శ్రీ నేమాని గురువర్యుల మధ్యాక్కర మోదమును నాకు గూర్చె ======*===== రాక్షసులను జంప రామ లక్ష్మణులు యా వార్త విన్న సకల వారి జాక్ష, ముని జనులకు మోదమును గూర్చె ఘోరప్ర మాద మౌర! రామ మనుజనులకు.
పండిత నేమాని వారూ, తప్పిన ప్రమాదం మోదాన్ని కూర్చిందన్న మీ పూరణ మధ్యాక్కరలో బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, శత్రుసైన్యానికి జరిగిన ప్రమాదం మనకు మోదాన్ని కూర్చేదేగదా! బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘సేన, బలగములు’ అని పునరుక్తి ఉన్నది కదా! ‘శత్రురాజ్యంపు రాజు/నేత’ అందాం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బస్సు ప్రమాదం పెద్ద ప్రమాదాన్ని తప్పించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, సాగర మధనం విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
రాజకీయ నాయకుల పలుకులు విని ఆత్మహత్యల పై ========*======== రాజకీయ నాయకులెల్ల రణము నందు బలుకు బలుకులను వినిన ప్రజల కెల్ల మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర! నమ్మి నడి సంద్రమున ముల్గు నరుల కెల్ల
మధ్యాక్కర:
రిప్లయితొలగించండికారులో జనుచుండ పెద్ద గాలి తుఫానులు వచ్చె
దారిలో తృటిలోన ముప్పు తప్పించుకొంటి మయ్యెడను
భూరి కాంతుల నీను మోదమును గూర్చె ఘోర ప్రమాద
మౌర! తప్పెను గదా యనుచు నంతరంగము పొంగిపోయె
శత్రు రాజ్యంపు సేన దుస్సాహసమున
రిప్లయితొలగించండిభరత ఖండంబునకుఁ బంపెఁ బలగములను
పెను తుఫానులలోఁ జిక్కి వెనుదిరిగిరి
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర.
చెట్టు గ్రుద్దగ మా ' బస్సు ' చేరలేదు
రిప్లయితొలగించండిఅమరనాథుని యాత్రకు నపుడు మాకు
గంగ వరదయె తప్పెను, బెంగ లేదు
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర!
దేవదానవ సమ్మోద దివ్య మథన
రిప్లయితొలగించండిమున మొదటఁ బుట్టిన గరళము నట మ్రింగి,
శివుఁడు కాచెను సర్వులఁ జిత్రముగను!
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర!!
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండి=======*=======
జుద మాడు చునుండగ జోలిబట్టె
బీదలు, ధనము తోడుగ పేకలనిడ
మీదబడ్డ రక్ష కులకు మేల మయ్యె
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర!
(మేలము = పరిహాసము )
=======*=======
కంటి యమసదనమ్మును ఘనము గాను
పాప పుణ్య ములకు జిక్కు ఫలిత మెల్ల
రాక పోకల మర్మము నాకు దెలిసె
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర!
శ్రీ నేమాని గురువర్యుల మధ్యాక్కర మోదమును నాకు గూర్చె
రిప్లయితొలగించండి======*=====
రాక్షసులను జంప రామ లక్ష్మణులు యా
వార్త విన్న సకల వారి జాక్ష,
ముని జనులకు మోదమును గూర్చె ఘోరప్ర
మాద మౌర! రామ మనుజనులకు.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండితప్పిన ప్రమాదం మోదాన్ని కూర్చిందన్న మీ పూరణ మధ్యాక్కరలో బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
శత్రుసైన్యానికి జరిగిన ప్రమాదం మనకు మోదాన్ని కూర్చేదేగదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘సేన, బలగములు’ అని పునరుక్తి ఉన్నది కదా! ‘శత్రురాజ్యంపు రాజు/నేత’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బస్సు ప్రమాదం పెద్ద ప్రమాదాన్ని తప్పించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
సాగర మధనం విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవ పూరణ చాలా బాగుంది.
మొదటి, మూడవ పూరణలలో అన్వయం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది.
సేన గొప్పతనమదేమి జీతగాండ్రె
రిప్లయితొలగించండివారలునను వాదములకు బదులు చూపి
ప్రాణ భిక్షను పెట్టిన ప్రతిభఁ గాంచ-
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర!
శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి(మొదటి పూరణలో పోలిస్ రైడింగ్ లో దోరకకుండుట, మూడవ పూరణలో మొదటి రోజు యుద్ధానంతరము
ఆడు వారికి,ముని జనులకు మోదమయ్యె,కానీ రామ మనుజనులకు = వానరులకు ప్రమాదమని సందేహములో వ్రాసితిని )
మరి యొక పూరణ
======*======
విందు నందు వడి వడిగ పాండు సుతుడు
కాల కూటము సేవింప కౌరవులకు
మోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర!
పాండు సుతునకని దలచె మెండు గాను
అయ్యా! వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ 3వ పూరణ తొలి పాదములో రామలక్ష్మణులు + ఆ = రామలక్ష్మణులునా అగును - యడాగమము రాదు. స్వస్తి.
వనములఁదరులఁనఱకుట వాహినులలొ
రిప్లయితొలగించండిసికతతోడుట తప్పని చెప్పువారి
మాటలకు దేశమునపెద్ద మనుషులకను
మోదమును గూర్చె ఘోరప్రమాదమౌర!
శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి======*========
వరద లందు జిక్కి జనులు పస్తు లుండ
పూరి,కిచిడి బెట్టి ధనము పూర్తి గాను
దండు కొన్న వ్యాపారుల దండులకును
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
శంకరా భరణ బ్లాగు , చదువరులకు
రిప్లయితొలగించండిమోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర
కలిగె నుత్తరా ఖండము గ్రామ ప్రజకు
బహుళ నదులన్ని వరదలై పా ఱు కతన
రాజకీయ నాయకుల పలుకులు విని ఆత్మహత్యల పై
రిప్లయితొలగించండి========*========
రాజకీయ నాయకులెల్ల రణము నందు
బలుకు బలుకులను వినిన ప్రజల కెల్ల
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
నమ్మి నడి సంద్రమున ముల్గు నరుల కెల్ల
మంత్రి గారిపై పిర్యాదు జేసి కష్టములను కొని దెచ్చుకొన్న వారిపై
రిప్లయితొలగించండి======*=========
న్యాయ సూత్రములు జదువ నరుల కెల్ల
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
నమ్మి దిరుగు నరుల కెల్ల,చెమ్మ గిల్లు
దార,పుత్రుల చెక్కిళ్ళు ధరణి లోన
బాల్యమున విడిపోయిన బాల్య మిత్రు
రిప్లయితొలగించండిలిరువురు వరద వలన కలిసిరి చిత్ర
మిది వినిన భయద విలయమే గననిది
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర.
లక్క యింటికి నిప్పును మిక్కుటముగ
రిప్లయితొలగించండినంటు కొనినంత పాండవు లంత మొందు
తెలిసి విదురుడు తప్పించె తెలివి గాను
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర !
శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి=======*======
సుర వర బలమ్ము నెంచగ శూలివి గద
కరము నుంచెద నొక తురి శిరము పైన
ననుచు దను భస్మమై నట్టి యసురుని గన
మోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర!
======*========
గంగ యమున సొగసును గాంచ జనులు
వెడలె కేదార నాధుని కడకు,మిగిలె
కట్టె పై ధన కనకమ్ము,ఖలులకు నది
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
అడిగిన వరము లిచ్చెడి యక్షరుడగు
రిప్లయితొలగించండిశివుని ధ్యాన పిఠము హిమ శిఖరము గన
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
జనులు హిమ శిఖరము నెక్కు సాహసమ్ము
గూర్చు జనులకు యాత్రలు కువలయమున
రిప్లయితొలగించండిమోదమును; గూర్చె ఘోరప్రమాద మౌర
పెక్కునష్టాలు ,కష్టాలు పెక్కుటిలగ
భరత సైన్యమేకాపాడె భవ్యరీతి !!!
కలసి వచ్చిన భార్యతో కాపురంబు
రిప్లయితొలగించండిమోదమును గూర్చె; ఘోరప్రమాద మౌర
తప్పెనట, భార్య గయ్యాళి తనము దుర్భ
రమ్ము సోదర! కోరంగ రాదు నెపుడు!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మొత్తంమీద పదిపూరణలు చెప్పారు. ఈరోజు మీలో రచనోత్సాహం పెల్లుబికినట్లుంది. సంతోషం.
3వ పూరణలో ‘రామలక్ష్మణు లట్టి’ అనండి. (నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!)
4వ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. ‘విందునందు వడివడిగ భీముఁ డపుడు’ అందాం.
5వ పూరణలో ‘మున్గు’ టైపాటు వల్ల ‘ముల్గు’ అయినట్టుంది.
8వ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘యమునల’ అంటే సరి.
*
గూడ రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వాహినులలొ’ అని హ్రస్వాంతంగా వ్రాయరాదు. అక్కడ ‘వాహినులను’ అని సప్తమ్యర్థంలో ద్వితీయను వాడవచ్చు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘భరణ బ్లాగు’ను ‘భరణము బ్లాగు’ అనండి.
*
‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.