18, అక్టోబర్ 2016, మంగళవారం

సమస్య - 2174 (మగఁడు ప్రసవించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మగఁడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె"
లేదా...
"మగవాఁడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్"

80 కామెంట్‌లు:



  1. పురిటి నొప్పులకు సగము పురుషుడున్ను
    బాధ్యతగొన వరము బొంది భార్య మేలు
    నిదుర బోయి లేవంగను నిమ్మళముగ
    మగఁడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఆ మధ్య వచ్చిన 'చిత్రం భళారే విచిత్రం' సినిమాను గుర్తు చేశారు.
      బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు

    గుర్విణిగ నున్న సాధ్విని కొక్కిరించ
    శాప మిడె నామె మగనికి సత్త్వ మమర
    విధముగ నవ మాసములకు విడుపు గలిగి
    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె.

    (మగడు = రాజు; గుర్విణి = గర్భవతి; సత్త్వము = గర్భము)

    గురువుగారూ! నమస్కారములు. దయతో నిన్నటి (మొన్న) పద్యాన్ని పరిశీలించండి,

    కుంభిని వెలిగిన బుధులను
    దంభముతో బట్టి యణచు దనుజుల జంపన్
    సంభవ మొందిన శివుడా
    రంభాపతి రాముడయ్యె రాజసమొప్పన్.

    (రంభ= పార్వతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. ఊరువు లనుండి యూర్వశి శౌరి తనయ
    మంత్ర జలమహి మయనమాం ధాత బుట్టె
    నాటి నుండియు మగవారు మేటి యనగ
    మగఁడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగుంది.
      కాని రెండవపాదంలో యతి తప్పింది. 'పూత మంత్ర మహిమను మాంధాత పుట్టె' అనండి.

      తొలగించండి
    2. ఊరువు లనుండి యూర్వశి శౌరి తనయ
      పూత మంత్ర మహిమను మాంధాత పుట్టె
      నాటి నుండియు మగవారు మేటి యనగ
      మగఁడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె

      తొలగించండి
  4. కలలు పండగ నామెకు నెలలు నిండ
    ఆడపడుచును తోడుండ నామె వెంట
    ప్రసవ సమయపుకష్టముల్ పడుచు,నాయ
    మ,గడుఁ, ప్రసవించి శిశువును మగువకిచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ వినూత్న ప్రయోగ ప్రయత్నం ప్రశంసింపదగినదే.
      కాని మగఁడు లోని అరసున్నాను చివరికి మార్చారు. ఇలా మార్చడం సంప్రదాయం కాదు.

      తొలగించండి
  5. నీతి చంద్రికలు కురియు రీతి నతడు
    కావ్య మొక్కటి వెలయించి కన్న బిడ్డ
    యనుచు నిజసతి కందించె నంకితమ్ము!
    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    నెగడునెన్నాళ్ళు విశ్వంపు నీమ మిటుల
    మగడు మగువ సమానులౌ మరొక జగము
    సృష్టి జేసిరి విజ్ఞాన ద్రష్టలొకట

    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె
    తగునమ్మాయని తానె కర్తనని పో, తా త్సారమున్ జేయగా
    మగువల్ సృష్టికి మూలకందములనన్ మానంబు దక్కించ నో
    మగవాడై తప మాచరించి మనసా మార్గంబజుండో యనన్
    మగవాడే ప్రసవించి యిచ్చె శి శువున్ మర్యాదతో నింతికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      క్రింద చెప్పిన సవరణను పరిగణనలోకి తీసుకున్నాను.

      తొలగించండి
  7. సంతు లేనట్టి యొక్కర్తె సద్గతికయి
    పెంచుకొనగోరి యర్థింప విజ్ఞ యపుడు
    స్వీయ పుత్రుని దత్తత చేతు మనగ
    మగడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మనసా మాన్యుండజుండో యనన్ .గా మార్చి చదుప గలరు.డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  9. మహిని వనితకు తోడయి మనునెవండు?
    పడతి సృష్టికి మూలమై వరలు నెటుల?
    నవని పురుషుండు ప్రేమము నెవరికిచ్చె?
    మగడు, ప్రసవించి శిశువును, మగువకిచ్చె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. గది బయట నార్తితో నుండ సుదతిముద్దు
    మగఁడు, ప్రసవించి శిశువును మగువకిచ్చె
    సుతుని చూపించిరమ్మని పతియెమెచ్చ
    పరవశమ్మీయదే తొలి వలపు పంట?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మనకుటుంబములన్ యజమానియెవరు?
    వనిత యెవ్విధి గృహమున వినుతికెక్కు?
    శివుడు తనువున సగభాగ మెవరికిచ్చె?
    మగడు, ప్రసవించి శిశువును, మగువ కిచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. విను 'సరోగసి ' గర్భమ్ము వేడ్కతోడ
    తాను ధరియించి పుత్రునే తరుణికీయ
    భార్యనొప్పగ జేయగా పట్టుబట్టి
    మగడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      అద్దె గర్భాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ప్రాచ్య దేశమునందున ప్రధమముగను
    జరిగె నిట్టుల నిజముగ ధరణిలోన
    లింగమార్పిడి జేయగ లీలగాను
    మగడు ప్రసవించి శిశువును మగువకిచ్చె!!!

    రిప్లయితొలగించండి
  14. పురుషు డధికుడు, స్త్రీ సలుపు పనులన్ని
    చేయగలడను నీకును జెప్పెద నిది
    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె
    నేని యొప్పుకొనెద నాడు నీదు మాట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నితీశ్ చంద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేయగలడని...' అనండి.

      తొలగించండి
  15. మగువ సేవకు నొప్పులు మరచి పోవ
    తలుపు మూసిన ఘడియకీ తలపు రాగ
    "నోట తడియారి వేచియున్నాడు నాదు
    మగడు"; ప్రసవించి శిశువును మగువ కిచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి.పి. శాస్త్రి గారూ (మీ పూర్తి పేరు?),
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యుడను! ఈరోజు మొట్టికాయలు తప్పినవి. నా పూర్తి పేరు "గుర్రం ప్రభాకర శాస్త్రి" (బండి ర నాఫోనులో లేదు). పాఠశాల నెల్లూరు జిల్లా ముత్తుకూరు. కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయం,
      వాల్తేరు. ఊద్యోగం బెంగాలు. విశ్రామం హైదరాబాదు. మాతృభాష మళ్ళీ నేర్చుకోవాలని తాపత్రయం...

      తొలగించండి


    3. గుఱ్ఱం ప్రభాకర శాస్త్రిగారు


      ఉపయోగ మేమో చూడండి :) టిల్డే కీ (నిదురబోయేటట్లు కనబడు S లాంటి కీ :)


      నిదురన గల టిల్డే కీ
      కుదురుగ నొక్కి ర అ నొక్క కులుకుచు తా కం
      డ్లెదురుగ వచ్చు ఱ యక్షర
      మది కష్టపడితి నుపాయ మదియని తెలియన్ :)


      Tlde+r+a


      జిలేబి

      తొలగించండి
    4. జిలేబి గారు:

      మీకు నా కృతజ్ఞతలు. కానీ నా పాత సేంసుంగు ఫోనులో ఎంత వెదికినా టిల్డే కనిపించ లేదు. నా ఆరెళ్ళ మనవరాలు నాకన్న స్మార్టు. అడిగి చూస్తాను. అయినా నాకు తెలుగు గుణింతం రాదు. నా పుత్రుని పెళ్ళి పత్రికలో నా గుర్రం ఇంటిపేరు ఎలా వ్రాయలో తెలియక మా కాబోయీ వియ్యంకునికి ఫోన్ చేసినపుడు ఆయన బండి ర అని చెప్పారు ;) వారు తెలుగు పండితులు! చాలా కష్టపడి "లేఖిని" నేర్చుకొని తంటాలు పడుతున్నాను. టైం పాస్!

      మీ కంద పద్యం మనోహరంగా ఉంది.చాలా సంతోషం!

      తొలగించండి
    5. శాస్త్రి గారూ,
      లేఖినిలో ఱ టైప్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి.....
      ~ra (ఱ)
      gu~r~raM (గుఱ్ఱం)

      తొలగించండి
    6. జిలేబి గారు:

      దొరికింది దొరికింది టిల్డె! మాకోడలు ధర్మం!

      నమోనమ:

      గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి

      శంకరయ్య గారూ:

      కృతజ్ఞతలు!

      తొలగించండి
  16. సంతు లేని యొకతె సఖి సాయ మడిగె
    అందు కంగీక రించియు నామె పూని
    ఆధునిక వైద్య రీతిని; యాన తీయ
    మగడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె.

    రిప్లయితొలగించండి
  17. బండికాడి అంజయ్య గౌడ్ గారి (వాట్సప్) పూరణ....

    యజ్ఞ జలము వలన యవనాశ్వునికిని
    గర్భము కలిగి జన్మించె నర్భకుండు
    ఘనుడు మాంధాత యనువాడు క్ష్మాతలమున
    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె

    రిప్లయితొలగించండి
  18. మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె
    నేమి చిత్రము నిట్లుగా నీజగమున
    సాధ్య మగునే దె లుపుడయ్య!సామి మాకు
    నట్లు జరుగదు ముమ్మాటి కదియ మరిని
    మూల కారణంబ యగును ముదిత యెపుడు

    రిప్లయితొలగించండి
  19. తల్లి సేదదీఱగఁ దన తనువు నిమురఁ
    బ్రసవ వేదన భరియించి పడతి యపుడు
    చంద్రు డనుచుఁ బొగడ నత్త సంత సింప
    మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె


    జగతిం జూడగ నిట్టి వింతలు మహాశ్చర్యంబులై తోచవే
    మగువల్ మెచ్చరె యిట్టి భర్తలను సన్మానమ్ములుం జేయరే
    తగదీ దుర్భర బాధ నీకనుచు భర్తై యుండి స్వ్పప్నంబునన్
    మగవాఁడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    మగడు ప్రసవి౦చి శిశువును మగువ కిచ్చె

    శిశువు మారె ముసలకమై చిత్రముగను

    యదుకుల౦ బెల్ల చిటికెలో న౦త మయ్యె

    ముగిసె ద్వాపర యుగ మి౦క | ముర రిపు౦డు

    పాల కడలిని విష్ణువై పవ్వళి౦చె !

    రిప్లయితొలగించండి

  21. పెంపకంబుకు శిశువునువెదకుచుండి
    పేదగర్భిణి చెంతకు వెడలియడిగె
    మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె
    నతని యిల్లాలికాయింతి యపుడు.

    తగునంచున్నొక గర్భిణిన్ మిగులపేదన్ జేరి యాచించెనా
    మగవాఁడే, ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్
    భగవత్ప్రేరణచేత నీ మగడు నన్ ప్రార్థించె నిస్సంతువై
    యగచాటేల శుభమ్ము నీకనుచునత్యంతానురాగమ్మునన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పెంపకంబుకు' అన్నదానిని 'పెంపకమునకు' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి

    2. ఆర్య! అనేక నమస్కారములు. మంచి సవరణ సూచించారు. ధన్యవాదములు. సవరించిన పద్యాన్ని పంపుతున్నాను.

      పెంపకమునకుశిశువునువెదకుచుండి
      పేదగర్భిణి చెంతకు వెడలియడిగె
      మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె
      నతని యిల్లాలికాయింతి యపుడు.

      తొలగించండి
  22. నాలుగో సారి గర్భమ్ము నాతి దాల్చ
    అధిక సంతాన మైనట్టి యట్టి శిశువు
    తనదు చెల్లికిమ్మనుచును దార నడిగె
    మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె


    నగరమ్మందున గొడ్డురాలయిన యో నారీ శిరోభూషణ
    మ్మగు స్త్రీ గోరెను దత్తపుత్రుడనె యమ్మైతాను లాలింప నెం
    చగ, తాగర్భము దాల్చి సంతునిక నిస్సంకోచియైనివ్వగన్
    నగలన్ గోరుచు నొప్పెనో పడతియానందమ్ముగా, పుట్టెనే
    మగవాఁడే, ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్

    రిప్లయితొలగించండి
  23. పగవాడీవని దూరముంచిరిగదా పత్నీకుటుంబీకులున్
    మొగమోటంబది లేక దూరముగ పోపొండండ్రు నాత్మీయులున్
    దగవేలాయని గర్భిణీ సతికి మంతర్సానిగాజేసెగా
    మగవాఁడే, ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తీవ్రంగా ప్రయత్నించాను. కృతార్థుడను కాలేదేమోనని అనుమానము.మీపరీక్షకై నిరీక్షణ

      తొలగించండి
    2. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ ప్రయత్నం చాలావరకు సఫలమయింది. పూరణ బాగుంది. అభినందనలు.
      'మంతరసాని' శబ్దం ఉంది కాని 'మంతర్సాని' అనడం ఆలోచింపదగింది.

      తొలగించండి
    3. అవును గురువు గారు, భావౌచిత్య, గణ యత్యాదులన్నంటికీ సమతుల్యము చేయగల మరోపదము స్ఫురించలేదు.ప్రాజ్ఞులు సెలవిస్తే కృతజ్ఞుణ్ణి

      తొలగించండి
    4. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ నమస్సులు. నాకు తోచిన సవరణలను చేసితిని. పరికించండి.


      పగవాడీవని దూరముంచిరిగదాభార్యాగ్ర జన్మాదులే
      మొగమోటంబది లేక దూరముగ పోపోరాయనన్ బంధువుల్
      దగవేలాయని గర్భిణీ సతికి వైద్యంబందజేయంగనా
      మగవాఁడే, ప్రసవించి యిచ్చె శిశువున్, మర్యాదతో నింతికిన్

      తొలగించండి
    5. కుటుంబికుడు సాధువు. పోపొండండ్రు - అండ్రు (అందురు) క్రియ దృతాంతము కాదు.

      తొలగించండి
    6. కామేశ్వరరావుగారూ శతాధిక కృతజ్ఞతలు.చాలాబాగుందండీ

      తొలగించండి
  24. ముగుదన్ గాంచి మనమ్మునన్ మమత పెంపొందన్ ప్రమోదమ్ముతో
    తగఁ బెండ్లాడి భవంతి కేగి పలు సత్కార్యమ్ములన్ చేయుచున్
    సగభాగమ్మగు పత్నిచాలమి ధృతిన్ సాధించి గర్భమ్ము తా
    మగవాఁడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    హరియె మోహిని యై యపు డవతరి౦చె

    మోహిని౦ గా౦చిన భవు౦డు ముగ్ధు డగుచు

    స౦గమి౦పగ నయ్యప్ప జనన మ౦దె |

    మగడు ప్రసవి౦చి శిశువును మగువ కిచ్చె !

    హరి - ప్రసవమ౦ది యొసగె నయ్యప్ప సుతుని

    మోహినీ రూపిణి కత్య౦త ముదము తోడ |


    { మగడుప్రసవి౦చి = విష్ణువు ప్రసవి౦చి ;

    శిశువును మగువ కిచ్చె = శిశువును

    మోహిని కిడెను ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. 'మోహినీ రూపిణికిఁ గడు ముదముతోడ' అనండి.

      తొలగించండి
  26. సమస్యాపూరణం

    ఆడపిల్లను ప్రసవించ నాగ్రహించి
    కనులెరుపుజేసి కోపాన కక్ష్య పెంచ
    మగడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె
    తల్లి,తండ్రికగుపడక దాయుమనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (అయినా ఎంతకాలం దాస్తుంది?)

      తొలగించండి
  27. నగుబాటోర్వను దత్తపుత్రు నెవరైనన్ దెమ్మటంచున్ సదా
    తగవాడన్ తన భర్తతోడ సతి సంతానంబు లేదంచు తా
    తగుమార్గంబని బంధువైన నెలతన్ దైన్యంబుతో నడ్గ నా
    మగవాఁడే, ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్"

    రిప్లయితొలగించండి
  28. నెలలు నిండిన భార్యకు నెప్పులు మొద

    లవ్వ, చెల్లితో నేగి యయ్యాసుపత్రి

    యందు వలసిన యేర్పాట్ల నన్ని జేయ

    మగడు; ప్రసవించి శిశువును మగువకిచ్చె.

    రిప్లయితొలగించండి
  29. దండ కారణ్యమున తనకండ లేక
    భార్య ప్రసవించు సమయాన భయము జెంద
    కోయ ముదుసలి మగువను గూర్చినంత
    మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె

    రిప్లయితొలగించండి
  30. మంత్రపూతమైన జలము మహిని త్రాగి
    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె
    పెరిగినట్టి శిశువు తాను పెద్ద యగుచు
    చక్రవర్తి మాంధాతయ్యె జగతి యందు.

    రిప్లయితొలగించండి
  31. సరస సల్లాప మాడుచు సాకనట్టి
    సంతుకంతును పొడిగించ?వింత గరిచె
    ప్రసవ వేదన దెలియని భర్తరాగ
    ఊహలందున నిదురలో నులికిబడగ
    కలగ కళలాగ కవితలా పలికిరచట
    మగడు ప్రసవించి శిశువును మగువకిచ్చె|

    రిప్లయితొలగించండి
  32. రాక్షస గురువైన శుక్రాచార్యునిశిష్యుడైన కచుని చంపదలచి రాక్షసులుకచునిజంపిబూదిజేసికల్లున గలిపిగురువుకు త్రాగించ?ఆతనిని బ్రతికించుటకుసంజీవిని విద్య నేర్పి శిష్యునిప్రసవించికూతురికొసగుట
    తగవుల్ లేకను నాకచున్ దునిమిదగ్దమ్జేసియా కల్లునన్
    రగిలేకక్షగ పూర్తిగా గలిపి సంరక్షింప సంజీవినీ
    తగదౌ రీతిగ రాక్షసుల్ గురువుకున్ త్రాగించ? జీవించెగా
    మగవాడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నాతికిన్

    రిప్లయితొలగించండి
  33. సంతు లేదను 'యవనాశ్వు 'చింత దీర్చ
    ఋషులు జన్నము గావించి యిచ్చినట్టి
    మంత్ర జలమును త్రాగ తన్మహిమ చెత
    మగదు ప్రసవించి శిశువును మగువ కిచ్చె.

    రిప్లయితొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    చాలా ఆలస్యంగా నా పూరణ పెట్టుచున్నాను. మన్నింపుడు.

    [కళాపూర్ణోదయ గత సుగాత్రీశాలీనుల (సుముఖాసత్తి, మణిస్తంభుల) కథనిట ననుసంధానించుకొనవలసినది]

    సగమై దేహమునందు నున్న సతికిన్ సంతోష మొప్పారఁగన్
    మగఁడే పెండ్లము, పెండ్లమే మగఁ డయెన్; గామంపు సత్క్రీడలో
    దగఁ గ్రీడించియు శారదాంబ దయ నంతస్సత్త్వుఁడై యొప్పి, యా

    మగవాఁడే ప్రసవించి, యిచ్చె శిశువున్, మర్యాదతో నింతికిన్!

    రిప్లయితొలగించండి
  35. మధుసూదన్ గారూ, నాకు జ్ణాపకం ఉన్నమటుకు సుముఖాసత్తి ప్రసవించి శిశువుని ఇవ్వలేదని అనుకొంటున్నాను. వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  36. మాన్యులు చంద్రశేఖర్ గారూ...నమస్సులు!

    పింగళి సూరన గారు... ఈ ఘట్టమును రచించకున్నను...
    సత్యవాక్పాలకులు[రాలు] అయిన కృత్రిమ సుముఖాసత్తిచేఁ దన నిష్టపడుచున్న సత్వదాత్మునకు సమాధానముగా నీ మాటలనుౕం బలికించినాౕఁడు.

    ఆ.
    ఆ లతాంగియుఁ దన కప్పటి కొక్కింత
    గర్భజనన శంక గల దటంచుఁ
    జెప్పి "సిద్ధుసుతుని సిద్ధున కీక యేఁ
    గలయ నన్యు"
    ననుచుఁ గడపి పుచ్చె. [కళా.5-196]

    కావునఁ గృత్రిమ సుముఖాసత్తి {మణిస్తంభుఁడు] తాను శిశువునుం బ్రసవింపఁగనే యా శిశువునుఁ గృత్రిమ మణిస్తంభునికి [సుముఖాసత్తికి] యిచ్చియే యుండును. నిజరూపధారులైన పిదప తన పతి తనకిచ్చిన సుతుఁడు సద్యోయౌవనుఁ డగుట వలన నతనిం బెంచు భారమునుండి విముక్తురాలై, యతని నక్కడనే విడచి ముని వృత్తిని జీవించుటకై పతితోఁ బాటుగఁ గాసారపురమునఁ గాఁపుర ముండి యుండవచ్చును.

    ఇది యూహ మాత్రమే. నిజము ఆ సూరనకే తెలియును.{ఈ విషయం ఆయన రాయలేదు కనుక}

    అయితే... యిది సమస్యాపూరణము కాఁబట్టి, దీనిలో భర్త భార్యగను, భార్య భర్తగను మారియుండుటను మాత్రమే గ్రహింపవలెను. మగవాఁడు ప్రసవించుటయే యిచ్చట మనకు కావలసిన యంశము కాఁబట్టి, మరింత వితర్క మవసరము లేదు కాఁబట్టి యింతటితో విరమించుచున్నాను.

    వినమ్ర వందనములతో...
    భవదీయుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  37. అగచాటుల్ పడుచుండగా నచటనా హాస్పత్రి వైటింగులో
    మగవాఁడే;...ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్
    మగువే "చూపుము భర్తకంచు వడిగా మాచిన్ని పాపాయినిన్"...
    నగవుల్ చిందెడి చిట్టిపాప నతడు న్నాత్రంబుగా ముద్దిడన్

    రిప్లయితొలగించండి