27, జులై 2013, శనివారం

సమస్యాపూరణం – 1125 (వృద్ధనారిని యువకుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వృద్ధనారిని యువకుఁడు పెండ్లియాడె.
ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

 1. యువకుడను పేరు గలిగిన వృద్ధుడొకడు
  విధురు డగుటచే నొక కొంత వెదకి వెదకి
  తుదకు చేదోడు వాదోడు దొరకె ననుచు
  వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

  రిప్లయితొలగించండి
 2. అభవుఁ డాతఁడు, సంతత యౌవనుండు,
  సకల భువన శివంకర శంకరుండు,
  వినతి సేయ సురలు, దక్ష తనయలందు
  వృద్ధనారిని, యువకుఁడు పెండ్లి యాడె!

  (దక్ష తనయలందు వృద్ధనారి=దక్షుని జ్యేష్ఠపుత్రిక=సతీదేవి)

  రిప్లయితొలగించండి
 3. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  ర ల లకు యతి మైత్రి గురించి మీరు చేసిన సూచనను చూచితిని. నా ఉద్దేశములో ర ల లకు ఉచ్చారణలో చాల సన్నిహిత సంబంధము ఉన్నది - కనుక యతి మైత్రిని అంగీకరించుటయే మంచిది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొన్న మాయింటికి ఒక చిన్నవాడు వచ్చాడు. వాని మెడలో దండను చూసి "తులసీ దళాలా?" అని అడిగితిని. "కాదు కాదు. లుద్లాక్షలు లుద్లాక్షలు" అని వివరించాడు.

   తొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  వృద్ధుడే.. పేరేమో ‘యువకుడు’. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో యతిదోషం. సవరించండి.
  ‘ర-ల’ యతి విషయమై మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ‘వృద్ధ’ శబ్దానికి గల ‘పెద్ద’ అర్థంతో మంచి పూరణ. చేసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. నమస్కారములు
  శ్రీ పండితులవారి ప్రతిభ అద్భుతం రెండిటికీ ఒకే పద్యం అవధాన సరస్వతులు కదా ! చాలా బాగుంది

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  తనకన్నా కొంచెం పెద్ద వయసు గల స్త్రీని ఒక యువకుడు పెళ్ళాడిన వైనం :

  01)
  _________________________

  వృద్ధుడైనట్టి తన తండ్రి - క్రుద్ధుడైన
  శుద్ధమైనది,చదువరి, - ముద్దు లొలుక
  పెద్ద దైనను నేమాయె - బుద్ధి గలది
  సిద్ధరామయ్య కూతురు , - ముగ్ధ , జూచి
  మద్దతిచ్చిన మిత్రుల - సద్దులోన
  శ్రద్ధ , కల్యాణ మంటప - గద్దెయందు
  వృద్ధనారిని యువకుడు - పెండ్లియాడె !
  _________________________

  రిప్లయితొలగించండి
 7. ప్రేమ మరువలేదు పనిని వీడలేదు
  అంతరిక్షము జుట్టెను కాంతి గతిని
  క్షణములేళ్ళ నొకవిధము గడిపి వచ్చి
  వృద్ధనారిని యువకుడు పెండ్లియాడె

  కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించేటప్పుడు కాల పరిమాణం మారిపోతుంది.(Time dilation) కనుక భూమి మీద ఉన్న వ్యక్తికి 20 ఏళ్ళు గడిస్తే, ప్రయాణించి వచ్చిన వానికి 6 ఏళ్ళే గడుస్తుంది. (ప్రయాణించిన వేగాన్ని బట్టి ఇది మారుతుంది). బయలుదేరేటప్పుడు ఒకే వయసువాళ్ళైనా ఇప్పుడు ఒకరు ఇంకొకరి కంటే పెద్దవారు!! కేవలం లెక్క ప్రకారమే కాదు శారీరిక మైన మార్పులతో సహా!! (Twin paradox)

  రిప్లయితొలగించండి
 8. అరయనానాఁడు సీతాస్వయంవరమున
  శివుని వింటిని విరువ సచ్చీలుఁడైన
  రామభద్రుఁడు చేకొనె రహివహింప
  "వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె"

  వృద్ధనారి = ప్రాతదైన వింటినారి
  పెండ్లి = కరగ్రహము, స్వీకారము

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు

  గురుదేవులు క్షమించగలరు.
  శ్రీ వసంత కిషోర్ గారు ఆడిగిన
  పూరణ తొలగింపు గురించి, నా ప్రయత్నమునకు గెలుపు లబించినది. పూరణ తొలగించ వలెననిన ముందుగా మీరు గూగుల్ మెయిల్ సైన్ ఇన్ కావాలి, తరువాత డేట్ మరియు టైం ప్రక్కన చిన్న చెత్త బుట్ట కనిపించును, దానిని నొక్కిన యడల వ్యాఖ్య తొలగించబడును.అప్పుడు ‘వ్యాఖ్య తొలగించబడింది. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.’ అన్న వ్యాఖ్య కనిపిస్తుంది. తొలగింపు వెనుక మరియొక ఉద్దేశ్యము ఏమియు లేదండి. చిన్న ప్రయత్నము.
  పేదరాసి పెద్దమ్మ కథకు మంచి పద్యము వ్రాయలేక పోయాను.

  ఆటవికులలో వింత వింత ఆచారములు గలవు. వాటిని దెలియక తప్పు జేసిన యడల వింత వింత శిక్షలు పడును,
  ======*======
  వింతలను జూడ దిరిగెను పంతముగను
  వివిధ జాతులను గలిసె వేడుక గను
  జేయ తప్పు దెలియకను జిక్కెనంత
  వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

  రిప్లయితొలగించండి
 10. వృద్ధు డైనట్టి భీ ముడు పెండ్లి యాడె
  వృద్ధ నారిని, యువకుడు పెండ్లి యాడె
  వయసు లోనున్న వాణిని వలచి మిగుల
  దంపతు లిరువు రాదర్శ దంపతులు మఱి

  రిప్లయితొలగించండి
 11. శ్రీ నేమాని గురుదేవుల పద్యము " సమస్యాపూరణం మరియు పద్య రచన" లకు వెలుగు నిచ్చు చున్నది.
  శ్రీ వసంత కిషోర్ గారి ప్రాస పద్యము వారి బలుకల వలె " అందరి పూరణలూ అలరించు చున్నవి !" " సమస్యాపూరణం" ను అలరించినది,
  మరియు అందరి పూరణలూ బ్లాగున అలరించు చున్నవి!

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  ఆదిత్య గారూ,
  సైన్స్ ఫిక్షన్ చదివినట్టుంది మీ పూరణ. బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మంచి ప్రయత్నం చేసారు. కానీ సమర్థనీయం కాదనిపిస్తున్నది.
  ‘నారి’ తద్భవము. దానిని తత్సమ శబ్దంతో సమాసం చేయరాదు కదా!
  *
  వరప్రసాద్ గారూ,
  కొన్ని గిరిజన జాతుల్లో ఈ అన్న చనిపోతే తమ్ముడు వదినను పెళ్ళి చేసుకొనే ఆచారం ఉన్నది. ఇటువంటి కథాంశంతో హిందీలో ఒక సినిమా వచ్చింది. పేరు గుర్తులేదు.
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. అయ్యా! గ్రామాంతరము వెళ్తూ తొందరలో పద్యము వ్రాయుటలో యతి దోషమును గమనించ లేదు. 1వ పాదమును ఇలాగ మార్చుదాము:
  "పేరు యువకుడనగ నొప్పు వృద్ధుడొకడు"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
  మీకు మా యందు గల ఆదర భావమునకు చాల సంతోషముగ నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.
  పద్యానికి ఆయువుపట్టు అయిన లయ నా సవరణలో కంటే మీ సవరణలోనే ఉన్నది.

  రిప్లయితొలగించండి
 16. వయసు మీరిన శృంగార వనితఁ గాంచి
  వయసులో నున్న యువకుడు వలచి, యామె
  ప్రేమ మైకములో బడి బిడియ పడక
  వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

  రిప్లయితొలగించండి
 17. ఆటపాటలయందు అనురాగముప్పొంగ
  ..........ఏకమయ్యెమనములిరువురికిని |
  పరిణయమాడంగబాసలుచేసిరి
  ..........పెద్దలూకొనెవారి పెండ్లిమాట |
  అంతఁబోరుకువచ్చె నాదేశరిపురాజు
  ..........ఆరణముఁయువకుడశువులొదిలె
  పిచ్చిదైతనువేచె ప్రియునికై యువతి వ
  ..........త్సములెన్నయిననాశ చావకుండె |

  ఆమెపైప్రేమయెనతడికాయువిచ్చె
  పుట్టినాడతడు మఱల పుడమిఁగత
  జన్మ ప్రతినలనీడేర్చ; సంతసమున
  వృద్దనారిని యువకుడు పెండ్లియాడె |

  రిప్లయితొలగించండి
 18. హరికి నాభికంజము నుండి యాత్మజునిగ
  పుట్టి, సృష్టిని జేయుచు పొందు కొఱకు
  వాణి కరమును గ్రహియించె బ్రహ్మ, జ్ఞాన-
  వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె.

  రిప్లయితొలగించండి
 19. ప్రేమ కోసమై యొప్పించి యామె తల్లి
  వృద్ధనారిని - యువకుడు పెండ్లి యాడె
  యువతిని ; మిగుల సంతస మొందె వధువు
  బంధుమిత్రు లెల్లరు మెచ్చి వచ్చి రపుడు.

  రిప్లయితొలగించండి
 20. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గూడ రఘురామ్ గారూ,
  బాల్యస్నేహం, యవ్వనంలో పేమ, పెండ్లి బాసలు, పెద్దల అంగీకారం, యుద్ధం, ప్రేమికుడు మరణం, ప్రియురాలు నిరీక్షణ, ప్రేమికుడు పునర్జన్మ, ప్రతిజ్ఞాపాలన, వివాహం... అబ్బో పెద్ద కథనే చెప్పారు. బాగుంది. అభినందనలు.
  సీసం మూడవ పాదం ఉత్తరార్ధంలో ‘ఒదిలె’ అన్నది గ్రామ్యం. దాన్ని ఇలా అందాం ‘ఆ రణము ప్రియుని యసువుల గొనె’.
  నాల్గవ పాదములో ‘వత్సరము’లను ‘వత్సము’ లన్నారు. ఆ పాదాన్ని ఇలా మారుద్దాం. ‘పిచ్చిదై తనువేచె ప్రియునికై యువతి వ/ త్సరము లేగిన నాశ చావకుండె |
  ఎత్తుగీతిలో ‘ప్రేమయె యతని కాయువిచ్చె’ అనండి. ‘పుడమిఁ గత’ను ‘పుడమిని గత’ అనండి.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. నాగరాజు రవీందర్ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. విశ్వ మంతట తానైన వేద విదుడు
  సృష్టి స్తితి లయలకు సూత్ర ధారి
  నిత్య యవ్వను డాతడు సత్య మనగ
  వృధ నారిని యువకుఁ డు పెండ్లి యాడె !

  రిప్లయితొలగించండి

 24. కడగి యవివాహితగ నుండి కన్య యొకతె
  కాంచె నభివృద్ధి యుద్యోగ కారణమున
  పెద్ద దైనను తనకంటె ప్రేమ ముదిరి
  *‘వృద్ధ 'నారిని యువకుడు పెండ్లియాడె

  * వృద్ధిలో కొచ్చిన

  రిప్లయితొలగించండి
 25. వృద్ధ నాయిక సీతయై వెలసె తెరను
  యువకిశోరుడు శ్రీరాము డవతరించి
  శంభు చాపమ్ము విరిచెను జనులు మెచ్చ
  వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

  ముగురుతల్లుల్ల మూలమ్ము మొదటి అంబ
  ఆదిభిక్షువు మదనారి వేదవేద్యు
  దివిజులెల్లరు గోరుచు దీవెనలిడ
  వృద్దనారిని యువకుడు పెండ్లియాడె

  రిప్లయితొలగించండి
 26. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  కానీ పూరణ సమర్థనీయంగా లేనట్టుంది.
  ‘సృష్టి స్థితి’ అన్నప్పుడు ‘ష్టి’ గురువై గణభంగం.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. ముదిత సీతకు ' ముసలమ్మ ' ముద్దు పేరు
  పెండ్లియాడుచు నుండగా వేడ్క మీర
  వ్యాఖ్య జేసెను నవ్వుచు బావగారు
  " వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె "

  రిప్లయితొలగించండి