కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్"
లేదా...
"నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్"
లేదా...
"నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము"
కడు పేదన్ శుభలక్షణాన్వితను సౌఖ్యంబెన్ని పెండ్లాడనె
రిప్లయితొలగించండిన్నడు కాఠిన్యమెరుంగనట్టిరవి, వెన్నల్ చిల్కగా చల్లనౌ
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
పడకంజేరిననూత్నకాంత ముఖభాస్వత్ శ్వేతకాసారమున్ ||
రూపకాలంకారము. ముఖము = శ్వేతకాసారము. నేత్రములు = ఉత్పలములు.
సద్గుణాఢ్యుడు రవి సౌందర్యవతినెన్ని
పెండ్లిజేసికొనగ ప్రియముఁ భార్య
పడకటింటియందునడిరేయి రవిఁ గాంచి
నవ్వె నుత్పలముల నయన, వధువు.
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా ద్విపద పాదాన్ని ఆటవెలదిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.
జగతి నేలె డిరవి జంటకోమలి నెంచి
రిప్లయితొలగించండిజేరె ముదము గాను చెలియ చెంత
నిండు చంద మామ నడిరేయి రవిగాంచి
నవ్వె నుత్ప లముల నయన వధువు
అక్కయ్యా,
తొలగించండిద్విపద సమస్యకు మీ ఆటవెలది పూరణ బాగున్నది.
కాని... మూడవపాదంలో యతి తప్పింది. సవరించండి.
జగతి నేలెడి రవి జంటకోమలి నెంచి
తొలగించండిజేరె ముదము గాను చెలియ చెంత
వెండి వెన్నె లేమొ నడిరేయి రవిగాంచి
నవ్వె నుత్పల ముల నయన వధువు
అక్కయ్యా,
తొలగించండియతిదోషం సవరింపబడలేదు. ప్రాసాక్షరం ఒకటి అనుస్వారపూర్వకంగా, మరొకటి అనుస్వారం లేకుండా ఉండకూడదు కదా!
అవును క్షమించాలి ఈమధ్య మరీ మతిపోతోంది .గమనించలేదు
తొలగించండి
రిప్లయితొలగించండిసడిజేయన మనస్సు సఖుని జేరగను
పడిగాపుల వయస్సు పరితపించనట
సుడిగాలి వలె పతి సుకుమారినిగన
నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండి' షట్పది ' లో -
చల్లని కౌముది
నిడు శశి గాంచుచు
తెగబాఱె నోయి కంధి నడిరేయి;
రవిగాంచి నవ్వె ను
త్పలము సింధువు నందు
రేగుచు నుండి నీరెండనోయి.
(కంధి = సముద్రము)
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిషట్పదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాపేరు: "ప్రభాకర" శాస్త్రి. నా భార్య ముద్దుపేరు: "కలువ" రాణి. నాకు తెలుగు వ్యాకరణం రాదు. కానీ శ్రీమాన్ శంకరయ్య గారి ప్రోత్సాహంతో "శంకరాభరణ" గోష్టిలో కలిశాను:
రిప్లయితొలగించండిప్రౌఢుల సభన 'ప్రభాకరు'డుండి
పట్టుబట్టి తెలుగు పద్యముల్ వ్రాయ
పడిపడి నవ్వె నా ప్రియసతి 'కలువ'
"నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము!"
జి. ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణలోని చమత్కారం బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. "పడిపడి నవ్వె నా పత్నయౌ 'కలుగ'" అందామా?
ధన్యవాదములు ఆచార్యవర్యా!
తొలగించండిఈరోజే పరవస్తు గారి బాలవ్యాకరణానికి ఆర్డర్ ఇచ్చాను. రేపు వస్తుంది అమెజాన్లో.
నమస్తే!
శాస్త్రి గారూ,
తొలగించండిమీకొక వ్యాకరణ పుస్తకం పి.డి.యఫ్. పంపించాను. మీకు ఉపయోగపడుతుందో లేదో ... చూసి చెప్పండి.
నళిని సంతసించె నడి రేయి! రవి గాంచి
రిప్లయితొలగించండినవ్వె నుత్పలములె నాకమనుచు!
యట్టి రాత్రి మరియు నట్టి పగలె నిల
పగల ద్రోలి వైచు! వగల దీర్చు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నాకమనుచు। నట్టి రాత్రి మరియు నట్టి పగలె యిల" అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండినడికూపంబని గాంచ నా జగతినిన్ నాకంబుగా గూర్చెదన్
వడినిందేర్పడునట్టి చిత్రములకే వాసిన్ గనన్నోస్థలిన్
నడిరేయిన్ రవి గాంచి యుత్పలములానందంబునన్ విచ్చెడిన్
సడియుం జప్పుడు లేని కాలముననే "సావిత్రి"నిన్ గన్నటుల్
ఓ స్థలిన్ ఉదా॥ అమెరికా వంటి పడమర భూభాగంలో
కడుప్రేమ గానదో కాలంబు ననగ
పడి పడి పరికించు వైనంబు విభుని
కడనుండు చింతనన్ గదిసిన మదిని;
నడిరేయి రవి గాంచి నవ్వె ఉత్పలము! డా.పిట్టా
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఒక'ను 'ఓ' అనరాదు.
ఎడబాటున్ సహియించలేక దన రాకేందుప్రభా మానసున్
రిప్లయితొలగించండిసడి లేకన్దరి జేరగన్ గనుచు నాశల్బూయగన్ వేగమే
యొడిలోనన్ దనియించు లాలనల నుత్సాహంబునం దూగగన్
నడిరేయిన్ "రవి" గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్!
రిప్లయితొలగించండినా రెండవ పూరణము:
అలుక వీడిన వేళను పలుక నేర్చి
కులుకు లొలికెడి దనసతి కోప మడచ
దువ్వ, "నడిరేయి, రవి గాంచి నవ్వె నుత్ప
లము"లు, దరిజేరిన మగని లాలనమున!
దువ్వు=నిమురు
శిశ్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "యొడిలోనన్ దనియించు లాలనలతో నుత్సాహమం దూగగన్" అందామా?
ధన్యవాదములు గురువుగారూ సవరిస్తాను.
తొలగించండిమ.వడిగా జేరితి యుత్సహింప మది యా వైబోగముంజూడగన్
రిప్లయితొలగించండినడిరేయైనను వెల్గుచుండు రవి యా నార్వే ప్రదేశమ్మునన్
కడు మోదమ్మును పొందు గాదె మదియే కాంచంగ నాదృశ్యమే
నడిరేయిన్ రవి గాంచి యుత్పలము లానందంబున విచ్చెడిన్.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జేరితి నుత్సాహింప..' అనండి.
పడరాని పాట్లను బడుచున్న గాని
రిప్లయితొలగించండినడకతొడరుచుండె నాజూకు లేక
పడకిల్లు జేరిన పట్టదే నిదుర
వడిగనుత్పలమాల వరదల్లె రాక
బడలి పోయెనుమది భావంపుజడికి
పడిపడి పరికించి పరితాపపడెడు
నడిరేయి రవిగాంచి నవ్వెనుత్పలము
తడగమ్ము నందుండి తలయూచెనదివొ!!!
అత్యద్భుతం
తొలగించండిశైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరణ :లానందంబునన్ విచ్చెడిన్.
రిప్లయితొలగించండిసడిలేని వెన్నెల సరసాల నీడ
రిప్లయితొలగించండిపడిలేచి మిగిలిన ప్రణయాల జంట
నడిరేయి, రవిగాంచి నవ్వె నుత్పలము
షోదయమున వారి శోభను గనుచు
చివరి పాదం సవరణ
తొలగించండిచూడము వారిని చురుకులొద్దనుచు
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చురుకు లెందుకని' అనండి.
వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్
రిప్లయితొలగించండిసుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో
యొడిలో పుస్తకముంచివ్రాయ 'రవి ' యే ' నో ' యంచు ధారాగతిన్
నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శక్తితో నొడిలో...' అనండి.
వేడి గాడ్పు వీచె నడిరేయి, ర విగాంచి
రిప్లయితొలగించండినవ్వె నుత్పలమన న్యాయ మౌనె ?
చంద్రు జూడ గ విక సనమునొందు భువిని
రవిని జూడ గముకు ళ త నునొందు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కడగండ్లు పడి రవి,కాలు జారంగ
రిప్లయితొలగించండిపడమరసంద్రాన,పాతాళమునకు
పడిపోయె.నడుసులో నడగారుచున్న
నడిరేయిరవి గాంచి నవ్వె నుత్పలము
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్న సవరణతో..
రిప్లయితొలగించండివడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్
సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో
నొడిలో పుస్తకముంచివ్రాయ 'రవి 'తా ' నో ' యంచు ధారాగతిన్
నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.
తాన్ (ఓ) యంచు
ఉత్పలము = ఉత్పలమాలా వృత్తములు.
గోలి వారూ,
తొలగించండిసవరించిన పూరణ బాగుంది. సంతొషం!
పుడమిం జంద్ర సుదర్శనంబు మది సమ్మోదంబు సేకూర్చదే
రిప్లయితొలగించండికడతేర్చంగ దినాంతరశ్రమను సౌఖ్యంబౌ శరద్రాత్రినిం
గడు చిత్తద్యుతి కల్గ జేసెడు కురంగాంకుండు చంద్రుండు దా
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
బడబాగ్ని మించు తాపము వెదఁజల్లు
కడగన్ను చూపుల కడతేర్చఁ గాంత
తడియారఁ గుత్తుకఁ దారాధిపుఁ గను
నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము
[రవి = జీవుడు]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఅఖండ యతి వలదనుకొని చేసిన సవరణ:
తొలగించండిపుడమిం జంద్ర సుదర్శనంబు మది సమ్మోదంబు సేకూర్చదే
కడతేర్చంగ దినాంతరశ్రమను సౌఖ్యంబౌ శరద్రాత్రినిం
గడు చిత్తద్యుతి కల్గ జేయు మణి సంకాశుండు చంద్రుండు దా
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅఖండయతి ఎవ్వరు ప్రయోగించినా నేను అభ్యంతరం చెప్పను. దానిని ప్రయోగించరాదని వ్యక్తిగతంగా నేను మడి కట్టుకున్నా ఈమధ్య ఒకటి రెండు సందర్భాలలో తప్పలేదు.
సవరించిన పూరణ (అఖండయతిని పరిహరించినందుకేమో!) ఉత్తమంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
మడిచేలన్ తడి పెట్టగా జనెను సామాన్యుండ దేవేళలోన్?
కడు శోభన్ వికసించె తామరలు తత్కార్యంబు లెట్లబ్బెనో?
వడిగా జందురు డేగుదెంచ భువిపై భాసింపగా వెన్నెలల్ !
నడిరేయిన్, రవిఁ గాంచి, యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
కడుశక్తి జోడించి ఘనతరంబయిన
రిప్లయితొలగించండినక్షత్రశాల నా నగరంబులోన
నిర్మించి యున్నారు నిష్థాత్ము లందు
నడిరేయి రవిగాంచి నవ్వె నుత్పలము.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముడివేయ రాజుతో మూలమై తాను
రిప్లయితొలగించండినడిరేయి, రవిగాంచి నవ్వె నుత్పలము
తడబాటు నెరుగక తానె దినమంత
వడిజేరి వసియించ పద్మమ్ముతోడ
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కదన రంగమునందు కవ్వడిన్ దునుమ
రిప్లయితొలగించండికర్ణుడు కొలను లో కలువ యై వెలుగ
కన్న తండ్రిననుచు ఖగుడేగు దెంచ
నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
వడి నక్షత్రపుశాల కేగి తలచెన్ బాలుం డవాక్కై యటన్
రిప్లయితొలగించండినడిరేయిన్ రవిగాంచి, యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
కడిమిన్ రాత్రులలోన గాదె యిచటం గన్పించ దొండైన దా
ముడుసంతానము లోషధీశుడు ముదం బున్నార లీవేళలోన్.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడుగుల్ వేయుచు భార్యజేరెనతడే యానందమొప్పారగన్
రిప్లయితొలగించండిగడియన్ వేసితి చేరరమ్మిటకు సత్కాలమిదే యంచనన్
బిడియమ్మేవిడె కాంతులూరు కనులన్ ప్రేమించుభర్తన్ గనన్
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
బిడియ పడుచున్న భామనే ప్రియుడు చేరి
సరస సంభాషణము జేయ సంత సించె
నారి నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్ప
లముల వోలెను మెరిసెనా లలన కనులు
వడిగా గాలి ప్రచండవేగమున భీభత్సమ్ము సృష్టింపగా
రిప్లయితొలగించండిజడి వానై కురియన్నిలాతలమె యో సంద్రమ్ము గామారె నా
నడిరేయిన్ , రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
విడిపోవన్ గగనమ్ముమబ్బులిక తా విచ్చేయగా సూర్యుడే
విరించి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'సత్కాలమ్మిదే' అనండి. లేకుంటే గణదోషం.
మూడవ పూరణలో 'ఒక'ను 'ఓ' అన్నారు. అక్కడ 'కురియ న్నిలాతల మయో సంద్రమ్ము...' అనండి.
వడిగా సాగదు కాల మీ దినమ మావాస్యన్ కటా లేక మా
రిప్లయితొలగించండియొడయం డంచు విచారులై విడువ నిట్టూర్పుల్ రవిన్ కేతువే
సడి లేకన్ కబళించ గ్రమ్మె తిమిరాల్ చంద్రుండయెన్ భానుడున్
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలువ కన్నుల చిన్నది వలచి రవిని
రిప్లయితొలగించండిపెండ్లి యాడె; పడకటింట వెంటనున్న
నారి నడిరేయి రవి గాంచి నవ్వె; నుత్ప
లములు విరిసినవా యంచు రవియు బల్కె.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పడకటింట నెపుడు ప్రమదముకలుగు?
రిప్లయితొలగించండికడుముద మెప్పుడు కను తమ్మిపూలు?
యుడుపతి కనుగొని యుప్పొంగె నెద్ది?
నడిరేయి, రవిఁ గాంచి, నవ్వె నుత్పలము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గగనాన మేఘాలు గ్రమ్మేనో యేమొ
రిప్లయితొలగించండికమలాల గనలేని కలతయో నేమొ
అస్తమించుటమాని అలిసెనో యేమొ
నడిరేయి రవిగాంచి నవ్వెనుత్పలము!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలతయో యేమొ... అనండి.
.అడుగకనే జెప్పెనతివాగుడందు
రిప్లయితొలగించండితడబాటు యందున త్రాగియునొకడు
నడిరేయి రవిగాంచి నవ్వె నుత్పలము
జడపువ్వు రవ్వలుజతజేర భార్య? {రవిగాంచి=పేరుగలవ్యక్తీ}
2,తడబాటందున నవ్యదంపతుల నిత్యానందభాగ్యంబునే
వడిగా బంచగ నెంచ శోభనము సర్వంబంచు భావించుచున్
గడుపన్ బూనగ భార్య కళ్ళచట నోకాసారమే| చిత్రముల్
నడిరేయిన్ రవిగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్ {భర్తయొక్క ప్రతి బింభముయుత్పలములు,కన్నులకాసారాలు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రాసలీల సలుప రవిశశి నేత్రుడు
రిప్లయితొలగించండిమురిసి చూసె యమున పరుగులాపి
నడచె వినయమలర నడిరేయి రవిగాంచి
నవ్వె నుత్పలములు నర్మముగను
శ్రీవల్లి రాధిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరికనుండి సందేహించకుండా నేరుగా బ్లాగులో పూరణలు ప్రకటించండి.
గడియైన నినువీడి కనుమూయలేను
రిప్లయితొలగించండిసుడిగాలి లానీవు చుట్టుకు రాకు
నడిరేయి రవిగాంచి నవ్వెనుత్పలము
సడిసేయకోస్వామి సరగున రార
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నడిరేయిన్ రవిగాంచి శార్దులము లానందంబునన్ చేరగా
రిప్లయితొలగించండినడిరేయిన్ రవిగాంచి మత్తెభము లానందంబుగా కూడగా
నడిరేయిన్ రవిగాంచి చంపకము లానందంబుగా పూయెగా
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్ :)
(ఇచ్చట "రవి" యనగా అర్ధరాత్రి పద్యములు వ్రాసి ప్రచురించు భవదీయ వృద్ధ "కవి"...పేరు "ప్రభాకరుడు" aka G. P. Sastry)
తొలగించండినడిరేయిన్ గాంచెను రవి
వడినేదేదో తెలియదు ప్రస్తుత మీ యం
శుడు గాంచి నవ్వె భళివి
చ్చెడు నుత్పలముల జిలేబి జేజే యనవే :)
జిలేబి