4, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1102 (బాట వీడి నడచువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బాట వీడి నడచువాఁడె జ్ఞాని.

30 కామెంట్‌లు:

  1. పరుల కెపుడు తాను పరమార్థ మందించు
    బోధ సేసి, యెట్టి బాధ నిడక,
    ధర్మ మాచరించి, తానెప్పుడును దప్పు
    బాట వీడి నడచువాఁడె జ్ఞాని.

    రిప్లయితొలగించండి
  2. భ్రాంతిలోన బడక పరమార్థమును గోరి
    భక్తి పథమునూని బ్రహ్మనిష్ఠు
    డగుచు మాయచేత నలరు నధర్మపు
    బాట వీడి నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  3. సకల శాస్త్రములను జక్కఁగాఁ బఠియించి,
    మోక్ష మార్గ మెపుడు బోధ సేసి,
    భోగములను విడచి, భువిఁ గల్ల గురువుల
    బాట వీడి, నడచువాఁడె "జ్ఞాని".

    రిప్లయితొలగించండి
  4. అనవరతము మదిని హరిపదమ్ముల నిల్పి
    తంపు లందు తాను తగులు కొనక
    మరల మరల బుట్టు బురద జంజాటపు
    బాట వీడి నడచువాఁడె జ్ఞాని.

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారూ,
    ‘తప్పు బాట, కల్ల గురువుల బాట’లను వీడుమన్న మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అధర్మమార్గాన్ని వీడిన వాడే జ్ఞాని అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    జంజాటపు బాట వీడుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  6. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు

    నేడు చిన్న పిల్లలకు,పెద్దలకు కూల్ డ్రింక్,పొగ త్రాగ వలదనిన దెలిపిన,వాడు అజ్ఞాని యని జెప్పెదరు
    లోకపు పోకడను ఈ విధముగా
    ======*========
    సామ వేద మనుచు సాధు జనులు జూపు
    బాట వీడి నడచు వాడె జ్ఞాని,
    విలువల వలువలను వీపున మోయుచు
    ధర్మ నిరతు డైన ధర్మ రాజు

    ధరణి జనుల తోడ దిరుగు వా డజ్ఞాని,
    చీమ సందు వెదకు సిద్ద జ్ఞాని ,
    ఖలుల జెంత జేరి కపట విద్యలు నేర్చి
    కయ్యమునను గోరు కాల జ్ఞాని ,

    దివి ననవరతమ్ము దిరిగిన విజ్ఞాని,
    పరుల సొమ్ము దినిన పరమ జ్ఞాని,
    తప్పు లందున దన తప్పు దాచి పరుల
    లోపములను జూపు లోక జ్ఞాని
    ( దివిని= ఆకాశమున)

    రిప్లయితొలగించండి

  7. ధర్మ బుద్ధి లేక ధార్మికుడును గాక
    కల్లబొల్లి మాట లుల్ల సిలగ
    నర్మ భాషణముల నమ్మించు వారల
    బాట వీ డి నడచు వాడె జ్ఞాని .

    రిప్లయితొలగించండి
  8. స్వార్థచింతవీడిసంఘపుమేల్గోరి
    సేవజేయువాడె దైవసముడు
    నీతినియమములకు నిలబడి యవినీతి
    బాట వీడి నడచు వాడె జ్ఞాని !!!

    రిప్లయితొలగించండి
  9. వరప్రసాద్ గారూ,
    న్యాజోక్తులతో నిందిన మీ పూరణ, తరువాతి రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    పద్యాలలో ‘సిద్ధజ్ఞాని, కాలజ్ఞాని, పరమజ్ఞాని, లోకజ్ఞాని’ అన్నప్పుడు ‘జ్ఞా’కు ముందున్న అక్షరాలు గురువులై గణదోషం ఏర్పడుతున్నది.
    *
    సుబ్బారావు గారూ,
    ధర్మబుద్ధి లేనివారి బాటను వీడుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    అవినీతి బాటను వీడుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    అజ్ఞాని లో అ గురువు, ‘సిద్ధజ్ఞాని, కాలజ్ఞాని, పరమజ్ఞాని, లోకజ్ఞాని’ లోని ‘జ్ఞా’కు ముందున్న అక్షరాలు గురువుకాదని అనుకొంటిని, తప్పులు తెలియ జేసినందులకు గురుదేవులకు ధన్యవాదములు
    =====*=======
    శాంతి సుఖము కోరి సత్య ధర్మ నిరతి
    ననుస రించు సాధు జనుల కెల్ల
    కీడు జేయు రాజకీయ నాయక గణ
    బాట వీడి, నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    గణ దోషములను సవరించి

    ======*=========
    సామ వేద మనుచు సాధు జనులు జూపు
    బాట వీడి నడచు వాడె జ్ఞాని,
    విలువల వలువలను వీపున మోయుచు
    ధర్మ నిరతు డైన ధర్మ రాజు

    ధరణి జనుల తోడ దిరుగు వా డజ్ఞాని,
    భోగములను వెదకు రోగ మందు
    చీమ సందు వెదకు దోమ సిద్ద జ్ఞాని,
    భక్తీ మార్గ మనుచు రక్తి కొఱకు

    ఖలుల జెంత జేరి కపట విద్యలు నేర్చి
    కరుణ దార లెల్ల కురియ జేసి
    కయ్యమునను గోరు ఖలుడు కాల జ్ఞాని,
    నీతి నియమములను నీట గలిపి

    దివి ననవరతమ్ము దిరిగిన విజ్ఞాని,
    పంచదార వంటి బలుకు బల్కి
    పరుల సొమ్ము దినెడి కరి పరమ జ్ఞాని,
    దొంగ దొంగ యనుచు తొంగి జూచి

    తప్పు లందున దన తప్పు దాచి పరుల
    తప్పు లెల్ల ఘోర దప్పి దమని
    లోపములను జూపు లోభి లోక జ్ఞాని
    విశ్వ దాభి రామ వినుర వేమ|

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! వరప్రసాద్ గారూ!
    మీ పద్యాలలో చివరిపాదముగా (విశ్వదాభిరామ వినుర వేమకి బదులుగా) ఈ పాదమును ఉంచండి.

    "వరప్రసాదు మాట పసిడి బాట"

    రిప్లయితొలగించండి
  13. వరప్రసాద్ గారూ,
    ‘శాంతి సుఖము కోరి..’ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘గణ బాట” అని సమాసం చేయరాదు కదా. అక్కడ ‘రాజకీయ నాయకులదౌ..’ అనండి.
    సవరించిన మీ పద్యాలు బాగున్నవి.
    అన్నట్టు... చివరి పద్యం నన్ను ఉద్దేశించి వ్రాసినట్టుంది.. :-)

    రిప్లయితొలగించండి
  14. జపము తపము దినము జరుపుకొనుచునుండు
    వాడె , సర్వశక్తి వంతు నమ్ము
    వాడె, కామ జనిత భవబంధనమ్ముల
    బాట వీడి నడచువాఁడె జ్ఞాని.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. భక్తి యోగమనగ బంగారు బాటయౌ
    జ్ఞాన యోగమనగ కాంతి పథము
    మంచి బాట బూని, మాయామయమ్మగు
    బాట వీడి నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  17. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీరు శక్తి వంతు అని వాడేరు. ఇకార ఉకారముల తరువాత మంతు అని వాడవలెను. శక్తిమంతుడు అనుట సాధువు. అలాగే హనుమంతుడు, మొదలగునవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. వెతల మూట,సుఖము వెతికినంతట జూట
    బరువు బాధ్యతల తుపాకి తూట
    శత్రువులకు పీట, సంసారపు దిగులు
    బాట వీడి నడచువాఁడె జ్ఞాని!!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    అన్ని పద్యములు కొందరి రాజకీయ నాయకులను ఉద్దేశించి వ్రాసినవి
    గురుదేవులకు ధన్యవాదములు ఇది అంతయు మీరు పెట్టిన భిక్ష
    ======*======
    పండితుల వారి ప్రేమకు
    మండితుడ నయితిని నేడు మది యుప్పొంగెన్,
    ఖండితముగ పండుగ గద
    పండితు లండగ నిలువగ పద్య రచనకున్ ।

    రిప్లయితొలగించండి
  20. anRtamula baaTa naavESamula baaTa
    hitamu gaani baaTa hiMsa baaTa
    parulu diTTu baaTa paramaarthamulu lEni
    బాట వీడి నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  21. తోట లందు దిరిగి తోయజాక్షి వెనుక
    మాటి మాటి కేమొ మాట గలిపి
    మోస గించ చెలిని బాస తప్పెడి చెడు
    బాట వీడి నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  22. ద్వంద్వ సంచయమును,దర్ప న్యూనత లను
    వీడి శుద్ద సత్వ వేద మార్గ
    మందు నిలిచి యుండి మాయాంధ కారపు
    బాట వీడి నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  23. అన్య మతపు బాట నావేశముల బాట
    హితము గాని బాట హింస బాట
    పరులు దిట్టు బాట పరమార్థములు లేని
    బాట వీడి నడచు వాడె జ్ఞాని

    రిప్లయితొలగించండి
  24. శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
    మీరు దర్ప న్యూనతలను అని వాడేరు. ఇందులో న్యూకి ముందున్న అక్షరము గురువు అగుతుంది. సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    అంత్యానుప్రాసతో మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఆంగ్లంలో ‘అనృతమైన బాట’ తెలుగులో ‘అన్యమతపు బాట’ అయిందా? గణదోషం అనుకుంటే ‘అనృతముగల బాట’ అంటే సరిపోయేది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఈనాటి మీ పూరణ నిర్దోషంగా చాలా బాగుంది. అభినందనలతో పాటు ధన్యవాదాలు.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! అక్కడ ‘దర్పరాహిత్యమున్’ అందామా?

    రిప్లయితొలగించండి
  26. పెద్దలిరువురికీ నా ధన్యవాదములు.
    సవరించిన పద్యము

    జపము తపము దినము జరుపుకొనుచునుండు
    వాడె , ముక్తినిచ్చు వాని నమ్ము
    వాడె, కామ జనిత భవబంధనమ్ముల
    బాట వీడి నడచువాఁడె జ్ఞాని.

    రిప్లయితొలగించండి
  27. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    గణము కుదురుట లేదనే దానిని మార్చాను.
    చక్కని సవరణ చూపారు.

    రిప్లయితొలగించండి
  28. హమ్మయ్య ఒక్క పద్యాని కైనా శ్రమ తప్పించాను కదా !

    రిప్లయితొలగించండి