23, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1121 (దారా రమ్మని పిల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా!
(ఆకాశవాణి సౌజన్యంతో...)

23 కామెంట్‌లు:

  1. తనకున్ జెప్పక పతి పరుగు లిడంగ
    దేవేరి వెంబడించి గాంచె గజేంద్ర మోక్షమున్
    ఔరా అని ముదంబున, భక్త జన మం
    దారా, రమ్మని పిల్చె, నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. "రారా సుందర నాదు డెందమున సామ్రాజ్య క్షితీశుండవై,
    నోరారంగను నన్ను బిల్చి, యిదె నీ నూత్నానురాగమ్ముతో
    దారం జేరుకొనంగ రమ్ము! మదనా! తప్తాంతరంగ ప్రమో
    దా! రా ర"మ్మని పిల్చె నొక్క సతి భర్తం బ్రేమ పొంగారఁగా!

    రిప్లయితొలగించండి
  3. శ్రీరమ్యంబగు శారదైందవ లసఛ్ఛృంగార క్రీడాస్థలిన్
    మారానంద విలాస యుక్త రసరమ్యంబైన హర్మ్యంబునన్
    స్మేరాస్యా! సుఖలీల దేలవలె స్వామీ! మద్ధృదారామమం
    దారా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా

    రిప్లయితొలగించండి
  4. "రారా సుందర! మద్విశాల హృది సామ్రాజ్య క్షితీశుండవై,
    నోరారంగను నన్ను బిల్చి, యిదె నీ నూత్నానురాగమ్ముతో
    దారం జేరుకొనంగ రమ్ము! మదనా! తప్తాంతరంగ ప్రమో
    దా! రా ర"మ్మని పిల్చె నొక్క సతి భర్తం బ్రేమ పొంగారఁగా!

    రిప్లయితొలగించండి
  5. రారా ! మానస చోర ! చేరుకొనరా ! రావేలరా సుందరా !
    హా! రాజా! మనపాలి శత్రువుగదా యాషాఢ మాసంబిదే
    చేరన్ రార నెలైన వెంటనె యనెన్ - సెల్ఫోనులో తాను ము
    ద్దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా!

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కాలకౌశికున కమ్ముడు వోయి భర్తకు వీడ్కోలు పలుకుతూ
    నమస్కరిస్తున్న చంద్రమతి :

    01)
    __________________________________

    దారాదత్తము సేసినావు సుతునిన్ - దారా సమేతంబుగన్
    ధీరోదాత్తుడవీవు సత్యకమునన్ - దీక్షాపరత్వంబునన్
    ధారాళంబుగ స్వీకరించు మిదిగో - దండంబు ! మచ్చిత్త మం
    దారా ,రమ్మని పిల్చె ! నొక్క సతి భ - ర్తన్ ప్రేమ పొంగారఁగా!
    __________________________________
    సత్యకము = సత్యము
    *****
    మత్+చిత్త = మచ్చిత్త
    శంకరార్యా ! సరియేనా ?

    రిప్లయితొలగించండి
  7. జిలేబీ గారూ,
    మంచి భావాన్ని వెలిబుచ్చారు. దీనికి ఎవరైనా పద్యరూపాని ఇస్తారేమో చూద్దాం.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇంతకూ చంద్రమతి భర్తను పోయిరమ్మంటున్నదా, రమ్మంటున్నదా? :-)

    రిప్లయితొలగించండి
  9. రారా! శంకర! నాదు చిత్తమది నీ రాజ్యమ్ము గా నేలు కో
    రా !రావేల సరాగ మాడ సరసారామంబులం చిత్త చో
    రా !రా రమ్మనగా తపమ్ము విడవేరా పార్వతీ చిత్త కే
    దారా! రమ్మని, పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా

    రిప్లయితొలగించండి
  10. శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    "మచ్చిత్తము" సరియైన ప్రయోగమే.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈ సమస్య 2-5-2013 నాడు ఇచ్చాను. మరిచిపోయి మళ్ళీ ఇవ్వడం జరిగింది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  13. ఆరామంబున పండు వెన్నెలలలో నానంద మొప్పారగన్
    గారాబంబున నీ నికుంజములలో కౌగిళ్ళలో జేర్చగా
    రారా! మన్మధ భారి కోర్వనిక నో ప్రాణేశ! మన్మోహనో
    ద్దారా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా !

    రిప్లయితొలగించండి
  14. రేరాజున్ సిగదక్కచేసి జడనన్ శ్రీ గంగనున్ చేర్చి సొం
    పారన్ బొట్టుగ చిచ్చుకన్ను మెరయన్ పామున్ మెడన్ దాల్చి సిం
    గారంబై కరుణించినావా గొనుమా కైవారముల్ భక్త మం
    దారా రమ్మని పిలిచే నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా

    రిప్లయితొలగించండి
  15. కారగారము వంటి నీ జగతిలో గార్హ స్ధ్యమున్ మ్రగ్గు చున్
    బోరాటం బున జీవితాంత మికనే మోసంబు లన్ గాన కన్
    చేరా లంటిని నీదు పాద యుగళిన్ సేదన్ బడన్ భక్త మం
    దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగార గన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కారాగా రమువంటి నీజగతిలో గార్హ స్ధ్యమున్ మ్రగ్గు చున్
      బోరాటం బున జీవితాంత మికనే మోసంబు లన్ గాన కన్
      చేరా లంటిని నీదు పాద యుగళిన్ సేదన్ బడన్ భక్త మం
      దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగార

      తొలగించండి
  16. వారాంతంబున మంచి పాకము నిడన్ వాత్సల్య ముప్పొంగగా
    కారుణ్యామృత మూర్తి భర్త కొరకై కాంక్షా ప్రియత్వమ్మునన్
    నోరూరించెడి వంటకంబు లిడుచున్ నోరార హృద్యప్రమో
    దా! రా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా

    రిప్లయితొలగించండి
  17. ఆరామం బున వేచి యుంటిని కదా యాసించి నీరాక కై
    నోరూ రంగ భుజించ నీకు రుచియౌ నూబిండి కూరల్ వడల్
    తారా చంద్రుల వెన్నెలందు మనమీ తాంబూల సేవంబు నన్
    రారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా !

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !

    వందన మాచరించి వీడ్కోలు తీసుకోవడానికి
    వీలుగాదూరంగా మగవాళ్ళలో నున్న భర్తను
    కాస్త దగ్గరగారమ్మని చంద్రమతి పిలుస్తోంది !

    రిప్లయితొలగించండి
  19. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘జడనన్’ను ‘జడలో’ అనండి. ‘కరుణించినావ’ టైపాటు వల్ల ‘కరుణించినావా’ అయింది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ మొదటి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘చేరాలంటిని’ అన్నదాన్ని ‘చేరంగోరితి’ అనండి.
    రెండవ పూరణలో సమస్యలోని ‘దారా’ను ‘రారా’ అని మార్చారు. కాబట్టి ఇది పూరణగా స్వీకరించబడదు కదా!
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి