జిలేబి గారూ, ఛందోబద్ధంగా పద్యప్రవరలు చెప్పే ప్రవరులు ఎందరున్నా, వచనకవిత్వం వ్రాసే మీలాంటి మాయాప్రవరులే ‘క్రెడిట్’ కొట్టేస్తున్నారు. * ఆదిత్య గారూ, పువ్వుల నమ్ము పిల్ల పువ్వుల యమ్ము నాటిందా? మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వృత్త్యనుప్రాసతో మీ మొదటి పద్యం శోభిస్తున్నది. రెండవ పద్యం కూడా చాలా బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి. జిలేబి గారన్నట్టు ప్రవరులై ‘ఎవ్వతె వీవు’ అని పద్యాన్ని ఎత్తుకొనడం, నిండైన భావకవిత్వం... ఇవేవో నవయువకుడు వ్రాసిన పద్యాల్లా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు. * సుబ్బారావు గారూ, చదువ ముచ్చటైన పద్యం వ్రాసారు. అభినందనలు.
గోకుల బాలకా! విరుల కోరిన వాడవు దాగనేలరా? నీ కల కంఠి కన్నులను నిండిన రూపముఁ జూపవేలరా? లోకుల ముందు నన్నిటుల లోకువ జేయగ న్యాయమే? యదో! నే కనుగొంటి రమ్మిటకు, నీ శిరమందదొ పింఛమా పొదన్.
రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యం చివరి అక్షరం ‘న్’ అని ఉండవలసింది టైపాటు వల్ల ‘న’ అయింది. (అయ్యో, ఒక్క తప్పుకూడా లేదే అనుకున్నా, దొరికింది) * బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మంచి భావంతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. ‘గులాబీ, మనోహారీ’ అని దీర్ఘాంతాలుగా ఉండి గణదోషం ఏర్పడుతున్నది. బహుశా టైపాటు కావచ్చు. ‘పిలుపులు + ఆ’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘పిలుపులు నా / పిలుపులతో’ అనవచ్చు. లేదా మీరే ఏదైనా సవరణ సూచించండి. * లక్ష్మీదేవి గారూ, గోపిక మాటలుగా మీ పద్యం చక్కని ధారతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం ‘వయ్యారంగా’ ఉండి రంజింపజేస్తున్నది. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పద్యం శోభాయమానంగా ఉంది. అభినందనలు.
పండిత నేమాని వారూ, స్త్రీ శక్తి స్వరూపిణి అని నిరూపిస్తూ భక్తిభావంతో చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు. * మిస్సన్న గారూ, మనోజ్ఞ భావ విభవాస్పదమైన మంచి పద్యం చెప్పారు. అభినందనలు.,
రిప్లయితొలగించండిబ్లాగు కన్య వేచి ఉన్నది బుట్ట బట్టి
అయ్యలారా కామెంటు చెండులు కై
మీ పుష్ప పద్యములే తనకు ఈనాటి
సుగంధ భరిత దినారంభం శుభారంభం !!
జిలేబి
జిలేబి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నా బ్లాగుకన్య ‘వరూధిని’! ప్రవరుని జాడ చెప్పండి.
రిప్లయితొలగించండిశంకరయ్య గారు,
మీ బాలా గు కన్య వరూధిని కి ఒక్క ప్రవరాఖ్యుడు కాదండోయ్ ! 'స్కోరు' మీది ప్రవరలు చెప్పు ప్రవరాఖ్యులు గలరు
జిలేబి
రిప్లయితొలగించండినవ్వుల కన్నుదోయి మృదునర్తన చేయగ నిల్చి జూచు నీ
వెవ్వతవే?! విరించి నిను వీడ్కొని యుండగలంగినాడకో!
పువ్వులనమ్ముదానవటె పొమ్మది నమ్మను నా మనమ్ము నో
పువ్వుల యమ్ముదాన! సిగపువ్వుగ దాల్చి యనుగ్రహింపవే!
జిలేబి గారూ ! మమల్ని ప్రవరలుజెప్పు ప్రవరాఖ్యులను చేశారు. బాగుంది..
రిప్లయితొలగించండితలుపుల వద్దనె యున్నది
తలలో పూలున్న కన్య తలపుల లోనన్
వలపులు కనబడు, తానా
వల పూలమ్మంగ బోవ పయనంబాయెన్.
కలువ కన్నులు వెలుగొందు కమలవదన
రిప్లయితొలగించండిలలన సొగసైన పూల మాలలను గూర్చె
సరస హృదయాల రంజింపజాలు లీల
సొంపులవి జూడ నెవనికి సొమ్ము లగునొ?
ఎవ్వతెవీవు? ఫుల్లజలజేక్షణ! నీ వదనాంబుజంబునన్
రిప్లయితొలగించండినవ్వులె మించు పువ్వులను, నారికి గూర్చిన కామబాణమా?
జవ్వని వీవు, రమ్య సుమ సాయకముల్ కద నీ శుభేక్షణల్
మవ్వపు మేని సోయగపు మానిని! మా నవనాయికామణీ!
శ్రీ నేమాని వారు ప్రవరాఖ్యునిలా " ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ " లాంటి పద్యం చెప్పారు.. బాగుంది.
రిప్లయితొలగించండి'పూలమ్మి' నిలచి యున్నది
రిప్లయితొలగించండిపూలమ్మిక డబ్బు తేగ బుట్టను బట్టెన్
కాలమ్ము చెడెను జాగ్రత
గాలమ్ముల గని చనవలె గద మీనాక్షీ !
రిప్లయితొలగించండిసొగసు కన్నుల దోడన సొంపు మీఱి
ఎడమ చేతిని పూ బుట్ట యింపు గొ లుప
వలపు కన్నులు రమ్య మై వలపు లీ న
చూడ ముచ్చట గొలిపెను జూడు డార్య !
జిలేబి గారూ,
రిప్లయితొలగించండిఛందోబద్ధంగా పద్యప్రవరలు చెప్పే ప్రవరులు ఎందరున్నా, వచనకవిత్వం వ్రాసే మీలాంటి మాయాప్రవరులే ‘క్రెడిట్’ కొట్టేస్తున్నారు.
*
ఆదిత్య గారూ,
పువ్వుల నమ్ము పిల్ల పువ్వుల యమ్ము నాటిందా? మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వృత్త్యనుప్రాసతో మీ మొదటి పద్యం శోభిస్తున్నది. రెండవ పద్యం కూడా చాలా బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి. జిలేబి గారన్నట్టు ప్రవరులై ‘ఎవ్వతె వీవు’ అని పద్యాన్ని ఎత్తుకొనడం, నిండైన భావకవిత్వం... ఇవేవో నవయువకుడు వ్రాసిన పద్యాల్లా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
చదువ ముచ్చటైన పద్యం వ్రాసారు. అభినందనలు.
మిత్రులారా!
రిప్లయితొలగించండిపుష్పలావికపై ఈనాడు మంచి పద్యములే వెలువడినవి. అందరికి శుభాభినందనలు. శ్రీ ఆదిత్య గారి పద్యమే నా పద్యమునకు స్ఫూర్తి నిచ్చినది. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెల మాలల నల్లితి
రిప్లయితొలగించండివెల్లువగా వలపు జిలుకు విరజా జులనే !
నుల్లము ఝల్లనగ ప్రియులు
కొల్లలుగా దెచ్చి యుంటి కోరగ వనితల్ !
కాంతామణి పూ బుట్టను
రిప్లయితొలగించండికాంతులు విరజిమ్ము సంధ్య కాంతి వెలుగులో
శాంతముగా పట్టుకొనెను
సాంతము తను దైవపూజ సాగించుటకై!
కలువలు మల్లెలు చంపక
రిప్లయితొలగించండిములు మందారము గులాబీ మొల్లలు బంతుల్
కలరవముల పిలుపులు యా
లలిత మనోహారీ పుష్పలావిక సొబగుల్
గోకుల బాలకా! విరుల కోరిన వాడవు దాగనేలరా?
రిప్లయితొలగించండినీ కల కంఠి కన్నులను నిండిన రూపముఁ జూపవేలరా?
లోకుల ముందు నన్నిటుల లోకువ జేయగ న్యాయమే? యదో!
నే కనుగొంటి రమ్మిటకు, నీ శిరమందదొ పింఛమా పొదన్.
చారెడు మల్లెలను గలిపి
రిప్లయితొలగించండిమూరెడు దండలుగ గ్రుచ్చి ముందు నిలిచె వ
య్యారముగ పుష్పలావిక !
బేరము లాడుచు విరులను విరివిగ గొనుడీ !
బుట్టన మిగిలిన దండను
రిప్లయితొలగించండిజుట్టవె! జడచుట్టు భామ! సోయగ మదరన్!
పుట్టవె? వలపులు మదిలో
సొట్టల నీ బుగ్గ చిమ్ము శోభలఁ జిక్కన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెల తక్కువ రండు కొనగ
రిప్లయితొలగించండివలపులు విరియంగ సౌరు వాడని విరులన్ !
మలచును మిము మోద మలర
కలతలు తొలగించి మదిని కాంతుడు మెచ్చన
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యం చివరి అక్షరం ‘న్’ అని ఉండవలసింది టైపాటు వల్ల ‘న’ అయింది. (అయ్యో, ఒక్క తప్పుకూడా లేదే అనుకున్నా, దొరికింది)
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మంచి భావంతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
‘గులాబీ, మనోహారీ’ అని దీర్ఘాంతాలుగా ఉండి గణదోషం ఏర్పడుతున్నది. బహుశా టైపాటు కావచ్చు. ‘పిలుపులు + ఆ’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘పిలుపులు నా / పిలుపులతో’ అనవచ్చు. లేదా మీరే ఏదైనా సవరణ సూచించండి.
*
లక్ష్మీదేవి గారూ,
గోపిక మాటలుగా మీ పద్యం చక్కని ధారతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం ‘వయ్యారంగా’ ఉండి రంజింపజేస్తున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం శోభాయమానంగా ఉంది. అభినందనలు.
వయ్యారముగ పుష్పలావిక ! ఉంటే ..
రిప్లయితొలగించండిబేరము లాడుచు... యెందుకండీ .. బేరములాడక ...కొంటే ...
పూలమ్మెడు పూబోణీ!
రిప్లయితొలగించండిపూలకు బోణీల ముందు పో జాగ్రతగా !
పూలన్ భ్రమరమ్ములతో
పూలమ్ములు వేయు వీధి పోకిరి తోడన్.
అమ్మ లీలలు అనూహ్యములు కదా! పుష్ప లావిక రూపములో అమ్మయే దర్శనమిచ్చెనను భావనతో:
రిప్లయితొలగించండిభ్రమలన్ వీడుచు మన్మనోబ్జమున నంబా! కాంచితిన్ నీ స్వరూ
పము దేవేశి! మహామహాద్భుతము, సద్భక్తిన్ నినున్ గొల్తు నో
యమరేంద్రార్చిత పాదపద్మ! సుమమాలాలంకృతా! మందహా
సముఖీ! సర్వ జగద్విధాయిని! నమస్కారంబు పద్మేక్షణా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
పూల + అమ్ములు అన్నప్పుడు సంధి లేదు. పూలు + అమ్ములు అని సంధి చేయవచ్చు.
అవును కదా ! అంతకు ముందు ఒకసారి తొలగించాను
రిప్లయితొలగించండిఅబ్బే ! తప్పు లేకుండా రాస్టె దిష్టి తగులుతుంది మరి అందుకని
కల్వల మించు కన్నులును, కాముని తూపుల బోలు చూపులున్,
రిప్లయితొలగించండిచెల్వగు మేని సోయగపు శ్రీ విభవాస్పదమై తరించు నా
వల్వయు, లాస్య చంద్రికల భాసిలు దివ్య ముఖేందు బింబమున్!
చెల్వుడు పుష్ప లావికను జేరక నెచ్చట దాగెనో గదా!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిస్త్రీ శక్తి స్వరూపిణి అని నిరూపిస్తూ భక్తిభావంతో చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మనోజ్ఞ భావ విభవాస్పదమైన మంచి పద్యం చెప్పారు. అభినందనలు.,
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిప్రభవించిన హాసముతో
రిప్లయితొలగించండిప్రభలుగొలుపు ముఖపు వెలుగు వాకిట మెరవన్
అభిసారిక వలె చిన్నది
శుభాంగియై ప్రియునికొరకు జూచుచునుండెన్
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
మాస్టరు గారూ ..ధన్యవాదములు.. మీరు చూపిన సవరణతో...
రిప్లయితొలగించండిపూలమ్మెడు పూబోణీ!
పూలకు బోణీల ముందు పో జాగ్రతగా !
పూలన్ భ్రమరమ్ములతో
పూలవి అమ్ములను వేయు పోకిరి తోడన్.
శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో మెరవన్ అని వాడేరు. మెరయన్ అని అనుట సాధు ప్రయోగము. స్వస్తి.