3, జులై 2013, బుధవారం

పద్య రచన – 391 (భవబంధములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“భవబంధములు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

  1. ప్రారబ్ధ వశమున భవబంధములలోన
    ....నజ్ఞాని కొట్టుమిట్టాడుచుండు
    తనవారలంచును తన సంపదలటంచు
    ....మోహపంకమ్ములో మునుగుచుండు
    విషయ సుఖమ్ములే ప్రియమంచు నాశించి
    ....యందు దుఃఖమ్ముల నొందుచుండు
    జీవుడు భ్రమచేత జేయుచు కర్మముల్
    ....వివిధ బంధములను బెంచుకొనును
    జ్ఞాన మెన్నడు కలుగునో వానికంత
    సకల బంధ చయమ్ముల జ్ఞాన వహ్ని
    యందు వేల్చి ప్రశాంతాత్ముడై తనరును
    శాశ్వతానంద సీమలో సంతతమ్ము

    రిప్లయితొలగించండి
  2. త్రెంచుము భవ బంధములను
    ఉంచుచు మఱి నీదు మనసు ఓంకార మునన్
    అంచెలు గా బై కెదిగిన
    సంచితముం జేయు నీ కు స్వర్గము శివుడున్ .

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    ‘భవబంధ’ముల గురించిన మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘బంధములను + ఉంచుము, మనసు + ఓంకారము, అంచెలుగా’ అని విసంధిగా ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణలు....
    త్రెంచుము భవ బంధమ్ముల
    నుంచుచు మఱి నీ మనమ్ము నోంకారములో
    నంచెలు గా బై కెదిగిన
    సంచితముం జేయు నీకు స్వర్గము శివుడున్ .

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్బారావు గారు పద్యము వ్రాసేరు - శ్రీ శంకరయ్య గారు దానిని కొంతవరకు దిద్దేరు. శుభాశీస్సులు మరియు అభినందనలు. ఈశ్వరు సేవించుచు స్వర్గమును పొందుట అనే విషయము నాకు రుచించలేదు. స్వర్గమునకు మోక్షమునకు గల తేడాను విస్మరించరాదు.
    నేను మరికొన్ని మెరుగులు దిద్ది పద్యమును ఇలాగ పునర్నిర్మించేను:

    పరమార్థంబగు మోక్షవైభవము సంప్రాప్తించగా గోరి యీ
    శ్వరు సేవించుచు జన్మబంధచయమున్ జ్ఞానాగ్నిలో వేల్చుచున్
    నిరతంబున్ దగు యోగసాధనలలో నిష్ణాతుడై జీవుడున్
    జరితార్థుండగు టొప్పు తత్పదమునన్ శాంతాత్ముడై ధీనిధీ!




    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    సుబ్బారావు గారి పద్యానికి మీ పునర్నిర్మాణం అద్భతంగా ఉన్నది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. అవరోధము లెన్నిన్నున్నను
    భవ బంధములు వీడి భగ వంతునిపై !
    సవినయ భక్తి నిలిపిన
    నవిముక్తము నందు ముక్తి యాదర మొప్పన్ !

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు
    =====*========
    ధనవనమున జిక్కి దారి దెలియ కున్న
    ఘనము ఘనము యనుచు ఖరము జెంత
    శునకము వలె జేరి స్రుక్కు చున్న జనులు
    మునిగిరి భవ బందముల కడలిని।
    ( ఖరము =ఖలుడు )

    రిప్లయితొలగించండి
  9. శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారు మీ కంద పద్య గణములు సరి లేవండి

    రిప్లయితొలగించండి
  10. భవబంధమ్ములబారిని పడవేయు
    దేహభ్రాంతి విడువ దిక్కునీవు
    మాయ పొరలు వీడు మర్మమెఱుంగగ
    కరుణఁ జూపెడు పెద్ద కాంతివీవు
    దీన బాంధవ! దారి తెలియగఁ జేసెడు
    పొద్దదెన్నడొ తెలుపు గురువంచు
    నమ్మితి, నీ చరణములను వీడక
    మదియందు గొల్చితి మరువకయ్య!

    ముందు వెనక జన్మ మోహము వీడగా
    బోధఁ జేయుమయ్య పుణ్యపురుష!
    చక్రమందు నలిగి సాగుచు నున్నట్టి
    గతిని నిలుపమయ్య! కమలనయన!

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాకుంటే మూడు పాదాలలో గణదోషం. నా సవరణ...
    అవరోధము లెన్నైనను
    భవ బంధమ్ములను వీడి భగ వంతునిపై !
    సవినయ భక్తిని నిలిపిన
    నవిముక్తము నందు ముక్తి యాదర మొప్పన్ !
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో ‘భవబంధనమ్ముల’ అంటే గణదోషం ఉండదు. బహుశా ‘న’ టైపాటు వల్ల తొలగిందేమో!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు
    "సోమవార శుభ దినమున" నండి
    =====*========
    భవ బందముల బ్రాంతి తోడ పరుగులు బెట్టెడి జనులు
    భువిని దిరుగు వారిని గని పుణ్య మూర్తులనుచు పొర్లి
    అవపాత పాసన మందు నగ్ర గణ్యుల మని బల్కి
    నవ విధముల జెడి నిలచె నడి సంద్రమున వారు నేడు

    రిప్లయితొలగించండి
  13. నమస్కారములు
    సోదరులు శ్రీ వర ప్రసాద్ గారికి ,సవరించిన [ సోదర ] గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి