30, జులై 2013, మంగళవారం

పద్య రచన – 418 (ఆధునిక మయసభ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ఆధునిక మయసభ”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

 1. ఆర్యా! ఈ అంశము "మయసభ" గతంలో ఇవ్వడం జరిగింది.

  ఆనాటి నా పద్యము :


  ఏసభాభవనంబు వాసిగన్నది చూడ
  సౌందర్యరాశియౌ మందిరముగ,
  ఏసభాభవనంబు భాసిల్లుచుండెను
  కమనీయసత్కళాఖండ మట్లు,
  ఏసభాభవనమం దాసుయోధను డప్పు
  డవమానమును బొందె ననుపమముగ
  ఏసభాస్థలముతా నిమ్మహి పాండవ
  కౌరవకలహాల కారణంబు,
  అదియె మయుడను శిల్పితా నతికుశలత
  రచన మొనరించి యా ధర్మరాజు కపుడు
  నిండు మనమున నర్పించి యుండె నాడు
  లేని దున్నట్లు కన్పించు దానిలోన.

  రిప్లయితొలగించండి
 2. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  బయలుదేరబోతుండగా మీ వ్యాఖ్య కనిపించింది. నిజమే.. మరిచిపోయాను. ధన్యవాదాలు.
  శీర్షికలో చిన్న మార్పు ఛేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 3. మయసభలు లేవు నేడన్ని మాయసభలు
  సభల పేరిట రభసల స్థావరములు
  స్థావరంబులు నేడెల్ల చట్టసభలు
  సభలు తీర్చిన ధనికుల సంతగోల

  రిప్లయితొలగించండి
 4. మయుని సభను జూడ నరిగి మమత తోడ
  ఉన్న దనుకొని దాకగ సున్న మిగిలె
  లేదు లేయని నేగగ మీ ద కుఱు క
  బల్లి నా మీ ద , మిక్కిలి భయ పడితిని

  రిప్లయితొలగించండి
 5. అయ్యా! శ్రీ హరి వారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము (పూర్వము పంపినది) అద్భుతము. ఈనాడు మరెలా స్పందించుతారో - ఇంకా బాగుగ నుంటుంది అని మా నమ్మకము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! శ్రీ శ్యామల రావు గారూ!
  మీరు మాయ సభలంటున్నారు. మాయ కానిది ఏమైన ఉన్నదా? మాయం కాలేనిది ఏమైన ఉన్నదా? చిన్న మాయను పెద్ద మాయ అన్నారు కదా సినీ కవులు. మీ పద్యము ప్రశంసనీయముగా నున్నది. అభినందనలు.

  అయ్యా! శ్రీ సుబ్బారావు గారూ! ఏదో సున్న మిగిలిందన్నారు - జగత్తే సున్నా కదా. (జగన్మిథ్యా అని ఆర్యోక్తి కదా) - అయినా బొత్తిగా బల్లి కోసము భయపడుటా? మీ పద్యము బాగుగ నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. గురువర్యులకు నమస్సుమాంజలులు..
  ఈ మద్య గత 10 రోజులనుండి పాండిచ్చేరి కేంపుకి వెళ్ళినందున శంకరాభరణాన్ని చూడలేకపోయాను, ఈ రోజు వచ్చి చూసేసరికీ కనులకి ,మనసుకు విందైన ఎన్నో పూరణలు, పద్యరచనలు కన్పించాయి..అంత అందంగా,అలవోకగా వ్రాస్తున్న కవివరేణ్యులందరికీ అభివాదములు చేస్తూ..తమరిచ్చిన పద్యరచనకు,సాహసించి, తెగించి, తేటగీతి అనుకుని వ్రాసాను..తప్పులనెల్ల సరిదిద్దగలరు..

  రిప్లయితొలగించండి
 8. హస్తం తోదైవాలనెల్ల నర్చించొచ్చు
  అండ పిండబ్ర హ్మాండమున్ అందించొచ్చు
  తిమ్మి బమ్మిగ బతుకులు తిప్పెయ్యొచ్చు
  ఆధు నీకమయసభయె అంతర్జాలం

  రిప్లయితొలగించండి
 9. అలనాటి మయుని సభయన
  నిల నెన్నడు గనము సొగసు నిద్దుర నైనన్ !
  కలనైన గాంచ లేనివి
  కలుషితపు సభలు మెండు కలవర బెట్టన్ !

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి


 11. అమ్మా శైలజ గారూ!
  శుభాశీస్సులు. మీకు పద్య కవితలో గల ఆసక్తి ఆనందకరము. ఆ ఆసక్తిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించండి. తేటగీతి అనుకొంటే చాలదు. ముందుగా తేటగీతి, ఆటవెలది మరియు కంద పద్యములను విరివిగా చదివి పద్యము లయను బట్టి పద్యమును గుర్తించే యత్నము చేయండి. ఆ తరువాత మీ ప్రయత్నము తప్పక ఫలించును. మీరు కోరేరు కాబట్టి మీ భావమును తేటగీతిలో వ్రాసేను - చూడండి:

  చేతులార దైవార్చనల్ చేయవచ్చు
  నఖిల బ్రహ్మాండ భాండాల నరయ వచ్చు
  తిమ్మి బమ్మిగ బ్రతుకుల ద్రిప్ప వచ్చు
  మయసభలను నంతర్జాల చయములందు

  రిప్లయితొలగించండి
 12. మయుడు రచించె ఇంద్రసభ మాదిరి ధర్మజు రాజ్యమందు వి
  స్మయమొనరించు మండపము మాయ తటాకము, ద్వారముల్, వనుల్
  నయమగు రీతి నేడు అధునాతన శిల్పము నేర్పుతో దు
  ర్జయముగ గట్టినారు మన రాజ్యసభన్ పరిపాలనార్ధమై

  రిప్లయితొలగించండి
 13. అరయుచు రాజ్యతంత్రముల నన్నిసమగ్రపు రీతి చర్చలన్
  జరుపుచు చట్టబద్దముగ శాసనముల్ ప్రజ సేమ మారయన్
  బరపుచు నుందురీ భవన భవ్య విశాల సభాస్థలిన్ నిరం
  తరమును పావులన్ కదిపి తత్తరపాటున సభ్యులందరున్

  రిప్లయితొలగించండి
 14. అయ్యా! శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
  మీ 2 పద్యములును బాగుగ నున్నవి. అక్కడక్కడ సంధులను చేయలేదు. అభినందనలు.

  రిప్లయితొలగించండి