26, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1124 (పాడు మనుజుఁ జూడ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాడు మనుజుఁ జూడ వేడుక గద!
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

51 కామెంట్‌లు:

 1. గాన మదియె పన్నగమ్ముల నాడించు;
  గానము విని మనిషి మేను మఱచు!
  గాయకాళిలోనఁ గర్ణ పేయముగనుఁ
  బాడు మనుజుఁ జూడ వేడుక గద!!

  రిప్లయితొలగించండి
 2. చెడును దరికి నెపుడు చేర నీయకు మంచు
  మంచి వీడబోక మసలు మనుచు
  తన మదిని వివేక మను రాతి పైన రా-
  పాడు మనుజుఁ జూడ వేడుక గద!

  రిప్లయితొలగించండి
 3. గుండు మధుసూదన్ గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘మనిషి’ సాధురూపం కాదని కొందరంటారు. బ్రౌణ్యం లోను, రవ్వా శ్రీహరి, శంకరనారాయణ నిఘంటువుల్లోను, జి.ఎన్. రెడ్డి పర్యాయ పద నిఘంటువులోను ఈ శబ్దం స్వీకరింపబడింది.
  అలాగే ఉండనిద్దామా? కాదు, కూడదని (ఎవరైనా అంటే).... ‘గానము విని నరుఁడు....’ అందామా?
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. కలిమి లేము లందు ఘన మనః స్థిరతతోఁ
  దా నుదారుఁ డయ్యుఁ దనరుచుండి,
  లోక మందు జనుల శొకమ్ముఁ దీర్చి, కా
  పాడు మనుజుఁ జూడ వేడుక గద!

  రిప్లయితొలగించండి
 5. కంది శంకరయ్యగారికి నమస్కారములు. మీ రన్నది నిజమే. ధన్యవాదములు. తమను సూచించినట్లుగనే సవరించుచున్నాను.

  గాన మదియె పన్నగమ్ముల నాడించు;
  గానము విని నరుఁడు మేను మఱచు!
  గాయకాళిలోనఁ గర్ణ పేయముగనుఁ
  బాడు మనుజుఁ జూడ వేడుక గద!!

  రిప్లయితొలగించండి
 6. కవిరాజు నిజకృతుల్ బాగుగా పులకించి
  ....పాడు మనుజు జూడ వేడుక గద
  భక్తితో నిత్యమ్ము భగవాను సన్నిధి
  ....పాడు మనుజు జూడ వేడుక గద
  పాడుతా తీయగా బహు వేదికలనంచు
  ....పాడు మనుజు జూడ వేడుక గద
  పద్య నాటకముల హృద్యమౌ రీతిలో
  ....పాడు మనుజు జూడ వేడుక గద
  ఈడు జోడునగుచు తోడుగా నాడుచు
  పాడు మనుజు జూడ వేడుక గద
  ఆర్తిలోన నున్న యట్టి వారలను గా
  పాడు మనుజు జూడ వేడుక గద

  రిప్లయితొలగించండి
 7. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  అయిదు విధాలుగా పాట పాడి, చివరగా కా‘పాడి’న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. అన్య చిత్తకాక యన్య దేవుని గాక
  పరమశివుని నొకని మాత్రము మఱి
  భక్తి శ్రద్ధ గలిగి పంచా క్షరి నియత
  పాడు మనుజు జూడ వేడుక గద !

  రిప్లయితొలగించండి
 9. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది. ‘పరమశివుని నొకని మరువకుండ’ అందామా?

  రిప్లయితొలగించండి
 10. అన్నమయ్యగారి నచ్చతెల్గుపదాలు
  త్యాగరాజురాగతత్వకృతులు
  భక్త రామదాసు భవ్యమౌకీర్తనల్
  పాడుమనుజు జూడవేడుకగద!!!

  రిప్లయితొలగించండి
 11. మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘గారి యచ్చతెల్గు..’ అని యడాగమం వస్తుంది.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు, మీ పద్యము అన్ని విధముల పాడు మనుజుఁలను జూపినది

  రిప్లయితొలగించండి
 13. గోండ్లు చేతు రౌర ! గుస్సాడి నృత్యము
  అందమైన నాట్య మదియె జూడ
  ఒప్పిదమగు రీతి డప్పును వాయించి
  పాడు మనుజు జూడ వేడుక గద !

  రిప్లయితొలగించండి
 14. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘రక్షించి మునిజన..’ అన్నదాన్ని ‘రక్షించి మునులను’ అంటే అన్వయం కుదురుతున్నది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ గుస్సాడి ఆటపాటల పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  "తాటకి తనయులను మట్టుబెట్టి" అనుచోట యతి గానీ ప్రాసయతి గానీ కుదరలేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. వరప్రసాద్ గారూ,
  నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా. ఆ యతిదోషం నా దృష్టికి రాలేదు. ఆ పాదాన్ని ‘తాటకీ తనయుల గీటడించి’ అందాం.

  రిప్లయితొలగించండి
 17. హరి హరీ శ్రీరంగ హరి యంచు కీర్తనల్
  ....పాడు జియ్యరు జూడ వేడుక గద
  తందాన తాన తందాన బుర్రకథల
  ....పాడు బృందము జూడ వేడుక గద
  గంగెద్దును గొని బాకానూదుచుం జని
  ....పాడు జంగము జూడ వేడుక గద
  చందమామా యంచు జానపదాలను
  ....పాడు గాయకు జూడ వేడుకగద
  పాడు జగతి వద్దు వద్దంచు గురుగీత
  పాడు గురుని జూడ వేడుక గద
  శీఘ్ర లాభమంచు చీటీలు వేలముల్
  పాడు మనుజు జూడ వేడుకగద

  రిప్లయితొలగించండి
 18. అట సుయోధనుండు పటువీరధాటిచే
  గోగణంబునెల్లఁ సాగనంప
  విరటు గౌరవములఁవిక్రమోద్ధతన కా
  పాడు మనుజుఁ జూడ వేడుక గద

  మనుజుఁడు = నరుఁడు, (అర్జునుఁడు అనే అర్థములో )

  రిప్లయితొలగించండి
 19. గురువుగారూ,

  శ్రీనేమాని గురువర్యుల మొదటి సీసపద్యములో మొదటి పాదము

  "కవిరాజు నిజకృతుల్ కమనీయమై పొల్చఁ" అంటె యతి మైత్రి కుదురుతుందనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 20. పండిత నేమాని వారూ,
  అన్నీ పాడించి, చివరకు కొసమెరుపులా చీటీలు పాడించిన మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో యతిదోషాన్ని గురించిన సంపత్ కుమార్ శాస్త్రి గారి వ్యాఖ్యను గమనించారా?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండు అరసున్నాలను నిరర్థకంగా ప్రయోగించారు.

  రిప్లయితొలగించండి
 21. అంధుడైననేమి హార్మోనియము పైన
  బిడ్డ పాటపాడ దొడ్డ రీతి
  వీధివీధి తిరిగి భిక్షకై వాయించి
  పాడు మనుజు జూడ వేడుక గద

  రిప్లయితొలగించండి
 22. ఘంట సాల వంటి గాన మాధుర్యంబు
  వినగ వినగ మదిని తేనె లొలుకు
  బాలు పాడి నంత పరవ శమ్మునదేల
  పాడు మనుజుఁ జూడ వేడుక గద !

  రిప్లయితొలగించండి
 23. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
  సవరణలతో
  ====*======
  రాక్షస తతినణచి రక్షించి మునులను
  తాటకి దనయులను గీటడించి
  రోగ ముక్త జేయు యోగి వలెను గా
  పాడు మనుజుఁ జూడ వేడుక గద!

  రిప్లయితొలగించండి
 25. తాడు సర్ప మనుచు తలిచెడి వారల
  భయము తొలగ జేసి బతుకు మాయ
  విప్పి జెప్పి తత్వ విషయము దెలుపుచు
  పాడు మనుజుఁ జూడ వేడుక గద!

  రిప్లయితొలగించండి
 26. సుఖము నందు మనకు సఖులెంద రుండిన
  నాపద పడునప్పు డాప్తుని వలె
  చెంత నిలచి యన్ని చింతల దీర్చి కా
  పాడు మనుజుఁ జూడ వేడుక గద!

  రిప్లయితొలగించండి
 27. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు

  మరియొక వీనుల విందు జేయు పాట
  ======*======
  రాజకీయ మనుచు రాక్షస తతులెల్ల
  మిద్దె పైన నిల్చి మేలు గొలుప
  లాలి పాట గనవరతము రాజీ నామ
  పాడు మనుజుఁ జూడ వేడుక గద!

  రిప్లయితొలగించండి
 28. ధన్యవాదములు గురువుగారూ,

  ఈ అరసున్నాల గురించి కొంచెము అజ్ఞానము, అపోహలు ఉన్నాయి. తెలుసుకొనటానికి ప్రయత్నిస్తానండీ.

  ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారికి శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు. నా మొదటి సీసములోని యతి దోషమును సవరించుతూ ఈ క్రింది విధముగా మొదటి పాదమును మార్పుచేయు చున్నాను:

  "కవిరాజు నిజ కృతుల్ కరము మోదము గూర్ప
  ....పాడు మనుజు జూడ వేడుక గద" స్వస్తి.

  రిప్లయితొలగించండి
 30. ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తలిచెడి, బతుకు’ శబ్దాల సాధురూపాలు.. ‘తలచెడి, బ్రతుకు’
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నది మీ పూరణ. చాలా బాగున్నది. అభినందనలు.
  ‘పాటగ + అనవరతము’ అన్నప్పుడు సంధి లేదు. ‘ర-ల’లకు యతి చాలా మంది అంగీకరించరు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  అర్థానుస్వారాల గురించి ఒక పాఠం పెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. కానీ వీలు చిక్కడం లేదు. త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తాను.
  *
  నేమాని వారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 31. ఒక మిత్రుడు “మీ బ్లాగులో వ్యాఖ్యల అక్షరాలు చాలా చిన్నగా కనిపిస్తున్నవి. పెద్ద అక్షరాలైతే చదవడానికి అనుకూలంగా ఉంటుంది కదా” అన్నారు.
  ప్రతి పోస్ట్‌లోను పైన “సమస్యాపూరణం – 1124 (పాడు మనుజుఁ జూడ)” అన్న విధంగా శీర్షిక ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే వ్యాఖ్యలు పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపిస్తాయి.
  పోస్ట్ క్రింద “33 వ్యాఖ్యలు:” అన్నదానిని క్లిక్ చేస్తే వ్యాఖ్యలు పోస్ట్ చేయడానికి బాక్స్ కనిపిస్తుంది.
  ఈ విషయం మిత్రులకు తెలియదని కాదు గాని, ఎవరికైనా సందేహం ఉంటే తీరుతుందని వ్రాస్తున్నాను.

  రిప్లయితొలగించండి

 32. నేమాని పండితార్యా! ఎంతమంది పాడు వారిని చూపించారండీ!!

  రిప్లయితొలగించండి
 33. అయ్యా మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  కనుపట్టిన పాడు వారినందరినీ సీసాలలో బంధించేను కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 34. ఓ భర్త భార్యతో:

  ఇన్ని నాండ్లునీ సంసార మీదినైన
  పుష్కరమ్ము దాటినఁ జూసి పుట్టినూరు
  నిజము చెప్పు మనోహరీ!నీకు "పెద్ద
  పాడు" మనుజు జూడ వేడుక గద?!

  రిప్లయితొలగించండి
 35. రామకృష్ణ గారూ,
  మంచి పూరణ. ‘పాడు’తో అంతమయ్యే ఊళ్ళు చాలా ఉన్నాయి. వైవిధ్యంగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఈదియైన’ అని ఉండవలసింది.

  రిప్లయితొలగించండి
 36. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కమ్మగా పాడే పాటగాణ్ణి చూస్తే :

  01)
  _________________________

  పలుకు పలుకు నందు - పారవశ్యము నొంది
  పాట మీద మంచి - పట్టు గలిగి
  ప్రజల మనము లెల్ల - సజలములౌ రీతి
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________

  రిప్లయితొలగించండి
 37. వరద బాధితుల కాదుకొనే వాడగపడితే :

  02)
  _________________________

  ప్రబలమైన వరద - పాలైన జనులదె
  పల్లె వీడి , సొంత - యిళ్లు వీడ
  పాజ,పవన ములను- వసనముల నిడి,కా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  పాజము = భోజనము
  పవనము = నీళ్ళు
  వసనములు = బట్టలు

  రిప్లయితొలగించండి
 38. నేలబడిన పక్షి పిల్లకు కాపాడే వాడు కనపడితే :

  03)
  _________________________

  పక్షి పిల్ల యొకటి - దక్షపై బడ ,జూచి
  పక్షము లవె లేక - పాకు చుండ
  పక్షిగృహము బెట్టి - రక్షణ నిచ్చి,కా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  దక్ష = నేల(భూమి)
  పక్షిగృహము = గూడు
  రక్షణ = కాపు

  రిప్లయితొలగించండి
 39. పాకే వారికి చక్రపాదాలిస్తే :

  04)
  _________________________

  పక్షవాతమునను - పాదము పడిపోవ
  పాకు చున్న చిన్న - వార్కి ,చక్ర
  పాదము లవి యిచ్చి- బాధల దీర్చి,కా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  చక్రపాదము = రథము(tricycle)

  రిప్లయితొలగించండి
 40. పాతలిడిన పావనుని పొడగాంచిన ద్రౌపదికి :

  05)
  _________________________

  పాపచింత లేని - పాపాత్ము డొక్కండు
  పావనైన యామె - పైట లాగ
  పాణి జేర్చి ,కొలువ - పాతల నొసగి,కా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________

  రిప్లయితొలగించండి
 41. భార్యనూ, రాజ్యాన్నీ,ప్రాణాల్నీ కాచిన రాముణ్ణి తిలకించిన సుగ్రీవునకు :

  06)
  _________________________

  పాడు వాలి వలన - భార్యయు, రాజ్యంబు
  ప్రాణములును పోవు - భావమందు
  ప్రాణ భిక్ష బెట్టి - ప్రాణేశ,భూమి,గా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  భావము = కాలము
  ప్రాణేశ = భార్య
  భూమి = రాజ్యము

  రిప్లయితొలగించండి
 42. కాళీయ మర్దనము జేసిన కృష్ణుని గనిన గోకులవాసులకు :

  07)
  _________________________

  పాడు విసపు పాము - పాలబడ్డ మడుగు
  పాటు జెంద లోన - బడిన వారు
  పాము పడగ త్రొక్కి - బాలార్జునిలను,గా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  బాల =గోపబాలకులు
  అర్జుని = ఆవు

  రిప్లయితొలగించండి
 43. పాదుకలను ప్రసాదించిన రాముణ్ణి గనిన భరతునికి :

  08)
  _________________________

  పాడు రాజ్య మొద్దు ! - పాలకుండవు నీవె !
  పాపి గావు మనుచు - భ్రాత యనగ;
  పావకోళ్ళ నిచ్చి - భరతుని ,కరుణ,గా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  పావకోళ్ళు = పాదుకలు

  రిప్లయితొలగించండి
 44. కీర్తనలు విన్నా రామదాసును గనినా :

  09)
  _________________________

  పంచదార కన్న - పనస తొనలకన్న
  పలుక రామ నామ - మొలుకు సుధలు
  పాహి రామ యనుచు - పాటలెన్నియొ గట్టి
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________

  రిప్లయితొలగించండి
 45. కీర్తనలనూ, అన్నమయ్యనూ గాంచిన :

  10)
  _________________________

  బ్రహ్మ మొక్కటె ,పర - బ్రహ్మ మొక్కటె యంచు
  భక్తి వేంకటేశు - భజన మునిగి
  భజన కెక్కు తెఱగు - భజనల వేలు,రా
  పాడు మనుజుఁ జూడ - వేడుక గద !
  _________________________
  రాపాడు = రాయు = వ్రాయు

  రిప్లయితొలగించండి
 46. శంకరార్యా !
  వరప్రసాద్ గారి పూరణ గాని తొలగించిన ఆనవాలు గాని
  లేవెక్కడా !
  కాని ఆ పూరణపై మీవి నేమాని వారివి వ్యాఖ్యలు కనబడు తున్నవి !
  ఇదెలా సాధ్యం ?????????????

  రిప్లయితొలగించండి
 47. వసంత కిశోర్ గారూ,
  ఇంతకు ముందొకసారి అన్నాను. మీ పద్ధతి ‘అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి’ అని!
  మీ పది పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  4వ పూరణలో ‘వార్కి’ అనడం సాధువు కాదు. అక్కడ ‘చిన్నవారిఁ జక్ర..’ అంటే సరిపోతుంది.
  5వ పూరణలో ‘పావని యగు నామె’ అనండి.
  7వ పూరణలో ‘బాలార్జునులను’ అనండి.
  8వ పూరణలో ‘వద్దు’ను ‘ఒద్దు’ అన్నారు. అక్కడ ‘పాడు రాజ్యమేల’ అనండి.
  *
  వరప్రసాద్ గారి పూరణ గురించి.....
  ముందుగా వరప్రసాద్ దానిని తొలగించారు. అప్పుడు ‘వ్యాఖ్య తొలగించబడింది. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.’ అన్న వ్యాఖ్య కనిపిస్తుంది. దానిని నేను తొలగించాను. అప్పుడు ఇంకేమీ కనిపించదు.

  రిప్లయితొలగించండి
 48. శంకరార్యా !
  సవరణలూ సలహాలకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి