21, జులై 2013, ఆదివారం

పద్య రచన – 409 (వానకాలఁపు చదువు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము.....
“వానకాలఁపు చదువు”

12 కామెంట్‌లు:

  1. వాన కారున కురియంగ వానజల్లు
    వాన కారును బడులలో పల్లెలందు
    కప్పు సరిలేక పాఠాలు చెప్పలేక
    బడికి శెలవని శెలవిచ్చు పంతులయ్య.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా శ్రీహనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యము బాగుగ నున్నది. శెలవు అనుట సాధువు కాదు. సెలవు అచ్చ తెనుగు పదము కాబట్టి "శ" తో గాకుండ "స"తో మొదలు పెట్టవలెను - అప్పుడు సెలవు అగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. ప్రతి దినమ్మును మానక పరుగులిడుచు
    పాఠ శాలకు నేగిన ఫలములేదు
    చదువ ,వ్రాయను నేర్వని జడుని నరయ
    వాన కాలపు చదువులు మాను టొప్పు

    రిప్లయితొలగించండి
  4. వాన కాలపు జదువను భావమెల్ల
    మారిపోయిన దీనాడు వానయైన
    నెండయైనను చదువుటలెల్ల సాగు
    నంతరాయము లేకుండ నదియె లెస్స

    రిప్లయితొలగించండి
  5. వాన బాగుగ కురిసినఁ బడికి సెలవు
    వరద నీరు పారుచునుండ బడికి సెలవు
    పండుగలు వచ్చినను మరి బడికి సెలవు
    వాన కాలఁపు చదువులు వ్యర్థ మయ్య

    రిప్లయితొలగించండి
  6. వానకాలపు చదువుల గురించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు.....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    బొడ్డు శంకరయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. బందు లుండిన చదువుకు విందు లనగ
    బాంబు ప్రేలుడు హత్యల బాధ లెపుడు
    వరుణ దేముడు కరుణించి కురిసి నపుడు
    ప్రాణ భయమున గుప్పెడు త్రాణ లేక
    చదువు కొను ట.. యె మేలౌను పదవి దొరకు !

    కొనుట = అనగా డబ్బిచ్చి కొనుక్కోవడం

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారికి నమస్కారము

    వానాకాలపు చదువని
    హీనముగా చూడవలదు
    హ్రీంకారముయే దీనులపాలిటి సిరియై
    మానము ప్రాణముల గాచు మహినెల్లరకున్


    ఋతువుల చదువులు మాత్రము
    హితమై చేకూర్చు జనులకింపుగ శుభముల్
    హితమగు వానలచదువే
    బ్రతుకునకొక భాగ్యమౌను పంటలు పండన్

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. రెండవ పాదం లేకున్నా సరిపోతుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    ‘హ్రీంకారముయే’ అనకుండా ‘హ్రీంకారమ్మే’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. దినకరుడాకస మందున
    గనపడు రోజున బుడతలు కదలుచు బడికిన్!
    చినుకులు వడివడి కురిసెడు
    దినమున బడినుండి వచ్చి తీరుదు రకటా!

    రిప్లయితొలగించండి