పండిత నేమాని వారూ, జయాపజయాలను సమానంగా స్వీకరించాలన్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘శాస్త్రజ్ఞులునున్’ అనకుండా ‘శాస్త్రజ్ఞులు త/ జ్జయమునకు...’ అంటే బాగుంటుంది.
హరి వేంకట సత్యనారయణ మూర్తి గారూ, ఉపదేశాత్మకమైన మీ ఖండిక అద్భుతంగా ఉంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘జగతిన’ అనకుండా ‘జగతిని’ అనండి. * మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, పోతన గారిననుసరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. ‘సామ్యమునకై’ అని ఉండాలి. ‘సామ్యము గోరి కృశించువారికిన్’ అందాం. * ఆదిత్య గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
విద్యల నేర్చెడు వేళ జ్ఞానార్జన
రిప్లయితొలగించండి....తప్ప వేరొక్క చింతనయె లేదు
సంఘమ్ములో నాకు జనగణ సేవయే
....కాక యన్యమగు సంగతి నెరుగను
సమరసీమను నాకు జన్మ భూరక్షణ
....మొక్కటే లక్ష్యమై యొప్పుచుండు
ధర్మమేయగు జీవితమ్ములో మార్గమ్ము
....కాని తదన్యమార్గమ్ము వలదు
లక్ష్య సాధనలో సదా లగ్నమగుచు
నే జయాపజయమ్ముల నెన్నడేని
స్వాగతించెద నే కడు సంతసమున
భవ్యయోగ మదే యను భావమలర
భయమెందుకు ధర్మమునే
రిప్లయితొలగించండినియమముతో ననుసరించ నీకది శుభమౌ !
జయమే తుది ఫలితము లప
జయములె యెన్నైన రాని చలియింపకుమా !
జయములు సరి , యపజయము, వి
రిప్లయితొలగించండిజయమునకే నాంది యండ్రు శాస్త్రజ్ఞులునున్
జయమునకు బొంగ కను నప
జయమునకుం క్రుంగ కుండు జనుడే ఘనుడున్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిజయాపజయాలను సమానంగా స్వీకరించాలన్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘శాస్త్రజ్ఞులునున్’ అనకుండా ‘శాస్త్రజ్ఞులు త/ జ్జయమునకు...’ అంటే బాగుంటుంది.
జయము కలిగెనేని సంతోషమందుచు
రిప్లయితొలగించండినపజయంబు గలుగ నతులదు:ఖ
మనుభవించు జనుడు హర్షావమానాల
కతడు కారకుండె? యవని లోన.
విజ్ఞులార! నిజము విజయాపజయములు
పూర్వ నిశ్చితంబు లుర్విలోన
మర్మమెరుగ దగును కర్మానుసారంబు
లఖిలఫలచయంబు లందరకును.
కర్మలందు హక్కు కలదు మానవులకు
ఫలములందు లేదు, భాగ్యవశము
ఫలమటంచు దలచి పనులు చేయుటయందె
బుద్ధి నిలుపవలయు పుడమి జనుడు.
జయము నందినాడ భయమేల నాకంచు
విర్రవీగకుండ, విజయమందు,
నపజయంబునందు నతిశాంతచిత్తుడై
మసలుచుండ వలయు మానవునకు.
జయము కలుగ దనుచు చలియించకుండంగ
స్థిరత జూపుచుండి వరుసనంత
విజయసిద్ధియందు వినయాత్మకుండౌచు
మెలగుచుండువాడు మేటి భువిని.
అపజయంబులోన నంతర్గతంబుగా
జయము కలదు నిజము భయమదేల?
అపజయంబు, జయము లారెండు సహజంబు
లనుచు తెలియదగును మనుజునకును.
జయము గాంతు మనెడు సంకల్పబలముతో
స్థిరతబూని లక్ష్య మరయు వరకు
పట్టువిడువకుండ గట్టిగా యత్నంబు
సలుప పొందవచ్చు జయము నిజము.
అపజయంబు మనిషి కతిసౌఖ్యదంబైన
జయము నందు కొరకు సాధనంబె
కనుక దాని జూచి మనమున చింతించ
వలదు ముందు కేగవలయు గాని.
జయమునకు పొంగవల దప
రిప్లయితొలగించండిజయమునకును గ్రుంగ వలదు జగతిన జయము
న్నపజయములు వెన్నాడును
జయాప జయముల కెపుడును జంకవలదయా
నేమాని పండితార్యా! చక్కగా సెలవిచ్చారండీ!
రిప్లయితొలగించండిమూర్తిగారూ! అభినన్దనలు.
జయము నపజయమ్ము సహజమ్ము బ్రదుకున
బొమ్మ బొరుసు వోలె సుమ్ము చూడ
తప్ప దెపుడు నీకు దక్కుట రెంటిలో
నేదొ యొకటి, చింత యేల? వలదు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
పంచాయతీ యెన్నికల ఫలితములను జూచి గెలిచినవారు, ఓడిన వారు జెప్పెడిది ఒకటే,డబ్బులు తీసుకున్న వారందరూ ఓటు వెయ్యలేదని,మధ్యలో దళారీలు లాభ పడిరి.గెలిచినా ఓడినా సంతోషము లేకుండెను,అభ్యర్థులు ఈ రీతిని బలుకుచుంటిరి. పోతన గారి పద్యములో
======*=====
నీరాట వనాటములకు
పోరాటము జరుగ లాభ మొందె ఖగమ్ముల్,
ఘోరము జయాపజయములు
భారమని బలుకుచు నేడ్చె పామరుల వలెన్.
జయము జయమంచు ముందుకు సాగి పోయి
రిప్లయితొలగించండిభక్తి భావము గొలిచిన భర్గు నెపుడు
అభయ మిచ్చును మనకప జయము లేక
ధర్మ నిరతిని మెచ్చును దైవ మెపుడు !
భయమున ముంచి మత్సరము, స్వార్ధము పెంచెడి భుద్ధికిన్ పరా
రిప్లయితొలగించండిజయమగుగాక –సర్వమత సామ్యముకై కృషి చేయు వారికిన్
జయమగుగాక దేశమును సాంతము రక్షణ సేయు సేనకున్
జయమగుగాక లోకమున శాంతులు నిండ సుఖింప సజ్జనుల్
జయమగు దేవి నీ కరుణ చాలన దృష్టి రవంత సోకినన్
భయములు దీరు నీ లలిత పావన పాదరజమ్ము దాల్చినన్
జయమగునే భవాని సరసమ్మగు వీక్షణ కాంతిచే పరా
జయము లభించు పాపులకు చల్లని నీకృప లుప్తమైనచో
రిప్లయితొలగించండితిమ్మాజీ రావుగారూ! చక్కని పద్యాలు వ్రాశారండీ!
నిజము రప్పించు విధములనిదియు నొకటి
రిప్లయితొలగించండిజయము మంచివానిగ నీదు జబ్బ చఱచు
అపజయము వైరియై నిన్ను హడల గొట్టు
బ్రతుకు చెరసాల విధి దీని రక్షకుండు
(good cop/bad cop interrogation tactics )
హరి వేంకట సత్యనారయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిఉపదేశాత్మకమైన మీ ఖండిక అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘జగతిన’ అనకుండా ‘జగతిని’ అనండి.
*
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
పోతన గారిననుసరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
‘సామ్యమునకై’ అని ఉండాలి. ‘సామ్యము గోరి కృశించువారికిన్’ అందాం.
*
ఆదిత్య గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
....
రిప్లయితొలగించండి