6, అక్టోబర్ 2016, గురువారం

సమస్య - 2164 (తులసీమాతను గొలిచిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తులసీమాతను గొలిచిన దురితము లబ్బున్"
లేదా...
"తులసీమాతను గొల్చినన్ దురితముల్ దోరంబులై యబ్బురా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

 1. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వలపులు వాంఛలు దీరును
  తులసీ మాతను గొలిచిన; దురితము లబ్బున్
  మెలనయె గూడక యుండిన
  వెలయింతుల వెంట నంటు వెఱ్ఱికి నెపుడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. కలినతులపుణ్యమబ్బును
  తులసీమాతను గొలిచిన, దురితము లబ్బున్
  తలబెట్టుచు గంజాయిని
  విలువెన్నకనాశ్రయింప పృథ్వీతలమున్ ||

  పలురోగంబులఁబారదోలగల దివ్యంబైనదీయౌషధం
  బిలవేల్పయ్యెను హైందవంబున కృపన్నీడేర్చు కామంబులన్
  తులసీమాతను గొల్చినన్, దురితముల్ దోరంబులై యబ్బురా
  యిల గంజాయికిఁ బూజఁజేతుననుచున్ హీనుండవై పల్కినన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'విలువెన్నక యాశ్రయించి' అనాలి కదా! (అక ప్రత్యయాంతావ్యయము కళ).

   తొలగించండి
  2. ఆర్య! అనేక నమస్కారములు. మీరు తెలియజేసిన తరువాతనే దోషమని తెలిసినది. సవరించినందుకు ధన్యవాదాలు. సవరణ చేసి పంపుచున్నాను.

   కలినతులపుణ్యమబ్బును
   తులసీమాతను గొలిచిన, దురితము లబ్బున్
   తలబెట్టుచు గంజాయిని
   విలువెన్నక యాశ్రయించ పృథ్వీతలమున్ ||

   తొలగించండి


 3. లలనా! శుభములు గలుగును
  తులసీమాతను గొలిచిన, దురితము లబ్బున్
  చులకన జేయ నితరులను,
  పలుకుల నడవడికల పరిపక్వత వలయున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పొలుపున్ బూనుచు గొప్పగా సతము సంభూషించుటల్ జేయగా
  సిలువల్ మాయుచు కోమలాంగులిల సౌశీల్యంబుతో వర్ధిలున్
  తులసీ మాతను గొల్చినన్; దురితముల్ దోరంబులై యబ్బురా
  వెలిచానల్ మెయి దిర్గగా నడరుచున్ పేట్రేగునౌవ్వారికిన్.

  (సిలువ= కష్టము; సంభూషించు= స్తుతించు; వెలిచాన = వేశ్య; మెయి= వెంట;)

  రిప్లయితొలగించండి
 5. కలికాలం బిదియైన గూలునుగదా కారుణ్య సంపూర్ణ నా
  యలిమేల్మంగను వేంకటేశమహిషిన్ హర్షప్రదన్ శాశ్వతన్
  తులసీ! మాతను గొల్చినన్ దురితముల్, దోరంబులై యబ్బురా
  యలఘుప్రాభవముల్ నిరంతర యశం బత్యంత సౌఖ్యంబులున్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. P.Satyanarayana
  జలకాలుష్యమరణ్య నాశన క్రియల్ చాంచల్య చిత్తంబు లా
  వులనున్ జంపుట మాంసభక్షణమునన్ వూపొంద మద్యంపు సే
  వలనున్ స్త్రీలకు మానభంగములతో వైవిధ్యపుం బూజలన్
  తులసీ మాతను గొల్చినన్ దురతముల్ దోరంబులై యబ్బురా!
  P.Satyanarayana
  తెలిసీ తెలియని నరునకు
  వలసెన్ బూజలను జేయ, వరుసలె దప్పెన్
  వెలివేసియు తన మాతను
  తులసీ మాతను గొలిచిన దురితములబ్బున్
  P.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'తెలిసీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'తెలిసియు' అనండి.

   తొలగించండి
 7. ఫలితము దక్కును తప్పక
  తులసీ మాతను గొలిచిన, దురితములబ్బున్
  కలికాలములోసతతము
  బలహీనులభూమిఁ గ్రోల బలవంతముగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. తలపులుదీరునునవనిని
  తులసీమాతనుగొలిచిన, దురితములబ్బున్
  మలినము సోకగజేసిన
  తెలిసియు దెలియక నరులకు ధీవరవినుమా!

  రిప్లయితొలగించండి
 9. పలురోగంబులు మాయమైచనును నా భాస్వద్యశోమూలమౌ
  తులసీమాతనుగొల్చినన్,దురితముల్ దోరంబులైయబ్బురా
  కలలోనైనను మైలపర్చి పలు దుష్కార్యంబులంజేయుచున్
  బలగర్వంబునదీసివైచినను దుర్భాషల్ ప్రలాపించినన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. కం. వెలసెను గల్ప తరువు గను
  వెల కట్టగ వీలులేని విధముగ దోపన్
  ఇలలో మనకిక నెవ్విధి
  తులసీ మాతను గొలిచిన దురితము లబ్బున్ ?

  రిప్లయితొలగించండి
 11. (1)
  తలిరుంబోడులు సుప్రభాతమున నే దేవిన్ సదా కొల్తు? రె
  వ్వలనన్ దైవకృపావలోకనము సంప్రాప్తం బగున్ దేహికిన్?
  ఖలులౌ వారలతోడి స్నేహ మొనరంగన్ జేయ నేమౌనొకో?
  తులసీమాతను; గొల్చినన్; దురితముల్ దోరంబులై యబ్బురా.
  (2)
  తెలవార స్నానమాడక
  తలపులలో భక్తి లేక తద్దయు విసుగున్
  గలిగి కృతక పద్ధతులన్
  దులసీమాతను గొలిచిన దురితము లబ్బున్.

  రిప్లయితొలగించండి
 12. కలబోయుచు గంజాయిని
  తులసీ వనమందు నాటి తులతూగంగన్
  కలిమియె ప్రధాన మనుకొని
  తులసీ మాతను గొలువఁగ దురితములబ్బున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. తులసీ ఔషధ గుణముల
  తెలిపిరి వైద్యులు పలువురు తెలియగ లేవా
  తెలుపుము యెట్టుల సాధ్యమొ
  తులసీ మాతను గొలిచిన దురితము లబ్బున్ !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంద పీతాంబర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తులసికి యౌషధ..' అనండి. 'తెలుపుము+ఎట్టుల = తెలుపు మెట్టుల' అవుతుంది. యడాగమం రాదు. 'తెలుపు మదెట్టుల సాధ్యము' అనండి.

   తొలగించండి
 14. వెలలేని సిరుల నొసగును
  తులసీమాతను గొలిచిన, దురితములబ్బున్
  తలి దండ్రుల దూషించుచు
  కలతల పాల్జేయు నట్టి కావరులకిలన్!!!

  రిప్లయితొలగించండి
 15. కలికుల నొకచో వికటపుఁ
  గులుకుల నునిచి తళుకు బెళుకులు తనరారం
  జెలువము లమ్మగ నయ్యిం
  తుల సీ మాతను గొలిచిన దురితము లబ్బున్

  [సీ = శ్రీ,, సంపద]


  విలువల్ నేర్చిన మానవుండని మహా విద్వాంసు డీతండనిం
  జెలువం బొప్పగ నీతనిం గొలువు సచ్ఛీలుండవై యంటినే
  కలనైనం దలుపంగ రా దతని ప్రాకారమ్ము లీ తాగుఁబో
  తుల సీమా? తను గొల్చినన్ దురితముల్ దోరంబులై యబ్బురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   అద్భుతమైన విరుపులతో చక్కని పూరణ లందించారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
  3. విలువల్ నేర్చిన మానవుండని మహా విద్వాంసు డీతండనిం
   జెలువం బొప్పగ నీతనిం గొలువు సచ్ఛీలుండవై యంటినే
   కలనైనం దలుపంగ రా దతని ప్రాకారంబటం దాగుఁబో
   తుల సీమా? తను గొల్చినన్ దురితముల్ దోరంబులై యబ్బురా

   తొలగించండి
 16. జలజాతాక్షుని మెప్పు చిక్కును గదా సద్భక్తితో నిత్యమున్
  తులసీ మాతను గొల్చినన్, దురితముల్ దోరంబులై యబ్బురా
  యిలలో దైవము దూరుచున్ సతతమున్ హీనత్వమున్ వర్తిలన్
  కలలన్ గంచు సదా శ్రమించ ధృతి సాకల్యమ్మగున్ కార్యముల్

  రిప్లయితొలగించండి
 17. లలనా !శుభములు గలుగును
  తులసీ మాతను గొలిచిన ,దురితము లబ్బు
  న్వెల యాల మోజువడి తన
  యాలిని నేగష్ట బెట్టు నాతని కి లలోన్

  రిప్లయితొలగించండి
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వ ర్యు ల కు న మ స్సు లు

  నిన్నపద్యములో " న " కు

  బి౦దుపూర్వక మహయిన " ఘ " కు యతి

  వేశాను . దానిని వర్గ యతిగా పరిగణి౦చ

  కూడదా ? అనగా

  ఙ్ఞ కారానికి న కారానికి యతి సరిపోదా ?

  నా స౦దేహము తీర్చ వలసి౦ది .

  ……………………………………………………


  అలాగే బి౦దుపూర్వక చ కారమునకు

  వర్గయతి వేయాల౦టే ఏ అక్షరము వేయాలి

  నా స౦దేహము తీర్చ వలసి౦దని మనవి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   ఒకసారి క్రింది లింకును క్లిక్ చేసి యతిభేదాలను గమనించండి.
   యతిభేదాలు-2

   తొలగించండి
 19. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  విలు వొక్కి౦తయు నీవు నీ మగనికిన్ |

  ………… వేది౦చి , నీ యత్త మా

  మల నేడ్పి౦తువు | ప్రక్కవారల పయిన్

  ……………… మాత్సర్యము౦ జె౦ది వ

  ర్తిలి , దూషి౦తువు | " ఛీ గయాళి "

  …… యను " కీర్తి౦" బొ౦దుచున్ గుల్కు నో

  లలనా ! యేటికి దొ౦గ పూజలను సల్ప౦గ ?

  …………… దుశ్శీల వై

  తులసీ మాతను గొల్చినన్ దురితముల్

  …………………… తోర౦బులై యబ్బు గా !

  రిప్లయితొలగించండి
 20. మ.ఇలలో దేవత యుద్భవించె మనకున్నీయంగ వేవేలుగన్
  కలలో నైనను గాంచనట్టి వరముల్ కారుణ్యమున్ జల్లుచున్
  పులకింపంగను మేను మానసమునన్ బూజింప; నేరీతిన్
  తులసీ మాతను గొలిచినన్ దురితముల్ దోరంబులై యబ్బురా?

  రిప్లయితొలగించండి
 21. కలతలు తొలగుట తథ్యము
  తులసీ మాతను గొలిచిన! దురితము లబ్బు
  న్నిలలో తన నెపమున నే
  కలకంఠి కనుగవ నీరు కారుచు జారన్!

  రిప్లయితొలగించండి
 22. తులసిని తులగల దేదియు
  నిలలేదని మును ముకుందు డింపుగ జూపెన్
  నెలతలటుగాక కుక్కల
  తులసీమాతను గొలిచిన దురితము లబ్బున్"

  రిప్లయితొలగించండి
 23. “నిలచును సుఖ,సంతోషము
  తులసీ మాతనుగొలిచిన”|”దురితములబ్బున్
  కలుషిత భావము లందున
  తెలియని వ్యసనాలుజేర?తిరుక్షౌరంబే”.|
  2.ఫలితంబబ్బును బాధ్యతాయుతపుభావంబందు నెల్లప్పుడున్
  తులసీ,మాతనుగొల్చినన్ “దురితముల్ దోరంబులైయబ్బురా
  వెలయాలే సుఖమన్నచో?గలుగు నిర్వీర్యంబు నిన్నంటులే|
  కలిమిన్,కీర్తినికాలరాయుగద|సంకల్పించ దుర్మార్గమే.

  రిప్లయితొలగించండి
 24. లలనా! సర్వశుభమ్ములొసుగు, నేలంజేరె దివ్యౌషధ
  మ్మిలన కృష్ణుని ప్రేయసై నిలిచెనా యింపైన యా మొక్కయౌ
  తులసీమాతను గొల్చినన్ , దురితముల్ దోరంబులై యబ్బురా
  కలికాలమ్మున వాడినన్నరులకే గంజాయనే మొక్కయే

  నిలుచును గదయా రోగ్యము
  తులసీమాతను గొలిచిన, దురితము లబ్బు
  న్నిలలో గంజాయనె
  ఖలు మొక్కల వలన సుమ్మ గనుమిది లలనా!

  ** నిన్నటి నా పూరణలు **


  భువిలో మేటి కవీంద్రులమ్మనుచునే పుంఖానుపుంఖాలుగా
  కవనమ్ముల్ రచియించినన్ గనగ సత్కావ్యమ్ములే శూన్యమై
  జవసత్త్వమ్ములు లేని కావ్యములతో జాగర్యమొందింపనీ
  కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్

  నవతర మంచును జాతిని
  యవమానించెడు కవితల నల్లెడు వారి
  న్నవని జనులు మన్నింపరు
  కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మొదటి, రెండవ పాదాలలో గణదోషం. 'సర్వశుభమ్ము లిచ్చుగద నేలం...', 'దివ్యౌషధ। మ్మిలలో...' అనండి.
   *****
   నిన్నటి పూరణల క్రింద నా వ్యాఖ్యను గమనించండి.

   తొలగించండి
 25. రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సవరించిన నిన్నటి పూరణ తిలకించ గోర్తాను.
   ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు. అవియున్ ద్రుతప్రకృతికమగుటచే సంధిరాక “అవియు నన్నన్” సాధువని సవరించితిని.


   అవినీతీతర కార్య నిర్వహణ సాహాయ్యేద్ధ వృత్తమ్మునున్
   దివిజారాధన ధర్మవర్తనము సందేహమ్ము వర్జింపు మె
   ట్టి విపత్కాలము నందు నైన నవి పాటింపంగ మేలౌను నీ
   కవి యన్నం గలికాలమందుఁ గడుఁ జుల్కం జూతురే యెల్లరున్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   నా సూచనను మన్నించి సవరించినందుకు సంతోషం. ధన్యవాదాలు!

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 26. కలుగును శుభములు నిత్యము

  తులసీ మాతను గొలిచిన; దురితము లబ్బున్

  తలిదండ్రుల శరణాలయ

  ములకున్ పంపించివేయు మూర్ఖులకెల్లన్.

  రిప్లయితొలగించండి
 27. కలబోయుచు గంజాయిని
  తులసీ వనమందు నాటి తులతూగంగన్
  కలిమియె ప్రధాన మనుకొని
  తులసీ మాతను గొలువఁగ దురితములబ్బున్.

  రిప్లయితొలగించండి
 28. అలివేణీ సిరులబ్బును
  తులసీమాతను గొలువగ;దురితము లబ్బున్
  తులసిని ద్రొక్కుచు తిరిగిన,
  యిలలో బాధలధికంబయి యేడ్తురు గనుమా!

  తులలేని సంపదబ్బును
  తులసీ మాతను గొలిచిన;దురితములబ్బున్
  విలువెరుగక సతతము యా
  తులసిని త్రెంచిన నిముసమె తొలగును సిరులున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. ఫలితము లభించు నిత్యము

  తులసీ మాతను గొలిచిన; దురితము లబ్బున్

  తెలిసియు మద్యము, గంజా

  యిల గొన నలవాటు పడిన నెవ్వరి కైనన్.

  రిప్లయితొలగించండి
 30. తొలగున్ పాపము, దూరమౌ నిడుములున్ దుఃఖంబులున్ దప్పకన్
  తులసీమాతను గొల్చినన్, దురితముల్ దోరంబులై యబ్బురా
  గొలువన్ జాలని స్త్రీల కిద్ధరణిలో, గుర్తించి సచ్చీలురై
  కలకాలంబిల పూజజేయ వలయున్ కాంతా మణుల్ నిత్యమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మి నారాయణ్ గారూ !నిఘంటువులలో అక్షర క్రమము (spelling) ' ఇడుమ ' 'ఇడుమలు ' అని ఉన్నది.

   తొలగించండి
 31. తులసీ పత్రములందు నుండినవి యస్తోకమ్ముగా నోషధీ
  విలువల్ రోగ నివారణమ్మగునుగా విశ్వమ్ము నందెవ్వరున్
  ​​తులసీమాతను గొల్చినన్​,​ దురితముల్ దోరంబులై యబ్బురా
  ​మలినాత్ముండగు వాని గొల్చినను సన్మానంబు నందించుచున్​!

  రిప్లయితొలగించండి
 32. కలుగు నకుఠిత పుణ్యము
  తులసీమాతను గొలిచిన; దురితము లబ్బున్
  వెలయాలి పొందు కొఱకై
  కులసతి పుస్తెలను త్రెంచి కులికెడు పతికిన్

  కులమత భేదము జూపుచు
  కలుషిత కార్యములు సలిపి ఘనులమటంచున్
  పలువురికి జూప భక్తిని
  తులసీమాతను గొలిచిన దురితము లబ్బున్

  రిప్లయితొలగించండి
 33. కలుషిత గంజా వనమిది
  ఖలులుండెడి జగములోన కనిపింతురు పూ
  జలుసెయు విటులు. వారికి
  తులసీ మాతను గొలిచిన దురితము లబ్బున్

  రిప్లయితొలగించండి
 34. సవరణకు ధన్యవాదాలు.
  మ.ఇలలో దేవత యుద్భవించె మనకున్నీయంగ వేవేలుగన్
  కలలో నైనను గాంచనట్టి వరముల్ కారుణ్యమున్ జల్లుచున్
  పులకింపంగను మేను మానసమునన్ బూజింప; నేరీతినిన్
  తులసీ మాతను గొలిచినన్ దురితముల్ దోరంబులై యబ్బురా?

  రిప్లయితొలగించండి
 35. నిలుపం జాలక ధూమపానమును హానిన్ గాంచకే పీల్చుచున్
  కలలో గూడను వీడలే కెపుడు తా కల్లున్ భళాత్రాగుచున్
  నెలలో ముప్పది పిజ్జలున్ తినెడి నా నేస్తుండు స్వాస్థ్యమ్ముకై
  తులసీమాతను గొల్చినన్ దురితముల్ దోరంబులై యబ్బురా!

  రిప్లయితొలగించండి