పండిత నేమాని వారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. కానీ‘శకారుడు’ శబ్దాన్ని ధర్మరాజుకు వర్తించడం సమర్థనీయంగా లేదు. * ఆదిత్య గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘హిడింబతొ’ అని ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. అక్కడ ‘హిడింబను’ అంటే సరి!
శ్రీనివాస్ గారూ, ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. మూడు పాదాల్లోనూ రెండు రెండు అక్షరాలు ఎక్కువుండి గణదోషం. 'దుర్గతిన్ + అవనిని' అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి.
ఆర్యా ! శంకరయ్య గురువర్యులకు నమస్కారములు. నా మొదటి పూరణ లోని యధిక గణములు యితర దోషములను తెలిపినందుకు కృతజ్ఞతలు. రెండవ పూరణలో మొదటి పాదం లో గణ దోషమును సవరించి పంపు చున్నాను. మన్నించగలరు.
శ్రీనివాస్ గారూ, మీ రెండవ ప్రయత్నం బాగున్నది. అభినందనలు. ‘పల్కులను + అప్పుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. దానిని ‘అవకరమైన యా పలుకు లప్పుడు....’ అందాం. ‘భువిసుర’ శబ్దం సాధువు కాదనుకుంటాను.
ఏల్చూరి మురళీధర రావు గారూ, అద్భుతమైన పూరణ చేసారు. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘హరణ మ్మొనరింపగ’, ‘హరిణమ్ముగ మార్చెను తద్గుణంబులే’ అని ఉండవలసింది.. టైపులో పొరపాటనుకుంటాను.
వసంత కిశోర్ గారూ, ‘దుష్టునితో వైరమేల?’ అనుకొన్న కవులు శకారుని కీర్తించినట్లు మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. మూడవ పాదంలో రెండక్షరాలు లోపించి గణదోషం. ఆ పాదాన్ని ‘దివిజులకన్న రాక్షసులె దీనశరణ్యులు గాదె” యంచు దు..’ అంటే ఎలా ఉంటుంది?
అవిరళ సాధనల్ సలుపు నాత్మవివేకుల తీరు నెన్న శై
రిప్లయితొలగించండిశవమున నున్న యట్లును పిశాచము పట్టిన వారి రీతిలో
భువి గనుపట్టు నక్కరణిబో గణుతించుచు సత్సభాస్థలిన్
కవికులమెల్ల బల్కెను శకారుని కంటెనుజ్ఞాని లేడిలన్
అవనిని యుద్ధ కార్యమున నార్తుల శోకము హాయిగొల్ప, దే
రిప్లయితొలగించండిసవరణమైనఁ జేతు మహిసత్తమ నీవట రాయభారమున్
వివరణ జేసి తెల్పుమని వేడెను ధర్మజు డాప్తి దెల్సి, యా
కవికుల మెల్లఁ బల్కెను శకారుని కంటెను జ్ఞాని లేఁడిలన్.
మహిసత్తమ = శ్రీకృష్ణుడు
ఆప్తి = భవిష్యత్కాలము
శకారుడు = ధర్మరాజు ( శకారంభకులు )
శకారుడు వసంతసేనతో పలికిన మాటలు :
రిప్లయితొలగించండికవికుల మెల్ల బల్కెను శకారుని కంటెను జ్ఞాని లే డిలన్
యెవడనుకుంటివే పుటల కెక్కినవాడ! వసంతసేన ! యో
ప్లవగముఖీ! సఖీ ! యిపుడె పట్టెద గట్టెద నిన్ను గూడెదన్
రవికులజుండు రావణుడు రాణి హిడింబతొ గూడినట్లుగన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
కానీ‘శకారుడు’ శబ్దాన్ని ధర్మరాజుకు వర్తించడం సమర్థనీయంగా లేదు.
*
ఆదిత్య గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘హిడింబతొ’ అని ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. అక్కడ ‘హిడింబను’ అంటే సరి!
దివిభువి యేక మైనపుడు ధీ దితు లన్నియు నారి నప్పుడా గతిన్
రిప్లయితొలగించండికవులును శుష్క వాదనలు గట్టిగ చేయుచు నుందు రెట్టి దుర్గతిన్
యవనిని గల్గె నా కవుల యందున దుష్టపు చేష్ట లేమి జేరెనో
కవికులమెల్ల బల్కెను శకారుని కంటెనుజ్ఞాని లేడిలన్
శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.
మూడు పాదాల్లోనూ రెండు రెండు అక్షరాలు ఎక్కువుండి గణదోషం.
'దుర్గతిన్ + అవనిని' అన్నప్పుడు యడాగమం రాదు.
సవరించండి.
అవకరములైన పల్కులను యప్పుడు వల్కె శకారు డాసభన్
రిప్లయితొలగించండిభువిసుర వంశ శేఖరుని బోలు మహాత్ముల కట్టి నిందగ
ల్గ విబుధు లెల్లరా సభను గాడిద బోలిక నొండ్ర బెట్టగా
కవికులమెల్ల బల్కెను శకారుని కంటెనుజ్ఞాని లేడిలన్
అవకరమైన పల్కులను యప్పుడు వల్కె శకారు డాసభన్
రిప్లయితొలగించండిభువిసుర వంశ శేఖరుని బోలు మహాత్ముల కట్టి నిందగ
ల్గ విబుధు లెల్లరా సభను గాడిద బోలిక నొండ్ర బెట్టగా
కవికులమెల్ల బల్కెను శకారుని కంటెనుజ్ఞాని లేడిలన్
ఆర్యా ! శంకరయ్య గురువర్యులకు నమస్కారములు. నా మొదటి పూరణ లోని యధిక గణములు యితర దోషములను తెలిపినందుకు కృతజ్ఞతలు. రెండవ పూరణలో
మొదటి పాదం లో గణ దోషమును సవరించి పంపు చున్నాను. మన్నించగలరు.
శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ ప్రయత్నం బాగున్నది. అభినందనలు.
‘పల్కులను + అప్పుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. దానిని ‘అవకరమైన యా పలుకు లప్పుడు....’ అందాం.
‘భువిసుర’ శబ్దం సాధువు కాదనుకుంటాను.
దివిభువి యేక మైనపుడు ధీ దితు లన్నియు నారి నప్పుడా
రిప్లయితొలగించండికవులును శుష్క వాదనలు గట్టిగ చేయుదు రెట్టి దుర్గతీ
యవనిని గల్గె నా కవుల యందున,సిగ్గును యెగ్గు వీడి యా
కవికులమెల్ల బల్కెను శకారుని కంటెనుజ్ఞాని లేడిలన్
శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ మొదటి పూరణ ఇప్పుడు నిర్దోషంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాన్యులు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
న్యాయస్థానంలో ధర్మాధికారి చారుదత్తుని దోషిగా ప్రకటించి మరణదండన విధించినపుడు శకారుడు అహంకరించి అన్న మాట:
అవితథమయ్యె నా పలు; కఘాత్ముఁడు వీఁడు; “వసంతసేనఁ గై
తవమునఁ దోఁటకుం బిలిచి, తల్లడవెట్టుచుఁ జారుదత్త దు
ర్భవకులఘాతకుం డబల ప్రాణముఁ దీసె” నటంచుఁ బ్రాడ్వివా
కవికుల మెల్లఁ బల్కెను; శకారుని కంటెను జ్ఞాని లేఁ డిలన్.
వి + కులము = విజ్ఞానుల సముదాయము.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
రవికుల దీపకుండు రఘురాముని శత్రువు రావణుండు తా
రిప్లయితొలగించండినవనిజ పొందుగోరె హరణం మొనరింపగ తాటకేయునిన్
నవనవ కుమ్దనంపు హరిణమ్ముగా మార్చెతత్గుణంబులే
కవికులమెల్ల బల్కెను శకారుని కంటెను జ్ఞాని లేడిలన్
ఏల్చూరి మురళీధర రావు గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ చేసారు. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘హరణ మ్మొనరింపగ’, ‘హరిణమ్ముగ మార్చెను తద్గుణంబులే’ అని ఉండవలసింది.. టైపులో పొరపాటనుకుంటాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
దుష్టునికి దూరంగా ఉంటే మంచిదని :
01)
____________________________________
కవనము సేయువేళ, కవి - గాయక ముఖ్యులు, జేరిరందరున్
కవులకు నిష్ఠురుండగు , శ - కారుడు ,దుష్టుడు,కూడినంతటన్
కవియగ నేల వాని నని - కల్కపు యూహల కుల్కుచున్ మదిన్
కవికుల మెల్లఁ బల్కెను శ - కారుని కంటెను జ్ఞాని లేఁ డిలన్ !
____________________________________
కవులకు నిష్ఠురుండు = నీటికాకుల్ని కూడా హింసించేవాడు
కవియు = ఎదిరించు
"శివుని నుతించునట్టి ఘన చిత్రకవిత్వము వ్రాతు"మంచు స
రిప్లయితొలగించండిత్కవికులమెల్లఁ బల్కెను;"శకారుని కంటెను జ్ఞాని లేఁడిలన్,
దివిజులకన్న రాక్షసులె దీనశరణ్యు"లటంచు దు
ష్కవికులమెల్లఁ బల్కెను శకారుని కంటెను బుద్ధిహీనతన్.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి‘దుష్టునితో వైరమేల?’ అనుకొన్న కవులు శకారుని కీర్తించినట్లు మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
మూడవ పాదంలో రెండక్షరాలు లోపించి గణదోషం. ఆ పాదాన్ని ‘దివిజులకన్న రాక్షసులె దీనశరణ్యులు గాదె” యంచు దు..’ అంటే ఎలా ఉంటుంది?
శ్రీ శంకరయ్యగారికి ధన్యవాదములు. టైపాటు వలన గణదోష మేర్పడినది. ఇది నా పూరణ...
రిప్లయితొలగించండి"శివుని నుతించునట్టి ఘన చిత్రకవిత్వము వ్రాతు"మంచు స
త్కవికులమెల్లఁ బల్కెను;"శకారుని కంటెను జ్ఞాని లేఁడిలన్,
దివిజులకన్న రాక్షసులె దీనశరణ్యు"లటంచు మేటి దు
ష్కవికులమెల్లఁ బల్కెను శకారుని కంటెను బుద్ధిహీనతన్.
తమరు సూచించిన సవరణ మఱింత బాగున్నది.
"శివుని నుతించునట్టి ఘన చిత్రకవిత్వము వ్రాతు"మంచు స
త్కవికులమెల్లఁ బల్కెను;"శకారుని కంటెను జ్ఞాని లేఁడిలన్,
దివిజులకన్న రాక్షసులె దీనశరణ్యులు గాదె"యంచు దు
ష్కవికులమెల్లఁ బల్కెను శకారుని కంటెను బుద్ధిహీనతన్.
మురియుచు పద్య శాస్త్రమును ముప్పది యేండ్లున కొంత నేర్చుచున్
రిప్లయితొలగించండిసవరణ జేసి పద్యముల శాంతియు సౌఖ్యము కోలుపోవుచున్
కవనము జేయ కష్టమున కాంతలు జ్ఞాతులు గేలిజేయ నా
కవికుల మెల్లఁ బల్కెను శకారుని కంటెను జ్ఞాని లేఁ డిలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి