6, అక్టోబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/15


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

15వ అర్థము చంద్ర స్మరణ          
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మకు మామయైనవాఁడును (బ్రహ్మ విష్ణుపుత్రుఁ డైనందున లక్ష్మి సోదరుఁడు చంద్రుఁడు బ్రహ్మకు మామ యగును)
నీరజాంబక = పద్మమే తల్లిగా గల బ్రహ్మయొక్క
భూతి = పుట్టువు గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్నభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికమైన నక్షత్రగణాధీశ్వరుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన చంద్రుఁడను ప్రభుఁ డైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు చంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:

  1. చుక్కలరేడాచంద్రా
    చక్కటిియావెన్నెలీయసంతసమాయెన్
    దుక్కములనురానీయక
    చక్కగమముకావుమయ్య!సదయతతోడన్

    రిప్లయితొలగించండి