31, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1129 (మనము శాంతించు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

41 కామెంట్‌లు:

  1. సడలి బడలి ఇంటికి రావంగ
    మురిపెంగ గృహిణి సేద తీరనీయంగ
    మనంబున సంతోషమ్ము ఉరకలేయంగ,
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న!

    రిప్లయితొలగించండి
  2. వెలుగువచ్చిన చీకటి తొలుగునట్లు
    జ్ఞాన మార్జింప నజ్ఞానమంతరించు
    బుద్దిశుద్దమౌ సత్యమ్ము బోధపడును
    మనము శాంతించునెన్నొసమస్యలున్న!!!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. అకట! యభివృద్ధి పథమున నగు పురోగ
    మనము శాంతించు నెన్నొ సమస్యలున్న
    కనుక నా సమస్యల పరిష్కారములను
    పొందు నట్లొనరించుట ముఖ్యమగును

    రిప్లయితొలగించండి


  5. అయ్యా! శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. "తొలుగు" అను పదము సాధువు కదు. "తొలగు" అనవలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీపండిత నేమానిగారికి నమస్కారం.నా చీకటిని తొలగించిన మీకుధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ప్రతి దినమ్మును చాగంటి ప్రవచనమ్ము
    శ్రద్ధ తోడన వినినచో సకల జనుల
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న
    కల్ల గాదిది నిజమునే బల్కు చుంటి

    రిప్లయితొలగించండి
  8. భువనములకెల్ల ప్రభుడౌచు నవనివారి
    క్షేమమరయుచు రక్షణ చేయుచుండు
    తిరుమలేశుని దర్శించ నరుగుజనుల
    మనము శాంతించు నెన్నొ సమస్యలున్న.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ హ.వేం.స.నా.మూర్తి గారికి కృతజ్ఞతాభివందనములతో వారి బాటలోనే........

    భక్తిభావంబులెసఁగ సద్భావమలరఁ
    పరమ ధార్మిక భావముల్ నిరతముగను
    తలఁచి శ్రీశైల దర్శనార్థమున బ్రోవఁ
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు

    గురుదేవుల శిరిడీ యాత్ర శుభ ప్రధము కావాలని భగవంతుని ప్రార్థిస్తూ
    ======*=====
    ధనమున దొనరగ నశాంతి మునిగి దిరుగు
    ననిశము దురాశతో గ్రుంగు మనుజు లెల్ల
    పెనగొన ప్రకృతి బంధము ప్రీతి తోడ
    మనము శాంతించు,నెన్నొ సమస్య లున్న.

    ధనమునను బెరుగు నశాంతి ధరణి యందు
    వనమున ప్రియురాలి సరస భాషణ లకు
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న,
    ఘనమగు ధనము తోడను గరగి పోవు
    ( ఘనమగు ధనము=శాంతి )

    రిప్లయితొలగించండి
  11. తల్లి దండ్రుల మృదు బలుకులకు, పిల్లలు నిత్యమూ శాంతి పావురములై యుందురు.
    =========*==========
    కనుగొన సుఖ శాంతులు నేడు కష్టమందు
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న,
    జనకుల మృదు వచనముల ఝరులయందు
    మునుల కోపమ్ము ధరణిలో మునిగి పోవు.
    ( మునులు = శాంతిని గోరువారు )

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సుబ్బా రావు గారూ!
    శుభాశీస్సులు
    మీ పద్యములో భావమును పురస్కరించుకొని ఇలాగ సవరించేను:

    ప్రతి దినమ్మును సద్గురు ప్రవచనమ్ము
    శ్రద్ధ మీరగ వినినచో సకల జనుల
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న
    కల్ల కాదు నా పలుకు నిక్కమ్ము సుమ్ము
    అభినందనలు:

    శ్రీ హరివారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    తిరుమలేశుని యెడల భక్తిని గుప్పించేరు.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీరు శ్రీశైల వాసుని సేవలో మునిగేరు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు.

    శ్రీ వర ప్రసాద్ గారూ! శుభాశీస్సులు,
    మీ 2 పద్యములు వైవిధ్యముతో నలరారుచున్నవి అభినందనలు.

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  13. శ్రీమతి జిలేబి గారికి శుభాశీస్సులు.
    మీ భావ వైవిధ్యమునకు ఢోకా లేదు. మీరు పద్య విద్యలో ఎప్పుడు అడుగు పెడతారో అని చూస్తున్నాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    =======*=======
    4.దొనరగ మన దురితముల ద్రుంచు నట్టి
    కనక గిరులపై దిరిగెడి, కలియుగమున
    ధనపతి యగు తిరుమ లేశు గన జనుల
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమానిగురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో
    =======*=======
    5.శివ శివ యన వడి వడిగ జెంత జేరి
    భూరి వరములిచ్చు సకల భూత గణపు
    రాజు యగు చిదంబర నటరాజుని గన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.
    =========*=======
    6.అసమదీయులు ముంచిరి తసమ దీయు
    లనని వింత వింతలు జేసి,రట్టు దీసి
    చింత దీర్చు మయా బజార్ చిత్రము గన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

    రిప్లయితొలగించండి

  16. 7.భక్తులు శరణ మయ్యప్ప స్వామి శరణ
    మన్న,రాళ్లు పూలుగ మార్చి యాదు కొనుచు
    వరము లిచ్చెడి కరిమల వాసుని గన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.
    =========*========
    8.సకల జనుల సమస్యలు సంధి జేయు
    హస్తినాపుర మందున నమ్మను గన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న,
    కాంగ్రెసు కురు వీరుల కెల్ల కచ్చితముగ

    రిప్లయితొలగించండి
  17. శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు. భావ వైవిధ్యమును ప్రదర్శించుచు మీరు 8 పద్యములను వ్రాసేరు. అన్నియునుబాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:

    5వ పద్యములో: రాజు + అనగ = ఇక్కడ సంధి నిత్యము కావున రాజనగ అగును - యడాగమము రాదు.

    7వ పద్యము: అయ్యప్ప స్వామిలో స్వా కి ముందునున్న ప్ప కూడా గురువు అగును - అందుచేత గణభంగము.

    4 పద్యము: దొనరగ అనే పదము నా వద్దనున్న శబ్ద రత్నాకరములో లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీమతి జిలేబీ గారిభావానికి నాపద్యరూపము......

    పలుతెఱంగులనుద్యోగ బడలికలను
    మరువజేయంగ నేర్చిన మహిత మూర్తి
    పతిని సేవించునట్టి సద్భార్యవలన
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న.

    నేటికార్యాలయమ్మునందాటుపోట్లు
    ఘోర రహదారి పయనంబు గూర్చు నట్టి
    బాధ మరిపించి మురిపించు భార్య వలన
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్...

    కష్టములఁ ద్రోసి ముదమును ఘనముగాను
    బొందుచుండును నిలలోన మూర్ఖుఁ; డతని
    మనము శాంతించు నెన్నొ సమస్యలున్న
    మానవునిఁ జూచినప్పుడు మరల మరల!

    రిప్లయితొలగించండి

  20. 'కర్మ జేయుటే నరునకు గాని, ఫలము
    పైన సుంతయు నధికార బలము లేదు'
    కృష్ణ పరమాత్మ చెప్పిన గీత విన్న
    మనము, శాంతించు నెన్నో సమస్యలున్న.

    రిప్లయితొలగించండి
  21. చింత లేకుండ మనుజులు కొంతనైన
    సంతసమ్మున జీవించు జాడలేవి?
    దైవ చింతన చేసిన తక్షణమ్ము
    మనము శాంతించు నెన్నొ సమస్యలున్న!

    రిప్లయితొలగించండి
  22. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    జిలేబీ గారి భావములకు పద్యరూపమును కల్పించిన మీ ప్రయత్నము చాల బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో మూర్ఖుని లక్షణమును బాగుగా ఉటంకించినారు. పద్యము బాగుగనున్నది. అభినందనలు.

    శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    భజ గోవిందములో -- "భగవద్ గీతా కించిదధీతా" అని సెలవిచ్చేరు కదా. మీరు భగవద్గీతను గుర్తునకు తెచ్చేరు మీ పద్యములో - చాల బాగుగ నున్నది - అభినందనలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    దైవ చింతన యొక్క మంచి ఫలితమును మీరు మీ పద్యములో వినుతించేరు. చాల బాగుగ నున్నది. అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    తప్పులకు క్షమించగలరు.
    సవరణలతో
    4 పద్యము మొదటి పాదము
    "అది ఒనరగ, దొనరగ కాదండి "
    "అనిశము దురితములు ద్రుంచె డవనిజ పతి " గా మార్చు చున్నాను.
    ====*======
    4. అనిశము దురితములు ద్రుంచె డవనిజ పతి
    కనక గిరులపై దిరిగెడి, కలియుగమున
    ధనపతి యగు తిరుమ లేశు గన జనుల
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.
    7. భక్త జనులు జేరి శరణ పరమ పురుష
    యన్న,రాళ్లు పూలుగ మార్చి యాదు కొనుచు
    వరము లిచ్చెడి కరిమల వాసుని గన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.
    ======*=======
    9.గీతకు,గవుల సినిమా గీత ములకు,
    పాటలకు ప్రాణమును బోసి ఘంటసాల
    గాన గంధర్వుని మధుర గానము విన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    =======*======
    10. కష్టముల యందు సుఖములు గలవని మరి
    సుఖముల యందు కష్టము జూపు చున్న
    కడలి యలలను కనులుండి గాంచిన మన
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

    రిప్లయితొలగించండి
  25. కర్త కాను నే, సాక్షిగ కార్యములను
    భక్తి శ్రద్ధల జేసి విధ్యుక్తముగను కర్మ ఫలత్యాగ మొనరింప
    కలుగు సుఖము
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న

    రిప్లయితొలగించండి
  26. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    సవరణలు బాగుగ నున్నవి. క్రొత్త పద్యములు కూడా మంచి భావముతో అలరారుచున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. కర్త కాను నే, సాక్షిగ కార్యములను
    భక్తి శ్రద్ధల జేసి విధ్యుక్తముగను
    కర్మ ఫలత్యాగ మొనరింప కలుగు సుఖము
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న

    రిప్లయితొలగించండి
  28. నెగడు పొగలతో రేగుచు రగులు దిగులు
    మనము శాంతించు, ఎన్నో సమస్యలున్న
    బ్రతుకు విలసిల్లు దైవకృపా కటాక్ష
    వీక్షణము సోక పొగమంచు విడిన రీతి

    రిప్లయితొలగించండి
  29. శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు.
    మీరు ఆత్మ జ్ఞానమునకు సంబంధించిన విషయమును ఎత్తుకొన్నారు చాలా సంతోషము. అభినందనలు. కానీ మీ భావము చక్కగా వ్యక్తము కాలేదు. అన్వయ సౌలభ్యము లేదు. మొదట కర్తను కాను నేను సాక్షిని మాత్రమే అని ఆత్మ జ్ఞానమును చెప్పుచూ, తరువాత భక్తి శ్రద్ధలతో జేసి అనుటలో మళ్ళీ కర్తగ దర్శనమిచ్చుచున్నారు కదా.

    మీ ప్రయోగము "కర్మ ఫల త్యాగము"లో త్యా అనే అక్షరమునకు ముందున్న ల అనే అక్షరము గురువగును ; అందుచేత గణ భంగము.
    అందుచేత మీ భావమునకు నేను ఈ విధముగా పద్యరూపమును ఇచ్చేను. చూడండి:
    జ్ఞాన మార్గమునుంబూని జనుచునుండి
    కర్మ లొనరించుచును ఫలాకాంక్ష లేక
    ఆత్మ భావన తోడనే యలరు నెడల
    మనము శాంతించు నెన్నో సమస్య లున్న

    రిప్లయితొలగించండి
  30. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు.
    ఇది యంతయూ మీరు పెట్టిన భిక్ష
    తాత మనువలపై
    =======*========
    కనులు గాంచక నటు దిటు గలియ దిరుగ
    పెనగొని కరము లందించి ప్రీతి తోడ
    మనుమల పలుకరింపుకు మునిగి దేలి
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

    రిప్లయితొలగించండి
  31. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ 2వ పద్యములోని భావము చాల బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ మనుమల పలకరింపులు చాల బాగుగ నున్నది. పలకరింపుకు అనుట సాధువు కాదు. పలకరింపున(ల)కు అనుట సాధువు. అందుచేత కొంచెము సవరించుచు "పలకరింపుల" అందాము. సమాసములో పూర్వపదము చివరి ఉకార ఋకారములకు తరువాత వచ్చినపుడు నకు అని వాడవలెను అని వ్యాకరణ సూత్రము.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. పసిడి ముద్దుల నగవుల మిసిమి తనయ
    చేరి యొడి లోన కిలకిల చిలుక పలుకు
    యెదను పులకించి సంతస మొంది నంత
    మనము శాంతించు నెన్నొ సమస్య లున్న

    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. పందిత శ్రీ నేమాని గారికి,
    నమస్కారములు, మీరు చేసిన సవరణ
    చాల బాగుంది.కృతజ్ఞతలు.నేను సవరించిన
    పద్యమును పరిశీలింప ప్రార్ధన.

    కర్త భావనలేక సత్కార్యములను
    భక్తి శ్రద్ధల జేసి విధ్యుక్తముగను
    కర్మ ఫలము విడనాడ కలుగు సుఖము
    మనము శాంతించు నెన్నో సమస్యలున్న

    రిప్లయితొలగించండి
  35. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.3వ పాదములో యతి మైత్రి కొరకు ఆ పాదమును ఇలాగ మార్చండి:

    "చుండ పులకించి సంతస మొందినంత"

    శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు.
    మీరు సవరించిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పద్యము మొదటలో "కర్త భావన" కి బదులుగా "కర్తృ భావన" అని వాడుట సాధు ప్రయోగము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  36. శ్రీ తిమ్మాజీ రావు గారూ!
    మీ పద్యములో 3వ పాదములో చిన్న టైపు పొరపాటు కూడా దొరలినది. "ను" అను అక్షరమును జేర్చవలెను. ఆ పాదముగా ఇలాగ చదువుకొనవలెను:

    "కర్మ ఫలమును విడనాడ కలుగు సుఖము"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  37. మనమునందున భయమును మసలనీక
    నేది జరిగిన మనమంచికేననుచు
    ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
    మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న

    రిప్లయితొలగించండి
  38. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  39. ఆర్యా ! ధన్యవాదములు.
    నా పూరణలో జరిగిన అక్షర లోపమును సవరించుచూ....

    మనమునందున భయమును మసలనీక
    నేది జరిగిన మనమంచికేనననుచు
    ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
    మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న

    రిప్లయితొలగించండి