వేదనాదములతో గోదావరీనది ....పావనమ్మొనరించు పత్తనమ్ము మంచి గాలియు నీరు మంచి యాహారమ్ము ....పుష్కలమ్ముగనుండు పురవరమ్ము విద్యాలయమ్ములు విజ్ఞాన సంస్థలు ....నాసుపత్రులు కలయట్టి నగరి వాణిజ్య కేంద్రాలు వాహన సౌకర్య ....ములు రాజకీయముల్ వెలయు సీమ భారతము తెనుగున వ్రాయబడిన తావు రాజరాజనరేంద్రాది రాజ ముఖ్యు లేలినట్టి పురమ్మది యెల్ల కళల కేంద్రమై యొప్పు రాజమహేంద్రవరము
రాజరాజ నరేంద్రు రాజ్యవైభవ దీప్తి ................నన్నయ ఘంటపు నవ్య మూర్తి సారంగధరు దీన చారిత్ర ఘటనలు ................చిత్రాంగి రత్నాంగి చిత్ర కథలు వీరేశలింగము నారీ సమాన్యత ................గోదావరీ నది గొప్ప నడత శ్రీపాద కృష్ణమూర్తి గ్రంధ మాలిక ................చిలకమర్తి యశస్సు శ్రీల చిలుక
కోటిలింగాల సన్నిధి గొప్ప వరము కళల కాణాచి కైతల కమ్మని రుచి చేరి చెడువాడు లేడను చెడని కీర్తి ఘనత రాజ మహేంద్రిదే కల్ల గాదు.
గలగల పారు దివ్య నది గౌతమి యొడ్డున గొప్ప దీక్షతో మిలమిలలాడు వెన్నెలలు మేలిమి జల్తరు వన్నె లీనగా జలజల జాలు వార తన చల్లని ఘంటము నుండి వాక్సుధల్ తొలికవి భారతాఖ్యమను తొల్లిటి కావ్యము చేసె నిచ్చటన్..
గోదావరి దరి నగరిది
రిప్లయితొలగించండిరాదారిది తెనుగు కావ్య రచనల పురికిన్
ఆదికవి భారతమ్మును
మోదముతో తెలుగులోన మొదలిడె నిచటే.
వేదనాదములతో గోదావరీనది
రిప్లయితొలగించండి....పావనమ్మొనరించు పత్తనమ్ము
మంచి గాలియు నీరు మంచి యాహారమ్ము
....పుష్కలమ్ముగనుండు పురవరమ్ము
విద్యాలయమ్ములు విజ్ఞాన సంస్థలు
....నాసుపత్రులు కలయట్టి నగరి
వాణిజ్య కేంద్రాలు వాహన సౌకర్య
....ములు రాజకీయముల్ వెలయు సీమ
భారతము తెనుగున వ్రాయబడిన తావు
రాజరాజనరేంద్రాది రాజ ముఖ్యు
లేలినట్టి పురమ్మది యెల్ల కళల
కేంద్రమై యొప్పు రాజమహేంద్రవరము
గోదావరి పుష్కరముల
రిప్లయితొలగించండినే దర్శించితి నదికతి నికటము నుండెన్
మోదమ్మందితి కవిజన
మా దారిని నడచి పోయి రంచను దలపున్.
రమ్య హర్మ్యాల విలసిల్లు రాజ మండ్రి
రిప్లయితొలగించండిచూడ చక్కని పురమది చూడ రండి
రాజ రాజ నరేంద్రుని రాజ్య మచట
రామ రాజ్యము పగిదిని రాణ కెక్కె .
రాజరాజ నరేంద్రుని రాజ ధాని
రిప్లయితొలగించండికావ్య పంటలు పండించు కవుల నెలవు
గౌతముని పేర నిలచిన గౌతమి నది
కోటి లింగాలు వెలసిన మేటి నగరు
రాజరాజ నరేంద్రు రాజ్యవైభవ దీప్తి
రిప్లయితొలగించండి................నన్నయ ఘంటపు నవ్య మూర్తి
సారంగధరు దీన చారిత్ర ఘటనలు
................చిత్రాంగి రత్నాంగి చిత్ర కథలు
వీరేశలింగము నారీ సమాన్యత
................గోదావరీ నది గొప్ప నడత
శ్రీపాద కృష్ణమూర్తి గ్రంధ మాలిక
................చిలకమర్తి యశస్సు శ్రీల చిలుక
కోటిలింగాల సన్నిధి గొప్ప వరము
కళల కాణాచి కైతల కమ్మని రుచి
చేరి చెడువాడు లేడను చెడని కీర్తి
ఘనత రాజ మహేంద్రిదే కల్ల గాదు.
గలగల పారు దివ్య నది గౌతమి యొడ్డున గొప్ప దీక్షతో
మిలమిలలాడు వెన్నెలలు మేలిమి జల్తరు వన్నె లీనగా
జలజల జాలు వార తన చల్లని ఘంటము నుండి వాక్సుధల్
తొలికవి భారతాఖ్యమను తొల్లిటి కావ్యము చేసె నిచ్చటన్..
తమ యూ రనగానే తన్మయముతో మిస్సన్న గారు వర్ణించిన రాజమహేంద్రి శోభాయమానముగా నుంది.
రిప్లయితొలగించండి'రాజమహేంద్రియె ' రమ్యము
రిప్లయితొలగించండివాజ గలుగు 'రాజమండ్రి ' పరనామంబున్
దేజస్సుల నోజమ్ముగ
'రాజమహేంద్రి నగరి ' యనరె రాజస మలరన్ !
రిప్లయితొలగించండిచిన్న సవరణతో...
రాజరాజ నరేంద్రు రాజ్యవైభవ దీప్తి
................నన్నయ ఘంటపు నవ్య మూర్తి
సారంగధరు దీన చారిత్ర ఘటనలు
................చిత్రాంగి రత్నాంగి చిత్ర కథలు
వీరేశలింగము నారీ సమాన్యత
................గోదావరీ నది గొప్ప నడత
శ్రీపాద కృష్ణమూర్తి గ్రంధ మాలిక
................చిలకమర్తి యశస్సు శ్రీల చిలుక
కోటిలింగాల సన్నిధి గొప్ప వరము
కళల కాణాచి కైతల కమ్మని రుచి
చేరి చెడువాడు లేడను చెడని కీర్తి
ఘనత రాజ మహేంద్రిదే కల్ల గాదు.
గలగల పారు దివ్య నది గౌతమి యొడ్డున రాణ్మహేంద్రిలో
మిలమిలలాడు వెన్నెలలు మేలిమి జల్తరు వన్నె లీనగా
జలజల జాలు వార తన చల్లని ఘంటము నుండి వాక్సుధల్
తొలికవి భారతాఖ్యమను తొల్లిటి కావ్యము చేసె దీక్షతో.
మూర్తి మిత్రమా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి