25, జులై 2013, గురువారం

పద్య రచన – 413 (కరతాళ ధ్వనులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“కరతాళ ధ్వనులు”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. కరతాళ ధ్వని లేకను
  మరి కళ రాణించదయ్య మన చప్పట్లే
  మరిమరి యింధనమగు కళ
  సరిగా పెంపొందు ధనము సరి రాదన్నా !

  రిప్లయితొలగించండి
 2. కరతాళ ధ్వనులంత చేరుకొనె నాకాశంబు మా శంకరా
  భరణ ప్రఖ్యను కంది శంకరుడు విద్వల్లోకమాన్యుండు సా
  దరరీతిన్ కవిపండిత ప్రథిత బృందంబుల్ ప్రశంసింపగా
  వరివస్యల్ పొనరించి వాణికి కృపాపాత్రుండునై యొప్పుటన్

  రిప్లయితొలగించండి
 3. కరతాళ ధ్వని జేసిరి
  విరివిగబ్రజ లందఱచట వేడుక తోడన్
  పరమానందుల వారిది
  దరిసెన భాగ్యంబు గలుగ దద్దయు బ్రీ తిన్.

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  వినయ వినమితుడనై ధన్యవాదములు తెలుపుకొనుచున్నాడను.

  రిప్లయితొలగించండి
 5. సుబ్బారావు గారూ,
  మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
  ‘దరిసెన భాగ్యము’ అని సమాసం చేయరాదు కదా. ‘దరిసెన మను భాగ్య మబ్బె...’ అందాం.

  రిప్లయితొలగించండి
 6. విరులును ఫలములు తోయము
  పరదైవమ్మునకు అయ్యవారికి రూకల్
  సరి కానుక నాయకులకు
  కరతాళధ్వనులు దక్కు కవి మిత్రులకున్

  రిప్లయితొలగించండి
 7. విరిదండ పింఛము సిగ
  కర మందర కంకణములు ఘల్లున మ్రోగన్
  మురలళీధరుడేతెంచగ
  కరతాళ ధ్వనులు గోపకాంతలు చేసెన్

  కరతాళధ్వని యమునా
  తరంగములు మారుమ్రోగె ధ్వానము వినుచున్
  పరవశులై వ్రజమూకలు
  పరుగున యేతెంచెరటకు బాలుని చూడన్

  అరుదెంచెను నందుని సతి
  కరాంగుళ లను విరిచి దుష్టి కట్టడి చేసెన్
  శిరములు మూర్కొని
  పురమును చేర్చెను ముఖముకు వల్లియ వెనుకన్

  రిప్లయితొలగించండి
 8. ఎదసడి చేసినట్లు ధ్వనియించును మానసవీధులందు తో
  యదములు పిల్చినట్లు హృదయమ్ము మయూరముగా నటించు నో
  యుదయపు సందడిన్ ప్రకృతి యొప్పిన రీతి మనస్సు మారు నే
  నిదియది చెప్పలేని సుఖమేదియొ నింపును లోన కేకిసల్ !!

  రిప్లయితొలగించండి
 9. ఎదుటి వారి ప్రజ్ఞ నెఱిగిన క్షణమునన్
  తలచి చేసెడు కరతాళ ధ్వనులు
  చేయు వారి కిచ్చు నాయురారోగ్యమ్ము
  చెందు వారి మేథ కందు విందు!

  రిప్లయితొలగించండి
 10. ఆయ్యా! శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
  మీ 3 పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:-

  1. 1వ పద్యములో టైపు పొరపాటులున్నవి. 1వ పాదములో 1 లఘువు తక్కువ.
  3వ పాదములో "ల" ఎక్కువగ నున్నది.
  4వ పాదములో గోపకాంతలు చేసెన్ అనుట సాధువు కాదు. గోపకాంతలు చేసిరి అనవలెను.

  2వ పద్యము: 3వ పాదములో వ్రజమూకలు అనుట సాధువు కాదు. వ్రజ అనునంది సంస్కృత పదము - దాని తరువాత తెలుగు పదము మూకలు వేసి సమాసము చేయరాదు.
  4వ పాదములో పరుగున + ఏతెంచె అనుచోట యడాగమము రాదు - నుగాగమము వచ్చును.

  3వ పద్యము: 3వ పాదములో 1 గణము తక్కువగా నున్నది. 4వ పాదములో ముఖముకు అను ప్రయోగము సాధువు కాదు. ముఖమునకు అనుట సరియైన ప్రయోగము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  ఒక సూచన: కరతాళ ధ్వనులు అనే సమాసములో ధ్వ అనే అక్షరమునకు ముందున్న ళ గురువు అగును. పరిశీలించండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. సరిగమపదనిసల విభా
  వరి నందున పాటగాళ్ళ పాటలతో మై
  మరచిన పండిత పామర
  కరతాళధ్వనులు మ్రోగ కనువిందాయెన్

  రిప్లయితొలగించండి
 13. అయ్యా! శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది - అభినందనలు. ఆఖరి పాదములో "కరతాళ ధ్వనులు మ్రోగ కనువిందాయెన్" అన్నారు కదా! ధ్వనులు కర్ణసుఖముగా ఉండును అనుట సమంజసమేమో? పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. తప్పెట తాళము లన్నవి
  చప్పున విని నంత జనులు సారస్వత మున్ !
  మెప్పగు కరతాళ ధ్వని
  గొప్పగ ముదమొందు రనగ గుప్పెడు మనమున్ !
  ---------------------------------------------
  సభ యందలి యవధానికి
  నభ మంటిన కవుల ప్రతిభ నాగాస్త్రము లై
  సభి కుల కర తాళ ధ్వని
  నభి నందన పలుకు లందు నారాయణు డౌ !

  రిప్లయితొలగించండి
 15. శ్రీ పండితి నేమాని గురువుగారికి నమస్కారములు! మీ సూచనకు కృతజ్ఞతలతో సవరణ....

  సరిగమపదనిసల విభా
  వరి నందున పాటగాళ్ళ పాటలతో మై
  మరచిన పండిత పామర
  కరతాళధ్వనులు మ్రోగ కర్ణసుఖమయెన్

  రిప్లయితొలగించండి
 16. శ్రీ నేమని గురువర్యులకు ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరించిన పద్యం:
  ఎదుటి వారి ప్రజ్ఞ నెఱిగిన క్షణమునన్
  తలచి చేసెడు కరతాళ సడులు
  చేయు వారి కిచ్చు నాయురారోగ్యమ్ము
  చెందు వారి మేథ కందు విందు

  రిప్లయితొలగించండి
 17. సురుచిర పద భావమ్ముల
  సరస కవిత్వమ్ము వ్రాయు సన్మిత్రుల కీ
  యవసరమున సమ్మదమున
  ‘కరతాళధ్వనులు’ సేయఁగా మన సయ్యెన్.
  *
  కరతాళ ధ్వనులు అన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  ఆదిత్య గారికి,
  సహదేవుడు గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  తిమ్మాజీ రావు గారూ,
  మీ మొదటి పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘విరిదండయు’ అంటే సరి. రెండవ పాదంలో ‘కర మందర’? అక్కడ ‘కరమున దగ కంకణములు..’ అంటే సరిపోతుందనుకుంటాను. మూడవ పాదంలో ‘ల’ ఎక్కువయింది (టైపాటు). ‘గోప కాంతలు చేసిరి’ అనాలి కదా. అక్కడ ‘గోపికలు చేసి రటన్’ అందాం.
  రెండవ పద్యంలో ‘ఏతెంచె(చి) రటకు’ అని టైపాటు.
  మూడవ పద్యంలో 3,4 పాదాల్లో గణదోషం. సవరించండి.
  *
  సహదేవుడు గారూ,
  ‘కరతాళ సడులు’ అనే సమాసం చేయరాదు కదా. ‘కరతాళ రవము’ అందాం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ‘ఒందుదు రన’ అనండి.

  రిప్లయితొలగించండి
 18. తాళ లేక తాళం అన్వయుంచుచు
  రసిక హృదయుల మనస్సున ఒలలాడి పద్య గద్య నాటక రంగాలను రంజింప రంగమార్తాందుల మనస్సును రంజింప చేయు కరతాళ ధ్వని

  రిప్లయితొలగించండి