21, అక్టోబర్ 2016, శుక్రవారం

సమస్య - 2176 (పతి ముఖ దర్శనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్"
లేదా...
"పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా"

90 కామెంట్‌లు:

  1. పతి యనుమానములకు తా
    సతమతమై పార్వతియను సతి విసుగొందెన్
    బ్రతిమాలుచు వచ్చిన తన
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అతకులగు దనుజులు భువిని
    యతులను వేధించుటెరిగి నావేశముతో
    శితికంఠుడుండు తరి తన
    పతి ముఖదర్శనము సేయ బార్వతి వెఱచున్.

    వితమును గూడక శివుడను
    పతి నింటను కినుకదోడ పదరుచు పిలువన్
    పతి కోపము నెఱుఁగుచు దన
    పతి ముఖదర్శనము సేయ బార్వతి వెఱచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  3. సతియై దాక్షాయణియై
    పతియన శంకరుడటంచు పక్కల నిలచెన్
    పతియర్ధనారి యని తన
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. గతి సద్గతినెల్లపుడున్
    పతియన నయ్యరనుచు సతి పరమార్థంబున్
    స్తుతియించుచుండు, తా పర
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ భావమే కొంత సందిగ్ధం!

      తొలగించండి
  5. పతియా నతి జవదాటిన
    సతిపార్వతి భంగ పడగ సహనము లేకన్
    మితి మీరగ యవమానము
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    సతిపతులుగఁ గూర్పఁగఁ జని,
    రతిపతి జతనమును సేయఁ, బ్రతిఘన్ ద్ర్యక్షుం
    డతనిని నీఱొనరుపఁ, బశు

    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  7. (2)
    పతి కెపు డప్రియం బిడెడు వప్త యొనర్చెడు "దక్షయజ్ఞమున్"
    సతి కనఁగాను వేగ సని, సంకట మందఁగఁ, గ్రోధమంది, ద
    ర్పితు నణచం జెలంగు హరు రీతి, రతీశునిఁ గాల్చు ప్రేతభూ

    పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    మతిదప్పి తప్ప ద్రాగిన
    సతికిచ్చిన తాళిబొట్టు సైతము పోవున్
    అతి వినయవతియె పాపము
    పతిముఖ దర్శనముసేయ "పార్వతి "వెరచున్
    మతినొక మిత్రునిన్ గనిన మానిని పెద్దల మాటటంచు నో
    పతియని యెంచు పద్ధతిని పాడియదైను మెచ్చకేసుమీ!
    అతడన నచ్చియే తపము నల్లన జేసెను బొంద క్రొత్తదౌ
    పతిముఖ దర్ళనమ్మనగ పార్వతి మిక్కిలి భీతిలున్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. రమణ మహర్షి చెప్పిన పిట్టకథ:

    సీతాపహరణానంతరం శ్రీరాముడు దు:ఖిస్తూ సీత కోసం అడివంతా గాలిస్తున్నాడు. ఆ సమయాన ఆకాశంలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నారు. శ్రీరాముని చూసి పార్వతి భర్తతో ఇలా అనినది: "శ్రీ రాముడు సర్వజ్ఞుడైన విష్ణుమూర్తి కదా. అయినా మూర్ఖునివలె ఇలా ఎందుకు ఏడుస్తున్నడు?" శివుడు నవ్వి: "అదంతా నాటకం. నమ్మకపోతే నువు సీత వేషం ధరించి శ్రీరామునికెదురుగా కనబడు" అన్నాడు. సీతా అలా చేయగా శ్రీ రాముడు మాయసీతను చూసి: "ఓ పార్వతీ! నీవు ఒంటరిగా ఈఅరణ్యంలో ఏంచేస్తున్నావు? శివుడెక్కడ? నీవెందుకు సీత వేషంలో ఉన్నావు?":

    **************************

    సతికై వెదకెడి రాముని
    సతి వేషము దాల్చివచ్చి సామంతముతో
    ప్రతిభను జూపగ సీతా
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి.పి. శాస్త్రి గారూ,
      అవాల్మీకమైన మీరు తెలియజేసిన కథ రాముని వ్యక్తిత్వాన్ని చాటుతున్నది. దాని కనుగుణంగా మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. శృతి తప్పగ పతికోపము
    సుతుడే హతుడయ్యెననుచు శోకములోనన్
    బ్రతికిన కరిముఖుడౌగణ
    పతి ముఖదర్శనము సేయ పార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రుతి' అనండి.

      తొలగించండి
  11. అతులిత మగు రుగ్మతచే
    సతమతమయి వదనసీమ సౌరు లడంగన్
    వెతతో నద్దమునన్ రఘు
    పతి! ముఖదర్శనము సేయ పార్వతి వెఱచున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. స్తుత భాద్రపదపు శుద్ధ చ
    వితి వచ్చెను, నాడు తగదు విధు దర్శన మ
    య్యొ! తలను నెలవంక గలుగు
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్.

    స్తుతమయి యొప్పు భాద్రపద శుద్ధ చతుర్థిని చంద్రదర్శనం
    బతి హితదూరమంచుఁ దన యర్ధశరీరముఁ బాసె నేలనో?
    సతతము చంద్రరేఖను బ్రశస్తముగాఁ దలఁ దాల్చునట్టి యా
    పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్య గారూ...నమస్సులు! మీ రెండు పూరణములు అద్భుతంగా ఉన్నాయి!

      తొలగించండి
    2. నాకు కూడా అర్ధమయ్యేంత స్పష్టంగా వ్రాశారు. ధన్య వాదాలు సార్!

      తొలగించండి
    3. మిస్సన్న గారూ,
      గోలి వారూ,
      గుండా వారూ,
      గుండు వారూ,
      శాస్త్రి గారూ,
      ధన్యవాదాలు!

      తొలగించండి
  13. శ్రుతి మించిన కోరికలను
    గతి దప్పిన జీవితమున గష్టాల్ పెనగన్
    వెతలందు కుములు చుండిన
    పతి ముఖ దర్శనము సేయ "బార్వతి"
    వెఱచున్!

    రిప్లయితొలగించండి
  14. సుతనని తలవక యల్లుని
    శితికంఠుని బిలువ మరచి చేసెడు క్రతువే
    కృతకము! సతియౌచుఁ ‌బ్రజా
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. కం.కతమే దయినను గానీ
    సుతుడును గణ నాయకుండు చోద్యము గలుగ
    న్నతిగా నుగ్రు డయిన గణ
    పతి ముఖ దర్శనము సేయ బార్వతి వెఱచున్
    (గణేశుడు ప్రసన్న వదనుడు కదా !మరి యతడు ఆగ్రహోదగ్రుడయిన ఆ ముఖమును చూడ వెఱచుట సహజమే కదా !)

    రిప్లయితొలగించండి
  16. పతిమాటన్ జవదాటుచు
    సతి దక్షుని యఙ్ఞమునకుఁజనినపుడున్ స్వా
    గతసత్కారమున ప్రజా
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్ ||

    అతివకు భర్తమాటలెపుడండగనుండి శుభమ్మునిచ్చెడున్
    గతులవి మారిపోవునట కాదనుచుంజనినంత చూడరే
    సతి పతిఁ ధిక్కరించి పితృసన్నిధికింజనె దక్షుడన్ ప్రజా
    పతి ముఖ దర్శనమ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పతిఁ ధిక్కరించి' అన్నపుడు అర్ధానుస్వారం అవసరం లేదు.

      తొలగించండి
    2. ఆర్య! అనేక నమస్కారములు. సవరణ సూచించినందుకు ధన్యవాదములు. సవరించిన పద్యం పంపుచున్నాను.

      అతివకు భర్తమాటలెపుడండగనుండి శుభమ్మునిచ్చెడున్
      గతులవి మారిపోవునట కాదనుచుంజనినంత చూడరే
      సతి పతి ధిక్కరించి పితృసన్నిధికింజనె దక్షుడన్ ప్రజా
      పతి ముఖ దర్శనమ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా ||

      తొలగించండి
  17. అతులిత భక్తిని సేవిం
    చి తరింపగ నా భవాని శివుని కనుగొనన్
    ప్రతిబింబార్ధము తెలియగ
    పతి ముఖ దర్సనము సేయ బార్వతి వెఱచున్!
    (శివుని భక్తితో సేవించి తరించాలని తలచి దరిచేరితే సగమే కనిపిస్తున్నాడు, మిగతా సగంలో నా ప్రతిబింబపు సగం కనిపిస్తోంది - ఇదేమిటనుచు తన భక్తిని తానే శంకిస్తూ పార్వతి భయపడినట్లుగా నొక చమత్కార భావన. ఈది సరియగునో కాదో దయచేసి తెలుప గలరు. ధన్యవాదములు).

    రిప్లయితొలగించండి
  18. శ్రీవల్లి రాధిక గారి పూరణ...

    అతులిత రాగాన్వితమౌ
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచు
    న్నతివ కను రెప్పలకటా
    యతిశయ మగు సిగ్గు వరద నడ్డగ లేకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీవల్లి రాధిక గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. పతిఁ గొలిచి కరం బరుదగు
    మతిహీన వర మడిగిన కుమతి కంజ కులా
    వతరణుడు మహిత లంకా
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్


    పతి వలదన్ననేరక సుపర్వ సమూహము నేగు చుండగన్
    ధృత మతి యజ్ఞ వీక్షణకుఁ దేజము మీర గృహంబు సేరగం
    బితృ కృత భంగ వృత్తి కడు వేదన నీయ కళంకి తాత్మయై
    పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  20. సతి యయ్యును పార్వతి తన

    పతినే యనుమానపడుచు పలు నిందలు వే

    సె; తుదకు సత్యము తెలియగ

    పతి ముఖ దర్శనముు సేయ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేసె' అన్నది ద్రుతాంతం. 'వేసెన్+తుదకు = వేసెఁ దుదకు, వేసెం దుదకు, వేసెన్దుదకు' అవుతుంది. కనుక అక్కడ 'వేసి తుదకు...' అనండి.

      తొలగించండి
    2. గురువులు శంకరయ్య గారికి ధన్యవాదములు.
      మీ సూచన ప్రకారం మరలపంపు చున్నాను.

      సతి యయ్యును పార్వతి తన

      పతినే యనుమానపడుచు పలు నిందలు వే

      సి; తుదకు సత్యము తెలియగ

      పతి ముఖ దర్శనము సేయ బార్వతి వెఱచున్.

      తొలగించండి
  21. సతతము లోకపావనిని సంతున గొల్చెడి భక్తకోటిఁ దా
    ప్రతిదినమందు పూజలిడి భాద్రపదంబున విఘ్ననాథునిన్
    వ్రతమది చేయకున్న తన ఫాలపు భాగము నుండెడిన్నిశా
    పతి ముఖ దర్శనమ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా

    రిప్లయితొలగించండి
  22. అతికోపముతో శంభుడు
    సుతుడంచు తెలియక తున్మి స్రుక్కిల జేయన్
    పతిచే ఖండితమగు గణ
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. అతివకు బుణ్యము లొదవును
    బ తి ముఖ దర్శనము సేయ, బార్వతి వెఱచు
    న్స తతము మనసున దలచుచు
    బతియగు నావేంక టేశు బాధల గమికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బాధల గమికిన్'...?

      తొలగించండి
  24. అతులితమైన భక్తిననలాంబకు పాదములంట తా కడున్
    సతమతమౌట కాంచుచును చంద్రుడు హేళనచేయ పుత్రునిన్
    సతి కని తామసమ్మునను శాపమునిచ్చెనుతానె యా నిశా
    పతి ముఖ దర్శనమ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. అతిశయమైన ప్రేమ, విరహానల తాపము, తీవ్ర శోకముల్
    జతపడ శుష్కజీవనము. చావగ జాలను, దేవదాసుతో
    బ్రతుకగ లేను, ఖర్మ’ మను భావము డెందమునన్ స్ఫురింపగా
    పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. E.N.V. రవి గారూ,
      ఎంతకాలానికి పునర్దర్శనం. బ్లాగు ప్రారంభంలో తరచుగా కనిపించేవారు. ఆ తరువాత నల్లపూస ఐపోయారు. మీ పునరాగమనం సంతోషదాయకం. (కేవలం 'రవి' అని చూసి ఇంకెవరో అనుకున్నా. కాని ఫేస్ బుక్కులో E.N.V. రవి పేరుతో పూరణ పెట్టడంతో మీరే అని తెలుసుకున్నాను).
      శరత్ బాబు పార్వతి విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజానికి నాకు దేవదాసు పాత్ర కంటే పార్వతి పాత్ర అంటేనే ఇష్టం, సానుభూతి!

      తొలగించండి
    2. :) ధన్యవాదాలు. మొత్తం పద్యవిద్య నశించిపోయిందండి. పార్వతి - చంపకమాల వ్రాయించింది.

      తొలగించండి
  26. అతిశయ మేమున్నది, తా
    సతిధర్మము నెఱపుచున్న సద్గుణ వతియౌ
    అతివయె కావున మరిపర
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
  27. పతియే దైవంబనుకొని
    సతతము భావించుకొనగ?”సారాపంపా
    పతియెయింటికి రాగా?
    పతిముఖ దర్శనము సేయ బార్వతివెఱచున్.
    2. సతిపతి సద్గుణంబె తగుశాంతికి మూలము సంతు భాగ్యమౌ
    హితమును మానగానె?బలహీనత లంటును దయ్యమట్లుగా
    పతనము బంచగా?”వ్యసన భావన లందున కోపతాపమున్
    పతి ముఖ దర్శనమ్మనగ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'సారాపంపా'...?

      తొలగించండి
  28. సతతము కొలిచెడి పెనిమిటి
    సుతుడని చూడక దునుమగ శూలము చేతన్
    గతిచెందగ తన సుముఖుడు
    పతిముఖ దర్శనము సేయ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ మోహన్ గారూ,
      ఎప్పుడో రెండేళ్ళ క్రితమనుకొంటాను. బ్లాగులో కొన్ని పూరణలు చేశారు. మీ పునరాగమనం సంతోషదాయకం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. ఈనాటి సమస్యకు ప్రేరణ ఎన్.వి. రమణ రాజు గారి 'చిత్రకవితాప్రపంచం' బ్లాగులోని క్రింది టపా.

    కావ్యకంఠ గణపతిమునికి నవద్వీప పండిత పరిషత్తులో ఇచ్చిన సమస్య ఇది....
    "వత్సర స్యైకదా గౌరీ పతివక్త్రం నపశ్యతి"
    (సంత్సరాని కొకసారి గౌరి భర్త ముఖం చూడదు)
    ఇది పతివ్రతా ధర్మానికి విరుద్ధం కదా! దాన్ని వారు ఇలా పూరించారు చూడండి-

    భాద్రశుక్ల చతుర్థ్యాంతు చంద్రదర్శన శంకయా
    వత్సర స్యైకదా గౌరీ పతి వక్త్రం నపశ్యతి
    వినాయకచవితినాడు చంద్రదర్శనం దోషం కదా! మరి చంద్రుడేమో శివుని తలపై ఉంటాడు. అందువలన గౌరీదేవి సంవత్సరానికొకసారి శివుని ముఖం చూడదు - అని భావం.
    ఎంత కమనీయమైన ఊహతో పూరించాడో కదా!

    'చిత్రకవితాప్రపంచం' బ్లాగు నిర్వాహకులు ఎన్.వి. రమణ రాజు గారికి ధన్యవాదాలతో...)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈనాటి సమస్యకు, దానికి నా పూరణకు... అని చదువుకొన మనవి.

      తొలగించండి
    2. 'చిత్రకవితాప్రపంచం' బ్లాగు నిర్వాహకుల పేరు ఎ.వి. రమణ రాజు గారు. గమనించగలరు.

      తొలగించండి
  30. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { మేమెల్లరము దేవతలను దర్శ౦ప విహారయాత్ర కేగితిమి . మాతో పాటు పార్వతి అను నమ్మాయిని కూడా తీసుకెళ్లాము .తిరుపతి వే౦కటేశ్వరుని , మరియు ఆ భద్రాచల రాముని జూచి
    పూజి౦చితిమి . సి౦హాచల నృసి౦హుని
    ముఖదర్శన మనగ పార్వతి భీతిలును గదా
    దీనిని మది నె౦చి ఆమె మ౦దిర గర్భ ప్రవేశము
    చేయ లేదు }



    వ్రత నియమాను సార మనుర౦జిత మైన

    ………… విహార యాత్ర లో

    స్థతమతి ( న్ ) దైవదర్శనము జేసుకొన౦

    ………… జనినార | మ౦దున

    న్నతులిత మైన యట్టి వృషభాధిపు ,

    ………… భద్రగిరీ౦ద్ర వాసు న౦

    చితమగు భక్తి c బూజలను జేసితి |

    ……… మి౦ కల సి౦హశైలభి

    త్పతి ముఖ దర్శన౦బనగ బార్వతి మిక్కిలి

    ………… భీతులు౦ గదా

    మతి నిది నె౦చి రాదయెను మ౦దిర గర్భము

    ………… లోని కత్తరిన్

    రిప్లయితొలగించండి
  31. అతిశయమేమి లేదు, గని యచ్చెరువొందక యాలకింపుడీ,
    సుతుడను గాంచి నవ్వెనని శోకముతో కడు కోపియై నిశా
    పతిని శపించినట్టి సతి భద్రుడు చంద్రుని దాల్చెనంచు తా
    పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుతుడను గాంచి' అన్నచోట 'సుతు గనుగొంచు నవ్వెనని...' అనండి.

      తొలగించండి
  32. సందిత గారి పూరణ....

    సుతునిగణపతినిగని దుస్
    స్మితుడైెశాపంబునం దెచేరెనుచంద్రుం
    డతిథిగచవితినతారా
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్!

    రిప్లయితొలగించండి
  33. సుతుడని తెలియక దునిమిన
    ప్రతిగా గజముఖము తోడ ప్రాణము బోయన్
    కృతకంబుగ కనబడు గణ
    పతి ముఖదర్శనము సేయ బార్వతి వెఱచెన్!!!



    మితిమీరిన కోపముతో
    స్ప్రుతిజాతుని నుసిగ జేయ శూలధరుండే
    గతియించగ రతిపతి, పశు
    పతిముఖ దర్శనము సేయ బార్వతి వెఱచెన్!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. శైలజ గారూ స్మృతిజాతు డనిన తలపుల నుండి పుట్టిన వాడని యర్థము కద. "స్ప్రుతిజాతుని" అన్నారు పొరపాటా లేక విశేషార్థమేమైన నున్నదా?

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      అది టైపాటు అని భావించడం వల్లనే దానిని నేను ప్రస్తావించలేదు. ధన్యవాదాలు!

      తొలగించండి
  34. కంది శంకరయ్య గారూ ! నమస్కారము !
    "రంభాపతి రాముడయ్యె రాజసమొప్పన్"
    సమస్యకు వచ్చిన పూరణలు సమీక్ష చేయ లేదు. ఒకసారటు దృష్టి పెట్ట ప్రార్థన !
    -- గుఱ్ఱం జనార్దన రావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      ఆరోజు ప్రయాణంలో ఉండడం వల్లనో, అస్వస్థత వల్లనో పరిశీలించలేదు. ఇంకా పూర్తిగా నేను కోలుకోలేదు. వీలైతే రేపు చూస్తాను.

      తొలగించండి
  35. సతి దక్షయజ్ఞమును గన
    పతి యాజ్ఞనుమీరి పోయి భంగ పడంగన్
    వెత నొందు కథన మందున
    పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్

    రిప్లయితొలగించండి
  36. స్తుతి పాత్రుడు పరమేశుని
    రతిపతి బాణముల నేసి లలి యనురాగా
    న్వితు జేయ,క్రోధితుండౌ
    పతి ముఖ దర్శనము సేయ బార్వతి వెరచున్

    రిప్లయితొలగించండి
  37. అతులితమౌ తపోమహిమ నప్పరమేశ్వరు మెప్పు పొందియున్
    మతి చెడి తన్ను దా మరచి మంచిచెడుల్ విడనాడి యంతలో

    నతి దురితాత్ముడౌచు తన నాలిగ గోరిన ప్రాతవేలుపుం
    బతి ముఖ దర్శనమ్మనగ బార్వతి మిక్కిలి భీతిలుం గదా.

    రిప్లయితొలగించండి
  38. నుతమగు కంధరమ్మునను నున్నగ చుట్టిన కృష్ణసర్పమున్
    స్తుతమగు నీల కంఠమున త్రుళ్ళు విషమ్మును మాటిమాటికిన్
    సతమత మౌచు చూడగను స్వప్నము నందున మూడు కన్నులన్
    పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా :)

    రిప్లయితొలగించండి