12, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1110 (కాంతాలోలుండె మోక్షగామి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.

24 కామెంట్‌లు:

 1. సుంతయును బంధ ముంచక,
  యంతయు బ్రహ్మమ్మటంచు, నందె మనమ్మున్
  జింతింప నిలుపు, నిర్వృతి
  కాంతా లోలుండె మోక్షగామి యనఁ దగున్.

  రిప్లయితొలగించండి

 2. ఇద్దరి కి ఇరుకైన దారి తావుంటే ఆతండు లేడు
  ఆతండు ఉంటే తా లేడు,ప్రేమ బాట పూబాట
  పరమాత్మ బాట ఒక్కండే ఒక్కండై ఏ
  కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.

  రిప్లయితొలగించండి

 3. కాంతా పుత్రులు గల్గియు
  సుంతయు లంపటము లేమి సుజ్ఞాని యిలన్!
  వింతయె? సంసారియె, మరి
  కాంతా లోలుండె, మోక్షగామి యనఁ దగున్.

  రిప్లయితొలగించండి

 4. భ్రాంతి తగదు, సంసారికె
  యెంతేనియు వీలు మూడు ఋణముల దీర్పన్,
  చింతింపకు మన, విను నిజ
  కాంతా లోలుండె, మోక్షగామి యనఁ దగున్.

  రిప్లయితొలగించండి
 5. కాంతల చుట్టును దిరుగును
  కాంతా లోలుండె, మోక్ష గామి యనదగున్
  ఆంతర్యం బున శివునిడి
  కాంతలకుం దూ రమగుచు గడిపెడు వానిన్ .

  రిప్లయితొలగించండి
 6. అంతములేని భువనము నొ
  కింత మధురసము హృదయసఖి యధరము మనః
  శాంతిని చవిజూచు అమర
  కాంతాలోలుడె మోక్షగామియనవలెన్

  రిప్లయితొలగించండి
 7. కాంతా విరతులు గావలె
  శాంతిని పొందుటకు నంచు సంగము వీడన్
  వింతయె బ్రహ్మము నెరిగిన
  కాంతా లోలుండె మోక్షగామి యనఁ దగున్.

  రిప్లయితొలగించండి
 8. చింతింపక హరి నెపుడున్
  సొంతంబెటులౌ నుముక్తి? సంతత హరినే
  చింతింపగ మది యందే
  కాంతా లోలుండె మోక్షగామి యనఁ దగున్.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  =====*=======
  అంతయు తానై యుండిన,
  వింతగ పంతములు జేయు వేదాంతునినిన్
  దంతి వరదుని గనిన శ్రీ
  కాంతాలోలుండె,మోక్షగామి యనఁ దగున్

  రిప్లయితొలగించండి
 10. జిలేబీ గారికి ధన్యవాదములతో,

  స్వాంతమున జ్ఞాన మలరగ
  ధ్వాంతము దాఁ బాసి పాసి ద్వంద్వము దొలగున్
  శాంతము చిత్త మమర నే
  కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.

  రిప్లయితొలగించండి
 11. చింతలఁ దూరమొనర్చి య
  నంతునిపై ధ్యాసఁగల్గి యానందమునన్
  గంతులు వేసెడి నిర్వృతి
  కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.

  రిప్లయితొలగించండి
 12. శాంతము వీడక, నాదను
  చింతలఁ జిక్కక నిరతము శ్రీహరి పాదా
  క్రాంతుండయిన-- విమోచన
  కాంతాలోలుండె- మోక్షగామి యనఁదగున్

  రిప్లయితొలగించండి
 13. శాంతి స్తానము సతియని
  కాంతా లోలుండె మోక్ష గామి యనఁ దగున్ !
  భ్రాంతిని పెడదారి బడక
  దాంతిగ తానుండు భర్త దామోదరుడౌ !

  దాంతి = ఒర్పు , నిగ్రహము

  రిప్లయితొలగించండి
 14. intula nevarini gOraka
  shAnti sukhambulanubonda samsArambun
  santasamuna jemsedu kula
  kAnta lOlunDe mOksha gAmi yanadagun

  రిప్లయితొలగించండి

 15. బొడ్డు శంకరయ్య గారి పూరణ......

  ఇంతుల నెవరిని గోరక
  శాంతి సుఖంబులనుబొంద సంసారంబున్
  సంతసమున జేసెడు కుల
  కాంతలోలుండె మోక్షగామి యనదగున్

  రిప్లయితొలగించండి
 16. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  అయితే నిఘంటువులలో ‘నిర్వృతి = సుఖము, ఊఱట, నాశము, చావు’ అనీ, ‘నిర్వృత్తి = సంతోశము, మోక్షము’ అనీ అర్థాలున్నాయి. మీ పూరణ భావాన్ని గమనిస్తే రెండవ అర్థాన్నే గ్రహించారనిపిస్తున్నది.
  *
  జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
  గన్నవరపు వారు మీ భావంతో స్ఫూర్తిని పొందినట్టున్నారు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  ఆదిత్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘వేదాంతున్, వేదాంతుని, వేదాంతునిన్’ అనవచ్చు... మీరు ‘వేదాంతునినిన్’ అన్నారు. అక్కడ ‘వేదాంతవిదున్’ అంటే సరిపోతుందనుకుంటాను.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. అంతిమ మానవ జన్మము
  చింతలు కడు వంతలున్న చెలి నగవులతో
  కాంతుని జేరిన నిర్మల
  కాంతా లోలుండె మోక్షగామి యనదగున్ .

  రిప్లయితొలగించండి
 18. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. నమస్కారములు
  నా ఈ పద్యములో దోషాలున్నాయా ? మరి సరిజేయ లేదెందు కని ? బహుస గురువులు మర్చి పోయారను కుంటాను

  రిప్లయితొలగించండి
 20. అక్కయ్యా,
  దోషాలుంటే అప్పుడే చెప్పేవాణ్ణి కదా.. మీ రన్నాక చూస్తే .. స్థానమును స్తానము అన్నారు... అంతే...

  రిప్లయితొలగించండి
 21. ఆహా ....దోషం ......లేకపోతే ....ఫ్ఛ్ ! పద్యమే .....కాదు
  ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 22. చింతలు హెచ్చగ మదిలో
  శాంతియు సౌఖ్యమ్ము లేక సంసారములో
  భ్రాంతుల తొలగించెడి నిజ
  కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్

  రిప్లయితొలగించండి


 23. వింతైన జీవితంబిది!
  చింతన జేయ చితికేగు చితికెడి బతుకున్
  శాంతము గానన్ నిర్వృతి
  కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. కాంతా!,...లజ్జను వీడుచు,
  కాంతా!,...సంసారమందు గగ్గోలులలో,
  కాంతా!,.. ఆ పరమేశ్వర,
  కాంతా!,...లోలుండె మోక్షగామి యనఁదగున్

  రిప్లయితొలగించండి