పండిత నేమాని వారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * శ్యామల రావు గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, యస్వీ రంగారావు విశ్వరూపాన్ని నాల్గు పద్యాల్లో వివరిస్తూ చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * ఆదిత్య గారూ, అద్భుతమైన వృత్తం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
ఆ సినిమాలు పిల్లలూ పెద్దలూ అందరూ తప్పక చూడ దగినవి ! వాటిలో యశస్వి నటన అద్భుతం అనుపమానం ! ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుండి పోతాయి ! ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటాయి !
రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘సంద్రము’నకు ‘సాంద్రము’ అని టైపాటు అనుకుంటా. * గుండా రఘురామ్ గారూ, శుభాకాంక్షకు తెలిపినందుకు ధన్యవాదాలు. ఆధునిక మాయల పకీరులను గూర్చి చక్కని పద్యాలు వ్రాసారు. బాగున్నవి. అభినందనలు. ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. మీ పద్యాలలో చాలాసార్లు ‘తొ’ అన్నారు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఇంద్రజాలాది విద్యల నెన్నొ నేర్చి
రిప్లయితొలగించండిభోగభాగ్యాలతో తులతూగ నెంచి
కట్టె మును మాయల పకీరు గాలిమేడ
లక్కటా! కూలె నా మేడ లంతలోన
మాయలపకీరు కథలను
రిప్లయితొలగించండిహాయిగఁ జదువుచు గడిపిన నా బాల్యంబే
మాయెనొ యనుచును నేటికి
ప్రాయంబునఁ పెద్దవారు వగచుట వినరే!
పరసతిని చెఱగొనెను రావణుని వోలె
రిప్లయితొలగించండివలదు విడుమన్న సంగు మాటలను ద్రోసె
తెలుగుసీతమ్మ నాగమ్మ వలన తుదకు
బాలునకు మాయలపకీరు కూలినాడు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
యశస్వి రంగారావు (S.V.R)
బాలనాగమ్మలో మాయల మరాఠీగా :
01)
__________________________
బాలనాగమ్మ సౌందర్య - భ్రమను మునిగి
సంగు వలదని వారింప - సరకు గొనక
సమసె మాయల మారియే - శాశ్వతముగ
సాటి లేరిల ! యస్వియార్ - సాటి యతడె!
__________________________
మాయల పకీరు ప్రాణపు మర్మ మిదియ
రిప్లయితొలగించండిచిలుక యందున నుండెను చెలువు గాను
బాల నాగమ్మ సుతు నాగ వర్ధి రాజు
చెట్టు దరిజేరి మఱియు నా జిలుక జంపె
యశస్వి రంగారావు (S.V.R)
రిప్లయితొలగించండిపాతాళ భైరవిలో నేపాళమాంత్రికునిగా :
02)
__________________________
నీకు దక్కును రాసుత - నిజముగాను
సాహసము జూపు మోయంచు-పోహణించె !
తోట రాముని వంచించి - వాటముగను
శక్తి పాతాళ భైరవిన్ - సంగ్రహించి
రాకుమారిని కొనిపోయె - రాక్షసుండు !
తోటరాముని చేతిలో - తుట్ట తుదకు
మరణమును పొందె నేపాళ - మాంత్రికుండు !
సాటి లేరిల ! యస్వియార్ - సాటి యతడె!
__________________________
పోహణించు = ప్రశంసించు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియశస్వి రంగారావు (S.V.R)
రిప్లయితొలగించండిభట్టి విక్రమార్కలో మణిసిద్ధునిగా :
03)
__________________________
విక్రమార్కుని, భార్యతో - వేరు పరచి
విజయమందగ నెంచిన - కుజనుడైన
వింత మహిమల మణి సిద్ధు - డంతరించె
విక్రమార్కుని చేతిలో ! - విధికి లొంగి !
సాటి లేరిల ! యస్వియార్ - సాటి యతడె!
__________________________
యశస్వి రంగారావు (S.V.R)
రిప్లయితొలగించండిమాయా బజారులొ ఘటోత్కచునిగా :
04)
__________________________
మాత మాటల తలదాల్చి - మాంత్రికుండు
మంచమున నున్న మరదలిన్ - మాయతోడ
మరుని సాటైన యభిమన్యు - దరికి జేర్చె
మధుర మాయా బజారునం - దెదురు లేక!
మాయ శశిరేఖగా తాను - మరలి వచ్చి
మొత్తమంత, వివాహపు - భోజనంబు
ముత్య మంతయు విడువక - మోజుదీర
మెక్కె , ఘన ఘటోత్కచుడయి - చక్కగాను !
మంచి పాండవులకు జేసె - మంత్రమహిమ !
సాటి లేరిల ! యస్వియార్ - సాటి యతడె!
__________________________
శ్రీ వసంత కిషోర్ గారికి మాయలపకీరు (యశస్వి రంగారావు గారు) శాశ్వతముగ జనుల హృదయములో జీవించి యుందురు.
రిప్లయితొలగించండిఅ చిత్రములు జూచిన పిల్లలు
======*=======
మాయలపకీరు బలుకులు
గాయము జేయగను,వాని కాయము తునియల్
జేయ కర వాలములతో
నాయకుడను గని ముదమున నాట్యము జేసెన్
మాయామోహవిజృంభణాగగనధూమ మ్మాత డజ్ఞాని స
రిప్లయితొలగించండిజ్జాయామానసధర్మదీక్షబలనైశ్చల్యమ్ము నాగమ్ముతో
ఢీయంచున్ చెలరేగ వచ్చె ఘను డేడీ వాడు నీరయ్యెనో!
ప్రాయశ్చిత్తము ప్రాణమయ్యె తుదకున్ పాన్గంటి బాలార్కుచే
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
శ్యామల రావు గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
యస్వీ రంగారావు విశ్వరూపాన్ని నాల్గు పద్యాల్లో వివరిస్తూ చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
ఆదిత్య గారూ,
అద్భుతమైన వృత్తం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెట్టు తొఱ్ఱను కలదొక చిలుక ప్రాణి
రిప్లయితొలగించండిఏడు సాంద్రము లావల కేగి నంత
నాదు ప్రాణము గాంచగ నీదు తరమె
మాయలను జేయు మాంత్రికు మహిమ తెలుప ?
శంకరయ్య మాష్టారు గారికి జన్మదిన శుభాకంక్షలు.
రిప్లయితొలగించండిభూములఁమ్రింగుచు స్కాములఁజేసెడు
..........మంత్రివర్యులుగారె మాయగాళ్ళు |
దొంగకంపెనిఁబెట్టి దొంగలెక్కలఁజమ
..........జేయ కోట్లుదినరె మాయగాళ్ళు|
పండిన వరిఁదాచి పంటలులేవని
..........బ్లాకుఁనమ్మెడివారె మాయగాళ్ళు |
మనుజావయవముల మాయఁగాజేసిన
..........మ్మంగజూచెడివారె మాయగాళ్ళు|
ఎన్నొ మోసముల్ చేయుచునెన్నొ జీవి
తములఁదేశమునంతయుఁదగని స్వార్ధ
మందు ఛిద్రముజేసెడు మాయగాళ్ళ
వరుసఁ మాయమరాఠీలెవరు నిలువరు ||
మాయలతొ మంత్రములతొ కామవపువులతొ
కుట్రలతొ క్రూరముగ రాజకుమరులెంతొ
మందినంతము జేసిన మంత్రగాని
జీవమెవ్విధిఁగలదొక చిలుకలోన
ఊహాతీతములైన మాయలతొనయ్యోజాతి ఐశ్వర్యమున్
స్వాహాజేసెడు మోసగాళ్ళపదవుల్ సాంతమ్ముగాపీకఁగా
నీహస్తంబుననున్నయస్త్రమొకటే; నిష్పక్షపాతమ్ముతో
మోహంబంతయు వీడి నీవొసగు నీ"వోటే"గదాసోదరా ||
మూఢ మతులను మెప్పించి మోసకారి
రిప్లయితొలగించండిగుమ్మమున జొచ్చి పీడ పోగొట్టె దనుచు
మాయ జేసి పైకము దోచి మాయ మయ్యె
మాయల ఫకీరు మాయల బాయ వలెను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరప్రసాద్ గారికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఆ సినిమాలు పిల్లలూ పెద్దలూ అందరూ తప్పక చూడ దగినవి !
వాటిలో యశస్వి నటన అద్భుతం అనుపమానం !
ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుండి పోతాయి !
ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటాయి !
శంకరార్యా ధన్యవాదములు !
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
‘సంద్రము’నకు ‘సాంద్రము’ అని టైపాటు అనుకుంటా.
*
గుండా రఘురామ్ గారూ,
శుభాకాంక్షకు తెలిపినందుకు ధన్యవాదాలు.
ఆధునిక మాయల పకీరులను గూర్చి చక్కని పద్యాలు వ్రాసారు. బాగున్నవి. అభినందనలు.
‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. మీ పద్యాలలో చాలాసార్లు ‘తొ’ అన్నారు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.