అత్తలు పూర్వమ్ము పెత్తనమ్ము వహించి ....సౌమనస్యము లేక సమత లేక కోడరికమనెడు పాడు సంస్కృతి బూని ....హింసించుచుండిరి హేయముగను ఆ కాలములలోన అత్తయే లేకున్న ....సర్వ స్వతంత్రమౌ సరణిలోన నలరారుచుండె కోడలు చూడ నామెయే ....యుత్తమురాలుగా నొప్పుచుండె కాని నేడు మారె కాలమ్ముతో బాటు మంచి మనసు తోడ మగువలెల్ల నొకరి యందు నొక్కరొప్పగు ప్రేమతో మెలగుచుండిరి కద మేలు మేలు
లక్ష్మీదేవి గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. సీసము నాల్గవ పాదంలో గణదోషం. ఇలా అందాం. కాలమిట్టుల మారె కర్మఫలమదేమొ గాని కొడుకు కేది గతియొ సుమ్ము * పండిత నేమాని వారూ, మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.
అత్త లేని కోడలుత్తమురాలంచు
రిప్లయితొలగించండిపేరు గాంచె భువిని; ప్రియము తోడ
యింటి పేరు నిలుప నిచ్ఛ గలిగియున్న
కోడలైన- యత్త నీడ కోరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅత్తలు పూర్వమ్ము పెత్తనమ్ము వహించి
రిప్లయితొలగించండి....సౌమనస్యము లేక సమత లేక
కోడరికమనెడు పాడు సంస్కృతి బూని
....హింసించుచుండిరి హేయముగను
ఆ కాలములలోన అత్తయే లేకున్న
....సర్వ స్వతంత్రమౌ సరణిలోన
నలరారుచుండె కోడలు చూడ నామెయే
....యుత్తమురాలుగా నొప్పుచుండె
కాని నేడు మారె కాలమ్ముతో బాటు
మంచి మనసు తోడ మగువలెల్ల
నొకరి యందు నొక్కరొప్పగు ప్రేమతో
మెలగుచుండిరి కద మేలు మేలు
అయ్యా,
రిప్లయితొలగించండిఇంకొక కోణమున్నది.
కోడలు నేటికి కొత్తగ నేర్చిన
విద్యల గర్వముఁ పెచ్చు పెరగ
నత్తరికమనెడు కొత్త సంస్కృతిఁ బూని
హింసల పాల్జేసె నింటి వార
నెల్లర; కోడలి నేమియు ననలేక
బాధల పడుచున్న వారె హెచ్చు
కాలమిట్టుల మారె కర్మఫలమ
దేమొ గాని కొడుకు కేది గతియొ,
నడుమ బాధ లన్ని పడునది కొడుకులె
యనగ కలుగు బాధ యయ్యొ రామ!
నరుని జన్మ లెత్త నలుగక తప్పద
దెట్టి వారికైన నేమి చెపుదు?
అత్తలేని కోడలుత్తమురాలు...(కోడలుతమురాలై అత్తను అమ్మనుకుంటే ఇంక అత్తెక్కడుంటుంది.)
రిప్లయితొలగించండికోడల్లేని అత్త గుణవంతురాలు...(అత్త గుణవంతురాలై కోడల్ని కూతురనుకుంటే ఇంక కోడలెక్కడుంటుంది)
అత్తను తల్లిగ కోడలు
అత్తయు కోడలిని కూతురనుచును చూడన్
అత్తలు కోడండ్రుండరు
క్రొత్తగ దానర్థ మత్త ! కోడల ! వినరే !
అత్తలేని కోడలుత్తమురాలు...(కోడలుతమురాలై అత్తను అమ్మనుకుంటే ఇంక అత్తెక్కడుంటుంది.)
రిప్లయితొలగించండికోడల్లేని అత్త గుణవంతురాలు...(అత్త గుణవంతురాలై కోడల్ని కూతురనుకుంటే ఇంక కోడలెక్కడుంటుంది)
అత్తను తల్లిగ కోడలు
అత్తయు కోడలిని కూతురనుచును చూడన్
అత్తలు కోడండ్రుండరు
క్రొత్తగ నుత్తములు వినరె ! గుణవంతులునున్.
అత్తలేని కోడలు త్తము రాలన
రిప్లయితొలగించండినిది వరకిటి మాట యిప్పు డరయ
కోడరికము వచ్చు కోడ ళ్లె యత్తల
యునికి నోర్వ జాల కుండి రకట
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
సీసము నాల్గవ పాదంలో గణదోషం. ఇలా అందాం.
కాలమిట్టుల మారె కర్మఫలమదేమొ
గాని కొడుకు కేది గతియొ సుమ్ము
*
పండిత నేమాని వారూ,
మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
కాలము మారిన దట నిక
రిప్లయితొలగించండివేలము వేయంగ నత్త వేధించి స్నుషన్ !
గోలను జేసిన కోడలు
నాలుకలను కత్తిరించి నడి వీధి నిడున్ !
---------------------------------------
అమెరి కాల కొచ్చి యత్త బారిన బడి
స్వర్గ సీమ కేగ సవతి పోరు
తప్ప లేద టంచు తలను బాదు కొనెడి
మహిళ కేది సుఖము మహిని జూడ
అత్తా కోడళ్ళనగను
రిప్లయితొలగించండిచిత్తములను గలుప కున్న చిక్కులు మెండౌ !
నుత్తమమగు మనసు గలిగి
గుత్తముగా కలసి యున్న కొనియాడ దగున్ !