8, జులై 2013, సోమవారం

పద్య రచన – 396 (కుశల ప్రశ్నలు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“కుశల ప్రశ్నలు”

15 కామెంట్‌లు:

  1. మనిషి కలిసినపుడు మనమేల మొదటని
    పలుకరించకుంట పరమ తప్పు
    మనసు తేలికగును మమతలు పెంపొందు
    కుశలమడుగ మిగుల కూర్మి పెర్గు.

    రిప్లయితొలగించండి
  2. మనిషి కలిసినపుడు మనమేల మొదటని
    పలుకరించకుంట పరమ తప్పు
    మనసు తేలికగును మమతలు పెంపొందు
    కుశలమడుగ మిగుల కూరిమొదవు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో -- (1) పలుకరించకుంట, (2) పరమతప్పు, (3) కూరిమొదవు అనే ప్రయోగములను పరిశీలించి మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. బాల్య మిత్రుడేనియు నాప్త బంధువేని
    నెదురుపడ పల్కరించుచు నెడద నెడద
    జేర్చి కుశల ప్రశ్నలు వేసి చిత్త మలర
    ముచ్చటించు కొనెడు తీరు ముదము గూర్చు

    రిప్లయితొలగించండి
  5. ఒకరు నొకరికి నెదురైన నుత్సహించి
    కుశల ప్రశ్నలు వేయుచు కౌతుకమున
    వ్యావహారిక విషయముల్ బదిలముగను
    మాట లాడుదు రయ్యెడ మైమ ఱచుచు .

    రిప్లయితొలగించండి
  6. కుశల ప్రశ్నలు వేయక కుత్సితంపు
    మతిని గొప్పలు పోవును మందబుద్ధి
    ముద్దుగా నగుమోముతో ముచ్చటించు
    పూర్వభాషిని ప్రేమించు పుర జనాళి!

    రిప్లయితొలగించండి

  7. సరదాగా ఈ పద్యం వ్రాశాను.
    పెద్దలు అన్యథా భావించ వద్దని మనవి.

    చెప్పెద నిచట బలిపీఠ చిత్ర గీతి
    కుశలమా నీకు ప్రియతమా కుశల మేన
    మనసు నిలుపుకో లేకంటి మరల మరల
    అంతియే అంతియే కాస్త చింత యాయె.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కుశల ప్రశ్నలపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని వారు ప్రస్తావించిన దోషాలను గమనించారు కదా! నా సవరణలతో మీ పద్యం......
    మనిషి కలిసినపుడు మనమేల మొదటనే
    పలుకరించుట యనవలదు సుమ్ము!
    మనసు తేలిక యగు మమతలు పెంపొందు
    కుశలమడుగ మిగుల కూర్మి పెరుగు
    . *
    పండిత నేమాని వారూ,
    ముదము గూర్చెడి కుశలప్రశ్నల గురించి చక్కగా తెలిపారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘కుశల ప్రశ్నలు వేయుచు కుతుక మెసగ/ కోర్కె పెరుగ’ అందాం.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ముందు నవ్వి, వెనుక వెక్కిరించే వారిని గురించి చక్కగా చెప్పారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘బలిపీఠం’ చిత్రంలోని ఆ పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి. దానిని గుర్తు చేస్తూ, ఆ భావం చెడకుండా పద్యబద్ధం చేసారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. రామచంద్రుడు జనులను పలుకరించు విధము గనుడు


    కాంచినంతనె రాముఁడు ఘనగుణాఢ్యు
    డౌత పలుకరించెడువాడు డంబమించు
    కయును లేని యుత్తముడట, కనిన వారు
    వ్రాసి యున్నారు నడవడి బాగనుచును.

    రిప్లయితొలగించండి
  10. కుశల మడిగెను కోమలి కొసరి కొసరి
    శశిని మించిన యందము వశము కాగ
    ముదము నొందుచు మదినిండ మోద మలర
    కుశల మంటిని కనుసైగ కోరి తెలిపి

    రిప్లయితొలగించండి
  11. అతిథి యరుదెంచ గృహమున కాదరముగ
    వారి కెదురేగి బాగుగా స్వాగతించి
    అడిగి కుశల ప్రశ్నలు వేసి యాసన మిడి
    గౌరవింతు రట్లు భరత ఖండమందు

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    అతిథిమర్యాదను గురించి చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. వచ్చితివా బావ! బాగుగా జరిగెనా
    ....నీ ప్రయాణంబెల్ల నిన్న నేడు
    మనవారలౌ నత్త మామయు బావలు
    ....వదినెలు పిల్లలు భద్రము కద
    అత్తయు మామయు నారోగ్యవంతులై
    ....యుండిరే సుఖముగా నూరిలోన
    పిల్ల లెల్లరు పట్టు వీడక శ్రద్ధగా
    ....చదువుచుండిరె మహోత్సాహ మలర
    అనుచు కుశల ప్రశ్నల వేసి ఆదరమున
    మనసు మనసును కలుపుచు మాటలాడి
    సకల మర్యాద లొనరించి సాయపడెడు
    వారి మేల్ మరతురొక్కొ యెవ్వారునేని?

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకర గురువర్యులకు, శ్రీ నేమానివారికి ...దోష సవరణలు చేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

  15. నిను కోరి రామా, మా తల్లి ఏమి తపము జేసెనో
    నిను వీడి రామా,మా తల్లి ఎటుల జీవించెనో
    మా తల్లి ఏమి జేసె నని విడనాడితివి, ఈ లవ
    కుశల ప్రశ్నల కి జవాబులెవ్వి ? పలుకుము రామా !

    జిలేబి

    రిప్లయితొలగించండి