19, అక్టోబర్ 2016, బుధవారం

న్యస్తాక్షరి - 36 (శం-క-ర-య్య)

అంశము- 'శంకరాభరణం' బ్లాగుపై మీ అభిప్రాయం.
ఛందస్సు- ఆటవెలఁది.
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా
‘శం - క - ర - య్య’ ఉండాలి. 
పద్యంలో ఎక్కడా 'శంకరయ్య' పేరును ప్రస్తావించరాదు.

113 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు...
  మొన్న కర్నూలుకు వెళ్ళే ముందు నాలుగు రోజుల టపాలను షెడ్యూల్ చేశాను. ఈనాటి సమస్య కూడా షెడ్యూల్ చేశాననుకొన్నాను. అస్వస్థత కారణంగా ఆలస్యంగా ఇప్పుడే లేచాను. తీరా చూస్తే ఈనాటి సమస్య లేదు. ఇప్పటికిప్పుడు ఏ సమస్య నివ్వాలో తోచక 'న్యస్తాక్షరి' ఇచ్చాను.
  ఆలస్యానికి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 2. గురుదేవులకు ప్రణామములు. ఆరోగ్యము జాగ్రత్త.ప్రయాణములను తగ్గించుకొన మనవి.

  రిప్లయితొలగించండి
 3. శంక లెన్నొ తీర్చు సామర్థ్యమా లేదు;
  కవి హృదయముఁ దెలియఁగా విఫలుఁడ;
  రసికజనులు మెచ్చ వ్రాయింతుఁ గవిత లి
  య్యల్పుని దగు బ్లాగు నందు సతము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకలన్ని దీర్చి సాహిత్యమును పంచు
   కవిత పటిమ తెలియు కవులు మీరు
   రసమయముగ కవన రసమొలికించిన
   య్యధిక కాంతి పంచు హరిహయేశ

   తొలగించండి
  2. హరి హరివర భక్తు డరిసూదనుం డల
   నిజ బల మెరుగని విధి జన హృదయ
   రంజ కుండు త్రిపుర భంజకాఖ్య శుభగుఁ
   డు తనదు ప్రతిభఁ గనడు కవి వరుడు

   తొలగించండి
  3. ఫణికుమార్ గారూ,
   కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు!

   తొలగించండి
 4. శంక యేల మీకు సాంబశివుని సాక్షి
  కవన, పద్య విద్య కలిపి నేర్పు
  రస సమాగమంబు! బ్లాగులందున నిద
  య్య యొక మేటి బ్లాగు!యనుసరింప

  రిప్లయితొలగించండి
 5. శంభు పత్ని మమ్ము చల్లంగ చూడంగ
  కమల గర్భు రాణి కరుణ మెఱయ
  రమయు మాకు మిగుల రమ్యంబుగనిడెన
  య్య కవనంపు శక్తి యలరు నెలవు

  రిప్లయితొలగించండి
 6. శంప మటుల దెనుగు సాహిత్యమందున
  కలన జేయు చుండె గావ్య పటిమ
  రమ్య భావ ఝరుల సౌమ్యుడై శంకర
  య్య వరుడు మనకిట సహాయ మిడుచు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ,
   'శంకరయ్య' పేరును ప్రస్తావంచరాదన్న నిషేధాన్ని గమనించ నట్టున్నారు.

   తొలగించండి
  2. అవును గురువుగారూ.... గమనించలేదు.... అయినా మీరే దీనికి అర్హులు.... నమస్సులు.

   తొలగించండి
  3. సవరణతో:
   శంప మటుల దెనుగు సాహిత్యమందున
   కలన జేయు చుండె గావ్య పటిమ
   రమ్య భావ ఝరుల సాధన బలముని
   య్యగను సరసతను సహాయ మిడుచు!

   తొలగించండి
  4. నా రెండవ పూరణము:

   "శంకరాభరణము" సమ్యగ్దిశా సూచి
   కరతలామలకము కావ్య మరయ
   రసమయంబగుచును రమ్యభావబలమి
   య్యగను దరినిలుచు రయంబు గాను!

   రయము=ప్రవాహము

   తొలగించండి
  5. మీ రెండు పద్యాలు బాగున్నవి.
   ఆకారాంత స్త్రీలింగ సంస్కృత పదం 'శంపా'. ఇది తెలుగులో 'శంప' అవుతుంది. ముప్రత్యయం చేరదు.

   తొలగించండి
 7. శంక యేల భావసంకోచ మది యేల
  కవితలల్లు పనిని ఘనత గూర్చు
  రమ్యమైన ఫణితి రయమున నేర్పు న
  య్య నిజముగను శంకరాభరణము.
  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి

 8. శంకలనకలంక పంకజములసేసి
  కవితలల్ల నేర్చు కవితలలను
  రమ్య నర్మ రీతి రసముల నద్దున
  య్యతుల భారతీప్రియాభరణము
  ఈ సాహితీ వేదిక

  రిప్లయితొలగించండి
 9. శంకలెన్నొ దీర్చి సరిమెచ్చు పద్యాలు
  కవులు వ్రాయజేసి గారవమున
  రసమయమ్ముగాను బ్లాగును మార్చెన
  య్య గురువులిటను గనుడార్యులార.

  రిప్లయితొలగించండి
 10. శంకలన్ని దీర్చి సాహిత్యమును బెంచు
  కవనమందు వివిధ గతుల జూపు
  రహివహించు నయ్య రసరమ్య భావమి
  య్యది గనుండు "శంకరాభరణము"

  రిప్లయితొలగించండి
 11. శంక గలుగు చోట సవరించి మిగుల మా
  కవిత లనట మంచి గాను మఱియు
  రమ్య ముగను నుండి రాణింప జేతువ
  య్య యవి నీకిత్తు నతులను నందు కొనుము

  రిప్లయితొలగించండి
 12. శంకర సతి మాకు శంకలేక యుత్తమ
  కవనములను వ్రాయ జవము నొసగె
  రమ్యమైన బ్లాగు రహము కల్గించెన
  య్య,రచింతు పద్దియముల మాల./నిచట.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి, చివరి పాదాల్లో గణదోషం. "...శంక లేకను మేటి... య్య రచియింతు పద్దియముల నిచట" అనండి.

   తొలగించండి
 13. శంకలన్ని దీర్చు సామర్ధ్యమును బెంచు
  కడు మనోహరంపు క్రమత జూపి
  రయము నేర్పు పద్య రచనంబున కనుడ
  య్య సతతమ్ము శంకరాభరణము.

  రిప్లయితొలగించండి
 14. జయహో శంకరాభరణం !


  శంఖ మయ్యె నిచట ఛందస్సు లను నేర్పి
  కణికలై మొదలిడి కంధి యయ్యె
  రమణియౌ జిలేబి నమనమిది గొనవ
  య్య!కవివర్య , పద్య రత్న మాల !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి


  2. శంఖ మయ్యె నిచట ఛందస్సు లను నేర్పి
   కణికలై మొదలిడి కంధి యయ్యె
   రమణియౌ జిలేబి నమనమిది గొనవ
   య్య!కవివర్య , పద్య యాన మనగ !

   జిలేబి

   తొలగించండి
 15. శంకలువిడి సతము చక్కని కవితల్
  కవులు మెచ్చునటుల ఖచ్చితముగ
  రయమున లిఖియించు ప్రజ్ఞనొసంగి తి
  య్యనగు పద్యములకు నాయువయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదం - కరము తృప్తి తోడ ఖచ్చితముగ - అనికూడా వ్రాయవచ్చు

   తొలగించండి
  2. మొదటి పాదంలో గణదోషం. "చక్కని కవితలన్" అనండి. 'కచ్చితము' సాధువు. 'ఖచ్చితము'ను శ్రీహరి నిఘంటువు పేర్కొన్నా అది వ్యావహారికమే. గ్రాంధికం కాదు.

   తొలగించండి
 16. శంక తొలగి తెనుగు ఛందస్సుతోడ వ్యా
  కరణమందు పట్టు దొరికెనిచట
  రస హృదయులు, గురువు లందరు నేర్పి ర
  య్య! యివె వందనమ్ము లందజేతు!

  శంక తీర్చి వైచె శంకరాభరణము
  కవిగ మర్చి భాష కందములిడ
  రస హృదయ్లు, కరము లందించి నేర్పి ర
  య్య! యివె వందనక్కు లందు కొనుడు!

  రిప్లయితొలగించండి
 17. శంకరాభరణము సత్కావ్య రచనకై
  కడగువారి కెల్ల గతుల శుభక
  రమగు భావమొసగు రమణీయ శబ్దశ
  య్య సమకూర్చుచుండు నసదృశమయి.

  రిప్లయితొలగించండి
 18. శంక తీర్చి వైచె శంకరాభరణము
  కవిగ మార్చి భాష కందములిడ
  రస హృదయులు, కరము లందించి నేర్పి ర
  య్య! యివె వందనక్కు లందు కొనుడు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. టైపాటులను సవరించాను.
   శంక తీర్చి వైచె శంకరాభరణము
   కవిగ మార్చి భాష కందములిడ
   రస హృదయులు, కరము లందించి నేర్పి ర
   య్య! యివె వందనమ్ము లందు కొనుడు!

   తొలగించండి
 19. శంకరాభరణము సద్గుణ భవ్య సు
  కవి నిలయము సకల కావ్య పఠన
  రతుల సుపరివేష్టిత తలము శుభద మి
  య్యవనిఁ గవన మెల్లఁ దివిరి నేర్పు

  రిప్లయితొలగించండి
 20. శంకరాభరణమొ సంగు ధ్యైర్యమ్మును
  కవితలు లిఖియించు కాలమందు
  రమ్యమైన బ్లాగు సౌమ్యుడౌ గురువు క
  య్యమ్ములు కనబడక యిమ్ముగూర్చు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'కయ్యమ్ములు కనబడక' కొనసాగుతున్న బ్లాగును గురించిన మీ పద్యం బాగున్నది.

   తొలగించండి
 21. శం కరమిది పద వశంకరమునిదియె
  కవన వన వనాంత గంధ యుతము
  రచన గతుల నేర్పరౌ రాజశేఖర
  య్య ఘనతనెరిజూ పు నద్ద మిదియె
  రాజశేఖరయ్య : శంకరయ్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృతజ్ఞతాపూర్వక నమస్సులు. దయచేసి, అతిచనువు,అధికప్రసంగము అనుకోకుండా మీరు కొంత విశ్రాంతి తీసుకొమ్మని మనవి

   తొలగించండి
 22. శంక లేదె వరికి శంకరా భరణమ్ము
  కలుగ జేయు పద్య కవిత లల్లు
  రపణమైన మేలు, రాజిల్లు నీ బ్లాగ
  య్య! నతులొనర్చెదనయా! మనీషి.

  రిప్లయితొలగించండి
 23. శంఖమునను రాలు సారాయి ధారకై
  కలలు గంటి రాత్రి కనులు నిండ
  రసిక రాణి నన్ను కసిరి పరుగులు తి
  య్య మదిని తలచితిని తమరి బ్లాగు!

  రిప్లయితొలగించండి
 24. శంక లేక మమ్ము సాహిత్య బాటలో

  కరము బట్టి నడుప గలరు బుధులు

  రమ్యమైన పద్య రచన గావింతు మ

  య్య నలరించ 'బ్లాగు'నందు సతము.

  రిప్లయితొలగించండి
 25. శంక యేల యిదియె జగతిలో వెలసిన
  కవనపు విరి తోట, కవుల కాత్మ
  రసహృదయులు మెచ్చు ప్రాజ్ఞుల కిదియె నె
  య్యమయి చెలగు జూడ యద్భుతమ్ము

  రిప్లయితొలగించండి
 26. శంభుని శిరమందు చంద్రరేఖను బోలి
  కవన లోకమందు కాంతు లీను
  రమ్య మైన బ్లాగు రసజగత్తు కది నె
  య్యమయి నిలిచె సత్యమవని యందు.

  రిప్లయితొలగించండి
 27. శంఖజముల నల్లి శారదా దేవిని
  కవులు గొలుచు నటుల గారవముగ
  రహి గలుంగ పద్య రచన నేర్పబడున
  య్య గనుగొనుడు శంకరాభరణము!!!

  రిప్లయితొలగించండి


 28. నలుబది వేలు పయిబడుచు
  నలరెడి పద్యపు పసిడి ధనాగారమిదీ !
  కలకాలము వెలుగుల ని
  చ్చు లక్ష ణముగ పలుకుజెలి చూడా మణియై

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు!
   ఇప్పటికీ బ్లాగులో ఎన్ని పద్యాలయ్యాయో నేను అంచనా వేయలేదు. మీరు ఆ పని చేసి నాకు సంతోషాన్ని కలిగించారు.

   తొలగించండి
 29. శంకరాభరణము సర్వోత్తమం|బ్లాగు
  కవులపూరణమిట భవిత కొరకె|
  రచన పచనమెంచి రక్తిగ మార్తువ
  య్య|గురువర్య|పద్యయశముబెంచ|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది పద్యం.
   'సర్వోత్తమం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'సర్వోత్తమపు బ్లాగు' అనండి.

   తొలగించండి
 30. రిప్లయిలు
  1. శంసనయుత దోషసవరణగావించి
   కవులఁ బ్రోత్సహించు ఘనుని చూడ
   రయ్య శంకరాభరణమను వేది నె
   య్యమును జూపి కవులనాదరించె.

   తొలగించండి
 31. శంకలన్ని దీర్చి శంకరాభరణాన
  కవులకిచ్చి కొత్త కవనధార
  రమ్యపద్యకూర్పు రంజిల్ల నేర్పితి
  య్యకవితలు వెలయగ యత్నమరసి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది.
   'పద్యకూర్పు' అనడం దుష్టసమాసం. 'పద్యరచన' అనండి.

   తొలగించండి
 32. శంభుపత్ని మెడను చంద్ర మణుల వోలె
  కవుల పద్య శోభ గ్రాలుచున్న
  రమ్య వేది "శంకరాభరణమిది" తి
  య్యని సమీక్ష లొసగు నునికిపట్టు

  రిప్లయితొలగించండి
 33. తరచుపయనమగుటసరికాదుశంకర!
  పయనమగుటవలనభద్రతయది
  కానరాదుమనకుకనుచూపుమేరన
  జరుగరానివియునుజరుగుచుండు

  రిప్లయితొలగించండి
 34. శంక లన్ని దీర్చి శంకరాభరణము
  కవిగ మార్చు నిన్ను ఖచ్చితముగ
  రమ్యముగను పద్య రచనమ్ము నేర్పి నె
  య్యమును పంచునుమన నయ్యవారు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంంది మీ పద్యం.
   'కచ్చితముగ' అనండి. అలాగే 'మన అయ్యవారు' అని ఉండాలి.

   తొలగించండి
 35. శంస యంబు లేక ఛందస్సు పటిమను
  కవన మందు నేర్పు ఖచ్చి తముగ
  రమ్య మైన రీతి రసమయ మగున
  య్యజ నులకు నేర్పు స్రష్ట గాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుందక్కయ్యా మీ పద్యం!
   చివరి పాదంలో గణ యతి దోషాలు. సవరించండి.

   తొలగించండి
  2. శంస యంబు లేక ఛందస్సు పటిమను
   కవన మందు నేర్పు ఖచ్చి తముగ
   రమ్య మైన రీతి రసమయ మగున
   య్యకవి యెవెలు గునటు లార్యు డయ్యు

   తొలగించండి
 36. శంక కలుగు రీతి '' శంకరాభరణము ''
  కష్టతర నిషిద్ధ ఘనపద ఝరి
  రసధుని నిడి కవుల రచ్చకీడ్చుగద! చ
  య్యనుచు పంపు కైత లనుచితమవ

  రిప్లయితొలగించండి
 37. కవిమిత్రులారా,
  అస్వస్థత కారణంగా సంబోధనలు, అభినందనలు తెల్పనందుకు మన్నించండి.
  బ్లాగు వైశిష్ట్యాన్ని ఇందరిన్ని విధాలుగా వివరించి ప్రశంసించినందుకు అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారూ, మీకు త్వరగా స్వస్థత చేకూరాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

   తొలగించండి
 38. శంకరాభరణముసాహితీ ప్రియులకున్
  కవులవేదికగను కావ్య రచన
  రసమయాన్వయబహు రచనల కునెలవ
  య్యగద బ్లాగుబహుళ యాగ క్రతువు

  రిప్లయితొలగించండి
 39. రేవులోను, నావలోను, పుట్టలోన పుట్టిన వారిని వర్ణిస్తూ పద్యము (మా యమ్మాయి సౌజన్య కోరగా వ్రాసినది). ఆ ముగ్గురి తో బాటు యింకో యిద్దరిని కలిపితిని.


  శ్రీరామాయణ కావ్య కర్త ఘన వల్మీకోద్భవుం డిద్ధరన్
  తోరంబౌ తరణోద్భవుండు ఘన చిద్రూపుండు వ్యాసుం డిలన్
  వారిప్రాంత శరోద్భవుండు శుభ షడ్వక్త్రుండు క్రౌంచారియున్
  హీరాభద్యుతి కుంభసంభవుడు యోగీంద్రుం డగస్త్యుం డిలన్
  నీరాటార్త పునర్భవార్చిత భవానీ శంకరాచార్యులున్
  దారిం జూప నమస్కరింతు మదినిం ద్రైలోక్య సంభావ్యులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ శంకరాచార్యుల ప్రస్తావనాంశము నాకు అర్థము కాలేదండీ.వారి పుట్టుక పైనలుగురి తో గల సామ్యము నాకు తట్టడంలేదండీ .దయచేసి నాసందేహము తీర్చ ప్రార్థన.

   తొలగించండి
  2. మూర్తి గారు నమస్సులు. నీరాటార్తుడు: మొసలి చేత బాధింప బడి, పునర్భవుడు: మృత్యువు బారి పడి తిరిగి జన్మ కలిగిన వాడు.
   అందరు సహజేతర విశేష జన్ములు.
   అర్చిత భవానీ: అన్నపూర్ణేశ్వరీ యని భవానిని యర్చించిన వాడు.
   ఇది నా భావము.

   తొలగించండి
  3. సహజేతరజన్మసామ్యము అర్థమైంది.సందేహము తీర్చినందుకు కృతజ్ఞతలు. సందేహము అడిగినందుకు క్షమాపణలు. మీపద్యరచనను సమీక్షించుసామర్థ్యము లేనివాణ్ణి. మీశైలి మాబోంట్లకు మార్గసూచి.

   తొలగించండి
  4. మూర్తి గారు సందేహము తీర్చ కలిగి నందులకు సంతోషము. ఇక్కడ క్షమాపణలకు తావు లేదండి. సందేహములు కలిగి నపుడే కదా యాలోచనా శక్తి పెరిగేది. ఏ సందేహమైనా నిస్సందేహముగా నడుగ ప్రార్థన.
   నా పద్యములను సమీక్షించు చున్నందులకు ధన్యవాదములు.

   తొలగించండి
  5. రావు గారూ మీ పద్యం సమీక్ష చేయలేదు. సందేహం మాత్రమే,అడిగాను

   తొలగించండి
 40. రిప్లయిలు
  1. శంబల రహితంబు సాహితీ సౌధంబు
   కవనపాఠశాల కావ్య శీల
   రసములూరు కావ్య రసఝరీ యూర్ములొ
   య్యనుచు నురుకు కవిహిమాలయంబు

   శంబలము :మాత్సర్యము
   కవిజలాశయంబు,కవి జనాశ్రయంబు
   దయచేసి విజ్ఞులు ఏది ఉచితతమమో తెల్ప ప్రార్థన
   కవుల ఉన్నతశిఖరములనుండి రసఝరులు ఊహ

   తొలగించండి
 41. శంకరాభరణము శంకలన్నియుదీర్చి
  కమ్మనైన పద్యకావ్యములను
  రహము తోడ వ్రాయంగ నేర్పెన
  య్యనిది నిజము నమ్ము డనవరతము.

  శంకరిదయచూప శారద కరుణింప
  కష్టమనక నిచట కవనములను
  వ్రాయనేర్చితినిటు వాసిగాను బెనక
  య్య సతము కరుణించి యాదరించె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పద్యాలు బాగున్నవి.
   మొదటి పద్యం మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 42. మిత్రులందఱకు నమస్సులు!

  శంక లేవి యున్నఁ జక్కఁగాఁ దీర్చి, సు
  రముఁ గానుఁ జేయు కార్యశీలి!
  యముతోడఁ బద్య రమ్యతఁ బొగడి, య
  య్య యిది బాగనియెడి "యయ్య" నతులు!!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 43. శ్రీగురుభ్యోనమః

  శంస జేయుచుంటి శంకరాభరణపు
  కవుల మధుర కవన గరిమ నెల్ల
  రక్తి కలుగ జేయు రత్నమై వెల్గున
  య్య జయ మొసగు వాణి యశము నిడుచు

  రిప్లయితొలగించండి
 44. డా.పిట్టా
  శంక వంక బాపు ఛందస్సు నియమాలు
  కంకలాయె మాకు కందములును
  రంకెలేయమన్న రహిని తప్పగును య
  య్యంకమందె మెదలునాశు కవిత
  ఘనత శరీర దార్ఢ్యమును గాన ని వానికి దక్కబోదు యా
  ననమున కాంతి నాస్తి యన నానదు శాంతి శరీరమాద్యమై
  యెనయును సర్వశక్తులును హెచ్చిన క్యాన్సరునడ్డ గోసి రా
  స్తనములు లేని పూరుషుడు సంస్తవనీయుడు గాడు ధాత్రిలో
  ఘనముగ బొట్టను బెంచగ
  గనడాయెను ఛాతి నిడివి కండర పుష్టిన్
  మనలేక నాసనాదుల
  స్తనములు లేనిపురుషుండు స్తవనీయుండే
  డా.పిట్టా

  రిప్లయితొలగించండి
 45. శంభుని కృపచే ప్రశస్తమౌ నీబ్లాగు
  కవన సుధల జల్లు భువిన కురియ
  రమ్య కవితలకును రహదారి యగుచు ని
  య్యవలయు కడు మోద మందరకును.

  రిప్లయితొలగించండి
 46. శంక వలదు మీకు శంకరాభరణమే
  కవుల కెల్ల తృప్తి కలుగ జేయు
  రసపిపాసు లౌచు రండయ్య శంకర
  య్యకు నమస్సు లిడుచు నాదరమున

  రిప్లయితొలగించండి