16, జులై 2013, మంగళవారం

పద్య రచన – 404

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27 కామెంట్‌లు:

 1. పట్టిని గట్టిగ చేతను
  బట్టుచు తా త్రొక్కుచుండె పట్టిన రిక్షాన్
  పట్టెడు తిన లేకున్నను
  పుట్టెడు ప్రేముంది కనరె పుత్రుని మీదన్.

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
  ‘ఉంది’ అని వ్యావహారికాన్ని వాడారు. ఆ పాదాన్ని ‘పుట్టెడు ప్రేమ గలదయ్య పుత్రునిమీదన్’ అందామా?

  రిప్లయితొలగించండి
 3. మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు...
  సవరణతో...

  పట్టిని గట్టిగ చేతను
  బట్టుచు తా త్రొక్కుచుండె పట్టిన రిక్షాన్
  పట్టెడు తిన లేకున్నను
  పుట్టెడు ప్రేమగలదయ్య పుత్రుని మీదన్.

  రిప్లయితొలగించండి
 4. వచ్చు టెరుగడు యెన్న డైశ్వర్యలక్ష్మి
  వదలిపోయె నే డాతని భాగ్యలక్ష్మి
  బ్రతుకు రెండు చేతులను జాగ్రత్తగాను
  పట్టి లాగుచున్నా డెట్లొ బండివాడు

  రిప్లయితొలగించండి
 5. ఆదిత్య గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. కడుపు నింపుట కుండెను కాలి బలము
  బ్రతుకు నీడ్చెద వెనుకెంత భారమైన
  కడుపు బుట్టిన వాడింత కాడు బరువు
  కడుపు లోపల బెట్టెద నొడుపుగాను

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  బిడ్డను కని భార్య చనిపోతే
  బిడ్డ నెవరికీ ఒప్పజెప్పకుండా
  కడుపుకు కట్టుకొని
  కడుపు కట్ట్టుకొని మరీ
  బిడ్డను సాకుతున్న దొడ్డ కార్మికుడు :

  01)
  ___________________________________
  దారయె వీడిపోయె; పసి - దారకు నిత్తరి సాకుమంచిటన్
  ధీరత వీడకుండ,తన - దేవుని దల్చుచు ,బిడ్డ తోడుగా
  దూరక నెవ్వరిన్,బ్రతుకు - దొర్లగ బండిని లాగుచుండెగా !
  దారుణ మీ పరిస్థితి , వి-ధాత లిఖించెను వీనికెన్నడో !
  ___________________________________
  దారకుడు = బాలుడు

  రిప్లయితొలగించండి
 8. కన్ను గవకు గంటె మిన్నగా పుత్రుని
  చేత బట్టు కొనుచు చేదు చుండె
  రిక్ష, చూడు డార్య ! రేయి బగలు ను లా
  గినను దీ రవాతని నిడుమములు

  రిప్లయితొలగించండి
 9. భారంబు గాదు జనులకు
  దారా పుత్రాదు లెంత దారిద్ర్యమునన్,
  తాఁ రక్షింపగ నిక సం
  సారపు రిక్షాను లాగ సాగెను ధరలోన్.

  రిప్లయితొలగించండి
 10. చేత బిడ్డ తోటి చేతిలో హేండిలు
  పట్టి తొక్కు చుండె పొట్ట కోసం
  కుప్ప తొట్టి కుళ్ళు కాల్వల్లొ పట్టిలుంచు
  జనులు నేర్చు కొనరె జనకు ప్రేమ

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండవ పద్యం కూడా చాలా బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం కరుణరసాత్మకంగా చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘గవకు గంటె’ అన్నదానిని ‘గవను మించి’ అంటే?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
  ‘కోసం’ అని వ్యావహారిక పదాన్ని వ్రాసారు. ౩వ పాదంలో యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ....
  చేత బిడ్డ తోటి చేతిలో హేండిలు
  పట్టి తొక్కు చుండె పొట్ట కోసం
  కుప్ప తొట్టి కుళ్ళు కాల్వల్లొ పట్టిలుంచు
  జనులు నేర్చు కొనరె జనకు ప్రేమ

  రిప్లయితొలగించండి
 12. మూడు గాండ్ల రిక్ష మూల్గుచు లాగగ
  వెనుక జంట బేరం వీపున సుతుఁ
  తనదు కడుపు నిండు తనయుడు బాగుండు!
  రెక్క కదలి తొక్క డొక్క నిండు!

  రిప్లయితొలగించండి
 13. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  శ్రీమతి శైలజ గారి భావమునకు సరియైన పద్యము మీరు వ్రాసేరు. బాగుగనున్నది. ఆ పద్యములో కొన్ని గణభంగములు కనిపించుచున్నవి. టైపు పొరపాటులు కావచ్చు. సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. తన బ్రతుకు బిడ్డ పోషణ
  కనుటకు నతి దీన గాధ గాగ యొకనికిన్
  కనుపట్టె నొక్క కవికదె
  యనువగు వస్తువుగ కవిత నల్లుట కొరకై

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.
  కాపీ, పేస్ట్ లలో జరిగిన పొరపాటు వలన నా సవరణలోనూ శైలజ గారి పద్యమే వచ్చింది.. నేను సవరించిన పద్యం ఇది...
  చేత బిడ్డ మరొక చేతిలో హేండిలు
  పట్టి తొక్కు చుండె పొట్ట కొరకు
  కుప్ప తొట్టిలోన్ కుళ్ళు కాల్వల నుంచు
  జనులు నేర్చు కొనరె జనకు ప్రేమ.

  రిప్లయితొలగించండి
 16. అయ్యా! శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. మొదటి పాదములో యెరుగడు + ఎన్నడు - అని యడాగమము చేసేరు. అక్కడ ఉకార సంధి నిత్యముగా వచ్చును. అందుచేత ఆ పాదమును ఇలాగ మార్చుదాము:

  వచ్చు నెన్నడో యెరుగడైశ్వర్య లక్ష్మి - స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. మిత్రులారా!

  సమాసముల మధ్యలో వచ్చు రేఫయుత సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరము గురువా లఘువా అను సందేహము వచ్చునపుడు, ప్ర హ్రాదయః అనే ఒక సూత్రము ప్రకారము పూర్వ అక్షరమును తేలికగా పలికి లఘువుగా వాడుకొనవచ్చును, లేక ఊది పలికి గురువుగా నైనను వాడుకొనవచ్చును. ఇవి సమాసములకే పరిమితములు కాని పదముల మధ్యలోని అక్షరములకు అన్వయించకొనరాదు.

  ఉదా: సరస + ప్రక్రియ = సరసప్రక్రియలో ప్ర ముందున్న స గురువుగా నయినను లేక లఘువుగానైనను వాడుకొనవచ్చును.

  పరిశ్రమ మొదలైన విడి విడి పదములలో మధ్యనున్న శ్ర కి ముందునున్న రి విధిగా గురువే యగును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. పై శైలజ గారి పద్య సవరణలో ‘తొట్టిలోన్’ అన్నదాన్ని ‘తొట్టిలోన’ అని చదువుకొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 19. పుట్టెడు దు:ఖము నందున
  పట్టెడు మెతుకుల కొఱకని పాటు పడంగన్
  పుట్టిన బిడ్డను చేకొని
  చుట్టగ నూరంత దిరిగి చోద్యము గాదే ?

  చోద్యము = వింత , తోల దగినది

  రిప్లయితొలగించండి
 20. అక్కయ్యా,
  అబ్బ! ఎంత మంచి పద్యం వ్రాసారు! నిజంగా చాలా సంతోషంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 21. హమ్మయ్య శ్రమ పెట్ట నందుకు చాలా సంతోషంగా ఉంది..బోలెడు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 22. రక్షణ జేయగ బిడ్డను
  రిక్షా తొక్కెడి శ్రమికుని రెక్కల కష్టం
  రక్షించునతని బిడ్డను
  లక్షణమగు భవితనిచ్చి లాలించునయా

  రిప్లయితొలగించండి
 23. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మీరు పాత సమస్యలను కూడా పూరిస్తున్నారు. సంతోషం. తీరుబడిగా వాటిని పరిశీలిస్తాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 24. అయ్యా! శ్రీ బొడ్డు శంకరయ్య గారూ!
  మీ పద్యము బాగుగనున్నది. 2వ పాదము చివరలో కష్టం అనుట సాధు ప్రయోగము కాదు. కష్టము అని వాడవలెను. అందుచేత మీ పద్యమును ఈ విధముగ సరిచేసి వ్రాయుచున్నాను:

  రిక్షా త్రొక్కుచు తగు సం
  రక్షణ తన బిడ్డ కిడెడి శ్రామికు శ్రమయే
  రక్షించు నతని బిడ్డను
  లక్షణమగు భవిత నిచ్చి లాలించునయా!

  రిప్లయితొలగించండి
 25. బరువనక బాధ్యత యెడ బె
  దురు లేకుండ శ్రమియింపఁ దోడుగ నిలుచున్
  హరి యెల్లప్పుడు నతనికి
  వరములఁ గోరగ నిడుటకు పరుగిడి రాడే!

  రిప్లయితొలగించండి
 26. తప్పును తెలిపినందుకు నేమాని వారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 27. వందనీయులు శ్రీ కంది శంకరయ్య గారలకు నమస్కారములు,
  మీరు మా పాతపూరణలను కూడ వీక్షించుచున్నందులకు కృతజ్ఞతలు
  గౌరవనీయులు శ్రీ పండిత నేమాని గారలకు నమస్కారములు,
  మీరు సూచించిన సాధునియమం మరియు సవరణకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి