5, జులై 2013, శుక్రవారం

పద్య రచన – 393 (విందు)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. విందొక్కరికేనా యిది
  సందిగ్ధము తినగ నొకరు సాధ్యంబగునే
  ఇందలి ఖాద్యములన్నీ
  అందరికిని పంచవలయు నదియే మేలౌ

  రిప్లయితొలగించండి
 2. అతి విశాలంబగు నరటాకుపై నొప్పు
  ....నవిగొ భక్ష్యములు భోజ్యములు చాల
  మధుర పదార్థముల్ మంచి వాసనలతో
  ....నోరూర జేసెడి తీరులోన
  కాజాలు లడ్డూలు కజ్జికాయలు పాల
  ....కోవాలు మరి రసకోరలాది
  పెండ్లి విందున కేని వింత ప్రదర్శన
  ....కేని నారీతిగా నేర్పరచిరి
  ఔర మధుమేహ జీవుల కదియె విషము
  నహహ ఆరోగ్యవంతుల కమృత సమము
  వేగ తినరండు లొట్టలు వేసికొనుచు
  నంబరమునంటు మిక్కిలి సంబరముగ

  రిప్లయితొలగించండి

 3. అన్నము కొద్దిగ నున్నది
  యెన్నెన్నో స్వీట్లతోడనెంతరిటాకో !
  ఇన్నియు తినునాయొక్కడు?
  గిన్నిస్ బుక్కెక్కు వారికీ సా' పాట్లా" !

  రిప్లయితొలగించండి
 4. తీపి యనినచో మొగము మొత్తెనివి చూడ
  నిన్ని మధుర పదార్థములెన్ని, యెన్ని!
  యొక్క రికి వడ్డననుఁ జేయనొప్పునె యిటు
  ల! తిను వారెవ్వరును లేరు ; లాభమేమి?

  రిప్లయితొలగించండి
 5. చూడు పొడుగాటి విస్తరి చోద్య మయ్యె
  రకరకంబుల తీపులు రమ్యముగను
  చూడ కనువిందు నొడ గూర్చె చూచు కొలది
  ఆలసింపక రండిక యాహరించ .

  రిప్లయితొలగించండి
 6. బ్లాగు సోదర సోదరీ మణులకు నమస్కారములతో వ్రాయునది .. మన గురువులు శ్రీ శంకరయ్య గారు
  గ్రామాం తరమునకు ప్రయాణమై వెళ్ళు చున్నారుట . రేపు ఉదయము వచ్చుదురట . ఈ విషయము
  బ్లాగు నకు తెలియ జేయవలసినదని నాకు యిప్పుడే మెసేజి పంపిరి . గమనించ ప్రార్ధన .

  రిప్లయితొలగించండి
 7. అరటాకున గనపడె రుచి
  కరమౌపలురకములు శుచికరముగ,వైద్యుల్
  పరిపరివిధములనుడివిరి
  సరిపడదని తీపివిందు ;శంకర తిననా ?

  రిప్లయితొలగించండి
 8. విందది వింతగ నున్నది
  వందల మందికి సరియగు వంట లనంగా !
  ముందుగ తినెదము రండుప
  పసందుగ నుండును గదమరి శాకములన్నీ !

  రిప్లయితొలగించండి
 9. సకుటుంబ సపరివారము
  నొకరింటికి విందుకేగ నుచితంబని వా
  రొకరొకరిని విడఁదీయక
  నొకటే యరిటాకు వేసి యూరించిరటుల్!

  రిప్లయితొలగించండి
 10. ‘రుచి’కరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  మంద పీతాంబర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  సహదేవుడు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. ఆ.వె:
  అన్ని రకములైన యాహారమును జూడ
  అరటి యాకునందు నమరియుండె
  భూమి పైన నున్న భోజన ప్రియులకు
  అన్నియు లభియించు నారగించ !

  రిప్లయితొలగించండి
 12. ఆ. వె.
  తీపి వంటకాలు తీరైన ఘుమఘుమ
  మన సమూహమంత మనసు పడియె
  కనుల విందుగాని కదలిరావెట్టుల
  కవుల పద్యములును కరము తీపి!!

  రిప్లయితొలగించండి