వసంత కిశోర్ గారూ, నేను ఔషధం అనే అర్థాన్ని స్వీకరించాను. మీరన్నాక సమస్యలో ఔచిత్యం లోపించిందని తెలిసింది. ధన్యవాదాలు. సమస్యను కొద్దిగా మార్పు చేస్తున్నాను.
శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. మిత్రులు వసంత కిశోర్ గారికి ధన్యవాదములు. కర్ణ రసాయన మనునది యొక జాతీయము. విడివిడిగా నర్థములు తీసుకొనరాదు. తీసికొన్నచో నర్థము విభేదించును. ఈ జాతీయమునకు నాంధ్రవాచస్పత్యమునందు "జా. చెవులకింపైనది" యని యర్థమిచ్చుటతోఁ బాటు "వాని పాట కర్ణ రసాయనంబుగా నున్నది" యని ప్రయోగముఁ జూపినారు. కావున తాము మొదట యిచ్చిన పాఠమే బాగుగ నున్నది. దానిని మార్చవలసిన యవసరము లేదనియే నా యభిప్రాయము.
గుండు మధుసూదన్ గారూ, ధన్యవాదాలు. ‘కర్ణరసాయనము’ అనే జాతీయం యొక్క అర్థాన్ని వివరించి నా సందేహాన్ని తీర్చారు. విద్యార్థి కల్పతరువు లోనూ ఈ జాతీయానికి ‘వినసొంపైనది’ అనే అర్థాన్నిచ్చారు. మీరు కోరినట్లే సమస్యకు మొదటి పాఠాన్నే ఇస్తున్నాను.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో గురువు గారికి ధన్యవాదములు శ్రీ శైలజ గారు గురువుగారు పామరుడనైన నన్ను ప్రోత్సహించి,తప్పులను సరిజేయుచున్నారు. ఇది అంతయు గురువుగారు పెట్టిన భిక్ష. =======*======= రాజకీయ నాయకుల బలుకులు విని ఆత్మహత్యలు జేసుకొన్న వారిపై
గాడిదలెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్ వేడుక జూచి యీల లను వేసిరి వెర్రిగ కుర్ర కారులే (పిల్ల వారలై ) వాడిరి మల్లె పూల వలె బాలలు,క్రుంగిరి వారి బంధువుల్ వాడెను వృద్ధ దంపతులు,పాడకు గాడిద పూట పూట కున్
నాఁడు సుయోధనుండు జననమ్మగు పట్టున భూనభోంతరాల్
రిప్లయితొలగించండిగోడును వెళ్ళఁ గ్రక్కినవి; ఘోరతరమ్ముగఁ గూసె ఘూకముల్;
వాడలనుండు కుక్కలును బావురు మన్నవి; సంతసమ్మునన్
గాడిదలెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా !
రిప్లయితొలగించండికర్ణ రసాయనము అంటే అర్థం ?
రసాయనము అంటే విషము అనే అర్థమున్నది
కావున
కర్ణ కఠోరమని భావించ వచ్చునా !?
మధుసూదన్ గారి పూరణ మంజులముగా నున్నది !
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండినేను ఔషధం అనే అర్థాన్ని స్వీకరించాను. మీరన్నాక సమస్యలో ఔచిత్యం లోపించిందని తెలిసింది. ధన్యవాదాలు. సమస్యను కొద్దిగా మార్పు చేస్తున్నాను.
శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. మిత్రులు వసంత కిశోర్ గారికి ధన్యవాదములు. కర్ణ రసాయన మనునది యొక జాతీయము. విడివిడిగా నర్థములు తీసుకొనరాదు. తీసికొన్నచో నర్థము విభేదించును. ఈ జాతీయమునకు నాంధ్రవాచస్పత్యమునందు "జా. చెవులకింపైనది" యని యర్థమిచ్చుటతోఁ బాటు "వాని పాట కర్ణ రసాయనంబుగా నున్నది" యని ప్రయోగముఁ జూపినారు. కావున తాము మొదట యిచ్చిన పాఠమే బాగుగ నున్నది. దానిని మార్చవలసిన యవసరము లేదనియే నా యభిప్రాయము.
రిప్లయితొలగించండిపాడగ నెంచి విప్పినవి పాపము గొంతుల, స్వామి కీర్తనల్
రిప్లయితొలగించండిగాడిద లెల్లఁ జేసినవి గానము, శ్రోతల కర్ణపేయమౌ
జాడయె కానరాదనుచు చల్లగ జారుకొనంగఁ జూచినన్
పోడు మహాశివుండటనె పొందుగఁ గూర్చొను నాలకింపగా.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. ‘కర్ణరసాయనము’ అనే జాతీయం యొక్క అర్థాన్ని వివరించి నా సందేహాన్ని తీర్చారు. విద్యార్థి కల్పతరువు లోనూ ఈ జాతీయానికి ‘వినసొంపైనది’ అనే అర్థాన్నిచ్చారు. మీరు కోరినట్లే సమస్యకు మొదటి పాఠాన్నే ఇస్తున్నాను.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మార్చిన సమస్యను కూడా పూరించే ప్రయత్నం చేయండి.
గురువు గారూ,
రిప్లయితొలగించండిఆజ్ఞ.
ఇదే పూరణను,మార్చిన సమస్యకనుగుణంగా మారుస్తున్నాను.
పాడగ నెంచి విప్పినవి పాపము గొంతుల, స్వామి కీర్తనల్
గాడిద లెల్లఁ బాడినవి;గానముఁ గర్ణరసాయనమ్ముగన్
నేడిక నుండబోదనుచు నేర్పుగ జారుకొనంగఁ బోవునే?
పోడు మహాశివుండటనె పొందుగఁ గూర్చొను నాలకింపగా.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిగురువు గారికి ధన్యవాదములు
శ్రీ శైలజ గారు గురువుగారు పామరుడనైన నన్ను ప్రోత్సహించి,తప్పులను సరిజేయుచున్నారు. ఇది అంతయు గురువుగారు పెట్టిన భిక్ష.
=======*=======
రాజకీయ నాయకుల బలుకులు విని ఆత్మహత్యలు జేసుకొన్న వారిపై
గాడిదలెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్
వేడుక జూచి యీల లను వేసిరి వెర్రిగ కుర్ర కారులే (పిల్ల వారలై )
వాడిరి మల్లె పూల వలె బాలలు,క్రుంగిరి వారి బంధువుల్
వాడెను వృద్ధ దంపతులు,పాడకు గాడిద పూట పూట కున్
పాడెదమంచు పాటలను పాఠము నేర్వరు వట్ఠి గాడిదల్
రిప్లయితొలగించండిమూడును వీరికిన్ చదువు పూర్తిగ రాక పరీక్ష తప్పినన్
నేడిక చెప్పినన్ వినరు నీతులు వీరని తిట్టుచుండగా
గాడిద లెల్లఁ జేసినవి గానముఁ గర్ణరసాయనమ్ముగన్!!
గాడిద లన్ని నేర్చినవి గానము తుంబురు శిష్యులై ధరన్
రిప్లయితొలగించండిపాడెద మిప్పుడే యనుచు పాడిగ నారద మౌని నా సభన్
జూడగ బిల్చి నప్పుడది జూడగ నచ్చెరు వొందె మౌని యా
గాడిదలెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్
మధుసూదన్ గారి పూరణ మధురంగా ఉంది.
రిప్లయితొలగించండిగాడిద జంట యొక్కటట గడ్డిని మేసెడి పెన్మి టిట్లనన్
"పాడుము ప్రేయసీ! కరుగ బండలు కమ్మగ" నోండ్ర బెట్టెనా
యాడుది పొంగి, యార్చినవి యన్నియు వంతగ, పల్కె వృద్ధులౌ
గాడిద "లెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్"
బూడిద రంగు గాడిదలు ముద్దుగ రెండును పెండ్లి యాడగన్
రిప్లయితొలగించండికూడగ వచ్చి చేరినవి కుక్కలు, నక్కలు, పందిపిల్లలున్
వేడుక సల్ప నేర్పరచె విందు వినోదము లెన్నొ గావునన్
గాడిదలెల్ల జేసినవి గానము గర్ణరసాయనమ్ముగన్
ఊడిగ మెంత జేసినను నూరట జెందక నొక్క తావునన్
రిప్లయితొలగించండిబాడిగ ముట్ట లేదనుచు బాదెను మూఢుడు చావు దప్పగా
దాడిని జేయగోరి తమ దాస్యము త్రెంచుకు బోవ నెంచియా
గాడిద లెల్ల జేసినవి గానముఁ గర్ణ రసాయ నమ్ముగన్ !
రసాయనము = జర వ్యాధులను పోగొట్టెడి ఔషధము , మజ్జిగ , విషము , విఢంగము , గరుత్మంతుడు
పాడెద మంచు శ్రావ్యముగ పాడగ రానటువంటి మూర్ఖులౌ
రిప్లయితొలగించండిగాడిదలెల్ల చేసినవి గానము , కర్ణ రసాయనమ్ముగన్
పాడిన ఘంటసాలవలె పాడెటి గాయక శ్రేష్టు నిద్ధరిన్
జూడగ లేము వారి ఘన సుందర గాన మినంగ లేమికన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా చదువుకొనే దినములలో ఒక అనుభవము .
రిప్లయితొలగించండిబాడుగ యింటిలోన పలుపాటులు తక్కవు నెట్టి వారకున్
గాడిద మూక యొక్కటియు గ్రక్కున జేరెగ ప్రక్క చావిడిన్
వేడుకె యెల్ల వేళలను ! వేదన యేలని రక్తి నొందగా
గాడిదలెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్ !
మిత్రులు మిస్సన్నగారికి ధన్యవాదములు. మీ పూరణ కూడ బాగుగ నున్నది.
రిప్లయితొలగించండివసంత కిశోర్జీ ! నమస్తే! బహుకాల దర్శనం.....సంతోషం...
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! వందనం !
రిప్లయితొలగించండిమిత్రులందరికీ వందనములు !
చాలాకాలం తరువాత మిత్రులను కలుసుకోవడం
మహదానందం కలిగిస్తోంది !
కర్ణరసాయనము-జాతీయమని దెలిపి సందేహ నివృత్తి జేసిన
మధుసూదనుల వారికి ధన్యవాదములు !
మొదట ఆపద్యపాదం చదవగానే అదే అర్థం స్ఫురించింది !
కాని శల్య పరీక్ష చేసే బుద్ధి ఊరుకోకుండా రసాయనానికి అర్థం వెదికింది !
దానితో వచ్చిన గందరగోళమది !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఎన్నికలలో, గాడిద గుర్తుపై నిలచి గెలిచిన , ఒక అడ్డ గాడిద , గాడిద
నెక్కి ఊరేగడం చూసిన నిజమైన గాడిద లానందంతో :
01)
__________________________________
గాడిద బొమ్మలన్ బరచి - గ్రామపు కూడలి గోడలందునన్
గాడిద గుర్తుపై నిలచి - గ్రామపు యెన్నిక లందొకం డదే
గాడిద గెల్చినంత ,నొక - గాడిద నెక్కి ,దిరుంగ సాగినన్ ;
గాడిద గెల్పు వార్త విని - గ్రామము నందలి ,సందు ,గొందులన్
గాడిద లెల్లఁ జేసినవి - గానముఁ గర్ణరసాయనమ్ముగన్.
__________________________________
పశువుల మేతకై కేటాయించిన సొమ్ము మొత్తం కాజేసిన గ్రామాధికారులు
రిప్లయితొలగించండిఆడిట్లోదొరికిపోయి జైలు పాలవ్వడం గమనించిన గాడిదలు :
02)
__________________________________
గాడిద కన్న హీనముగ - గ్రామము నందలి పెద్దలందరున్
గాడిద మేతకై , యిడిన - కాసుల మొత్తము మేసివైచినన్
గాఢపు శోధనన్ దొరకి - గమ్మున ఖైదున జేరి నంతటన్
గాడిద లెల్లఁ జేసినవి - గానముఁ గర్ణరసాయనమ్ముగన్.
__________________________________
గానుగ యెద్దును బండికి కడితే :
రిప్లయితొలగించండి03)
__________________________________
గాడుపు వేళలో నొకడు - గానుగ యెద్దును బండి గట్టగా
కాడిని వీడు యెద్దు నదె - "గాడిద "యంచట గొట్టి దిట్టినన్
గాడిద మందలో మరొక - గాడిద జేరె నటంచు పొంగుచున్
గాడిద లెల్లఁ జేసినవి - గానముఁ గర్ణరసాయనమ్ముగన్.
__________________________________
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిగత నెల రిటరైన ఒక మిత్రుని సన్మాస సభ నిన్న జరిగింది. సన్మాన పద్యాలు వ్రాసి, సభలో పాల్గొనడానికి వెళ్ళడంతో నిన్న బ్లాగు మిత్రుల పూరణలపై, పద్యాలపై స్పందించే అవకాశం దొరకలేదు. మన్నించండి.
*
లక్ష్మీదేవి గారూ,
సవరించిన సమస్యకు అనుగుణంగా మార్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అన్నట్టు... నిన్న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ‘రెడ్డిగారి కష్టాలు’ వ్రాసిన ‘శీనా’ మీరేనా?
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పాడెటి’ని ‘పాడెడు’ అందాం.
‘గాన మినంగ లేమికన్’ అన్నదాన్ని ‘గానము విందుమా యికన్’ అందాము.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
స్వానుభవాన్ని వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ వైవిధ్యంగా అలరిస్తున్నవి. అభినందనలు.
దూడలు దుప్పులున్ పులులు తొండలు పందులు పశ్వులన్నియున్
రిప్లయితొలగించండివేడుక మీర నెన్నికల భీకర రీతిని పోరగా భళా!
ఓడిన నేతలెల్లరిని హోయని హోయని హాయిజూచుచున్
గాడిద లెల్లఁ జేసినవి గానముఁ గర్ణరసాయనమ్ముగన్