కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్"
లేదా...
"కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్"
లేదా...
"కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్"
కం.వేడుక మీర యొకతె తన
రిప్లయితొలగించండివాడేనని మేనమామ వలచి వరించెన్
గోడను చాటుగ గొని యా
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మీర నొకతె తన వాడే యని...' అనండి.
2) ఉ.ఈడును జోడునున్ గుదిరె నిద్దరకంచును పెద్దలందరున్
చేడియ నొక్కతెన్ తనదు చేతిని మేలుగ మేనమామకున్
కూడి నొసంగగా దలప కోరిక మీరగ చిందులాడుచున్
కోడలు మామ జూచి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివీడున మౌనము నిలుపుచు
పోడిమి లెంచుచు చెయివులు పొందుగ జేసే
వేడబమగు నాజవమున
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
(వీడు= ఇల్లు; పోడిమి= సైగ/గుఱుతు ; చెయివులు = పనులు; వేడబము = మనోహరము/విచిత్రము; ఆజవము = కుటుంబము)
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జేసే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'జేయన్' అనండి.
ఆడుచు పాడుచు నిరతము
రిప్లయితొలగించండినీడగ వెన్నంటి దిరుగు నీరజ తనకున్
వేడుక తోముద ముగమేన
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. 'వేడుక మేనరికమ్మని' అనండి.
రిప్లయితొలగించండిబాడబ యవధాని, నతని
కోడలు నేత్రావధాని ! కొమరుడు తండ్రిన్
వేడెనట గుడికి రమ్మని,
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండినేత్రావధానంతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
'..యవధాని యతని...' అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండిచూడగ నొక్కటా రుజయు చోద్యమునౌ కనులందు రెప్పలన్
గూడగ గట్టివేయు మరి కొందరి యక్షులు గోప్య పోకడల్
వీడవు తల్పులోయనగ వేసటగా నదురంగ,మూసి యా
కోడలు మామ జూచి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్
మాడకు నూనెను రుద్దగ
చూడడు యాబిడ్డ,మగడు చొప్పడె నిద్రన్
గోడు ఘటించగ వెసగొని
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చూడడు+ఆ' అన్నపుడు యడాగమం రాదు. 'చూడం డా బిడ్డ...' అనండి.
అంజయ్య గౌడ్ గారి (వాట్సప్) పూరణ....
రిప్లయితొలగించండికొన్ని ప్రాంతాల్లో అక్క తన కూతురిని తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుంది (సందర్భం)
వేడుకతోభగినియుతన
కూడజనించిన యతనికి కూతురు నివగన్
వీడెము నొసగుచు చక్కగ
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
బండకాడి అంజయ్య గౌడ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఇవగన్' అనడం దోషం. 'కూతురు నిడగన్/నొసగన్' అనండి.
మీ సవరణ సమంజసంగా ఉన్నది.
తొలగించండిఆడినమాట నిల్పుకొన నక్కకుమార్తెను జేకొనన్ బుధుల్
రిప్లయితొలగించండివేడుకగా ముహూర్తమును బెట్టిరి పెండ్లికి, మేనమామ తా
మేడిని బట్టి దున్నుచును మేలము లాడక మిన్నకుండగన్
కోడలు మామజూచి కనుగొట్టెను రమ్మని సైగజేయుచున్!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాడకువాడకుందెలియు వానికి సోదరి కూతరుండగన్
రిప్లయితొలగించండివేడుక పెండ్లిజేసిరని వేకువఝాము ముహూర్తమందునన్
తోడుగవచ్చినట్టియది దోషములేదిల మేనకోడలౌ
కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్ ||
వేడుకగా పెండ్లాడగ
తోడయ్యెన్ సోదరిసుత తుష్టినొసంగన్
కూడంగా తొలిరేయిన్
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్ ||
కోడలు = Daughter in law or Wife C.P.Brown Dictionary.
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వేడుకగా మేనరికము
రిప్లయితొలగించండికూడనతడు తాళికట్టె కోడలు మెడలో
వీడెమునందించుచునా
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దూడల బాలుద్రాపగను, దూపిలి యుండిన గోగణాలకున్
రిప్లయితొలగించండిబేడను దీసి గ్రాసమును వేసిన పిమ్మట తౌడు నీరముల్
గోడకునున్న గాబునను గూరిమితో మిళితంబు సేయ నా
కోడలు మామ జూచి కనుగొట్టెను రమ్మని సైగ జేయుచున్.
గోడకు బ్రక్కన గట్టిన
దూడలు గోవులకు సేవ తోరపు బ్రీతిన్
వేడుకగా జేయుటకై
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మాయాబజార్ చిత్రంలో ఒక ఊహా దృశ్యము:
రిప్లయితొలగించండి'ఆడెడి' మాయా శశిరే
ఖాడెదమని 'శకునిమామ' నాటకు పిలిచెన్
ఆడుచు మాయా జూదము
'కోడలు' కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శశిరేఖ+ఆడెదమని' అన్నపుడు యడాగమం వస్తుంది.
గోడను జాటు చేసుకొని కూర్చొని మిక్కిలి హర్షమందుచున్
రిప్లయితొలగించండిమేడను గోసినట్టిదగు మేలిమిజామఫలంబు మెక్కగా
నాడగ పాడగం బిలిచె నచ్చట నుండగ నమ్మతమ్ము డా
కోడలు మామజూచి కనుగొట్టెను రమ్మని సైగ జేయుచున్.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూడొక విడ్డూరమనుచు
రిప్లయితొలగించండికోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్,
జోడుపగల గొట్ట నాపయి
జూడయినన్ లేక నతడు సంద్రము నబడన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
తన మేనమామపై మక్కువతోడ పెళ్ళిచేసుకోవాలనే సందర్భంలో:
రిప్లయితొలగించండి"మేడలు మిద్దెలొద్దు నిను మించిన వాడిట లేడు మామ, తా
రాడకు, నేను నీజత సరాగము లాడగ నోపు దిక్కులం
జూడకు చక్కనయ్య, యిక చోద్యము లేల"ని బిల్చి కేలిడన్
కోడలు మామజూచి కనుగొట్టెను రమ్మని సైగజేయుచున్!
నా రెండవ పూరణము:
తొలగించండివేడుకతో నాపండుగ
జూడంగను వచ్చినట్టి చుట్టంబులతో
నాడెడి వరుసను సరసపు
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వద్దును ఒద్దు అనరాదు. 'మేడలు మిద్దె లేల...' అనండి.
అవును గదా.... ధన్యవాదములు.... సవరిస్తాను.
తొలగించండివేడగ తోబుట్టువు పో
రిప్లయితొలగించండిబోడి యగు తన కుమార్తె ముచ్చటఁ గని పెం
డ్లాడమని, వల్లెయనగన్
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
పూబోడి యగు - టైపు తప్పు.
తొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆడుచు యాడించుచు మను
రిప్లయితొలగించండివాడిన యా మేనమామె వరుడై రాగా
వేడుకగా మేనరికపు
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్!
గురువు గారికి నమస్కారములు. నిన్నటి పద్యాన్ని చూడ గోరుతాను.
ధన్యవాదములు.
తపము నడ్డుకొనగ తలబోయు వారలు
శాపములకు మదిని జడియు చుంద్రు!
ధ్యానము సమకూరి తాపము తొలుగగ
మునికి గోపమె కద భూషణంబు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు(నిన్నటి దానితో) బాగున్నవి. అభినందనలు.
'ఆడుచు నాడించుచు...' అనంండి.
వేడుక లింట సాగఁ బరివేష్టిత బంధు సమూహ మండపి
రిప్లయితొలగించండిన్నాడగఁ బ్రీతి నాలు మగ లందరు గూడి కుతూహలమ్ముగం
బాడిగ మేనకోడలిని భార్యగఁ జేకొన నుత్సహించి యా
కోడలు, మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
కూడవు వలుక నసహనము
తోడఁ గలహపుఁ బలుకులను దురితము సుమ్మీ
చాడీ లేల మగువ యే
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ పాపము కోడలికి మాటాడితే కనుబొమ
అదరుతు౦ ది , నరాలబలహీనత కాబోలు ! }
వేడిగ ను౦డె , " యిడ్డెనులు " , ప్రీతి
ి
…………… భుజి౦పగ మేల ట౦చు నా
కోడలు మామ జూచి కను గొట్టెను రమ్మని
…………… సైగ జేయుచున్ |
కోడలు పిల్ల మ౦చి | ది౦చుకయు
………… కొ౦టె తన౦ బది లేదు | పాప మా
చేడియ యొక్క భ్రూకుటి , వచి౦పగ మాట ,
…………… వడ౦కు చు౦డుగా !
పా డగు రోగముల్ గలవు , వైద్యుల కే
………… యవి య౦తు చిక్కకన్
{ యుడ్డెనులు = ఇడ్లీలు ; భ్రూకుటి =
కను బొమ ; }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. సవరించండి.
గురు మూర్తి ఆచారి గారు నమస్సులు. కొట్టక, తిట్టక యిత్యాదులు కళలు. చిక్కకన్ ద్రుతాంతముగా బ్రయోగించుట ( అప్రయత్నముగా చాలామంది, నాతో సహా, ప్రయోగిస్తారు) సరి కాదని నా సందేహము.
తొలగించండిమా అన్న గారు పోచిరాజు సుబ్బారావు గారి పద్యము:
రిప్లయితొలగించండిచూడుము కలియుగ ధర్మము
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
కోడలి చర్యకు భయపడి
కోడలినే వెడల గొట్టె గుపితుడు నగుచున్
కోడలు, మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
తొలగించండిజూడగ దుష్టకంబు లవి జోరుగ సాగుచు నుండె నీభువిన్
గోడలు మామ జూచి కనుగొట్టుట యేమిది కండకావరం
బాడది యుండగా వలెను నాడతనంబున గౌరవంబుగన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
బాడుగ బండి గట్టుకుని పట్నము నుండియె యత్తవారిటన్
రిప్లయితొలగించండివేడుక తోడ జేరగను విజ్ఞత తోడ నమస్కరించె నా
కోడలు మామఁ జూచి, కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
వేడెను భర్తయే వనము వెన్నెల లోన సరాగమాడగన్
పైడమ్మ యమ్మ తమ్ముడు
పైడయ్యను వాడితోడ పరిణయ మవగన్
వేడుకగా పిలుచుచు నా
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చూడగనే ప్రేమించెను
రిప్లయితొలగించండివేడుకగా నక్క సుతను పెండిలి యాడెన్
కూడగ నిద్దరు నొకచో
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
వేడిమిని సైచజాలక
కోడలు కను గొట్టె మామకున్ రమ్మనుచున్
కోడలు హిడింబి పిల్చెను
గాడుపుమామను నిదాఘకాలములోనన్
చూడగ వంశోద్ధారకుఁ
రిప్లయితొలగించండివీడున కనునెవ్వరు,హరి బిలిచెనెవ్వారిన్
వోడగ కనుసైగలతోఁ
కోడలు, కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
కృష్ణుడు కనుసైగలతో (కనుగొట్టె మామకున్)
పిలిచె(,రమ్మని)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[చందాలకై వచ్చిన వారికి చందాలీయవద్దని యత్త మామకుఁ జెప్పుటకై పిలువఁగా, నతఁడు రాకపోవుటచేఁ, గోడలినిఁ బురమాయించఁగా, నామె కనుసైగతో మామను రమ్మని పిలిచిన ఘట్టము]
వాడనుఁ బెద్దలు మామను
వేడఁగఁ జందాల; నత్త పిలిచెను; మామే
రాఁ డయె; నత్తయె సెప్పఁగఁ,
గోడలు కనుఁగొట్టె మామకున్, "ర" మ్మనుచున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి(2)
తొలగించండి[చంద్రశాలలో భర్తనుఁ గూడుటకై సమీపించిన యొకయింటి కోడలు, పైన మేఘాలు క్రమ్ముకొనుట వలనఁ, జంద్రుఁడు వెన్నెల కాయకుంటచే, వెలుతురు లేక, కన్నుసైగతో, మేఘాల చాటుననున్న చంద"మామ"ను రమ్మని పిల్చిన ఘట్టము]
మేడకుఁ బైన మింటఁ గల మేఘము క్రమ్మిన చందమామనున్
వేడఁగఁ బూని యప్పు డట విస్తృతమౌ తమితోడఁ బాటలన్
బాడుచుఁ "రాఁ గదోయి! యిఁక భర్తనుఁ గూడఁగ నుంటి" నంచు నా
కోడలు "మామఁ" జూచి కనుఁగొట్టెను "ర" మ్మని సైగఁ జేయుచున్
స్వస్తి
మామను చందమామగా మలచిన మీ భావం మనోహరం.
తొలగించండిధన్యవాదాలండీ మిస్సన్న గారూ!
తొలగించండిఅనారోగ్యముతో నున్న కోడలిని మామ చూడవచ్చిన సందర్భం:
రిప్లయితొలగించండిచూడగ వచ్చిన తను మా
టాడగ లేక నలతఁ గనులార్చుచు కరముల్
జోడించి దీవెనలఁ గొన
కోడలు కనుఁగొట్టె మామకున్ రమ్మనుచున్
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు.
ఈ సాయంత్రం మా మనుమణ్ణి పాఠశాల నుండి తీసుకు వస్తుంటే ప్రమాదం జరిగింది. మా మనుమడు అకస్మాత్తుగా ఎక్సిలరేటర్ రెయిజ్ చెయ్యడంతో ముందుకు దూసుకు వెళ్ళి ఆగి ఉన్న కారును ఢీకొని పడిపోయింది. నా రెండు మోకాళ్ళ క్రింద, ఎడమ చేతి మధ్య వేలు, ఉంగరం వేలుకు, కొద్దిగా నడుముకు దెబ్బలు తగిలాయి. అదృష్టవశాత్తు మనుమడికి ఏం కాలేదు. వైద్యునికి చూపిస్తే నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చారు. రేపు హెల్త్ కార్డు తీసికొని పెద్ద హాస్పిటల్ వెళ్తాను.
రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను. దయచేసి ఎవరైనా సరే గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి.
Respected Sir:
తొలగించండిSo sorry to hear this. Praying for your quick and painless recovery!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅయ్యో...ఎంత ప్రమాదం తప్పింది! రేపటి వరకూ ఎందుకు? ఇప్పుడే వెళ్ళండి. రేపటి వరకు నొప్పులెక్కువవుతాయేమో! రాత్రి యిబ్బంది కావచ్చు! మీ అబ్బాయిని పిలిపించి ఇప్పుడే వెళ్ళండి!
తొలగించండిమాస్టరుగారూ! పెద్ద ప్రమాదం తప్పినందులకు అదృష్టవంతులే.....మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను.
తొలగించండిఆర్యా!
తొలగించండిఇటువంటి సంఘటన జరగటం దురదృష్టకరం. మీకు త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
గురువుగారూ....ఈ సంఘటన చాలా బాధ కలిగిస్తోంది.... విశ్రాంతి తీసుకోండి...మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను....
రిప్లయితొలగించండిఅయ్యో. మీరు త్వరగా కోలుకోవాలండీ.
రిప్లయితొలగించండివాడని మోమువాడ మనువాడిన నా ప్రియ ప్రాణమా చనం
రిప్లయితొలగించండిబాడియె నన్ను వీడి యిట భారము కాదొకొ రేయి నాకు నీ
తోడది లేక, నీ పిత సుదూరము పోయెడి నంచు భర్తతో,
కోడలు మామఁ జూచి, కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండి*గోడలదూకగమగడటు*
*వాడలసానులకొసంగవడ్డాణములన్*
*తోడైయత్తకుకనుగొన*
*కోడలు కనుగొట్టె !మామకున్ రమ్మనుచున్.*
*🌺సందిత బెంగుళూరు🌺*
శ్రీకంది శంకరయ్యగారికివందనాలతో మీయొక్క ఆరోగ్యము జాగ్రత్తగాచూచుకొండిఅన్నివిదాల శంకరుడే చూడగలడు.మంచిజరగాలని కోరుకుంటూ
రిప్లయితొలగించండి26.10.16.అత్తగారింటఆడపడుచును చూడడానికివచ్చినసమయాన
చూడగ రాగ నోవరుడు చూపులకందగ లేదు మామకున్
నీడననున్న నీరజ తనేయనుభావన కానుపించకే
గోడకు చాటుగా నిలిచి గుర్తెరుగంగను సంజ్ఞజేయుచున్
కోడలు మామజూచి కనుగొట్టెను రమ్మని సైగ జేయుచున్.
2.పాడల వాటగు సిగరెట్ట్
వాడెడి తనభర్త యొక్క పరివర్తన నే
జాడను మాన్పగ సైగగ
కోడలు కనుగొట్టే మామకున్ రమ్మనుచున్. {భర్తతప్పుజూపుటకు}
గురువుగారూ, త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాము
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ, బాధాకరమైన సంఘటన. మీరు త్వరగా కోలుకోవాలని భగవంతునికి మా ప్రార్థన.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ! పెద్ద ప్రమాదం తప్పినందులకు అదృష్టవంతులే.....మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను.
తొలగించండిమేడను చాటున జూచితి
రిప్లయితొలగించండినీడనుదాగుచును యత్త నీటుగ నగుచున్
మేడావారింటి చివరి
కోడలు, కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దురదృష్టకరము. వీలైతే యిప్పుడే చూపించుకోండి.
రిప్లయితొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా,దైవ కృపవల్ల ప్రమాదం తప్పినట్లే కాని ఈ వయస్సులో ద్విచక్ర వాహన వాడుకను తగ్గించండి,పిల్లలను గొంపోవ సాహసించవద్దండీ,
గురువు గారూ !
రిప్లయితొలగించండిఇప్పుడే చూశాను.ఇది చాలా దురదృష్టకరం.మీరు
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
అన్ఇనయ్ప్పుయగారూ ఇప్పుడే చూశాను.ఇది చాలా దురదృష్టకరం.మీరు
రిప్లయితొలగించండిత్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను.
ఆడుచు పాడుచు పెరిగుచు
రిప్లయితొలగించండివేడుకతోనకక్క తనయ వేంచేయంగన్
కోడలి వరసేనని యా
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
వేడగ బావయు దిట్టుచు
నాడను నీతోడ నటంచు నలుకను చూపన్
వాడిగ నింగిని జూచుచు
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్.
గురువుగారికి వందనములు.
రిప్లయితొలగించండిఈ వయసులో కొంత జాగరూకత వహించడము శ్రేయస్కరము గురువుగారూ. మీరు త్వరగా కోలుకోవాలని అభిలషిస్తున్నాను
గురువుగారు...దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పింది..అశ్రద్ధ చేయక వెంటనే మంచి హాస్పిటల్లో చూపించండి..మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నా..
రిప్లయితొలగించండికూడును దినుటకు వృక్షపు
రిప్లయితొలగించండినీడన గూర్చున్న మామ నెదురుగ పామున్
చూడగ గట్టిగ నరవక
కోడలు కనుగొట్టెమామకున్ రమ్మనుచున్!!!
గురువర్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిగోడకు చాటుగా గురక కొట్టుచు వృద్ధుడు మామ నిద్రిడన్
రిప్లయితొలగించండికోడలు మామఁ జూచి;...కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
పోడిమి మీరగా మగని పోకిరి చేష్టలు వీడుమంచు నా
కోడలి జుత్తు దువ్వుచును కొల్లలు పేలను నొక్కమంచుచున్