29, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1127 (పండుగనాఁ డేల నాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పండుగనాఁ డేల నాకు పాఁత మగఁ డనెన్.

20 కామెంట్‌లు:

 1. దండిగ చీరలు నగలే
  పండుగ నాఁ డేల నాకు పాతఁ మగఁ డనెన్
  పండిన మేనుకు మెరుపులు
  మెండుగ పూయించి పలికె మేలగు పతినౌ !

  రిప్లయితొలగించండి
 2. పేదఱికములో మ్రగ్గి మ్రగ్గి, చివరకు ధనవంతుఁడైనను, నగలు చేయించని భర్తతో భార్య...

  "మెండుగ సంపద లబ్బెను;
  దండిగ నగ లెన్నియైన ధరియింపఁ దగున్!
  దండుగసొ మ్మనఁగఁ దగదు;
  పండుగనాఁ డేల నాకుఁ బాఁత మగఁ?" డనెన్.

  రిప్లయితొలగించండి
 3. ఉండగ బట్టలు క్రొత్తవి
  పండుగ నాడేల నాకు పాత? మగడనెన్
  నిండగు మోదమునిడు నీ
  పండుగ మన పాలి పసిడి పండుగ రమణీ!

  రిప్లయితొలగించండి
 4. కవిమిత్రులకు నమస్కృతులు.
  రేపు మా బంధువులతో శిరిడీ యాత్రకు వెళ్తున్నాను. అయిదు రోజుల కార్యక్రమం.
  కానీ ప్రతిరోజూ పోస్టులు నిరాటంకంగా ప్రకటింపబడతాయి.
  గతంలో ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల, ఉన్నా అవి ఉదయం పది, పదిన్నర సమయంలో తెరవడం వల్ల పోస్టులు పెట్టడానికి ఇబ్బందిగా ఉండేది.
  బ్లాగులో ‘షెడ్యూల్’ అనే ఆప్షన్ ను నేనింతకాలం గమనించలేదు. దాని సహాయంతో పోస్టును సిద్ధం చేసి తేదీ, సమయం నిర్దేశిస్తే ఆరోజు అదే సమయానికి పోస్టు ప్రచురింపబడుతుంది. గత మూడు రోజులుగా ఈ పద్దతిలోనే ముందస్తుగా పోస్టులు పెడుతున్నాను. సఫల మయ్యాను.
  రాబోయే 5 రోజులకు ముందుగానే పోస్టులను సిద్దం చేసి తేదీ, సమయం నిర్దేశిస్తున్నాను. నా ప్రమేయం లేకుండా ప్రతిరోజూ పద్య రచన శీర్షిక ఉ. 5.30 గం.లకు, సమస్యాపూరణం ఉ. 6.00 గం.లకు ప్రకటింపబడతాయి.
  ప్రయాణంలో ఉండడం వల్ల మీ పూరణలను, పద్యాలను సమీక్షించలేను. దయచేసి ఈ అయిదు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసుకొనవలసిందిగా మనవి చేస్తున్నాను.
  పునర్దర్శనం ఆగస్ట్ 4, ఆదివారం నాడు.

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  పూర్వం ఎక్కడో ఒక వింత ఆచారం ఉండేదట !
  కార్తీక పౌర్ణమి నాడు ఊరంతా ఉత్సవాలు జరుపుకొన్న తరువాత
  స్త్రీలు తమ రవికెలను కుప్పగా పోసే వారట !
  ఆ కుప్ప నుండి పురుషులు రవికెలను తీసుకొనే వారట !
  ఏ పురుషునికైతే తన రవిక దొరికిందో
  ఆ పురుషునితోనే ఆ స్త్రీ ఆ రాత్రి సుఖించేదట !
  ఈ సామెత ఆ కథనుండి పుట్టిందే !

  *****
  అటువంటి పండుగ నాడు
  మగసిరి గల మగవాడు దొరుకుతాడని
  ఆశించిన ఒక యువతికి
  నపుంసకుడైన భర్త చేతికే తన రవిక దొరికినప్పుడు
  నిరాశతో
  "పండుగనాడు కూడా పాత మగడేనా " అని వాపోయిన వైనం :

  01)
  ______________________

  పండిన వెన్నెల రేయిని
  పండుగ సంబరము నందు - పండుడె దొరకన్
  పండిన సంతోషంబున
  పండుగనాఁ డేల నాకు - పాఁత మగఁ డనెన్.
  ______________________
  పండుడు = నపుంసకుడు
  పండు = ముగియు
  పండిన సంతోషంబు = నీరుగారిపోయిన ఆనందం(నిరాశ)

  రిప్లయితొలగించండి
 6. తన తొలి చిత్రములో విశేష ప్రజాదరణ పొందిన తార నిర్మాత, దర్శకులతో,

  రెండవ చిత్రము నందున
  మెండుగ ధన మిచ్చి సరస మేలగు నటుడిన్
  గండర గండడు దేవలె
  పండుగ నాఁ డేల నాకు 'పాతఁ మగఁ' డనెన్ .

  రిప్లయితొలగించండి
 7. మెండుగ గ్రొత్తవి యుండగ
  పండుగ నాడేల నాకు పాత, మగడనె న్
  నిండుగ నుండును నీ కవి
  దండలు మును గొన్నవాటి దాల్చుము మెడలోన్

  రిప్లయితొలగించండి
 8. గురుదేవులు నా తప్పులకు క్షమించగలరు
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

  కొన్ని తెలుగు సీరియళ్ళలో నాయికకు (చిన్నారి పెళ్లి కూతురు) క్రొత్త,పాత భర్తలు గలురు. ఇద్దరితో సంభాషణలు, కానుకలు ఇచ్చి పుచ్చు కోవటము జుపుచున్నారు.

  పాత భర్త స్పందన ఈ రీతిని
  ========*======
  మెండగు కానుక బంపితి
  పండుగ నాడేల నాకు ? పాత మగడనెన్
  గుండెలు మండుచు నుండగ
  బండగ నేనుండ గిట్టి బహుమతు లేలన్ !

  రిప్లయితొలగించండి
 9. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘పాత’ తర్వాత ఒక కామా పెడితే సుగమంగా ఉండేది.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అటువంటి సంప్రదాయం ఉండేదని నేనూ విన్నాను. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సరస మేలగు’...?
  *
  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘నేనుండగ + ఇట్టి = నేనుండగ నిట్టి’ అవుతుంది. సంధిలేదు. ‘బండగ నేనుండ నిట్టి...’ అందాం.

  రిప్లయితొలగించండి
 10. రెండుండ వాహనంబులు
  నిండాపదహారురాని నీపుత్రుండౌ
  పండరి కేలా క్రొత్తది
  పండగ నాడేలనాకు పాత? మగడనెన్!!!

  రిప్లయితొలగించండి
 11. రండో బాలకులారా!
  పండుగపై సామెతలను పలుకుండనుచున్
  పండితు డడుగగ నొక్కడు
  "పండుగనాడేల నాకు పాతమగడ"నెన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 12. పండుగ సందర్భమ్మున
  దండిగ సిరులున్నవాడు తన సతి తోడన్,
  "ఉండగ నూతన వస్త్రము
  పండుగ నాడేల నాకు పాత?" మగడనెన్.

  రిప్లయితొలగించండి
 13. గురువు గారూ ! ధన్యవాదములు. సరస అంటే ప్రక్కన , అనే అర్ధముతో వ్రాసానండి

  రిప్లయితొలగించండి
 14. వండిన పండుగ భక్ష్యము
  మెండుగ భుజియించి మంచమెక్కి పరుందన్
  కొండొక భర్తను గని సతి
  పండుగనాదేల నాకు పాత మొగుదనేన్

  రిప్లయితొలగించండి
 15. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారయణ మూర్తి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు వారూ,
  ఓహో.. ద్వితీయాలోపం చేసారా? బాగుంది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. "కొండంత బంగరుండగ
  పండుగనాఁ డేల నాకు?"; పాఁత మగఁ డనెన్:
  "మెండుగ నల్లధనమ్మిది
  కుండలలోదాచి పెట్టు కోరిక తీరన్"

  రిప్లయితొలగించండి


 17. చెండులు విసిరెడి వేళన
  నిండగు పున్నమి సమయము నిమ్మళముగనన్
  గండర గండడిని గనుచు
  పండుగనాఁ డేల నాకు పాఁత మగఁ డనెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. "వండుచు పాయస మత్తకు,...
  మెండుగ సుగరున్నదనుచు మిరియాల్ చారున్
  కొండొక కుక్కల బిస్కటు
  పండుగనాఁ డేల, నాకు?";
  పాఁత మగఁ డనెన్

  రిప్లయితొలగించండి