10, జులై 2013, బుధవారం

పద్య రచన – 398 (నవల)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“నవల”

6 కామెంట్‌లు:

 1. నవల యనెడి వధువు నవరస భరితాత్మ
  సరస వచన సుగుణ సాధు చరిత
  భద్ర లక్షణాఢ్య భాగ్యరేఖాన్విత
  ఆమె వైభవమ్ము లద్భుతములు

  రిప్లయితొలగించండి
 2. నవలలు వ్రాతురు కొందఱు
  అవలీలగ, గాని యందు నర్ధము వెదుకన్
  అవతవకలు గా నుండును
  వివరముగా వ్రాయు నతడు విశ్వంభు వుడే .

  రిప్లయితొలగించండి
 3. నవ రసములు గురి పించుచు
  నవ విధముల మెలికదిప్పి నవ్యత చూపన్
  భవ బంధముల కతీతము
  అవగత మవనట్టి నేటి నవలా రచనల్ !

  రిప్లయితొలగించండి
 4. నవలామణియను పేరుల
  నవనీ తలమున తరుణుల నలరింపంగా
  నవయువకులు పలుకుదురట
  జవరాలును సంతసమున సరిసరి యనదే!

  రిప్లయితొలగించండి
 5. నవనవ లాడెడి విధముగ
  నవరసములతోడ మెచ్చు నాయిక మరియున్
  నవలా నాయకు లుండెడి
  నవలల కాలమ్ము పోయె నట 'నెట్' వలతో.

  రిప్లయితొలగించండి
 6. నవ్యభావములకు నాంది యగు నవల
  *****అందచందములకునాది నవల
  ఎంత చదివినను వింతఁ గొల్పుచు మన
  *****సన్నిధిలోనుండు సరస మూర్తి
  పరహస్తగతమైన మరల తిరిగి రాని
  *****మోహకారక రమ్య మూర్తి నవల
  ప్రాతగ మారిన ప్రక్కకు నెట్టక
  *****పదిలపరచదగు సుధయె నవల

  వివిథ పాత్ర తత్వములకు విడిది నవల
  శ్లేష భాషల నిలయమై చెలయు నవల
  కాంత యైన జీవము లేని గ్రంథమైన
  నరుల మేలుకై యున్నది నవల కాదె!!

  రిప్లయితొలగించండి