11, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1109 (చచ్చినవాఁ డాగ్రహించి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

31 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  నేనింకా ప్రయాణంలోనే ఉన్నాను. ఈరోజు స్వస్థలం చేరుకోవచ్చు.
  దయచేసి పూరణల, పద్యాల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 2. అచ్చపు తత్వజ్ఞానము
  నెచ్చెలికానిమహిమ మదిని నిలిపి యా వి
  వ్వచ్చుడు రాగద్వేషము
  చచ్చినవాడాగ్రహించి శత్రువుగూల్చెన్

  రిప్లయితొలగించండి
 3. ఆదిత్య గారూ,
  'రాగద్వేషాలు చచ్చివాడు' అని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. హెచ్చిన విషాదమున తా
  నిచ్చగఁ జరియించి కౌరవేంద్రాదితతిన్
  పుచ్చెనెమపురికి, పుత్రుడు
  చచ్చినవాఁడాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

  పుచ్చెను = పంపెను
  పుత్రుడు చచ్చిన వాడు = అర్జునుడు ( పుత్రుడు అభిమన్యుడు )

  రిప్లయితొలగించండి
 5. తుచ్చపు కోరిక లతనిని
  మచ్చిక చేయగ మనసున మగటిమి చచ్చెన్
  రెచ్చిన రోషము తోడను
  చచ్చిన వాడాగ్రహించి శత్రువు గూల్చెన్


  రిప్లయితొలగించండి
 6. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  'పుచ్చెను + ఎమపురికి' అన్నారు. 'ఎమపురి' ఎక్కడిది? ఆ పాదాన్ని ఇలా సవరిద్దాం.....
  'పుచ్చెను యమపురికి సుతుడు/ చచ్చిన.....'

  రిప్లయితొలగించండి
 7. 'శీనా' శ్రీనివాస్ గారూ,
  'మగటిమి చచ్చినవాడు' అంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. బొబ్బిలి యుద్ధములోని అంశము

  వచ్చెను పాపారాయుడు
  చెచ్చెర సమరస్థలికి నిశిన్ గడు కసితో
  నచ్చట నకట విచక్షణ
  చచ్చిన వాడాగ్రహించి శత్రువు గూల్చెన్

  రిప్లయితొలగించండి
 9. గురువుగారికి నమస్సులు.

  సంధి చేసే క్రమములో చేసిన తప్పిదము. సవరించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. విచ్చల విడిగా ద్రాగెను
  చచ్చిన వాడా,గ్ర హించి శత్రువు గూల్చెన్
  అచ్చమ దెలుగిం టి వనిత
  ఉచ్చును బిగియించి, వేసి నోముగ శరమున్

  రిప్లయితొలగించండి
 11. హెచ్చిన సహనము తోడుత
  వచ్చియు భీముఁ డని సేయ, బార్హద్రథుఁ డా
  రచ్చను దిట్టఁగ, నోపిక
  చచ్చినవాఁ డాగ్రహించి, శత్రువుఁ గూల్చెన్.

  (బార్హద్రథుఁడు=బృహద్రథుని కుమారుఁడు>జరాసంధుఁడు)

  రిప్లయితొలగించండి
 12. పండిత నే మాని వారూ,
  'విచక్షణ చచ్చినవాడు' అంటూ చేసిన మీ పూరణ చాలా బాగుంది.అభినందనలు.
  *
  సుబ్బారావిు గారూ,
  విరుపుతో మంచి పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  'ఓపిక చచ్చినవాడి' గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. అచ్చపు జీకటి యందున
  చచ్చుచు బుట్టెడి జగతిని సాజమె యైనన్
  మచ్చరము తోన పరులను
  చచ్చిన వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్ !

  రిప్లయితొలగించండి
 14. kavulandariki namaskaramulu,

  nocchiyunu keedu jeyadu
  saccharitudu shatruvaina sandhi dorikinan
  kaccha biginchi vivekamu
  chacchinavadagrahinchi shatruvu goolchun

  chinna prayatnamu
  tappulunte manninchagalaru.
  Boddu Shankar, Bhiwandi, Maharashtra.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ బొడ్డు శంకరయ్య గారి పూరణ చాలా బాగుగ నున్నది - మంచి నీతిబోధకముగా నలరారుచున్నది. వారికి శుభాభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. ఇచ్చకపు మాటలాడుచు
  నెచ్చెలియెడ వర్తిలు కడు నీచుని యన్నల్
  మెచ్చెడు రీతిని- సహనము
  చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

  రిప్లయితొలగించండి
 17. బొడ్డు శంకరయ్య గారి పూరణ.......
  కవులందరికి నమస్కారములు,

  నొచ్చియును కీడు జేయడు
  సచ్చరితుడు శత్రువైన సంధి దొరికినన్
  కచ్చ బిగించి వివేకము
  చచ్చినవా డాగ్రహించి శత్రువు గూల్చున్

  చిన్న ప్రయత్నము
  తప్పులుంటే మన్నించగలరు.
  బొడ్డు శంకర్, భివాండి, మహారాష్ట్ర.

  రిప్లయితొలగించండి
 18. హమ్మయ్య, ఎట్టకేలకు ఇల్లు చేరుకున్నాను. మళ్ళీ కంటినిండుగా బ్లాగు చూసి, ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు పెట్టే అవకాశం దొరికింది. అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ చూడగానే ‘అచ్చపు జీకటిం బడి గృహవ్రతులై...’ అన్న పోతన గారి పద్యం గుర్తుకు వచ్చింది.
  మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే... కానీ భావం సందిగ్ధంగా ఉన్నట్టు అనిపిస్తున్నది.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సంధి దొరికినన్’ అనడం కంటే ‘సంధి కుదిరినన్’ అంటే బాగుంటుందేమో!
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. మచ్చిక జేయుచు చెలి నటు
  నుచ్చులు బిగియించి కసిగ నూహల యందున్
  హెచ్చగు నాశలు మీరగ
  చచ్చిన వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్ !

  హమ్మయ్య .గురువుల సవరణకు ఎంతో బోలెడు సంతోషం. ఎవరూ సరిజేయక పోతే తప్పులు తెలియక రాయ బుద్ధి వేయదు
  ఇక నా మొదటి పద్యం
  చస్తూ పుడుతూ ఉండటం నిజమని తెలిసినా ద్వేషంతో జనులు చచ్చి కుడా కక్ష తో సాధిస్తూ ఉంటారని నాభావం అదన్నమాట అసల్ సంగతి

  రిప్లయితొలగించండి
 21. వచ్చి తన పొట్ట కూటికి,
  ఇచ్చట గల వానిని అవహేళన సలుపన్ -
  గ్రుచ్చుకొని బాధ గుండెకు
  చచ్చినవా డాగ్రహించి శత్రువు గూల్చెన్!

  రిప్లయితొలగించండి
 22. చచ్చిన హీరో గారే
  వచ్చిరి ’ఈగై’ తెగించి పగసాధించెన్
  మెచ్చిన ప్రేక్షకు లిట్లనె
  "చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్"

  రిప్లయితొలగించండి
 23. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  చదువరి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "ప్రేక్షకు లని రిటు" అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 24. మెచ్చెడు రీతిగ రైతే
  పచ్చని పైరేమొ పెంచ, పండెడు వేళన్
  వచ్చిన తెగులున మొక్కలు
  చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

  రిప్లయితొలగించండి
 25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. సవరణతో
  నొచ్చియును గీడు సేయడు
  సచ్చరితుడు ధర్మమెరిగి శత్రువుకైనన్
  కచ్చబిగించి వివేకము
  చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

  రిప్లయితొలగించండి
 27. బొడ్డు శంకరయ్య గారూ,
  సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. చచ్చెను వాడని యెంచుచు
  ముచ్చట మురిపెమ్ము తోడ ముదముగ నుండన్
  కుచ్చితమున భూతమ్మై
  చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్


  ...Julius Caesar, Hamlet, Macbeth etc

  రిప్లయితొలగించండి


 29. పిచ్చో డా! మా ట్లాడ
  న్నచ్చొచ్చనివాడ! యాచనకుడా! యనుచున్
  గుచ్చన్ పెట్రేగుచు "వా
  చచ్చిన" వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 30. కుచ్చితపు బుద్ధి గైకొని
  రచ్చకు నీడ్చుచు చిదంబరయ్యను ఖుషినిన్
  కచ్చను తీర్చగ నోపిక
  చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్

  రిప్లయితొలగించండి