28, జులై 2013, ఆదివారం

పద్య రచన – 416 (పంచాయతీ యెన్నికలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పంచాయతీ యెన్నికలు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు

30 కామెంట్‌లు:

  1. పంచిరి సంచులు మత్తున
    ముంచిరి పౌరులను నీతి బోధలనుచు వ
    ల్లించిరి నేతలనేకులు
    పంచాయతి యెన్నికల ప్రభావమ్మెసగన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నేమాని గురుదేవుల పద్యము అద్భుతం, పంచాయతీ యెన్నికలను కళ్ళకు కట్టి నట్టులున్నది.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటి రాలేదు. అందరూ నాకు వచ్చిందంటే నాకు వచ్చిందంటున్నారు.
    ======*======
    పంచాయతి యెన్నికలకు
    పంచిరి ధన కనక వస్తు వాహనములలన్
    పంచన జేరిన జనులకు
    పంచిరి బంచాయతీలు వంచన జేయన్

    రిప్లయితొలగించండి
  4. ధనము పంచిన వారు ఓటమి పాలైరి
    ======*======
    పంచాయతి యెన్నికలకు
    ముంచిరి మత్తున జనులను,మునిగిన జనులే
    పంచిగ "నోటును" నేతలు
    గాంచిరి జుక్కల నధికము కైకాసమునన్

    ("నోటును"= ఓటును,కైకాసము= బాధ,వేదన)

    రిప్లయితొలగించండి
  5. ఎన్నికలు జరుగు చున్నవి
    ఎన్నిక పంచాయ తీ ల యీ శుల కొఱకున్
    అన్నలు దమ్ముల మధ్యన
    మున్నెన్నడు గానరాని మోదము తోడన్

    రిప్లయితొలగించండి
  6. పంచాయతి యెన్నికలం
    బంచిరి బహుమానములను, వంచన తోడన్
    సంచితముఁ జేయ ధనముల,
    మించిన కుట్రలను బన్ని మీరఁగ వసుధన్.

    రిప్లయితొలగించండి
  7. సంచుల కొలదిగ సొమ్ములు
    పంచుటకై ప్రజల కొఱకు పంచెలు, చీరల్
    ముంచగ మద్యపుటేరులు
    పంచాయతి యెన్నికలన పండుగ కాదే!

    రిప్లయితొలగించండి
  8. ఎన్నికలే పండుగ? మి
    స్సన్నా! నీ కవిత పండుగకు మాకు భళా!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములు బాగుగ నున్నవి - ప్రశంసలు కూడా బాగుగ నున్నవి. సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  10. నేమాని పండితార్యా!
    ధన్యవాదములయ్యా!

    రిప్లయితొలగించండి
  11. మొన్న ఎన్నికల విధులకు నిన్న రాత్రి వచ్చాను.

    ముంచుదురు జనుల నిప్పుడు
    పంచాయతి యెన్నికలను వారుణి లోనన్
    ముంచుదురు జనుల తదుపరి
    సంచులుగా సొమ్ము తిరిగి సంపాదించన్.

    రిప్లయితొలగించండి
  12. పంచాయతి ఎన్నికలన
    లంచాలకు మారుపేరు, రైతన్నకు తా
    నెంచిన ఫలములు దక్కవు
    వంచన మార్గమ్ము ప్రభుత వదలదు చూడన్

    రిప్లయితొలగించండి
  13. పంచాయతీ ఎన్నికల గురించి స్పందించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు......
    పండిత నేమాని వారికి,
    వరప్రసాద్ గారికి,
    సుబ్బారావు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    మిస్సన్న గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    ........... అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ‘వాహనములలన్’ అన్నదాన్ని ‘వాహనములనే’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. ఎన్నికల సమయమియ్యది
    వన్నెలు చిన్నెలును జూపి వంచన తోడన్
    మున్నెన్నడు వినియుండని
    వెన్నెన్నియొ వరము లొసగి యీమారైనన్.

    ధనమును మద్యము పంచుచు
    ననుపమ మధురోక్తులాడి, యటుగాకున్నన్
    ఘనతం జాటుచు నైనను
    కొనవలె యధికారమనెడు కోరికతోడన్.

    ఓటరు నాసర్వస్వం
    బోటరు భగవంతు డిప్పు డుర్వీతలమం
    దోటరె జననియు జనకుం
    డోటరునే కొల్తుమంచు నుత్సాహమునన్.

    సంచులలో నగణితధన
    సంచయమును నింపుకొనుచు సంతోషమునన్
    పంచిరి యత్యాదరమున
    పంచాయతులందు జూడ ప్రజలందరికిన్.

    పంచాయతి ఎన్నికలం
    దెంచగ నాయకుల జిత్తు లేమందు నికన్
    వంచనలో నొకరొకరిని
    మించిరి పదవులనుగోరి మేధావులనన్.


    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  15. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీ ఖండకృతి ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. హరి వారి కావ్య ఖండిక
    హరి హరి యొక యద్భుతముగ నలరారె బళా!
    పరితోష మలర మధురా
    క్షరమయముగ గూర్తు నాశిషశ్రీ ప్రతతిన్

    రిప్లయితొలగించండి
  17. నేతల వింతలు దెలిసిన
    ఖాతరు జేయకను ప్రజలు కాంక్షిత మైకం
    బాతురబడి పాత మరచి
    వేతురు తమవోటు మరల వేగిర పడుచున్ !
    ___________________________________
    వంచన జేయుచు ప్రజలను
    పంచుట యలవాటు గాన బహు రూపంబుల్ !
    పంచాయితి యెన్నికల పేర
    ముంచగ మైకపు వరముల మోహము లందున్ !

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమాని వారూ,
    ‘హరి’ గారిని ఆశీర్వదిస్తూ వ్రాసిన పద్యం సముచితంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడి పంచాయతీ ఎన్నికల గురించి మంచి పద్యాలు వ్రాసారు. అభినందనలు.
    రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. ‘పంచాయతి యెన్నికలని’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
    పంచాయతీ యెన్నికల పద్యరచన యెన్నికలవలె పసందుగానున్నది.
    పంచాయతీ యెన్నికల ఫలితములతో ప్రజలను తప్పు త్రోవలు పట్టించు వారధికమయ్యె

    అంకెల గారడి విద్యను
    పొంకముగను నేర్చి,జిక్కె పోరాటమునన్
    నంకుశములు జనులారా !
    శంకలు వీడి గనరండి చానళ్ళలలో.
    ( అంకుశములు= అధికారములు )
    బొంకుట నేర్చిన వంకర
    కింకర మూకలు జనులకు గెలిచితి మనుచున్
    అంకెలు నిత్యము జూపును
    జంకక మా ప్రగతి యనుచు జగతి జగడమున్!

    వరదల లోన వరద ల
    య్యె రవముల రణితము జూడ రయ్య వరదతో
    ధరను గరగి పోవు నేతల
    కరముల రవములు,వరములు కలియుగ మందున్

    దొంగ ఓట్లతో గెలుపొంది అది ప్రజల గెలుపను వారు గలరు .

    రాజుని మించిన రాజులు,
    రాజులము తరాజు లోని రతనాలను యూ
    ర్వీ జనులెన్ను కొనె రను
    త్తేజమున బలుకుచు నుండ దిగులేలనురా!

    ( తరాజు= విపణి, రతనాలు = మంచివారు )

    రిప్లయితొలగించండి
  20. పంచాయతీ యెన్నికలకు
    పంచిరి సొమ్ములను శక్తి వంచన లేకన్
    ముంచిరి ప్రజలను మత్తున
    వంచించిరి ఓటరులను వాగ్దానముతో..

    రిప్లయితొలగించండి
  21. శ్రీ వర ప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీరు కూడా ఎక్కువ పద్యములనే ఎత్తుకొన్నారు. బాగుగనున్నవి. సంతోషము.
    కొన్ని సూచనలు:
    1. 1వ పద్యములో చానళ్ళలోకి బదులుగా చానళ్ళకటా! అనండి
    2. 3వ పద్యము --
    2వ పాదములో యతి మైత్రి లేదు.
    3వ పాదములో గణభంగము.
    3. 5వ పద్యము.
    యుర్వీ కి బదులుగా యూర్వీ అని పడుట టైపు పొరపాటు.
    3వ పాదములో ఏదో అన్వయ లోపము. సరిచేయండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. వరప్రసాద్ గారూ,
    ఎన్నికల గురించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘పోరాటములో నంకుశములు..’ అనండి. ‘చానళ్ళలో’ అనాలి కదా. అక్కడ ‘చానళ్ళ నికన్’ అందాం.
    రెండవ పద్యం రెండవ పాదంలో గణ, యతి దోషాలు. మూడవ పాదంలో గణదోషం.
    నాల్గవ పద్యంలో ‘ఉర్వి’ని ‘ఊర్వీ’ అన్నారు. అక్కడ ‘రతనమ్ముల ను/ ర్వీజను...’ అంటే సరి. ‘కొనె రనుత్తేజము’ అన్నది కూడా సముచితంగా లేదు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘పంచాయతీ’ అని దీర్ఘాంతం టైపాటా? దానివల్ల గణదోషం. ‘పంచాయతి’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని వారూ,
    నేను వరప్రసాద్ గారి పద్యాలను సమీక్షిస్తూ టైపు చేస్తున్నప్పుడు మీ వ్యాఖ్య వచ్చింది. నేను చూడలేదు. మీ సవరణలు బాగునవి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. ఎన్నిక పురాణమందున
    ఎన్నికచే ప్రజల బాగ దెంతో, సరిగా
    నున్నదొ లేదో? ఒకచో
    నున్నను పార్టీకె. ఉండదు ప్రజకై

    రిప్లయితొలగించండి
  26. పంచాయితి రాజ్యమందు
    పంచ పరమ దైవతములు పాలించవలెన్
    వంచనచేయక ప్రజలను
    అంచెలు అంచెలుగ ప్రగతి నoదిoచంగన్

    రిప్లయితొలగించండి
  27. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం నాల్గవ పాదంలో గణదోషం. ‘ఉన్నను పార్టీకె గాని యుండదు ప్రజకై’ అందాం.
    రెండవ పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘రాజ్యమందు’ అన్నదాన్ని ‘రాజ్యములో’ అనండి.

    రిప్లయితొలగించండి
  28. సవరణతో...............
    పంచాయతి యెన్నికలకు
    పంచిరి సొమ్ములను శక్తి వంచన లేకన్
    ముంచిరి ప్రజలను మత్తున
    వంచించిరి ఓటరులను వాగ్దానముతో..

    రిప్లయితొలగించండి