి కొందరు యువత విషయంలో...

    రెండు జాబ్ ల సొమ్ము నొండు సంతానమ్ము
    మూడ్ ని బట్టి చేయు ముద్దు సుమ్ము
    క్రొత్త కాపురమ్ము కోరు విధానమ్ము
    యువతరమ్ము చేయు చుండు నమ్ము

    రిప్లయితొలగించండి
  9. అత్త మామ తోడ , అందరికి స్వస్తి
    ఆస్తి నొకటి తప్ప అన్ని నాస్తి
    జీన్స్ ఫేంట్ డ్రస్సు,, బేంకులో బేలన్స్
    కొత్త కాపు రాల కొరకు అమెరికాకు

    రిప్లయితొలగించండి
  10. హార్డు వేరు మొగడు నమ్మాయి సాఫ్టువేర్
    టిఫిను లంచు మరియు డిన్నరు లవి
    బయటె ముగియ కొత్త పద్ధతి కాపురం
    బిల్లు లాడ్జి వలెను పెళ్లి గాగ!

    రిప్లయితొలగించండి
  11. గూనలోనుండి తీసిన క్రొత్త యూరు
    గాయ ఘుమగుమల్ విందును జేయు రీతి
    కమ్మగా ఘాటుగా ప్రేమ కలసి వలపు
    విందు నిడు క్రొత్త కాపుర మిందు వదన!

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    కాని ఆశిసులు (ఆశీస్సులు), అక్షింతలు (అక్షతలు) పదాలు సాధువులు కావు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింహదగింది.
    కాని గణ యతి దోషాలున్నాయి.. మీ పద్యానికి నా సవరణలు....
    అత్త మామ తోడ , అందరకును స్వస్తి
    ఆస్తి యొకటి తప్ప యన్ని నాస్తి
    జీన్స్ ఫేంట్ డ్రస్సు,, స్విసు బేంకు బేలన్స్
    కొత్త కాపురాల కోర్కెలంట.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. ప్రణామాలు గురువుగారు,
    మీ సవరణలతో నా పద్యానికి జీవం ఇచ్చారు,మీ బ్లాగు(శంకరాభరణము) చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను, దోష రహితంగా పద్యాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను..కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి

  14. గురువుగారి పర్యవేక్షణలో శైలజగారు త్వరలోనే నిర్దోషంగా పద్యాలు వ్రాయగలరని ఆకాంక్ష.

    రిప్లయితొలగించండి
  15. సోదరి లక్ష్మి దేవి గారూ మీ పూరణ బాగుంది .నేనా ? ఒక్కనాడు గురువులకు శ్రమ లేకుండా వ్రాయను గదా ?
    శైలజ గారూ ! మెరేమీ బెంగ పడ కండి పట్టు వదలని విక్ర మార్కుడిలా మూడేళ్ళ నుంచీ కుస్తీ పడుతున్నా , నేనింకా ఇలాగే ఉన్నాను . ఓర్పు నేర్పు గలిగిన మన గురువుల అభయ హస్తం ఉందిగా ! బి ....బ్రేవ్ ...!

    రిప్లయితొలగించండి