త్రింశదర్థ పద్యరత్నము – పోకూరి కాశీపతి
ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
24వ అర్థము
–వీరభద్ర స్మరణ
భూరి జఠర గురుఁడు = వినాయకుఁడు అన్నగా గలవాఁడును,
నీరజాంబక భూతి = రుద్రుని వలన బుట్టినవాఁడును,
మహిత కరుఁడు = మహత్తరమైన కరములు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమే మణిభూషలుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి బలిష్టమైన సేనకు
(రుద్రగణమునకు) అధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన బాణములకు (ఆగ్నేయ సమ్మోహనాస్త్రములకు)
అధీశుఁడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును
(అగు వీరభద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
విఘ్న నాధుని సోదర ! వీర భద్ర !
రిప్లయితొలగించండిరుద్ర గణముల కధ్యక్ష ! రుద్రపుత్ర !
వేడు చుంటిని నిన్నునే వినయ ముగను
గావు మమ్ముల నిరతము గరుణ తోడ