బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యంలో కొన్ని సవరణలు అవసరం. ‘నాయకుల్ ఒసగ', ‘ వరుసన్ ఇవ్విధి' అనీ విసంధిగా వ్రాయకూడదు. అక్కడ ‘ నాయకోత్తము లిడన్’ ‘ వరుసన్ దప్పక'అందాం.
రిప్లయితొలగించువరదా వరదా అంటే
వరదల్లో ముంచే వయ్యా
కావు కావు మంటే
కాటికి నీ చోటికి పంపించే వయ్యా
జిలేబి
వరదై పొంగెను నదులే
రిప్లయితొలగించుబురదై రహదారులన్ని పొలములు మునిగెన్
చిరుతిండి గూడ దొరుకక
తిరుగాడెడు కష్టము కడతేరుచు వరదా !
వరదవలె పొంగి పొరలెడు
రిప్లయితొలగించుకరుణామృత పూర్ణహృదయ! కమలా హృదయే
శ్వర! వరద బాధితుల స
త్వరగతి బ్రోవంగ నిన్ను ప్రార్థింతు మదిన్
వరదై పొంగెను నదులే
రిప్లయితొలగించుబురదై రహదారులన్ని పొలములు మునిగెన్
చిరుతిండి గూడ దొరుకక
తిరుగాడెడు కష్టము కడతేర్చుము వరదా !
వరదలు వచ్చును నెప్పుడు
రిప్లయితొలగించువిరివిగ ప్రతి వత్సరమ్ము వేగము తోడన్
వరదలు వచ్చుట వలనన
తరుసంపద వృధ్ధి నొంది తగ్గు కలుషముల్
జిలేబీ గారూ,
రిప్లయితొలగించుమీ భావానికి నా పద్యరూపం.....
వరదా యని నిను బిలిచిన
వరదలలో ముంచుట యిటు భావ్యమ? మము బ్రో
వర దేవా యన నూరిని
పరేతభూమిగ నొనర్పఁ బాడియె నీకున్.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
వరదుని ప్రార్థించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘వచ్చును నెప్పుడు’ అన్నదాన్ని ‘వచ్చుచునుండును’ అనీ, ‘వలనన’ అన్నదాన్ని ‘వలననె’ అంటే బాగుంటుంది.
ఉరుములతో మెరుపులతో
రిప్లయితొలగించుకురిసెను భూలోకమందు గొప్పగ వానల్
మురిసెను జీవాలన్నియు
వరదలతో పరుగులెత్తె వాగులు వంకల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించువరువాత నెవెడలి గుడికి
రిప్లయితొలగించుపరమే శుని గొలిచి నంత పరమ ప్రీతిన్
కరుణే లేకను తానిటు
వరదలలో ముంచు టెంత భావ్యము తండ్రీ !
గంగను ప్రేమమీర తన కౌగిలి చేర్చ సిగన్ విదల్చె నా
రిప్లయితొలగించుజంగమదేవరుండు వివసత్వము నొందిన గంగ వేగయై
భంగమొనర్చె ఈ భువిని, పల్లెల, ప్రాణుల ముంపుచేయుచున్
జంగమ గంగ దూకుడును కట్టడి చేయుము జాతి కావగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించువఱదల్ వచ్చును వచ్చిపోవును కదా ప్రత్యబ్దమందున్ మహా
రిప్లయితొలగించువరదాతల్ మన నాయకుల్ ఒసగగా వాగ్దానముల్ వ్యాఖ్యలున్
వరదల్ పాలక వైరి పక్షములతో వాగ్దారలన్ ముంచుచున్
వరుసన్ ఇవ్విధ పాత క్రొత్తల అపూర్వంబైన సంయోగమే
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యంలో కొన్ని సవరణలు అవసరం. ‘నాయకుల్ ఒసగ', ‘ వరుసన్ ఇవ్విధి' అనీ విసంధిగా వ్రాయకూడదు. అక్కడ ‘ నాయకోత్తము లిడన్’ ‘ వరుసన్ దప్పక'అందాం.